Intinti Gruhalakshmi Today Episode: లేడీ విలన్ ఎంట్రీతో తులసికి షాక్.. కేసు పెడతానని బెదిరించి మరీ!
దేశంలోని మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అంకితకు అనసూయ చపాతీలు చేయమని చెబుతుంది. కానీ, అవి మంచిగా రావు. దీంతో ఆమెపై అనసూయ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అంతేకాదు, తులసిని చూసి నేర్చుకోమని హితవు పలుకుతుంది. దీంతో అంకితకు కోపం వచ్చి తులసితో తనను పోల్చొద్దు అంటూ సీరియస్ అవుతుంది. ఆ తర్వాత ఇదంతా విన్న తులసి ఆమెకు సర్ధి చెప్పాలని చూసినా తగ్గదు. ఇక, ఇంట్లో జరిగిన విషయాన్ని గాయత్రికి ఫోన్ చేసి చెబుతుంది లాస్య. ఆ తర్వాత అంకిత వ్యవహరించిన తీరుకు బాధ పడిన తులసి.. పరందామయ్యతో చెప్పుకుంటుంది.

తప్పంతా అనసూయదే అన్న మామ
అంకిత అలా మాట్లాడి వెళ్లిపోయిన తర్వాత తులసి ఎంతగానో బాధ పడుతుంది. తన వల్లే అంకిత అలా మాట్లాడిందని పరందామయ్యతో చెబుతూ ఉంటుంది. అంతేకాదు, 'నేనే తప్పు చేశాను మామయ్యా. నేను తొందర పడకుండా ఉండాల్సింది' అని పరందామయ్యతో అంటుంది. దీనికాయన 'లేదమ్మా.. ఇందులో నీ తప్పేమీ లేదు. మీ అత్తయ్యే కొంచెం ఎక్కువగా మాట్లాడింది. అందుకే ఇలా జరిగింది' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు ఆన్‌లైన్ మీటింగ్‌లో చేరేందుకు అంకిత ట్రై చేస్తుంది. కాస్త లేట్ కావడంతో ఈరోజు మీటింగ్‌లోకి ఆమెను వద్దంటారు.

అంకిత కోపం.. తులసి ప్రశ్చాత్తపంగా
మీటింగ్ వద్దనడంతో చిరాకుగా ఉన్న అంకిత దగ్గరకు అభి వస్తాడు. అప్పుడామెను చూసి ఏమైందని అడగ్గా జరిగిన విషయం మొత్తం చెబుతుంది. దీంతో అతడు కోపంగా అడుగుతానని అంటాడు. మరోవైపు తులసి ఏడుస్తూ 'నాకు తెలిసి అంకితకు నా మీద కోపం, ఉక్రోశం ఎప్పటి నుంచో ఉన్నాయి. నాకు ముందే చెప్పొచ్చు కదా. అంకితను బాధపెట్టాలని కానీ.. ఏడిపించి తక్కువ చేయాలని కానీ నేను ఎప్పుడూ అనుకోలేదు. తను తప్పు చేసినా కూడా ఏనాడూ ఎవ్వరికీ చెప్పలేదు. అలా చేస్తే మన పరువు మనం తీసుకున్నట్టే కదా అత్తయ్య. మనం గొప్పవాళ్లం అని నిరూపించుకోవడానికి ఎదుటివాళ్లను చేతగాని వాళ్లు అన్నట్టు చేసి చూపించడం కరెక్ట్ కాదు కదా అత్తయ్య' అంటుంది.

కిత కోసం తులసి.. మాటలు విని
అనసూయతో తులసి మాట్లాడుతూ.. 'అంకితకు నా మీద కోపం వచ్చి నాతో మాట్లాడకపోతే నేను ఎందుకు తనకు దూరంగా ఉండాలి. నాకు తనతో ఎటువంటి సమస్య లేదు కదా. నేను వెళ్లి మాట్లాడుతాను' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అలా డైరెక్ట్‌గా అంకిత రూమ్‌కు వెళ్లబోతుంది. ఇంతలో అంకిత అభితో మాట్లాడే విషయాలను తులసి వింటుంది. 'అసలు నా ప్రాబ్లమ్ తులసి ఆంటినే. ఈ ఇంట్లో కోడలు అంటే తులసి ఆంటి.. తులసి ఆంటిలా ఉండాలి అని అంటారు' అని అభితో చెబుతుంది అంకిత. ఇదంతా విని తులసి మళ్లీ బాధ పడిపోతుంటుంది.

తులసితో గొడవ పెట్టుకున్న లాస్య
రూమ్ బయట నిలబడి అంకిత, అభి మాట్లాడుకున్నవి వింటున్న తులసి దగ్గరకు లాస్య చాలా కోపంగానే వస్తుంది. వచ్చీ రావడమే 'లోపల ఏం మాట్లాడుకుంటున్నారో అర్థం కావడం లేదు కదా తులసి. చాటుగా నిలబడి మొగుడు, పెళ్లాల మాటలు వినడం తప్పుగా అనిపించడం లేదా. అయినా నీకు ఇదేం అలవాటు' అంటుంది. దీంతో ఆమె 'నేను వాళ్లతో మాట్లాడటానికి వచ్చాను. వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో వినడానికి రాలేదు' అంటూ బదులిస్తుంది. దీంతో ఇద్దరి మధ్య చాలా సేపు గొడవ జరుగుతుంది. ఇది చినికి చినిక గాలి వానలా మారిపోతుంది.

గాయత్రి ఎంట్రీ.. తులసిపై ఆగ్రహం
లాస్యకు, తులసికి గొడవ జరుగుతోన్న సమయంలోనే గాయత్రి అక్కడకు వస్తుంది. వచ్చీ రావడమే తులసిపై ఆగ్రహంగా 'అంకిత నా కోడలు కాదు కూతురు అన్నావు. తనకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటా అన్నావు. గుర్తుందా? ఇప్పుడు ఏం చేస్తున్నావు? నా కూతురును మహారాణిలా పెంచి ఈ ఇంటికి అప్పగించింది పనిమనిషిలా ఉండటానికి కాదు. నా కూతురుతో వంట పనులన్నీ చేయిస్తున్నారు. కోడలు ఇంట్లో అడుగు పెట్టడమే ఆలస్యం అత్తగారు మహారాణి అయిపోతుందా? కోడలు నౌకరు అవుతుందా? నా కూతురుతో ఇంటి పని.. వంట పని చేయించడానికి నువ్వెవరు' అని ప్రశ్నిస్తుంది.

తులసికి సపోర్టుగా మాట్లాడిన నందూ
గాయత్రి నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ తులసిని నిందించడంతో నందూ మధ్యలోకి వస్తాడు. 'మీరు జాగ్రత్తగా మాట్లాడండి. అంకిత తల్లి కాబట్టి మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే సహిస్తామని అనుకోవద్దు. ఇక్కడ ఎవ్వరూ అంకితను టార్చర్ చేయడం లేదు. అసలు ఏం జరిగిందో తెలియకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు' అంటూ ఫైర్ అవుతాడు. దీనికి గాయత్రి 'నా కూతురును టార్చర్ పెడుతున్నందుకు అందరినీ అరెస్ట్ చేయించగలను. ఆఖరికి మిమ్మల్ని కూడా చేయించగలను' అంటూ అనసూయ వైపు చూపిస్తూ అందరికీ వార్నింగ్ ఇచ్చేస్తుంది.

తులసి సీరియస్.. అంకితకు భరోసా
గాయత్రి కేసు పెడతా అనగానే తులసి సీరియస్ అవుతుంది. అంతేకాదు, 'రాములమ్మ లేదు కాబట్టే ఈరోజు అంకిత పని చేసింది' అంటుంది. అనసూయ కూడా అదే చెబుతుంది. మొత్తం మీద అందరూ పెద్ద గొడవ పడతారు. అంకిత కూడా తన తల్లి వైపే మాట్లాడుతుంది. గాయత్రి, లాస్య కలిసి తులసి మీద సీరియస్ అవుతారు. ఆ తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక, చివర్లో 'జరిగిందంతా మరిచిపో. ఇక నుంచి నీ హాస్పిటల్ పని మీదే దృష్టి పెట్టు. ఇంటి బాధ్యత, వంట బాధ్యత నాది. మొదటి రోజు నువ్వు ఈ ఇంట్లోకి వచ్చిన మాటను నేను నిలబెట్టుకుంటాను. తల్లిలా చెబుతున్నాను గుర్తుపెట్టుకో. కానీ, ఎప్పుడూ పెద్దవాళ్లకు ఎదురు చెప్పకు' అని సలహా ఇస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.


Click it and Unblock the Notifications











