Intinti Gruhalakshmi Today Episode: కెఫే ఓపెనింగ్‌కు చిరంజీవి.. వాళ్ల మధ్య చిచ్చు పెట్టిన గాయత్రి

తరాలు మారుతూ ఉన్నప్పటికీ తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ కెఫే బిజినెస్‌ను అభి అవమానిస్తూ మాట్లాడడంతో తులసి 'మీ నాన్న దొంగతనం చేసో.. ఎవరినో మోసం చేసే డబ్బు సంపాదించడం లేదు' అంటూ అతడికి క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత నందూ వెళ్లి అతడికి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాడు. అంతేకాదు, తమ విడాకులకు తులసి కారణం కాదని చెబుతాడు. ఇదంతా విన్న లాస్య అతడని తిట్టుకుంటుంది. ఇక, అభి మాటలతో తులసి బాధ పడుతూ ఉండగా.. పరందామయ్య వాళ్లు వెళ్లి ఆమెను ఓదార్చుతారు. అప్పుడు అభిని ఇంట్లో నుంచి వెళ్లిపోమందాం అంటుంది.

అభి క్షమపణలు.. అంతా హ్యాపీ

అభి క్షమపణలు.. అంతా హ్యాపీ

అభి మాటలకు తులసి బాధ పడుతుండగా అందరూ ఆమెను నవ్వించే ప్రయత్నం చేస్తుంటారు. అప్పుడు ప్రేమ్ 'సంతోషం సగం బలం' అనే పాటను పాడుతుంటాడు. దీంతో అందరూ డ్యాన్స్ చేస్తుంటారు. ఆ సమయంలోనే అభి అక్కడకు వచ్చి తులసి ముందు నిలబడి పశ్చాత్తాపంతో లెంపలు వేసుకుంటాడు. అంతేకాదు, చెవులు పట్టుకుని గుంజీలు కూడా తీసేస్తాడు. దీంతో తులసి సంతోషించి అభిని గుండెలకు హత్తుకుంటుంది. ఆ తర్వాత అభి పాటను మొదలెట్టమని ప్రేమ్‌కు సైగలు చేస్తాడు. అలా అందరూ సంతోషంగా డ్యాన్స్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు లాస్య.. అభిని తిట్టుకుంటుంది. అది విన్న నందూ 'అదే ఉమ్మడి కుటుంబం అంటే.. ఇక్కడ బంధాలు అనుబంధాలే శాశ్వతం' అని అంటాడు.

కెఫే ఓపెనింగ్‌కు చిరు.. ఐశ్వర్య

కెఫే ఓపెనింగ్‌కు చిరు.. ఐశ్వర్య

తర్వాతి రోజు ఉదయాన్నే అందరూ నందూ కెఫే దగ్గర కనిపిస్తారు. ఆ కార్యక్రమానికి గాయత్రి కూడా వస్తుంది. అప్పుడామె 'కెఫేకు రిబ్బన్ కటింగ్ కూడా పెట్టారంటే.. ప్రారంభోత్సవం భారీగానే ప్లాన్ చేసినట్టు ఉన్నారు. వీఐపీని ఎవరినైనా పెట్టారా' అని వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో అంకిత 'అలాంటి ఇలాంటి వీఐపీ కాదు.. పేరు వినగానే పూనకాలు వచ్చేస్తాయి' అంటుంది. ఆ వెంటనే ప్రేమ్ 'మనిషిని చూడగానే ఊపొస్తుంది.. ఆయన మాట వినగానే ప్రాణమే లేచి వస్తుంది' అంటాడు. అప్పుడు గాయత్రి కొంపతీసి చిరంజీవిని పిలిచారా అంటుంది. దీంతో తులసి 'ఒక్కచిరంజీవిని పిలిస్తే ఏం బాగుంటుందని.. ఐశ్వర్యరాయ్‌ని కూడా పిలిచాం. వాళ్లు ఎవరో కాదు.. అత్తయ్య మామయ్యలే' అని ఝలక్ ఇస్తుంది.

రిబ్బన్ కటింగ్.. కొబ్బరికాయతో

రిబ్బన్ కటింగ్.. కొబ్బరికాయతో

పరందామయ్య, అనసూయను నందూ రిబ్బన్ కట్ చేయండి అంటాడు. దీంతో ప్రేమ్ 'చిరంజీవి గారూ.. రిబ్బన్ కటింగ్ చేసే ముందు.. ఒక్క డైలాగ్ చెప్పండి' అంటాడు. దీంతో ఆయన 'చేయి చూశావా? ఎంత రఫ్‌గా ఉందో రప్ఫాడించేస్తా' అని డైలాగ్ చెప్తాడు. ఆ తర్వాత పరంధామయ్య, అనసూయలు రిబ్బన్ కటింగ్ చేస్తారు. ఇక తులసిని అనసూయ పిలిచి కొబ్బరికాయ కొట్టమని అంటుంది. దీంతో లాస్య 'లక్కీ కేఫ్ ఓనర్ నందూ. నేను ఆమె భార్యను.. కొబ్బరికాయ కొట్టాల్సింది నేను. ఆ తర్వాత నందూ కొట్టాలి. తర్వాత గెస్ట్‌లు' అంటుంది. దీంతో తులసి ఓకే అంటుంది.

నాకంటే నీకే ఆరాటం అంటూ

నాకంటే నీకే ఆరాటం అంటూ

కొబ్బరికాయ తీసుకుని లాస్య తులసి దగ్గరకు వస్తుంది. అంతేకాదు, 'హడావిడిలో పడి నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. నువ్వు నందూకు మాజీ పెళ్లానివి. మీకు విడాకులై ఏడాది అవుతుంది' అని అంటుంది. దీనికి తులసి 'నువ్వు గుర్తు పెట్టుకోవాల్సింది మా విడాకులు గురించి కాదు.. నీ పెళ్లి గురించి.. అయినా కొబ్బరికాయ గురించి తలుచుకోవాల్సింది ఈ విషయం కాదు.. మీ ఆయనకు మంచి జరగాలని కోరుకో' అని అంటుంది. దీంతో లాస్య.. 'మా ఆయన గురించి నాకంటే నీకే ఎక్కువ ఆరాటంగా ఉంది' అనగా నీ మైండ్ మారదని తులసి తిడుతుంది.

జాబ్ మానేసి ఇడ్లీలు అమ్ముకో

జాబ్ మానేసి ఇడ్లీలు అమ్ముకో

కెఫే ఓపెనింగ్ అయిపోయిన వెంటనే అభిని గాయత్రి పక్కకు తీసుకెళ్తుంది. అప్పుడామె 'నేను చెప్పింది ఏం చేశావు? నా కూతురితో కలిసి నా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు' అని అడుగుతుంది. దీనికి అభి 'ఏం చేయను ఆంటీ.. అంకిత నా మాట వినడం లేదు. అలాగని నేను మొండిగా మారితే తను మరింత మొండిగా మారుతుంది' అని అంటాడు. దీంతో గాయిత్రి 'అయితే ఒక పని చెయ్.. డాక్టర్ ఉద్యోగం మానేసి.. ఒక సైకిల్ కొనుక్కో. దానికి ఇడ్లీ క్యాన్ కట్టుకుని ఇడ్లీలు అమ్ముకో. మీ నాన్న కేఫ్‌కు మ్యాచ్ అవుతుంది' అని అల్లుడిని హేళన చేస్తూ మాట్లాడుతుంది.

దీపక్ రాక... సారీ చెప్పిన బావ

దీపక్ రాక... సారీ చెప్పిన బావ

కెఫే ఓపెనింగ్‌కు దీపక్ కూడా వస్తాడు. వచ్చీ రావడమే నందూను బావగారూ బాగున్నారా అని అడుగుతాడు. అప్పుడు నందూ 'నా పిలుపుని మన్నించి వచ్చినందుకు థాంక్స్ దీపక్.. ఆరోజు హాస్పటల్‌లో నిన్ను కొట్టాను సారీ' అంటాడు. దీంతో దీపక్ 'అవి గుర్తు చేయొద్దు బావగారూ.. ఒక్కక్షణం ఉండలేను. కానీ మా అక్క పిలిచింది కాబట్టి వచ్చాను.. మీకోసం మా అమ్మ పచ్చళ్లు.. మసాలా పొడిలు పంపించింది' అంటాడు. వాటిని చూసి నందూ 'మా అత్తయ్యది కూడా తులసిలా పెద్ద మనసు' అంటాడు. దీనికి దీపక్ 'మా అక్కలా ఈ లోకంలో ఎవరూ ఉండరు. నిజానికి మా అమ్మకు మీరంటే కోపం.. కానీ మా అక్క ఎదుగుదల చూసి మీపై కోపాన్ని మర్చిపోయింది' అని అంటాడు. అంతలో అక్కడకు తులసి వచ్చి అతడితో మాట్లాడుతుంది.

లాస్యకు గాయత్రి పంచ్ వేస్తూ

లాస్యకు గాయత్రి పంచ్ వేస్తూ


కెఫేలో లాస్య ఏదో పని చేస్తుండగా గాయత్రి వచ్చి 'కంగ్రాట్యులేషన్స్ లాస్య.. నీకు జాబ్ లేదని బాధపడకు. మీ ఆయన కేఫేలో ఏదో ఒక పని చేసుకుని ఉండొచ్చు. వంట రాకపోయినా ఏదో ఒక పని చేయొచ్చులే' అంటుంది. దీంతో లాస్య 'నీలాంటి పిచ్చి పిచ్చి మాటలు తులసి దగ్గర మాట్లాడు నా దగ్గర కాదు' అని వార్నింగ్ ఇస్తుంది. దీంతో గాయత్రి 'నువ్వు కూడా నీ కోపం అంతా తులసి దగ్గర చూపించు నా దగ్గర కాదు' అంటుంది. తర్వాత నందూ, తులసి క్లోజ్ అవుతున్నారని లాస్యను గాయత్రి రెచ్చగొడుతుంది. దీంతో లాస్య వెళ్లి హారతి ఇచ్చే విషయంలో గొడవ చేస్తుంది. అనంతరం పూజా కార్యక్రమాలు పూర్తి అవుతాయి. కానీ, ఆ సమయంలో రసవత్తర సన్నివేశాలు కనిపిస్తాయి. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X