For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: అతడి నాలుక కోస్తానన్న నందూ.. అభి తీరుతో అంకిత కీలక నిర్ణయం

  |

  చాలా భాషలను పోల్చుకుని చూస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్లయిట్ ఆలస్యం కావడంతో సామ్రాట్, తులసి ఎయిర్‌పోర్టులో వేచి చూస్తుంటారు. ఆ సమయంలో తులసి తెచ్చుకున్న పులిహోరను సామ్రాట్ మొత్తం తినేస్తాడు. అనంతరం నందూను ఒప్పించి లాస్య కూడా వైజాగ్ వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వస్తుంది. దీంతో భార్యను వెంట పెట్టుకుని వచ్చిన నందూను సామ్రాట్ ప్రశంసిస్తాడు. ఇక, ప్లయిట్ ఎక్కగానే బత్తాయి బాలరాజు ఎంట్రీ ఇచ్చి నందూకు చిరాకు తెప్పిస్తాడు. మరోవైపు, తులసితో అభి ప్రవర్తించిన తీరుపై అంకిత కోపంగా ఉంటుంది. దీంతో అతడికి ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతుంది.

  Karthikeya 2 Twitter Review: నిఖిల్ మూవీకి అలాంటి టాక్.. బాహుబలి తర్వాత ఇదే.. క్లైమాక్స్ మాత్రం!

  అభి గొడవ... బాధ పడిన అంకిత

  అభి గొడవ... బాధ పడిన అంకిత


  భోజనం చేసే సమయంలో తనను, తన తండ్రితో పోల్చారన్న కారణంగా అభి ఇంట్లోని వాళ్లతో గొడవకు దిగుతాడు. కావాలనే డాడీని విలన్‌ను చేస్తున్నారు అంటూ మండిపడతాడు. అప్పుడు ప్రేమ్ సర్ధి చెప్పబోగా.. అతడిపైనా విరుచుకుపడతాడు. ఆ తర్వాత అన్నం తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో అంకిత ‘అంతా నావల్లే.. నేను ఫుడ్ మంచిగా చేస్తే బాగుండు. అది నచ్చకనే అభి ఇలా చేశాడు. ఈరోజు రాత్రికి నేను వండను. బయటి నుంచి ఆర్డర్ చేస్తా' అని బాధ పడుతుంది. అప్పుడు అనసూయ ఆమెను ఓదార్చి నైట్ కూడా నువ్వే వండాలి అంటుంది.

  తులసి ఫొటోలు తీసిన సామ్రాట్

  తులసి ఫొటోలు తీసిన సామ్రాట్

  విమాన ప్రయానం చేస్తున్నానన్న సంతోషంతో తులసి తెగ సంబర పడుతూ ఉంటుంది. అంతేకాదు, విమానంలో ఉన్న తనను ఫొటోలు తీయమని సామ్రాట్‌తో అంటుంది. దీనికతడు ‘మీ ఫోన్‌లో ఫొటోలు సరిగా రావు. నా మొబైల్‌ నుంచి తీస్తాను' అంటూ క్యాప్చర్ చేస్తాడు. దీంతో తులసి రకరకాల ఫోజులు ఇస్తుంది. ఆ తర్వాత వాటిని తులసి దివ్యకు పంపిస్తుంది. అవి చూసిన కుటుంబ సభ్యులు తెగ సంతోష పడుతుంటారు. అదంతా చూస్తున్న నందూ, లాస్య మాత్రం అస్సలు సహించుకోలేరు. పైగా తులసి చేసే పనులకు నందూ తీవ్రమైన కోపంతో రగిలిపోతాడు.

  రష్మిక మందన్నా హాట్ సెల్ఫీ వైరల్: ఈ పిక్‌లో ఆమెను చూస్తే తట్టుకోలేరు

  ఇంట్లో వాళ్లకు తులసి ఫోన్ కాల్

  ఇంట్లో వాళ్లకు తులసి ఫోన్ కాల్


  ఫొటోలు పంపించిన తర్వాత తులసి ఇంట్లో వాళ్లకు ఫోన్ చేస్తాను అంటుంది. దీంతో సామ్రాట్ హ్యాపీగా చేసుకోండి అంటాడు. అప్పుడు తులసి.. తన మామ పరందామయ్యకు కాల్ చేస్తుంది. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయగానే.. మామయ్య ఫోటోలు చూశారా అంటుంది. దీనికి ప్రేమ్ చూశాం అమ్మ అంటాడు. తర్వాత తులసి ‘మామయ్య.. మనం ఇదివరకు బస్సులో వెళ్లినప్పుడు ఏసీ ఎక్కువగా ఉందన్నారు కదా.. ఇక్కడ అంతకంటే ఎక్కువ ఉంది' అంటుంది. ఆ తర్వాత ఫోన్ కట్ చేసి నేను ఏమన్నా ఎక్కువ మాట్లాడానా అని సామ్రాట్‌ను అడగ్గా లేదని బదులు ఇస్తాడు.

   బాలరాజు మాటలకు వాళ్లు షాక్

  బాలరాజు మాటలకు వాళ్లు షాక్


  ఫోన్ మాట్లాడిన తర్వాత తులసి డైరీ తీసుకుని ఏదో రాస్తూ ఉంటుంది. అంతలో బత్తాయి బాలరాజు.. సామ్రాట్‌ను పలకరిస్తాడు. ఆ తర్వాత ‘మీరు హీరో అవుతారా? హైట్ బాగున్నారు. మీరిద్దరూ భార్యాభర్తలు.. ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు కదా. హైదరాబాద్‌లో లైఫ్ బోర్ కొట్టి వైజాగ్‌లో ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు కదా' అని అంటాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. పక్కనే ఉన్న నందూకు కోపం వచ్చి ఇంకో మాట ఎక్కువ మాట్లాడితే నాలిక కోస్తా అని వార్నింగ్ ఇస్తాడు. దీంతో సామ్రాట్ ‘ఊరుకో నందూ.. ఏదో తెలియకుండా మాట్లాడాడు' అని సముదాయిస్తాడు. ఆ తర్వాత బాలరాజు ‘మీ గురించి ఏమో కానీ.. వీళ్ల గురించి మాత్రం బాగా చెబుతా. ఆవిడ మాత్రం ఆయన సెటప్ అయి ఉంటుంది' అంటాడు. దీంతో నందూ అతడిపై ఫైర్ అవుతాడు.

  ఫ్లైట్‌లోనే నయనతార - విఘ్నేష్ రచ్చ: భర్త మీద కూర్చుని.. ఏకంగా అక్కడ ముద్దు పెట్టేసి!

  ప్రేమ్‌కు సలహా ఇచ్చిన అంకిత

  ప్రేమ్‌కు సలహా ఇచ్చిన అంకిత


  మరోవైపు అంకిత ఒంటరిగా తిరుగుతూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో ప్రేమ్ అక్కడికి వచ్చి ‘అన్నయ్య అన్న మాటలకు బాధపడకు వదిన' అని ఓదార్చుతాడు. అప్పుడు అంకిత ‘మనసు మార్చుకొని ఇంటికి వచ్చాను అని చెప్పిన వాడు.. బుద్ధిగా ఉండకుండా ఎందుకు ఇలా చేస్తున్నాడు. అయినా నీ సంగతి ఏంటి. అసలు నీ మనసు నీ దగ్గర లేదు. శృతి గురించి ఆలోచిస్తున్నావు కదూ. ఇక్కడికి రావడం ఇష్టం లేకపోయినా మీ అన్నయ్య నా కోసం వచ్చాడు. జరిగిన గొడవ పక్కనపెట్టి శృతిని తీసుకొనిరా' అని అతడికి విలువైన సలహాను ఇస్తుంది.

  Recommended Video

  కార్తికేయ 2 తో చందు మొండేటి సక్సెస్ అయ్యాడా? *Reviews | Telugu OneIndia
  నందూను రెచ్చగొట్టేసిన లాస్య

  నందూను రెచ్చగొట్టేసిన లాస్య


  అనంతరం విమానం వైజాగ్‌కు బయలుదేరుతుంది. నందూ వాళ్ల వెనకాలే కూర్చున్న బత్తాయి బాలరాజు.. వాళ్లిద్దరినీ హేళన చేస్తూ ఉంటాడు. దీంతో వాళ్లకు తెగ కోపం వస్తుంటుంది. ఆ తర్వాత ఇద్దరూ లేచి పక్కకు వెళ్లిపోతారు. ఆ సమయంలో లాస్య ‘తులసికి దగ్గరయ్యేందుకు సామ్రాట్ ఎలా ప్రయత్నాలు చేస్తున్నాడో చూడు. సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నాడు.. ఇంత తెగింపా' అని నందూను రెచ్చగొడుతుంది. దీనికి అతడు ‘ఏం చేయను నాక్కూడా కోపం వస్తోంది. కానీ, మనం ఏమీ చేయలేము. చూస్తూ ఉండడం తప్ప' అంటాడు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 710: Tulasi feels excited about her first Flight Journey. After That Ankitha Advises Prem to Reunite with Shruthi
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X