Intinti Gruhalakshmi Today Episode: ఓపెనింగ్‌ రోజే కస్టమర్ల షాక్.. తులసి చేసిన పనితో నందూ నిరాశ

జనరేషన్లు మారుతున్నప్పటికీ తెలుగు టెలివిజన్‌పై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసిని అందరూ నవ్వించే ప్రయత్నం చేస్తోన్న సమయంలో అభి వచ్చి ఆమెకు క్షమాపణ చెబుతాడు. దీంతో అందరూ సంతోషంగా ఉంటారు. ఆ తర్వాత ఇంట్లో వాళ్లంతా నందూ కొత్త కెఫే ఓపెనింగ్‌కు వెళ్తారు. అక్కడ పరందామయ్య, అనసూయతో రిబ్బన్ కటింగ్ చేయించి కెఫేను ఓపెనింగ్ చేయిస్తారు.

ఆ సమయంలో లాస్య అన్నీ తానే చేస్తానని అంటుంది. ఇక, దీనికి గెస్టుగా వచ్చిన గాయత్రి.. నందూ, తులసి మధ్య ఏదో జరుగుతుందని లాస్యను రెచ్చగొడుతుంది. దీంతో ఆమె వెళ్లి తులసి పట్ల కఠువుగా ప్రవర్తించి ఇబ్బంది పెడుతుంది.

కస్టమర్లు కరువు.. లాస్య వెటకారం

కస్టమర్లు కరువు.. లాస్య వెటకారం

కెఫే ఓపెనింగ్ అయిన తర్వాత అందరూ కస్టమర్ల కోసం వేచి చూస్తుంటారు. కానీ, ఎవరూ రాకపోవడంతో నందూ టెన్షన్ పడుతుంటాడు. దీంతో లాస్య 'ఇక్కడున్న ప్రతి ఒక్కరికి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఇక్కడ కేఫ్ పెట్టడం అంత కరెక్ట్ కాదని అన్నాను. కానీ నా మీద చాలెంజ్ విసిరారు.

ఇప్పటి వరకు టైం వేస్ట్ చేసింది చాలు.. మూట ముళ్ళు సర్దుకుని ఇంటికి వెళ్దాం పదండి' అంటుంది. అప్పుడు తులసి శుభం పలకొచ్చు కదా లాస్య అనడంతో 'పొద్దున్నుంచి అదే మాట చెబుతున్నావు కదా. కేఫ్ అంతా కస్టమర్స్‌తో కలకల లాడుతుందన్నావు' అంటుంది.

వాళ్ల కోసం తులసి సూపర్ ప్లాన్

వాళ్ల కోసం తులసి సూపర్ ప్లాన్

కస్టమర్లు ఎంతకీ రాకపోవడంతో తులసి ఇంట్లో వాళ్ళను అక్కడ ఉన్న సీట్లలో కూర్చొమని చెబుతుంది. దీంతో అందరూ మనం కస్టమర్స్‌లా కూర్చోవడం ఏంటి అంటారు. అప్పుడు అనసూయ నాకు కూడా అదే అర్థం కావడం లేదు అంటుంది. అప్పుడు నందూ 'రెండు పానీపూరి బండ్లు పెడితే ఎక్కడికి వెళ్తారు' అంటాడు.

దీంతో శృతి జనాలు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్తాము అంటుంది. అప్పుడు నందూ కరెక్ట్.. తులసి ప్లాన్ కూడా అదే అని అంటాడు. దీనికి అనసూయ 'అర్థం అయింది రా మార్కెటింగ్ చదువుకుంటేనే కాదు ఆలోచన ఉంటేనే అని' అంటుంది.

ఆర్డర్ ఏంటో తెలియక టెన్షన్

ఆర్డర్ ఏంటో తెలియక టెన్షన్

తులసి చెప్పినట్లుగా అందరూ వెళ్లి సీట్లలో కూర్చుంటారు. కానీ, కస్టమర్లు చూసీ చూడనట్లుగానే వెళ్లిపోతుంటారు. అప్పుడు తులసి వాళ్ళ కుటుంబ సభ్యులకు కాఫీలు, జ్యూస్‌లు ఇస్తుంది. అప్పుడు అందరూ అవి తాగుతూ కస్టమర్స్ కోసం ఎదురు చూస్తుంటారు. అప్పుడు లాస్య పదేపదే వెళ్దాం వెళ్దాం అంటుంది. దీంతో అనసూయ ఇంట్లో ఏమైనా లంకె బిందెలు దాచావా? కావాలంటే మేముంటాం నువ్వు వెళ్ళిపో అంటుంది. ఇంతలోనే ఇద్దరు కష్టమర్స్ రావడంతో నందూ వాళ్లను లోపలికి పిలుచుకొని వెళ్తాడు.

ఇక, కస్టమర్స్ రావడంతో అందరి సంతోష పడుతూ ఉంటారు. అయితే, ఆ కస్టమర్లు ఆర్డర్ ఇవ్వడంతో దాని గురించి ఏం చేయాలో తెలియక తులసి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారు. చెఫ్ కూడా తనకు అదేంటో తెలియదు అంటాడు.

తులసి వాళ్లకు కస్టమర్లు షాక్

తులసి వాళ్లకు కస్టమర్లు షాక్

వాళ్ల మాటలు విని కస్టమర్లు వెళ్లిపోవాలని అనుకుంటారు. అప్పుడు నందూ వాళ్లను ఆపి పర్లేదు కూర్చోండి అంటాడు. అయినా వాళ్లు వెళ్లిపోతుండగా తులసి కూడా పిలుస్తుంది. తర్వాత నందూ, తులసి, ప్రేమ్, ముగ్గురు కలిసి వాళ్ల ఆర్డర్ తయారు చేస్తారు. ఆ సమయంలో అందరూ టెన్షన్ పడుతుంటారు. ఇక, తులసి వాటిని తీసుకెళ్లి ఇవ్వగానే.. కస్టమర్స్ వాట్ ఇస్ దిస్ ఇది కిటోబర్గరా అని షాకిస్తారు. దీంతో లాస్య 'నువ్వు ఊరగాయ పచ్చడి చేసుకో.

ఇలాంటివి నీకు సెట్ కావు' అని వెటకారంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత ఆ అమ్మాయితో వచ్చిన కుర్రాడు ఏమైంది బేబీ అనడంతో బర్గర్ సూపర్‌గా ఉంది అంటుంది. అంతేకాదు, ఇంకా కావాలని ఆర్డర్ చేస్తారు. దీంతో నందూ, తులసి ఇద్దరు ఆనంద పడుతూ ఉండగా లాస్య షాక్ అవుతుంది.

గాయత్రికి నందూ కరెక్ట్ ఆన్సర్

గాయత్రికి నందూ కరెక్ట్ ఆన్సర్

ఆ కస్టమర్లు వెళ్లిపోగానే అందరూ సంతోషంతో చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆ తర్వాత నందూ అక్కడి వాళ్లకు పని చెబుతూ ఉండగా.. గాయత్రి అక్కడికి వచ్చి 'అసలు నీ ప్రవర్తన ఏంటో నాకు అర్థం కావడం లేదు. నువ్వు అదృష్టవంతుడివో ఏంటో కూడా నాకు అర్థం కావడం లేదు' అంటుంది.

దీంతో నందూ 'అదృష్టం అంటే ఆస్తి ఉండడం కాదు సంతోషంగా చేతినిండా పని ఉండడం కడుపునిండా భోజనం చేయడం' అంటాడు. దీంతో తులసి 'సమర్ధించుకోవడంలో కూడా తులసి బాగానే ట్రైనింగ్ ఇచ్చినట్టు ఉంది. నువ్వు నేర్చుకున్నది మంచో చెడో కాలమే డిసైడ్ చేస్తుంది' అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

లాస్యకు నందూ వరుస షాక్‌లు

లాస్యకు నందూ వరుస షాక్‌లు

కెఫే విషయంలో అందరూ హ్యాపీగా ఉండడంతో లాస్య కుళ్లుకుంటూ ఉంటుంది. ఆ సమయంలో వెటకారంగా మాట్లాడుతుంటుంది. దీంతో పరందామయ్య 'మాట అనే ముందు కొంచెం ఆలోచించి మాట్లాడు' అంటాడు. ఆ వెంటనే నందూ 'మా నాన్న మన కోసమే చెబుతున్నాడు. ఎదురు తిరిగి మాట్లాడకుండా చెప్పింది విను లాస్య' అని సీరియస్ అవుతాడు. అప్పుడు హోటల్లో మిగిలినపోయిన ఫుడ్ మనమే తిందాము అని అంటాడు.

ఆ తర్వాత తులసి 'అన్ని జరిగాయా లేదా అని చెక్ చేసుకోండి. గ్యాస్ ఆఫ్ చేసే దగ్గర నుంచి లైట్స్ ఆఫీస్ చేసే వరకు ప్రతి ఒక్క విషయాన్ని దగ్గరుండి చూసుకోండి' అంటుంది. దీంతో నందూ 'నువ్వు పక్కనే ఉంటావు కదా తులసి' అని అంటాడు.

తులసి మాటతో నందూ నిరాశ

నందూ మాటకు తులసి 'నేను ఉన్న లేనట్టే. నా బాధ్యతలు నాకు ఉన్నాయి కదా' అని అంటుంది. దీంతో అందులో నా బాధ్యత కూడా ఒకటి అనుకోవచ్చు కదా అంటాడు. దీనికామె 'మీ బాధ్యతలు పంచుకోవడానికి మీ భార్య లాస్య ఉంది' అని అంటుంది. అప్పుడు నందూ నిరాశ చెందుతాడు. తర్వాత నందూ 'ఈరోజు ఈ డబ్బులు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది' అని అంటాడు.

అప్పుడు తులసి.. నందూకు ధైర్యం చెబుతుంది. ఆ తర్వాత తులసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనంతరం కెఫేలో లాస్య అన్న మాటల గురించి తులసి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ వెంటనే కెఫే ప్రమోషన్ గురించి ప్లాన్లు చేస్తుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X