Intinti Gruhalakshmi Today Episode: గెస్ట్ హౌస్‌లో లవ్ ప్రపోజ్.. సంతోషంలో తులసి.. పార్టీలో ఎంజాయ్
చాలా కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో చూద్దాం పదండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. గుడిలో మాట్లాడుకుంటోన్న సమయంలో సామ్రాట్‌ను మళ్లీ పెళ్లి చేసుకోమని తులసి కోరుతుంది. అదే సమయంలో అసలెందుకు పెళ్లి చేసుకోలేని ప్రశ్నిస్తుంది. దీనికతడు హనీ వల్లే చేసుకోలేదని అంటాడు. అంతేకాదు, తులసిని రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇస్తాడు. కానీ, ఆమె మాత్రం జీవితంలో తగిలిన దెబ్బలు చాలని, మళ్లీ అలాంటి ఆలోచన పెట్టుకోనని చెబుతుంది. ఇక, తులసి వాళ్లు తిరిగి రాకపోయే సరికి ఇంట్లో వాళ్లంతా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే నందూ.. తులసిపై నిందలు వేస్తూ నోటికొచ్చినట్లు మాట్లాడతాడు.

తులసి, సామ్రాట్‌ను రావొద్దంటూ
కారుకు బ్రేక్ ఫెయిల్ అవడంతో సామ్రాట్, తులసి నైట్‌కు ఎక్కడైనా తలదాచుకోవాలని చూస్తారు. ఆ సమయంలో పక్కనే ఓ గెస్ట్ హౌస్ కనిపిస్తుంది. దీంతో వాళ్లిద్దరూ వెళ్లి లోపలికి వస్తామని వాళ్లను అడుగుతారు. కానీ, అక్కడ ఉన్న అబ్బాయిలు మాత్రం ఒప్పుకోరు. పైగా 'మీరు ఎవరో తెలియకుండా మిమ్మల్ని లోపలికి పంపించం. కావాలంటే మీరు మీ ఇంట్లో వాళ్లు ఎవరికైనా ఫోన్ చేయించి మాతో మాట్లాడించండి' అని అంటారు. దీంతో తులసి 'మీరు మంచి పని చేస్తున్నారు. నమ్మకం లేని వాళ్లతో ఇలా ప్రవర్తించాలి' అంటూ ఆ కుర్రాళ్లను ప్రశంసిస్తుంది.

గెస్ట్ హౌస్‌లోకి సామ్రాట్, తులసి
ఆ తర్వాత సామ్రాట్ 'నేను బిజినెస్‌మ్యాన్‌ను. కారులో వెళ్తుంటే బ్రేక్ డౌన్ అయింది. నా గురించి తెలియాలంటే గూగుల్‌లో సామ్రాట్ అని నా పేరు సెర్చ్ చేయండి మీకే తెలుస్తుంది' అని అంటాడు. దీంతో ఆ కుర్రాళ్లు మొబైల్‌లో సెర్చ్ చేసి చూస్తారు. అప్పుడు అతడు నిజంగానే సామ్రాట్ అని, పెద్ద బిజినెస్‌మ్యాన్ అనే నిజం తెలుస్తుంది. దీంతో వాళ్లను లోపలికి రమ్మని పిలుస్తారు. అంతేకాదు, ఫ్రెండ్స్ అందరం కలిసి చిన్న పార్టీ చేసుకుంటున్నామని చెప్పిన ఆ కుర్రాళ్లు.. సామ్రాట్‌ను లోపలికి తీసుకు వెళ్లి అక్కడ ఉన్న అందరికీ పరిచయం చేస్తారు.

ప్రేమ్‌కు తులసి కాల్... ఫోన్ డెడ్
అనంతరం అక్కడి ల్యాండ్ లైన్ ఫోన్ నుంచి తులసి.. ప్రేమ్‌కు కాల్ చేస్తుంది. అప్పుడామె మేము సేఫ్‌గానే ఉన్నాం అని చెబుతుంది. దీంతో ఇంట్లోని వాళ్లందరూ ఊపిరి పీల్చుకుంటారు. అప్పుడు ప్రేమ్ 'వర్షం వస్తుంది కదా.. తెల్లారిన తర్వాతనే ఇంటికి రండి' అని చెప్తాడు. అప్పుడే తులసి ఏదో చెబుతుండగా వాళ్లకు వినిపించదు. దీంతో అటు ఇంట్లోని వాళ్లతో పాటు ఇటు తులసి కూడా కంగారు పడుతుంది. అప్పుడు సామ్రాట్ ఫోన్ డెడ్ అయింది అంటాడు. అంతేకాదు, మీరు సేఫ్‌గా ఉన్నట్టు మీ వాళ్లకు తెలిసింది కదా. కంగారు పడకండి అని అంటాడు.

పార్టీలో తులసి.. మామ ధీమాగా
ఇక, తులసి అక్కడి వాళ్లతో 'మీరు పార్టీ మూడ్‌లో ఉన్నారు. మా గురించి మరిచిపోండి. మీరు ఎంజాయ్ చేయండి. మీకు ఇబ్బంది లేకుండా మేము వేరే చోట కూర్చొంటాం' అని అంటుంది. కానీ, వాళ్లు మాత్రం వినరు. మీరు మాతో కలిసి ఎంజాయ్ చేయాల్సిందే అని పట్టుబడతారు. అంతేకాదు, బట్టలు కూడా మార్చుకొని రండి అని రూమ్‌కు తీసుకెళ్తారు. మరోవైపు, పరందామయ్య 'సామ్రాట్, తులసి గురించి ఇక మనం కూడా టెన్షన్ పడొద్దు. కారు కూడా రిపేర్ వచ్చింది అన్నారు కదా. ఈరోజు రాత్రి అక్కడే ఉండి వాళ్లు రేపు ఉదయాన్నే వస్తే నష్టం ఏముంది. మనం వాళ్ల కోసం మెళకువగా ఉండటం ఎందుకు' అని అంటాడు. ఆ తర్వాత ఈ విషయాన్ని సామ్రాట్ వాళ్ల బాబాయికి కూడా ఫోన్ చేసి చెబుతాడు.

పరువు గడప దాటేసింది అంటూ
తులసి ఫోన్ చేసిన తర్వాత అందరూ పడుకోవడానికి వెళ్తారు. కానీ నందూ, అనసూయ మాత్రం వెళ్లరు. అప్పుడు అనసూయ 'నీకు నిద్ర వస్తుందా? నాకైతే రావట్లేదు. ఈ ఇంటి పరువు గడప దాటి రోడ్డు మీద తిరుగుతోంది. తులసిని బాధపెట్టడం ఎందుకు అని అనుకున్నా. కానీ, ఇప్పుడు నేను బాధపడాల్సి వస్తోంది. అసలు తులసి మనసులో ఏముంది? ఆ సామ్రాట్ మనసులో ఏముంది? అసలు ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు' అని నందూతో అంటుంది. నందూ కూడా వాళ్లిద్దరూ కలిసి ఒక చోట ఉండటం జీర్ణించుకోలేడు. దీంతో తల్లిని రెచ్చగొడతాడు.

పార్టీలో లవ్ ప్రపోజ్ చేయడంతో
సామ్రాట్, తులసి ఇద్దరూ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తారు. ఆ బ్యాచ్‌లోనే మనోజ్, అక్కడే ఉన్న షీలాకు లవ్ ప్రపోజ్ చేస్తాడు. అప్పుడతను 'కొద్ది రోజులు గడిచేసరికి పరిచయం స్నేహంగా మారుతుంది. మరికొద్ది రోజులకు స్నేహం ప్రేమగా మారుతుంది. స్నేహం నుంచి ప్రేమ పుట్టదు అని అనుకోవడం మన మనసును మోసం చేసుకోవడమే. ఇక నా కన్ఫ్యూజన్‌కు పుల్‌స్టాప్ పెట్టే సమయం వచ్చేసింది. నీ పట్ల నాకు ఉన్నది ప్రేమ అని కన్ఫమ్ చేసుకున్నా. నువ్వు లేకుండా, నిన్ను చూడకుండా ఉండడం అయ్యే పని కాదని అనుకున్నా' అంటాడు.

తులసి సంతోషం.. డ్యాన్స్ చేస్తూ
తర్వాత మనోజ్ 'ఐలవ్యూ షీలా' అంటాడు. దీంతో అందరూ చప్పట్లు కొట్టి అభినందిస్తారు. అప్పుడు సామ్రాట్ మాత్రం తులసి వైపే చూస్తుంటాడు. షీలా కూడా మనోజ్ లవ్‌ను యాక్సెప్ట్ చేస్తుంది. తర్వాత మనోజ్ 'నేను నీకు ఇస్తోంది గులాబీ పువ్వు మాత్రమే కాదు.. నా గుండెను కూడా. జాగ్రత్తగా చూసుకుంటావు కదూ. మన ప్రేమను వ్యక్తం చేయడానికి చాలా ధైర్యం కావాలి. జీవితాంతం నాతో ఉంటావు కదూ' అంటాడు. ఇది చూసిన తులసి కూడా సంతోషిస్తుంది. ఆ తర్వాత అక్కడి వాళ్లతో కలిసి తులసి, సామ్రాట్ డ్యాన్స్ చేస్తారు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











