For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: నందూకు వాళ్ల నుంచి గుడ్ న్యూస్.. అంతలోనే తులసిని చూసి షాక్

  |

  ఎన్నో సరికొత్త ప్రయోగాలతో సినిమాలు వస్తున్నప్పటికీ తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే చూడండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూకు ముఖం చూపించలేనని నందూ బాధ పడుతూ ఉంటాడు. దీంతో లాస్య అతడిని ఓదార్చి సామ్రాట్‌తో మాట్లాడతానని వెళ్తుంది. సామ్రాట్ ఆహ్వానం మేరకు తులసి అతడి ఆఫీస్‌కు వెళ్తుంది. దీంతో వాళ్లిద్దరూ మాట్లాడుకుంటారు. ఆ సమయంలో లాస్య అక్కడకు వస్తుంది. అయితే, అప్పుడామెను పక్కన వెయిట్ చేయమని సామ్రాట్ వెనక్కి పంపించేస్తాడు. తులసి కోరిక మేరకు నందూ వాళ్లకు సామ్రాట్ మళ్లీ జాబ్ ఇస్తాడు. ఈ విషయాన్ని లాస్యకు చెప్తాడు. చివర్లో తన జోలికి రావొద్దని తులసి లాస్యను హెచ్చరిస్తుంది.

  Saakini Daakini Twitter Review: రెజీనా, నివేదా మూవీకి ఊహించని టాక్.. అది కూడా వర్కౌట్ అయితే మాత్రం!

  లాస్యకు వార్నింగ్ ఇచ్చిన తులసి

  లాస్యకు వార్నింగ్ ఇచ్చిన తులసి


  సామ్రాట్ కంపెనీలో ఉద్యోగాలు తిరిగి సంపాదించుకున్న లాస్యతో తులసి మాట్లాడుతుంది. ముందుగా లాస్య మాకు ఈ ఉద్యోగం మళ్లీ వచ్చేలా చేసినందుకు థాంక్స్ అని తులసితో చెబుతుంది. అంతేకాదు, 'కానీ.. నందూ విషయం మనసులో పెట్టుకొని ఏదైనా చేస్తాడా. ఆ విషయంలోనే నాకు చాలా భయంగా ఉంది తులసి' అంటుంది. దీంతో తులసి 'ఇన్ని రోజుల నుంచి సామ్రాట్ గారితో పని చేస్తున్నావు కదా. ఆయన గురించి నీకు తెలియదా. అయినా ఇకనైనా పక్కవారి విషయాల్లో జోక్యం చేసుకోవడం మానేయండి. లేకపోతే ఇలాంటి ఇబ్బందులో ఎదుర్కోవాల్సి వస్తుంది' అని లాస్యకు మార్నింగ్ ఇస్తుంది. దీంతో సరే అన్న లాస్య 'ఈమె ఓవర్ యాక్టింగ్ ఎక్కువైపోయింది' అని మనసులో అనుకుని వెళ్లిపోతుంది.

  సామ్రాట్‌కు తులసి కంపెనీ ఇచ్చి

  సామ్రాట్‌కు తులసి కంపెనీ ఇచ్చి

  లాస్యతో మాట్లాడిన తర్వాత తులసి నేరుగా సామ్రాట్ రూమ్‌లోకి వెళ్లిపోతుంది. అప్పుడాయనతో లాస్య వచ్చి తనను కలిసి వెళ్లినట్లు చెబుతుంది. అప్పుడు సామ్రాట్ 'వాళ్ల గురించి పెద్దగా పట్టించుకోండి. ముందు మీరు బ్రేక్ ఫాస్ట్ చేశారా. ఆ విషయం ముందు చెప్పండి' అని అడుగుతాడు. దీంతో తులసి నేను చేశాను.. మీరు చేశారా అని అడుగుతుంది. అప్పుడు సామ్రాట్ 'నేను తినలేదు. నాకు కంపెనీ ఇవ్వండి బయటికెళ్లి చేద్దాం' అంటాడు. దీనికి తులసి 'ఈ కంపెనీయే మీది.. నేను కంపెనీ ఇవ్వకపోతే ఎలా. పదండి వెళ్దాం' అని నవ్వుతూ బదులిస్తుంది.

  ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి ట్విట్టర్ రివ్యూ: సుధీర్ మూవీకి అలాంటి టాక్.. అదే పెద్ద మైనస్ అంటూ!

  నందూకు అబద్ధం చెప్పిన లాస్య

  నందూకు అబద్ధం చెప్పిన లాస్య


  సామ్రాట్ కంపెనీ నుంచి లాస్య ఇంటికి వెళ్తుంది. ఆ వెంటనే నందూతో 'మన ఉద్యోగం మనకే వచ్చింది. సామ్రాట్ మన ఉద్యోగాలు తిరిగి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు' అని చెబుతుంది. దీంతో నందూ అలా ఎలా ఒప్పుకున్నాడు అని అడుగుతాడు. అప్పుడు లాస్య ఏదో ఒకటి చెప్పి ఒప్పించానులే అంటుంది. కానీ, నందూ మాత్రం ఆ విషయం ఏంటే నాకు తెలియాలి చెప్పు అంటాడు. దీంతో లాస్య 'భూమిపూజ రోజు జరిగిన దానికి సారీ అని చెప్పాను' అంటుంది. దీనికి నందూ మరి మాజీ భర్త విషయం గురించి ఏం మాట్లాడారు అని లాస్యను సూటిగా అడుగుతాడు.

  నందూకు గుడ్ న్యూస్ చెప్పారు

  నందూకు గుడ్ న్యూస్ చెప్పారు


  నందూ అడిగిన ప్రశ్నకు లాస్య 'అది కావాలని దాచలేదు. అయినా అది చెప్పేంత ముఖ్యమైన విషయం కూడా కాదు కదా అని సామ్రాట్ కు చెప్పాను' అంటుంది. అప్పుడు నందూ మరి తులసి ఏం అనలేదా అని మరో ప్రశ్నను అడుగుతాడు. దీంతో లాస్య 'తులసి అసలు ఏం మాట్లాడలేదు. మౌనంగా ఉంది' అని చెబుతుంది. దీంతో లాస్య చెప్పిందంతా నిజమేనని నందూ నమ్ముతాడు. ఇంతలో నందుకు ఫోన్ వస్తుంది. మీ దివ్య ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది అని చెబుతారు. అప్పుడు నందూ సంతోషించి పర్సనల్‌గా దివ్యను కలిసి అభినందించాలని అనుకుంటాడు.

  బీచ్‌లో బికినీలో రెచ్చిపోయిన శ్రీయ: ఆ పార్టులన్నీ చూపిస్తూ దారుణంగా!

   ఒక కారులోనే తులసి, సామ్రాట్

  ఒక కారులోనే తులసి, సామ్రాట్


  ఆ తర్వాత నందూ, లాస్య.. తులసి కోసం కడుతున్న మ్యూజిక్ స్కూల్ దగ్గరకు వెళ్తారు. కానీ, సామ్రాట్ మాత్రం అక్కడకు రాడు. దీంతో నందూకు కోపం వస్తుంది. అప్పుడు లాస్యతో 'సామ్రాట్ కోసం కాదు.. ఆ తులసి కోసం ఇప్పుడు నేను వెయిట్ చేయాల్సి వస్తోంది. ఇదంతా మనకు అవసరమా లాస్య' అని అంటాడు. అంతలో సామ్రాట్, తులసి ఇద్దరూ కలసి ఒకే కారులో అక్కడకు వస్తారు. వాళ్లను చూసి నందూకు చాలా కోపం వస్తుంది. దీంతో లాస్య 'చాలా గంటల గ్యాప్ తర్వాత కలుసుకున్నారు కదా.. ఆ మాత్రం స్పీడ్ ఉంటుంది' అంటూ మరింత రెచ్చగొడుతుంది.

  లాస్యకు మళ్లీ క్లాస్ పీకిన తులసి

  లాస్యకు మళ్లీ క్లాస్ పీకిన తులసి

  తులసి, సామ్రాట్ సరదాగా మాట్లాడుకుంటూ రావడం చూసి నందూకు కోపం వస్తుంది. అప్పుడు సామ్రాట్ సారీ నందు.. అనుకోకుండా కొంచెం లేట్ అయింది అంటాడు. దీనికి నందూ ఇట్స్ ఓకే సార్ అంటాడు. ఆ తర్వాత సామ్రాట్.. 'తులసి ఇంతకుముందు నువ్వు ఏదో అన్నట్టున్నావు. ప్రతి క్లాస్ రూమ్ కు వెంటిలేషన్ ఉండాలన్నారు కదా. ప్రతి క్లాస్‌కు నాలుగు వైపుల నుంచి వెంటిలేషన్ ఉండేలా ప్లాన్ చేయించండి' అంటాడు. దీంతో లాస్య 'దానికి చాలా స్పేస్ వేస్ట్ అవుతుంది. లాభం కూడా ఉండదు' అంటుంది. దీనికి తులసి 'నువ్వు కట్టుకున్న చీర ఖరీదు ఎంత. ఇంత ఖర్చు పెట్టి కొన్న చీర వల్ల మీకు వచ్చే లాభం ఏంటి. కొన్ని గంటలు కట్టుకునే చీరకోసమే ఇంత ఖర్చుపెడితే మన దగ్గరికి వచ్చే పిల్లల కోసం ఆ మాత్రం చేయొద్దా' అంటుంది.

  డెలివరీ తర్వాత తొలిసారి బికినీలో ప్రణిత: మరీ ఇంత దారుణంగా చూపిస్తారా!

  వాళ్లు క్లోజ్.. ప్రేమ్, శృతి మాత్రం

  వాళ్లు క్లోజ్.. ప్రేమ్, శృతి మాత్రం


  ఆ తర్వాత తులసి, సామ్రాట్ సైట్ చూడటానికి వెళ్తారు. అక్కడ ఒక గుంత ఉంటుంది. దాన్ని దాటడానికి తులసి భయపడుతుంది. దీంతో సామ్రాట్ రండి నేను దాటిస్తా అని ఆమె చేయి పట్టుకుంటాడు. అలా ఆమెను దాటిస్తాడు. ఇవన్నీ నందూ చూడలేకపోతాడు. తర్వాత తులసి.. అక్కడ ఉన్న ఇంజనీర్లతో మాట్లాడుతూ ఉంటే సామ్రాట్ అలాగే తనను చూస్తూ ఉండిపోతాడు. దీంతో నందూకు తెగ కోపం వస్తూ ఉంటుంది. ఇంతలో తులసితో గడిపిన రోజుల గురించి నందూను సామ్రాట్ అడుగుతాడు. దీంతో ఆ పీడకలను గుర్తు చేయకండి అంటాడు. అప్పుడు సామ్రాట్ ఒక్క రోజు మీ ఫ్యామిలీతో గడిపితేనే నాకు ఎంతో సంతోషంగా ఉంది అంటాడు. మరోవైపు, ప్రేమ్, శృతి ఒకరినొకరు టీజ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 739: Lasya Misleads Nandhu About Tulasi and Samrat Getting Closer. After That Prem Gets Annoyed as Shruthi Teases Him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X