Intinti Gruhalakshmi: వేరే అమ్మాయితో విక్రమ్.. వాళ్లకు దొరకడంతో.. తులసికి రాజ్యలక్ష్మి షాక్
జనరేషన్లు మారుతున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే : గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. విక్రమ్‌కు రాజ్యలక్ష్మి అసలు ప్లాన్ గురించి చెప్పాలనుకున్న ప్రియ.. అతడికి కాఫీ ఇచ్చి మాట్లాడుతుంది. అప్పుడు విక్రమ్ ఆమెను ఎన్నో ప్రశ్నలు అడుగుతాడు. ఆ సమయంలోనే అసలు విషయం చెప్తుండగా బసవయ్య వచ్చి అడ్డుకుంటాడు. అనంతరం తులసి ఫ్యామిలీ అంతా పెళ్లి బట్టలు కొనేందుకు షాపింగ్‌కు వెళ్తుంది. అక్కడ పని చేసే వ్యక్తి తులసి, నందూను భార్యభర్తలని అనుకుంటాడు. దీంతో లాస్య అతడిపై ఫైర్ అవుతుంది. ఇక, షాపింగ్‌కు దొంగతనంగా వచ్చిన విక్రమ్.. దివ్యను పక్కకు రమ్మని సైగలు చేస్తుంటాడు.

ట్రయల్ రూమ్‌లోకి విక్రమ్: దొంగతనంగా షాపింగ్‌కు వచ్చిన విక్రమ్.. దివ్యను పక్కకు రమ్మని సైగలు చేస్తూ ఉంటాడు. కానీ, ఆమె మాత్రం చాలాసేపు బ్రతిమాలించుకుంటుంది. ఆ తర్వాత దివ్య.. పరంధామయ్య, అనసూయలకు ఇప్పుడే వస్తానని చెప్పి అక్కడ నుంచి వెళ్తుండగా విక్రమ్ ట్రయల్ రూమ్‌లోకి వెళ్తాడు. దివ్య కూడా అతడి వెనకాలే వెళ్తుండగా.. తులసి వచ్చి నీకు ఒక మంచి చీర చూశాను కదా అని అక్కడి నుంచి తీసుకొని వెళ్తుంది. ఆ సమయంలో దివ్య మాత్రం ట్రయల్ రూమ్‌లో ఉన్న విక్రమ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అతడేమో దివ్య వస్తుందని ఏదేదో ఊహించుకుంటారు.
వేరే అమ్మాయితోనే విక్రమ్: విక్రమ్ ట్రయల్ రూమ్‌లో ఉండగానే ఓ అమ్మాయి వచ్చి 'ఏంటో ఎన్ని మంచి డ్రెస్సులు వేసుకున్నా.. ఒక అబ్బాయి కూడా నా వైపు చూడడం లేదు. కనీసం ఈ డ్రెస్‌తో అయినా ఒక అబ్బాయి నా వైపు చూస్తాడేమో' అనుకుంటూ లోపలికి వెళ్తుంది. అంతలోనే విక్రమ్ ఎలా అయిన దివ్య కౌగిలించుకోవాలి అని డ్రెస్సింగ్ రూమ్‌లో లైట్‌ను ఆఫ్ చేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి రాగానే దివ్యనే వచ్చింది అనుకుని వెనకనుంచి వాటేసుకుంటాడు. అంతేకాదు, 'ఇంతసేపటి నుంచి ఎదురు చూస్తుంటే ఇప్పుడు వచ్చావా' అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి 'ఇన్నాళ్లకు నాకు బాయ్‌ఫ్రెండ్‌ను దొరికించావా స్వామి. చాలా థాంక్స్' అంటుంది.
ఆమెను చూసి విక్రమ్ షాక్ : చీకట్లో అమ్మాయిని హగ్ చేసుకున్న విక్రమ్ 'నీ ముఖంలో సిగ్గు ఎలా ఉంటుందో చూడాలని ఉంది. ఆగు లైట్ వేస్తా' అంటాడు. అప్పుడామె 'వద్దు బాబు నాకు లైట్ వేస్తే సిగ్గు' అంటుంది. దీనికతడు 'అదేంటి ఆల్రెడీ మన ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసుకున్నాము కదా' అనగానే.. 'నాకు ఒక మాట కూడా చెప్పకుండా ముహూర్తం ఫిక్స్ చేసావా నాటి బాయ్' అంటుంది. దీంతో విక్రమ్ 'నీ వాయిస్ ఏదో చేయలా కొడుతుంది ఒక్క నిమిషం ఆగు' అని లైట్ వేస్తాడు. అప్పుడు దివ్య కాకుండా వేరే అమ్మాయి ఉండడంతో చూసి షాక్ అవుతాడు. అప్పుడా అమ్మాయి 'ట్రయల్ రూమ్‌లో నువ్వే నన్ను పట్టుకుని.. ఇప్పుడు వదిలేయమంటావేంటి' అంటూ లాగుతూ ఉంటుంది. ఇదంతా చూసిన దివ్య నవ్వుకుంటూ ఉంటుంది.

విక్రమ్‌ను ఫాలో అవుతూ : దివ్య ఏమో విక్రమ్‌ను కలవాలని అనుకుంటూ ఉండగా.. తులసి మాత్రం ఆమెను ఆపుతూ ఉంటుంది. ఇక విక్రమ్ ఆ అమ్మాయి నుంచి తప్పించుకొని దివ్య కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో దివ్య ముందు చీరలు అన్ని పెట్టి ఒక్కొక్కటి సెలెక్ట్ చేయమని అంటారు. దీంతో దివ్య వాటిని విక్రమ్‌కు చూపించగా.. అతడు సెలెక్ట్ చేస్తాడు. అది నందూ చూసి విక్రమ్ ఎంపిక చేసుకున్న దాన్నే ఓకే చేస్తాడు. అలా చీరలన్నీ విక్రమ్‌కు నచ్చినవే సెలెక్ట్ చేస్తారు. దీంతో దివ్య ఆశ్చర్యపోతుంది. అది పూర్తవగానే దివ్యను ట్రయల్ రూమ్‌లోకి రమ్మని పిలుస్తాడు.
దొరికిపోయిన కొత్త జంట
విక్రమ్ పిలుస్తుండడంతో దివ్య 'అమ్మా.. ఈ డ్రెస్ ట్రై చేసుకుని వస్తాను' అని ట్రయల్ రూమ్‌లోకి వెళ్తుంది. అందులో విక్రమ్ ఉన్నాడని వాళ్లందరికీ తెలిసినా ఏమీ తెలియనట్లుగా ప్రవర్తిస్తుంటారు. ఇక, లోపలికి వెళ్లిన తర్వాత విక్రమ్, దివ్య రొమాన్స్ పండిస్తూ ఉంటారు. ఆ సమయంలో దివ్యకు పిల్లి అంటే భయం అని అనసూయ పిల్లిలా అరుస్తుంది. దీంతో ఆమె భయపడగా విక్రమ్ ధైర్యం చెప్తాడు. తర్వాత మళ్లీ అరవగా దివ్య భయంతో బయటకు వస్తుంది. వచ్చిన వెంటనే వాళ్ల కోసం అక్కడ వేచి చూస్తున్న వాళ్లందరినీ చూసి షాక్ అవుతుంది.
సిగ్గు పడిపోయిన విక్రమ్
దివ్య బయటకు వచ్చిన వెంటనే అందరూ నవ్వుతూ ఆమెను ఆటపట్టిస్తూ ఉంటారు. ఆ తర్వాత అనసూయ 'బాబు ఇక నువ్వు బయటికి రావచ్చు' అని అంటుంది. దీంతో విక్రమ్ సిగ్గుపడుతూ, టెన్షన్ పడుతూ బయటకు వస్తాడు. ఆ తర్వాత అతడికి ఏం చేయాలో అర్థం కాదు. అందరూ సరదాగా ఆటపట్టిస్తుండడంతో దివ్య, విక్రమ్‌లు ఇరుక్కుపోయామే అనుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు. అప్పుడు నేను వెళ్ళొస్తానండి అంటూ సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత నందూ బిల్ పే చేయడంతో అక్కడి నుంచి అందరు వెళ్ళిపోతారు.
తర్వాత తులసికి ఫోన్ చేసిన రాజ్యలక్ష్మి 'ఒక విషయంలో మీరు తప్పు చేస్తున్నారు. వెంటనే అది మార్చుకోవాలి' అంటుంది. దీనికామె 'నా తప్పు ఉంటే సరిదిద్దుకుంటాను.. క్షమాపణ చెబుతాను.. తప్పు లేకపోతే ఆ దేవుడు చెప్పిన వినను' అని అంటుంది. తర్వాత రాజ్యలక్ష్మి 'మీరు నన్ను గారు అని పిలవడం బాగోలేదు' అనడంతో తులసి అలవాటు పడాలి కదా అని అంటుంది. అప్పుడు రాజ్యలక్ష్మి ఏదేదో మాట్లాడగా తులసి నవ్వుతుంది. అనంతరం 'నగలు పంపించాను దివ్యకు నచ్చాయా' అనడంతో చాలా నచ్చాయి అంటుంది. అలాగే, తులసి 'రేపు అల్లుడు గారికి బట్టలు పంపిస్తాను' అంటుంది. ఇదంతా విన్న ప్రియ కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











