Intinti Gruhalakshmi Today Episode: లాస్యకు ఝలక్ ఇచ్చిన అంకిత.. సారీ చెప్పడంతో కథలో బిగ్ ట్విస్ట్
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అంకితను ఆస్పత్రి దగ్గర డ్రాప్ చేస్తానని తీసుకు వెళ్లిన లాస్య.. ఆమెను ఎంతగానో రెచ్చగొడుతుంది. అంతేకాదు, డిన్నర్‌కు వెళ్దామని అడగడంతో ఇద్దరూ నైట్ రెస్టారెంట్‌కు వెళ్తారు. ఇక, ఎంత సేపటికీ అంకిత ఇంటికి రాకపోవడంతో అందరూ భయపడుతుంటారు. అప్పుడు లాస్యతో కలిసి ఇంటికి వస్తుంది. దీంతో అందరూ ఆమెను మందలిస్తారు. దీంతో అంకిత కోప్పడుతూ ఫైర్ అవుతుంది. ఆ తర్వాత నందూ.. తులసితో ఇంటిని గాడిలో పెట్టమని అడుగుతుంటాడు. అది విన్న లాస్య అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

లాస్యకు స్కెచ్.. కోడలిపై తులసి లవ్
అంకిత మారిపోవడాన్ని గురించి ప్రేమ్, శృతి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ 'లాస్య ఇలా అంకితను మాయ చేస్తుంటూ చూస్తూ ఊరుకుందామా' అని అంటాడు. దీంతో శృతి 'అలా కాదు ప్రేమ్.. మనం అంకిత నుంచి కాదు.. లాస్య ఆంటి నుంచి నరుక్కుంటూ రావాలి. అప్పుడే అంకితకు లాస్య ఎటువంటిదో తెలుస్తుంది' అని చెబుతుంది. మరోవైపు, తులసి కాఫీ చేస్తూ ఉంటుంది. ఇంతలో అంకిత అక్కడికి వస్తుంది. అప్పుడు తులసి 'నీకోసమో కాఫీ కలుపుతున్నానమ్మా.. నువ్వు వెళ్లి కూర్చో. ఒక్క నిమిషంలో నేను తీసుకొస్తాను' అంటుంది.

అంకిత మనసు మార్చాలని తులసి
అంకితకు కాఫీ కలుపుకుని వచ్చి ఇస్తుంది తులసి. కానీ, ఆమెకు మాత్రం ఏం చేయాలో అర్థం కాదు. ఇబ్బందిగా ఉండడం చూసిన తులసి ఏమైందని అడుగుతుంది. దీనికి అంకిత 'నేను లేచేలోపే అన్ని పనులు చేసేస్తారు. మళ్లీ నేను చేయలేదు అని అంటారు' అంటుంది. దీనికి తులసి 'నా బంగారు తల్లి ఎంత మంచిదో. ఆఫీసు పనుల్లో ఎంత బిజీగా ఉన్నా మళ్లీ ఇంట్లో పనులు కూడా చేయడానికి నువ్వు ట్రై చేస్తున్నావు. కానీ, నేను చెడ్డ దాన్ని అవుతున్నాను. నేను ఉండగా నా బంగారు తల్లిని బాధ పడకుండా చూసుకుంటాను' అంటుంది.

అంకితతో ప్రేమగా మాట్లాడిన తులసి
అంకితతో తులసి మాట్లాడుతూ.. 'నీకు కూడా నా మీద అరిచే హక్కు ఉంది.. అలిగే హక్కు ఉంది. నీ మనసులో ఉన్న మాటను నిర్మొహమాటంగా చెప్పొచ్చు. నీలో నువ్వే బాధపడటం ఎందుకు. నిన్ను అర్థం చేసుకునే ఆంటి నీ కళ్లముందే ఉందమ్మా. నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుంది. నీకు ఇక మీదట కోపం వస్తే నాతో వచ్చి దెబ్బలాడు. అంతే కానీ నీలో నువ్వే బాధపడకు. ఎంత గొడవ జరిగినా.. నీ మీద నాకు కొంచెం కూడా ప్రేమ తగ్గదు. నిన్న రాత్రి కూడా మీ అంకుల్ అయినా నేను అయినా నీ మీద కోప్పడింది.. రావడం లేట్ అయితే ఒక్క మాట చెప్పాల్సింది కదా. నువ్వు లాస్యతో కలిసి తిరిగినా కూడా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ, నువ్వు నువ్వులా ఉండు. కాఫీ తాగు చల్లారిపోతుంది' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

లాస్యకు ఝలక్ ఇచ్చేసిన అంకిత
తులసి ఇచ్చిన కాఫీ తాగాక అంకిత తన రూమ్‌కు వెళ్లి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఆమె దగ్గరకు లాస్య వస్తుంది. అప్పుడు 'ఏంటి పొద్దున్నే తులసి నీ దగ్గరికి వచ్చి నీ మూడ్ పాడు చేసిందా? నీ చుట్టూ తిరుగుతూ ఎమోషనల్ స్పీచ్ ఇస్తూ పనికిమాలిన మాటలు మాట్లాడుతుంది' అని అంటుంది. దీంతో అంకితకు చాలా చిరాకు వేస్తుంది. 'అప్పుడు అసలు.. మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను ఏమీ నీ మాయలో పడలేదు. నువ్వు ఇప్పటి వరకు మాట్లాడిన మాటల్లో ఒక్క మాట కూడా తులసి ఆంటి గురించి మంచిగా మాట్లాడలేదు. కానీ, తులసి ఆంటి మాత్రం మీ గురించి ఒక్కటంటే ఒక్క చెడ్డ మాట కూడా మాట్లాడలేదు. మీరు ఇక మాట్లాడింది చాలు. ఇక్కడి నుంచి వెళ్లిపోండి' అని అరుస్తుంది.

తన వదిన కళ్లు తెరిపించిన ప్రేమ్
లాస్య మాట్లాడి వెళ్లిపోయిన తర్వత ప్రేమ్ వచ్చి అంకితతో మాట్లాడుతాడు. 'వదినా.. నీ కొలిగ్స్‌తో కంపేర్ చేస్తే నీ పర్ ఫార్మెన్స్ బాగుందని నీ సీనియర్ డాక్టర్ పొగిడితే నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యావు కదా. అంటే నిన్ను, నీ కొలిగ్స్‌తో పోల్చారు కదా. మరి చపాతీల విషయంలో నానమ్మ.. నిన్ను, అమ్మతో పోల్చినప్పుడు మాత్రం నీకు ఎందుకు కోపం వచ్చింది? ఏదో చెప్పాలి అనిపించింది చెప్పాను. సరే వస్తాను వదిన' అని చెప్పి ప్రేమ్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో అంకిత ఆలోచనలో పడిపోతుంది. ఆ తర్వాత ఆమెలో పశ్చాత్తపం కూడా కనిపిస్తుంది.

తులసికి సర్‌ప్రైజ్.. ఒక్కసారిగా షాక్
ఇక, ఫ్యాక్టరీకి వెళ్లిన తులసి ఇంటికి హడావుడిగా వస్తుంది. సాయంత్రం కాస్త లేట్ అవుతుంది. పరందామయ్య, అనసూయ అక్కడ కూర్చొని ఉంటారు. అప్పుడామె 'వాళ్ల దగ్గరికి వెళ్లి లేట్ అయింది. సారీ అత్తయ్య. వెంటనే ఫ్రెష్ అయి నేను వంట చేస్తా' అని చెబుతుంది. దీంతో ఇద్దరూ నవ్వేస్తారు. అంతేకాదు, 'ముందు నువ్వు వెళ్లి డైనింగ్ టేబుల్‌ను చూడు' అంటారు. దీంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి చూస్తుంది. అక్కడ గులాబీ రెక్కలతో సారీ అని రాసి ఉంటుంది. చూస్తే అక్కడ అన్నం, కూరలు అన్నీ వండి ఉంటాయి. వాటిని చూసి తులసి షాక్ అవుతుంది.

తులసికి క్షమాపణ చెప్పిన అంకిత
అవన్నీ చూసిన తులసి ఎవరు వండారని అనుకుంటుంది. అంతలో అంకిత వచ్చి ఆమెను కౌగిలించుకుంటుంది. అంతేకాదు సారీ చెబుతుంది. దీంతో తులసి 'ఏమ్మా.. కోప్పడు భరిస్తాను. కానీ, ధ్వేషాన్ని తట్టుకోలేనమ్మా' అంటుంది. దీంతో 'నాకు కోపం వస్తుంది కానీ, ధ్వేషించడం నా వల్ల కాదు ఆంటి. సారీ ఆంటి. వర్క్ టెన్షన్‌లో మీతోనూ, అమ్మమ్మతోనూ అలా రెస్పాండ్ అయ్యాను' అంటుంది. దీంతో పర్లేదులే అన్నట్లుగా మాట్లాడతారు. ఆ తర్వాత నందూ, లాస్య వస్తారు. అప్పుడతను 'మన తప్పు మనం తెలుసుకోవడం మంచి లక్షణం. చేసిన పనికి క్షమాపణలు చెప్పడం మంచి లక్షణం. చూశావా లాస్య దేవుడు నీకు ఎంత మంచి కుటుంబాన్ని ఇచ్చాడో. నువ్వు కూడా ప్రేమతో కుటుంబానికి దగ్గరవ్వు. తులసికి దక్కిన ప్రేమ నీకు కూడా దక్కుతుంది' అంటాడు. ఆ తర్వాత తులసి తన పిల్లలను శాలరీ ఇవ్వమని అడుగుతుంది. దీంతో కాస్త గొడవ జరుగుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











