twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: లాస్య ప్లాన్‌తో మారిపోయిన అంకిత.. తులసిని అలా చేయమన్న నందూ

    |

    మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంట్లో జరిగిన గొడవ తర్వాత గాయత్రి.. లాస్యను ఏమీ పట్టించుకోవద్దని చెబుతాడు నందూ. అంతేకాదు, ఇకపై ఇంటి పని చేయాలని.. అంకిత విషయంలో ఏమీ మాట్లాడొద్దని కూడా వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు, ఇంట్లో గొడవలకు తానే కారణం అని తులసికి అనసూయ సారీ చెబుతుంది. దీంతో ఆమె అలా మాట్లాడొద్దని అంటుంది. అంతేకాదు, అంకితను వెనకేసుకు వస్తుంది. అనంతరం భాగ్యకు ఫోన్ చేసిన లాస్య అన్ని విషయాలూ చెబుతుంది. దీంతో ఆమె మరిన్ని కన్నింగ్ సలహాలు ఇచ్చి గొడవలు పెట్టాలని చెబుతుంది.

    హాట్ సెల్ఫీతో ఈషా రెబ్బా అరాచకం: తెలుగు అమ్మాయిని ఇలా ఎప్పుడూ చూసుండరు!హాట్ సెల్ఫీతో ఈషా రెబ్బా అరాచకం: తెలుగు అమ్మాయిని ఇలా ఎప్పుడూ చూసుండరు!

     అంకితను మళ్లీ రెచ్చగొట్టేసిన లాస్య

    అంకితను మళ్లీ రెచ్చగొట్టేసిన లాస్య

    ఇంట్లో జరుగుతున్న గొడవలను వాడుకుని లాస్య.. అంకితను తన వైపు తిప్పుకుంటుంది. ఈ విషయాన్ని శృతి.. తులసితో అంటుంది. దీంతో ఆమె బాగా భయపడిపోతుంది. మరోవైపు, అంకితను తన కారులో డ్రాప్ చేయడానికి తీసుకెళ్తుంది లాస్య. ‘ఆఫీసు పని, ఇంట్లో పనిని వేర్వేరుగా చూడాలి. ఎక్కడి తలనొప్పి అక్కడే వదిలేయాలి. కోట్ల ఆస్తిని ప్రేమ కోసం వదులుకొని వచ్చావు. కానీ, ఇక్కడ నీకు ఆ ప్రేమ దొరికిందా లేదు కదా' అంటుంది. దీనికామె ‘అవును ఆంటి.. నాకు అక్కడ దొరకని ప్రేమ ఇక్కడ దొరుకుతుందనుకున్నా. కానీ, ఇక్కడ కూడా దొరకలేదు' అంటుంది.

     లేటుగా ఇంటికొచ్చిన అంకిత, లాస్య

    లేటుగా ఇంటికొచ్చిన అంకిత, లాస్య

    అంకిత బాధ పడుతుందని గ్రహించిన లాస్య.. ‘అందుకే.. నీ మూడ్ రిలాక్స్ కావడం కోసం ఈరోజు ఈవెనింగ్ మనం డిన్నర్‌కు వెళ్దాం' అని అంటుంది. దీనికామె వద్దులెండి ఆంటి అని చెబుతూనే.. కారు దిగిన తర్వాత మాత్రం వస్తానని చెబుతుంది. కట్ చేస్తే.. రాత్రి అయినా అంకిత ఇంటికి రాదు. దీంతో ఇంట్లో వాళ్లంతా అన్నం తినకుండా, నిద్రపోకుండా ఆమె కోసమే ఎదురుచూస్తూ ఉంటారు. అంకిత ఫోన్ స్విచ్‌ఆఫ్ వస్తుంది. లాస్య మాత్రం ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయదు. దీంతో ఏమైంది అని అందరూ టెన్షన్ పడుతుండగా.. ఇద్దరూ కలిసి నవ్వుతూ ఇంటికొస్తారు.

    <strong>బాత్రూంలో బ్రాతో రెచ్చిపోయిన హీరోయిన్: అద్దంలో అందాలన్నీ చూపిస్తూ దారుణంగా!</strong><br />బాత్రూంలో బ్రాతో రెచ్చిపోయిన హీరోయిన్: అద్దంలో అందాలన్నీ చూపిస్తూ దారుణంగా!

     ఇంట్లో రచ్చ... లాస్యపై నందూ ఫైర్

    ఇంట్లో రచ్చ... లాస్యపై నందూ ఫైర్

    లాస్య, అంకిత.. కలిసి నవ్వుతూ ఇంట్లోకి రాగానే అందరూ ఒకచోట కూర్చొని టెన్షన్ పడుతూ ఉండటం చూసి షాక్ అవుతారు. ఇంతలో అభి లేచి అంకిత వైపు సీరియస్‌గా చూస్తాడు. అప్పుడు లాస్య ‘ఏమైంది మీకు అందరూ ఏదో సంతాప సభకు వచ్చినట్టు అలా ఉన్నారు' అంటుంది. అప్పుడు నందూ ‘లాస్య నువ్వు నవ్వకు. లేట్ అవుతుంది అనుకుంటే మీరు ఒక్క మాట అయినా ఇంట్లో చెప్పాలి కదా. అసలు ఎక్కడికి వెళ్లారు? తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోంది. నువ్వేమో ఫోన్ లిఫ్ట్ చేయవు ఏంటి' అంటాడు నందూ. దీంతో లాస్యకు కూడా పట్టలేనంత కోపం వస్తుంది.

     అందరూ ప్రశ్నించడంతో చిరాకుగా

    అందరూ ప్రశ్నించడంతో చిరాకుగా

    నందూ మాటలకు హర్టైన లాస్య ‘అందరూ నన్ను దోషిలా చూస్తున్నారేంటి? అంకిత మూడ్ బాగోలేదంటే డిన్నర్ కు తీసుకెళ్లాను. ఇందులో నా తప్పు ఏముంది' అంటుంది. దీంతో తులసి ‘మీరు ఎక్కడికైనా వెళ్లండి. ఎవ్వరికీ అభ్యంతరం లేదు. మీ వల్ల ఇంట్లో వాళ్లు ఎవ్వరూ అన్నం తినకుండా వెయిట్ చేస్తున్నారు' అంటుంది. అప్పుడు అంకిత ‘నేను అన్నం తినకుండా ఉండండి అని అన్నానా. తిండి ఒక్కటేనా.. ఇంకేం లేదా. ఇంట్లో తులసి ఆంటితో సహా అందరూ ఎక్కడికైనా వెళ్లొచ్చు. కానీ ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ నాకేనా' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

    గుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి: జన జాగృతి పార్టీ కోసం రంగంలోకి.. సంచలనంగా మారిన ఫొటోలుగుడ్ న్యూస్ చెప్పిన చిరంజీవి: జన జాగృతి పార్టీ కోసం రంగంలోకి.. సంచలనంగా మారిన ఫొటోలు

     అంకితకు బాగా నూరిపోసిన లాస్య

    అంకితకు బాగా నూరిపోసిన లాస్య

    అంకిత కోపాన్ని తనకు అనుకూలంగా మలచుకోవాలని చూసిన లాస్య.. ఆమె దగ్గరకు వెళ్లి ‘సారీ అంకిత. నా వల్లే నీకు ఇవన్నీ' అంటుంది. దీనికామె ‘పర్లేదు ఆంటీ. ఇంట్లో వాళ్లు అంతా ఇలా తయారయ్యారు' అంటుంది. దీనికి లాస్య ‘ఇంట్లో వాళ్లు కాదు అంకిత.. కేవలం తులసినే నిన్ను టార్గెట్ చేసుకుంది. ఈ ఇంట్లో అందరూ తులసి చేతుల్లో కీలుబొమ్మలు. నువ్వు వెళ్లింది నాతో కాబట్టి మనిద్దరిని ఎలా విడదీయాలా అని తులసి తెగ ఆరాటపడుతుంది' అంటూ తులసి మీద లేనిపోనివి అన్నీ నాలుగు మాటలు ఎక్కువ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

     తులసితో నందూ.. తిట్టేసిన లాస్య

    తులసితో నందూ.. తిట్టేసిన లాస్య

    ఇంట్లో గొడవలు చూసిన తర్వాత నందూ.. తులసితో మాట్లాడతాడు. ‘ఈ ఇల్లు నావల్ల ఇప్పటికే ముక్కలు అయింది. ఇంకా ముక్కలు కావడం నేను చూడలేను. అంకితను లాస్య కీలుబొమ్మను చేసింది. ఈ కుటుంబాన్ని ఒక దారిలో పెట్టడం కేవలం నీవల్లే అవుతుంది తులసి. అంకితను మరో లాస్యను కానివ్వకు. అదే జరిగితే అంతకుమించిన దౌర్భాగ్యం ఉండదు' అంటాడు. అంతలో అక్కడకు వచ్చిన లాస్య ‘వావ్.. నీ తెగింపు చూస్తుంటే ముచ్చటేస్తుంది నందూ. అవకాశం దొరికితే చాలు.. మాజీ భార్యతో ముచ్చట్లు చెప్పడమే వదలవు కదా' అంటుంది.

    ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న దీప్తి సునైనా హాట్ ఫొటోలు: ఏకంగా బట్టలు లేకుండా కనిపించడంతో!ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న దీప్తి సునైనా హాట్ ఫొటోలు: ఏకంగా బట్టలు లేకుండా కనిపించడంతో!

    Recommended Video

    Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
     లాస్యకు వార్నింగ్ ఇచ్చిన తులసి

    లాస్యకు వార్నింగ్ ఇచ్చిన తులసి

    లాస్య వచ్చి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుండగా.. నందూ ‘లాస్య ఇక్కడికి వచ్చి సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నించకు' అంటాడు. మరోవైపు, తులసి కూడా లాస్యతో అంకిత గురించి మాట్లాడుతుంది. ‘అంకిత నీకు కోడలు మాత్రమే కావచ్చు లాస్య. కానీ నా కూతురు. నన్ను, అంకితను విడదీసేందుకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ వృథాయే. చేతనైతే అంకితకు దగ్గరవడానికి ప్రయత్నించు కానీ మమ్మల్ని దూరం చేయడానికి కాదు. ఈ కుటుంబంలోని వాళ్లను నాకు వ్యతిరేకంగా మార్చాలని చూస్తే అది నీకే సమస్యగా మారుతుంది' అంటూ సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. అనంతరం ప్రేమ్, శృతి కలిసి అంకిత గురించి మాట్లాడతారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 550: Lasya Provokes Ankitha Against Tulasi Again. After That Prem and Shruthi Talk about Ankitha.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X