For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: సామ్రాట్ ఇంట్లో తులసికి షాక్.. పరందామయ్యను అలా చూడడంతో!

  |

  ఎన్నో భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి, సామ్రాట్ గురించి ఆర్టికల్ రావడంపై అభి, ప్రేమ్ గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు ఇంట్లో వాళ్లంతా తులసికి సపోర్ట్ చేయగా.. అభి, అనసూయ మాత్రం తేడాగా మాట్లాడతారు. ఆ సమయంలోనే తులసి వస్తుంది. ఆ వెంటనే సామ్రాట్ కూడా వచ్చి ఆర్టికల్ గురించి తులసికి చెప్తాడు. కానీ, ఆమె మాత్రం లైట్ తీసుకుంటుంది. దీంతో ఇంట్లో వాళ్లందరూ షాక్ అయిపోతారు. కానీ, సామ్రాట్ మాత్రం ఆమె ప్రవర్తనకు ఫిదా అయిపోతాడు. ఆ తర్వాత తన బాబాయితో సామ్రాట్ తులసిపై ఉన్న అభిమానాన్ని బయట పెట్టుకున్నాడు.

  శివాత్మక రాజశేఖర్ షాకింగ్ స్టిల్: తొలిసారి ఈ రేంజ్‌లో అందాల ఆరబోత

   పరందామయ్య విలువైన సలహా

  పరందామయ్య విలువైన సలహా


  సామ్రాట్‌తో కలిసి తులసి ప్రవర్తిస్తోన్న తీరుపై అనసూయకు అనుమానం పెరుగుతూ ఉంటుంది. ఇదే విషయాన్ని అనసూయ.. పరందామయ్యకు చెప్తుంది. అంతేకాదు, తులసికి హద్దులు ఉంచాలని అంటుంది. దీంతో పరందామయ్య 'తులసిని ఎంకరేజ్ చేద్దాం. తులసికి మనం భారంగా మాత్రం మారొద్దు. ప్రపంచమంతా ఏకమై తనను విమర్శించినా తులసి పట్టించుకోదు కానీ.. మనిద్దరం వెళ్లి తనను వేలెత్తి చూపిస్తే తను తట్టుకోలేదు. కుప్పకూలిపోతుంది అనసూయ. అందుకే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం' అని అనసూయకు సలహాలను ఇస్తాడు.

  ప్రేమ్, శృతి మధ్య గిల్లికజ్జాలతో

  ప్రేమ్, శృతి మధ్య గిల్లికజ్జాలతో


  చాలా రోజుల తర్వాత శృతి, ప్రేమ్ ఒకే గదిలో ఉంటారు. అప్పుడు ప్రేమ్ ఇదిగో నీ బ్యాగు.. మీ అత్తయ్య వాళ్లింటి నుంచి తెచ్చాను అంటాడు. దీంతో 'శృతి ఎందుకు తెచ్చావు? అసలు నిన్ను ఎవరు తెమ్మన్నారు? నేను ఇక్కడ ఎన్ని రోజులు ఉంటానో నాకు తెలియదు అని ప్రశ్నిస్తుంది. నేను ఏం చేస్తున్నానో నాకు పూర్తి క్లారిటీ ఉంది. నేను ఇక్కడ ఉండేది నీ మీద ప్రేమతో కాదు.. ఆంటిని కాదనలేక' అంటుంది. దీనికి ప్రేమ్ 'నేను కూడా అమ్మ కోసం అమ్మను బాధపెట్టకూడదని ఒప్పుకున్నాను' అంటాడు. దీంతో నా మాటలు కాపీ కొట్టకు అని శృతి అంటుంది.

  మోనాల్ గజ్జర్ హాట్ సెల్ఫీ: అద్దంలో ఆ అందాలు కనిపించడంతో!

  వేరుగా పడుకున్న ప్రేమ్, శృతి

  వేరుగా పడుకున్న ప్రేమ్, శృతి


  ప్రేమ్‌తో గిల్లికజ్జాలు ఆడుతూ గొడవ పెట్టుకున్న తర్వాత దిండు, దుప్పటి తీసుకొని కింద శృతి కింద సర్దేందుకు ప్రయత్నిస్తుంది. దీంతో ప్రేమ్ నాకోసం ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు అంటాడు. అప్పుడామె ఆ దిండు, దుప్పటి నాకోసం కాదు.. నీకోసం అంటుంది. దీంతో ప్రేమ్ నీకు పొగరు మాత్రం ఇంకా తగ్గలేదు అంటాడు. అప్పుడామె అవును కావాల్సినంత ఉంది. నీకు కొంచెం కావాలా అంటుంది. అప్పుడు ప్రేమ్ కోపంతో కింద పడుకుంటాడు. దీంతో శృతి కాస్త నడవడానికి దారి ఉంచి పడుకో అంటుంది. ఆ తర్వాత ఆమె మంచంలో ఒక్కతే పడుకుంటుంది.

  సామ్రాట్ ఇంటికెళ్లిన మామయ్య

  సామ్రాట్ ఇంటికెళ్లిన మామయ్య


  ఉదయాన్నే పరందామయ్య కనిపించడు. దీంతో తులసి ఇంత పొద్దున్నే ఎటు వెళ్లాడు అని అనుకుంటుంది. ఇంతలో పరందామయ్య ఆమెకు ఫోన్ చేస్తాడు. అప్పుడు 'నేను చెప్పేది విను. నేను ఇప్పుడు సామ్రాట్ ఇంట్లో ఉన్నాను. ఏం జరిగిందో చెప్పడం ఫోన్‌లో కుదరదు కానీ.. నువ్వు ముందు వెంటనే బయలుదేరి రా.. ఇక్కడికి వచ్చాక మాట్లాడుకుందాం. ఎవ్వరికీ చెప్పకుండా వెంటనే బయలు దేరి సామ్రాట్ ఇంటికి వచ్చేయ్' అని అంటాడు. దీంతో తులసికి కంగారు వచ్చి ఏం జరిగింది అని ప్రశ్నిస్తుంది. కానీ, పరందామయ్య మాత్రం ఏమీ చెప్పకుండా వెంటనే రమ్మంటాడు.

  అతడితో పెళ్లికి ముందు హన్సిక ఘాటుగా! నాటుగా అందాల ఆరబోత

   సామ్రాట్ ఇంటికి చేరిన తులసి

  సామ్రాట్ ఇంటికి చేరిన తులసి


  సామ్రాట్ ఇంటికి తులసి బయలుదేరుతుండగా ఎక్కడికి వెళ్తున్నావు అని అనసూయ అడుగుతుంది. దీంతో తులసి కొంచెం పని ఉంది మళ్లీ వస్తా అని చెప్పి వెళ్తుంది. వెంటనే సామ్రాట్ ఇంటికి వస్తుంది. అప్పుడు ఏం జరిగిందో అని టెన్షన్ పడుతుంది. మరోవైపు, పరందామయ్య, సామ్రాట్ బాబాయి ఇద్దరూ కలిసి చెస్ ఆడుతూ ఉంటారు. ఇంతలో తులసి బెల్ కొడుతుంది. సామ్రాట్ డోర్ తీస్తాడు. అప్పుడు తులసి 'సారీ సామ్రాట్ గారు.. వయసుతో పాటు మామయ్యకు కోపం, చాదస్తం పెరిగాయి. కోపంలో ఆయన్ను ఏమనొద్దు. నేను ఆయనకు సర్దిచెబుతాను. మామయ్య ముందు నేను అవన్నీ చెప్పలేను. అందుకే గుమ్మం ముందే చెబుతున్నాను' అంటుంది. తర్వాత లోపలికి వెళ్లి చూడగా.. పరందామయ్య చెస్ ఆడుతుంటాడు.

  తులసికి సర్‌ప్రైజ్ ఇస్తామంటూ

  తులసికి సర్‌ప్రైజ్ ఇస్తామంటూ


  పరందామయ్యను చూసిన తులసి 'ఏంటి మామయ్యా ఇది.. నన్ను ఉన్నపళంగా రమ్మని మీరు తీరిగ్గా చెస్ ఆడుతున్నారు. ఏమైందో అని ఎంత కంగారు పడ్డానో తెలుసా? పైగా ఇంట్లో వాళ్లకు ఎవరికీ చెప్పలేదు. అసలు ఎందుకు రమ్మన్నారు' అని ప్రశ్నిస్తుంది. దీంతో పరందామయ్య నీకు ఒక సర్‌ప్రైజ్ ఇవ్వడానికి అంటాడు. ఏంటా సర్‌ప్రైజ్ అని అడుగుతుంది. కానీ.. ఎవరూ చెప్పరు. దీంతో తులసికి కోపం ఎక్కువవుతుంది. అప్పుడు చెప్పురా అని వాళ్ల బాబాయి.. సామ్రాట్‌తో అంటాడు. ఇంతలో పనివాళ్లు ఓ ప్లేట్ లో ఏదో తీసుకొని వస్తారు. అప్పుడు తులసి ఈ క్లాత్ తీసి చూడండి. సర్‌ప్రైజ్ ఏంటో మీకే తెలుస్తుంది అంటాడు. దీంతో తులసికి ఏం అర్థం కాదు.

  యాంకర్ స్రవంతి అందాల ప్రదర్శన: ఏకంగా అలాంటి ఫోజులతో ఘోరంగా!

  కార్డు చూసి తులసి సంతోషంగా

  కార్డు చూసి తులసి సంతోషంగా


  తర్వాత తులసి క్లాత్ తీసి చూస్తుంది. అందులో ఒక ఇన్విటేషన్ కార్డు ఉంటుంది. అదేంటి అని అనుకుంటుంది. ఈ కార్డు ఏంటి అని అడుగుతుంది. దీంతో సామ్రాట్ బాబాయి 'నువ్వ కట్టబోయే మ్యూజిక్ స్కూల్‌కు సంబంధించిన భూమి పూజకు చెందిన ఇన్విటేషన్ కార్డు' అంటాడు. దీంతో తులసి మురిసిపోతుంది. దాన్ని ఓపెన్ చేసి చదువుతుంది. అందులో తన పేరును చూసి చాలా సంతోషిస్తుంది. ఆ సమయంలోనే ఓ విషయం గుర్తొస్తుంది. చిన్నప్పుడు ప్రేమ్ బర్త్‌డే కోసం కార్డు కొట్టిచ్చిన నందూ.. తులసి పేరు వేయించడు. అది గుర్తు చేసుకుని బాధపడుతుంది.

  తులసి పేరు కిందే సామ్రాట్‌ది

  తులసి పేరు కిందే సామ్రాట్‌ది


  పేరు చూసిన తర్వాత తులసి 'నా పేరు కార్డులో రాసినందుకు చాలా థాంక్స్' అని సామ్రాట్‌కు చెబుతుంది. దీంతో సామ్రాట్ ఇదేం అంత పెద్ద విషయం కాదు అంటాడు. అప్పుడు తులసి నాకు మాత్రం ఇది చాలా పెద్ద విషయం అంటుంది. అప్పుడు సామ్రాట్ 'ఇక నుంచి పేరు కోసం మీరు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదు. మీ పేరుతోనే గుర్తింపు వస్తుంది' అంటాడు. దీంతో తులసి నా పేరు తర్వాత మీ పేరు వేయించుకున్నారు. మీకు చిన్నతనంగా అనిపించలేదా అంటుంది. దీంతో సామ్రాట్ ఈ మ్యూజిక్ స్కూల్ మీది. ఆశ మీది.. ఆశయం మీది అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 720: Shruthi Makes Fun on Prem. Then He Gets Irritated. After That Tulasi Feels Happy about Music School Invitation
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X