Intinti Gruhalakshmi Today Episode: తులసిపై నందూ ప్రేమ.. లాస్యకు షాక్.. విడాకులకు కారణం ఎవరో చెప్పి!

సుదీర్ఘ కాలంగా తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

సోమవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ కెఫే కోసం చూసిన రూమ్‌ను తులసి ఫ్యామిలీ మొత్తం చిటికెలే శుభ్రం చేసి పెడుతుంది. ఆ తర్వాత అనసూయ రెడీ చేసిన మెనూ విషయంలో డిస్కర్షన్ జరుగుతుంది. ఇక, ఇంట్లో అందరూ కూర్చుని కెఫే ఓపెనింగ్‌కు కావాల్సిన వస్తువుల గురించి రాస్తుండగా.. అభి వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడతాడు.

దీంతో అందరూ షాక్ అవుతారు. అభి మాటలతో నందూ ఒక్కసారిగా ఢీలా పడిపోతాడు. ఆ వెంటనే ఎమోషనల్‌గా మాట్లాడతాడు. అయినా అభి విమర్శిస్తూనే ఉంటాడు. దీంతో తులసి అతడిపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంది.

 అభికి బుద్ధి చెప్పిన తులసి

అభికి బుద్ధి చెప్పిన తులసి

అభి మాటలకు తులసి 'మీ నాన్న దొంగతనం చేసో.. ఎవరినో మోసం చేసే డబ్బు సంపాదించడం లేదు. ఆ విషయం మీ ఫ్రెండ్స్‌కు చెప్పు. కష్టపడి సంపాదించే వాడు ఎప్పుడూ తల దించుకొని ఉండడు. తల ఎత్తుకొని తిరుగుతాడు. ఈ విషయం కూడా మీ ఫ్రెండ్స్‌కు చెప్పు. అయినా కాకమ్మ హోటల్ పెట్టుకున్న వాళ్లు ట్రీట్మెంట్‌కు వస్తే ట్రీట్మెంట్ చేయవా? వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటావు కదా? వాళ్ళ డబ్బులు కావాలి కానీ వాళ్ళు నచ్చరా' అంటూ తగిన విధంగా బుద్ధి చెబుతుంది. దీంతో శృతి కరెక్టుగా చెప్పారు అనగా.. లాస్య ఆమెకు క్లాస్ పీకుతుంది.

పిల్ల కాకి అంటూ తాతయ్య

పిల్ల కాకి అంటూ తాతయ్య

తులసి మాటలకు అభి 'చూడు మామ్.. నువ్వు చెప్పే ప్రవచనాలు అన్ని సినిమాలో చెప్పట్టు కొట్టడానికి బాగుంటాయి. గాని రియల్ లైఫ్‌లో బాగుండవు. పరువు ప్రెస్టేజ్ ఇవన్నీ నీకు తెలియదు ఎందుకంటే నువ్వు చదువుకోలేదు కదా' అని అంటాడు. అప్పుడు పరందామయ్య 'ఒరేయ్ నువ్వు డాక్టర్ చదువు మాత్రమే చదివావు. మీ అమ్మ జీవితాన్ని చదివింది. మీ అమ్మ లాగా గొప్పగా ఎదగడం జీవితాంతం తపస్సు చేసిన నీ వల్ల కాదురా పిల్ల కాకి.

మీ అమ్మ కనబట్టి నువ్వు ఈరోజు భూమి మీద ఉన్నావు. మీ అమ్మ తన కడుపు మాడ్చుకొని నీకు పెట్టబట్టే ఈరోజు డాక్టర్ చదువు చదివావు. అలాంటిది మీ అమ్మను వేలు ఎత్తి చుపిస్తావా' అంటూ అతడికి ఓ రేంజ్‌లో క్లాస్ పీకేస్తాడు.

ఇంటి నుంచి వెళ్లిపోమని

ఇంటి నుంచి వెళ్లిపోమని

పరందామయ్య తిట్టడంతో అభి 'మామ్‌ను ఏదైనా అంటే చాలు.. అందరు కట్టకట్టుకుని నా మీద విరుచుకుపడుతున్నారు. నేను అనే దాంట్లో మంచో చెడ్డ ఉందో ఆలోచించరా' అని ప్రశ్నిస్తాడు. దీంతో అనసూయ మంచి ఉంటే కదరా ఆలోచించడానికి అంటుంది.

తర్వాత పరందామయ్య 'మీ నాన్న కాకమ్మ హోటల్ పెడతాడు. మీ అమ్మ చదువుకోలేదు అని నువ్వు అనుకుంటే ఇప్పటికిప్పుడే ఇంటి నుంచి వెళ్ళిపో. నీకు ఎవరు అడ్డుపడరు' అంటాడు. దీనికి అభి 'ఈ ఇంట్లో ఉండాలన్న తాపత్రయం కానీ.. ప్రేమ కానీ.. నాకు లేదు. ఎప్పటినుంచో వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను' అని చెప్తాడు.

కాపురం ముక్కలవుతుంది

కాపురం ముక్కలవుతుంది

అభి మాటలకు అనసూయ మీ అమ్మ మీరందరూ కలిసి ఉండాలని అనుకుంటుంది అని చెబుతుంది. దీనికతడు 'విడాకులు తీసుకొని విడిపోతే తప్పులేదు కానీ.. ఉమ్మడి కుటుంబం విడిపోతే తప్పేంటి నానమ్మ. మీ అందరిని చూసి నా భార్య కూడా అలాగే తయారైంది' అని అంటాడు. దీంతో అంకిత 'అమ్మ ప్రేమ పొందలేని వాడు బయటికి వెళ్లి బతకలేడు నిజం చెబుతున్నాను అర్థం చేసుకో అభి' అని అంటుంది.

దీంతో 'నాకు పద్ధతి నేర్పించడం కాదు అంకిత. ముందు భర్తను గౌరవించడం నేర్చుకో. మా మామ్‌ను ఫాలో అయితే మన కాపురం కూడా వాళ్ల కాపురం లాగే ముక్కలు అవుతుంది. విడాకుల వరకు వెళుతుంది' అని అంటాడు. అతడి మాటలకు అందరూ షాక్ అవుతారు. తర్వాత అతడు లోపలికి వెళ్లిపోతాడు.

 తులసికి జై.. లాస్యకు షాక్

తులసికి జై.. లాస్యకు షాక్

అభి లోపలికి వెళ్లగానే నందూ కూడా అతడి వెంట వెళ్తాడు. అప్పుడు అతడికి కూల్ చేసేందుకు ప్రయత్నిస్తాడు. కానీ, అభి మాత్రం అస్సలు తగ్గడు. పైగా తనకు పోరాడే ఓపిక లేదని అంటాడు. దీంతో నందూ తులసి గొప్పదనం గురించి చెబుతాడు. అదంతా లాస్య వింటూ ఉంటుంది. అప్పుడామె 'నందూ గోడ మీద పిల్లి. ఎప్పుడు ఎలా దూకేస్తాడో తనకే తెలియదు' అనుకుంటుంది. ఆ తర్వాత నందూ 'నేను మీ అమ్మ ప్రవర్తన నచ్చకపోతే 25 ఏళ్లు కాపురం చేసే వారిని కాదు. ముగ్గురు పిల్లని కనే వాడిని కాదు. అసలు మా విడాకులకు మీ అమ్మ కారణమే కాదు' అంటాడు.

అభికి నచ్చజెప్పిన తండ్రి

అభికి నచ్చజెప్పిన తండ్రి

ఆ తర్వాత నందూ 'మా విడాకులకు పూర్తిగా కారణం నేనే' అని అంటాడు. దీంతో అభి 'ఎందుకు డాడీ మీ మీద తప్పు వేసుకుంటున్నారు' అంటాడు. దీనికతడు 'తప్పు నా మీద వేసుకోవడం లేదు. నిజం చెప్తున్నాను అభి. నా మాట విను.. మీ మమ్మీని బ్లేమ్ చేయకు' అని నచ్చచెబుతాడు. అప్పుడు లాస్య మాత్రం ఏం జరుగుతుందో అర్థంకాక అలాగే చూస్తూ ఉంటుంది.

ఇక, అభి మాటలకు తులసి తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. ఇంతలోనే అందరూ అక్కడికి రావడంతో నేను ఏడవడం లేదు అంటూ కవర్ చేసుకుంటూ ఉంటుంది. అంతేకాదు, 'ఎవరు ఏమన్నా పట్టించుకోను కానీ.. నా పిల్లలు తప్పుపడితే నేను తట్టుకోలేను మామయ్య' అని బాధ పడుతుంది.

క్షమాపణ చెప్పిన అంకిత

తులసి ఇంట్లోని వాళ్లతో మాట్లాడుతున్నప్పుడే నందూ, లాస్య వేరు వేరుగా నిల్చుని వింటూ ఉంటారు. అప్పుడు తులసి 'అంకితను నా నుంచి దూరం చేయాలనుకుంటున్నాను. నేను అంత పాపిష్టి దాన్ని. అయినా మామయ్య చెప్పింది కరెక్టే అత్తయ్య. వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోదాం అనుకుంటే వెళ్ళిపోనిద్దాం. ఎవరు అడ్డు పడొద్దు.

అయినా వాడు ఇల్లు వదిలి వెళ్లినంత మాత్రం నా మనసులో నుంచి వెళ్ళిపోడు కదా' అని ఏడుస్తుంది. దీంతో అంకిత తులసి కాళ్లు పట్టుకుని.. మీ అబ్బాయి తరుపున నేను క్షమాపణలు చెబుతున్నా అంటుంది. దీంతో తులసి 'లేదమ్మా వాడు చెప్పింది నిజమే.

నువ్వు నా గురించి ఆలోచిస్తూ అభికి దూరంగా ఉంటున్నావు. ఈ ఇంటి గురించి నా గురించి ఆలోచించడం మానేసి వానికి దగ్గరగా ఉండు' అంటుంది. తర్వాత ప్రేమ్ గిటార్ తెచ్చి తులసిని నవ్వించేలా పాట పాడతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X