For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: గిఫ్టును చూసి షాకైన తులసి.. నిజం చెప్పమంటూ ప్రశ్నించడంతో!

  |

  ఎన్నో రకాల కంటెంట్‌తో షోలు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తనను జాబ్‌లో నుంచి తీసేయొద్దని లాస్య.. తులసి, సామ్రాట్‌ను బ్రతిమాలుతుంది. కానీ, వాళ్లిద్దరూ దానికి ఒప్పుకోరు. దీంతో లాస్య వాళ్లకు ఎదురు తిరుగుతుంది. ఆ వెంటనే వాళ్లిద్దరిపై నోటికి వచ్చినట్లు విమర్శలు చేస్తుంది. ఆ తర్వాత తులసి ఇంటికి వెళ్లగానే అనసూయ కూడా ఆమెను నిందిస్తుంది. ఆ సమయంలో తులసి కూడా తన గొంతును వినిపిస్తుంది. తర్వాత నందూను లాస్య రెచ్చగొడుతుంది. ఇక, తులసి కోసం పరందామయ్య ఓ సర్‌ప్రైజ్ గిఫ్టును ఆమె గదిలో ఉంచుతాడు. అది ఏంటా అని అంతా చూస్తుంటారు.

  అందాల ఆరబోతలో గీత దాటిన దివి: సీక్రెట్ పార్ట్స్ కనిపించేలా హాట్ షో

  తులసికి గిఫ్ట్.. ఓపెన్ చేయొద్దంటూ

  తులసికి గిఫ్ట్.. ఓపెన్ చేయొద్దంటూ


  తులసికి పరందామయ్య సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాడు. కానీ, అది తన కోసం అని అనసూయ అనుకుంటుంది. అప్పుడామెపై పరందామయ్య పంచులు వేస్తాడు. అనంతరం తులసిని ఆ గిఫ్ట్ ఏంటో ఓపెన్ చేయమని అడుగుతారు. కానీ, తులసికి మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాదు. అప్పుడు పరందామయ్య ఆ గిఫ్టును ఇక్కడే తెరవ వద్దని అంటాడు. అంతేకాదు, ఓ చోటుకు తీసుకు వెళ్తానని, అక్కడే ఓపెన్ చేయాలని చెబుతాడు. దీంతో అందరూ ఆయనను ఏ ప్లేస్‌కు వెళ్తున్నాం అంటూ ప్రశ్నిస్తారు. కానీ, పరందామయ్య మాత్రం సర్‌ప్రైజ్ అని సస్పెన్స్‌గా ఉంచుతాడు.

  తులసి నిలయానికి వెళ్లిన ఫ్యామిలీ

  తులసి నిలయానికి వెళ్లిన ఫ్యామిలీ


  పరందామయ్య క్యాబ్ బుక్ చేసి ఫ్యామిలీ మొత్తాన్ని పాత ఇల్లు తులసి నిలయానికి తీసుకుని వెళ్తాడు. దీంతో తులసి 'మళ్లీ నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు మామయ్య? నన్ను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్లండి మామయ్య' అని అడుగుతుంది. దీంతో పరందామయ్య ఒక్క నిమిషం అమ్మ. ఇక్కడ నిలబడి ముందు నువ్వు ఈ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేయి అంటాడు. దీంతో తులసికి ఏం అర్థం కాదు. అప్పుడు పరందామయ్య 'ఈ ఒక్కసారి నేను చెప్పింది చేయి. నిన్ను ఇక ఏం అడగను. ఇప్పుడే ఇక్కడే ఆ గిఫ్ట్ ప్యాక్‌ను ఓపెన్ చేయి' అని చెప్తాడు. దీంతో ఓపెన్ చేస్తుందామె.

  స్టార్ హీరోయిన్‌‌ను ఇబ్బంది పెడుతున్న నిర్మాత: పెళ్లి చేసుకోకుండా అలా చేయమంటూ!

  గిఫ్ట్‌ను చూసి షాకైపోయిన తులసి

  గిఫ్ట్‌ను చూసి షాకైపోయిన తులసి


  గిఫ్ట్ ఓపెన్ చేయగానే అందులో ఆ ఇంటి తాళాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉంటాయి. అప్పుడు తులసి ఏంటిది.. ఇది నిజమేనా అని అంటుంది. దీనికాయన అవును.. నీ కల మళ్లీ నెరవేరింది. పోగొట్టుకున్నది మళ్లీ నీకే దక్కింది అంటాడు. దీంతో తులసి 'నా జీవితంలో ఇప్పటి వరకు నేను పోగొట్టుకున్నది ఏదీ నాకు దొరకలేదు. కానీ, చివరకు ఈ ఇల్లు దొరికింది. మామయ్య మీరు నాకు ఒక పని చేయండి. ఈ ఇంటిని నా పేరు మీద వద్దు.. మీ పేరు మీద రిజిస్టర్ చేయించండి. నాకు వద్దు. నాది అసలు మంచి జాతకం కాదు. నా దగ్గర ఏదీ ఉండదు' అని కోరుతుంది. దీంతో పరందామయ్య 'లేదమ్మా అది నీది. ఆ ఇల్లు నీదే. అప్పుడు ఆ ఇల్లు అమ్మేలా రావడానికి కారణం నేను, నా కొడుకు. ఈ ఇల్లు నీ పేరు మీద ఉండాలి. కాదనకు అమ్మ' అంటాడు.

  అనసూయ ప్రశ్న.. అడుగు పెట్టేసి

  అనసూయ ప్రశ్న.. అడుగు పెట్టేసి


  పరందామయ్య ఇంటిని తిరిగి సంపాదించడంతో అనసూయకు డౌట్ వస్తుంది. అప్పుడామె 'అసలు ఈ ఇల్లు నీ చేతికి ఎలా వచ్చింది. అంత డబ్బు పెట్టి కొనేంత స్థోమత లేదు కదా' వరుసగా ప్రశ్నలను అడుగుతూ ఉంటుంది. దీంతో సంతోషంగా ఉన్న సమయంలో ఇప్పుడు ఇవన్నీ అవసరమా అనసూయ అంటాడాయన. ఆ తర్వాత తులసి నిలయం అనే బోర్డును అక్కడ ముందు తగిలించు అంటాడు. దీంతో తులసి ఆ ఇంటికి బోర్డు తగిలించి లోపల అడుగు పెడుతుంది. ఆ తర్వాత ఇంటి డోర్ ఓపెన్ చేసి భావోద్వేగానికి గురవుతుంది. అప్పుడు అందరూ సంతోషిస్తారు.

  నగ్నంగా సీతా రామం హీరోయిన్: సినిమాలో అలా.. రియల్‌గా ఇంత దారుణంగా!

  తులసిని చూసి కుళ్లుకున్న అత్త

  తులసిని చూసి కుళ్లుకున్న అత్త


  తులసి ఇంట్లోకి అడుగు పెట్టబోతుండగా పిల్లలంతా మామ్ ఒక్క నిమిషం అని ఆపుతారు. ఆ తర్వాత ఆమెను చిన్నగా రమ్మని రెండు వైపుల నుంచి పువ్వులు చల్లుతూ ఉంటారు. అలా ఎంతో గ్రాండ్‌గా ఆమె లోపలికి అడుగు పెడుతుంది. ఆ తర్వాత పరందామయ్య ఆమెకు స్వీట్ తినిపిస్తాడు. కానీ, ఇదంతా చూసిన అనసూయ మాత్రం కుళ్లుకుంటూ ఉంటుంది. అయితే, ఫ్యామిలీ మొత్తం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక, ఇంట్లోకి అడుగు పెట్టిన తర్వాత తులసి అంతా తిరిగి చూసుకుంటుంది. ఆ సమయంలో గతంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుంటుంది.

   పరందామయ్యకు తులసి ప్రశ్న

  పరందామయ్యకు తులసి ప్రశ్న


  అనంతరం తులసి దేవుడి గదిలోకి వెళ్లి దండం పెట్టుకుంటుంది. కానీ, ఇదంతా ఆమెకు కలలానే అనిపిస్తుంది. అంతేకాదు, ఇప్పటి వరకు లేని సంతోషం తన ముఖంలో కనిపిస్తుంది. తర్వాత పరందామయ్యతో గతం కళ్ల ముందు తిరుగుతుంది మామయ్య అంటుంది. దీనికాయన కాలం వెనక్కి వెళ్తే బాగుండు అనిపిస్తోంది కదా అంటాడు. అప్పుడు తులసి ఎంత వెనక్కి వెళ్లినా మళ్లీ ఇక్కడికే వచ్చి ఆగుతుంది కదా. కాలం వెనక్కి వెళ్లినా నా వరకు ఏం మార్పు ఉండదు అంటుంది. ఆ తర్వాత ఒక్క ప్రశ్న అడుగుతాను మామయ్య అంటూ 'ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి నాకు ఈ ఇల్లు బహుమతిగా ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది' అని అడుగుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 768: Parandhamaiah Presents Special Gift to Tulasi. The Family Feels Happy About This. Then She Questions Him About His Decision.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X