Don't Miss!
- News
మంకీపాక్స్ కలవరం: 10 రోజుల్లో 12 దేశాలకు వ్యాప్తి, వేగం పెరగనుందని డబ్ల్యూహెచ్ఓ అలర్ట్
- Sports
IND vs SA 2022: సన్‌రైజర్స్ ప్లేయర్స్‌కు పిలుపు?: రెండుగా టీమిండియా: కోచ్‌గా వీవీఎస్?
- Finance
176 NFOs మ్యూచువల్ ఫండ్స్ రూ.1.08 లక్షల కోట్ల సమీకరణ
- Technology
OnePlus స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్ ఫీచర్లతో వన్‌ప్లస్ బ్రాండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది
- Automobiles
పోర్ష్ టేకాన్ ఎలక్ట్రిక్ కారును టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించిన మలయాళం సూపర్‌స్టార్ మమ్ముట్టి
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు మే 22 నుండి 28వ తేదీ వరకు..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Intinti Gruhalakshmi Today Episode: వసంత దెబ్బకు నందూకు అస్వస్థత.. అతడి ఫోన్ ఎత్తిన లాస్యకు షాక్
మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. వ్యసనాలకు అలవాటు పడిపోయిన అభి.. తన ఫ్రెండ్‌తో మందు తాగుతూ ఉంటాడు. అప్పుడతను షేర్ మార్కెట్ గురించి చెబుతాడు. దీంతో ఇంటికొచ్చిన తర్వాత దాని గురించే ఆలోచిస్తూ.. ఏమైందని ప్రశ్నించిన అంకితతో దురుసుగా మాట్లాడతాడు. ఇక, ఇంటర్వ్యూ పోయిన బాధతో ఉన్న నందూను తులసి ఓదార్చుతుంది.
అతడిని ఎంకరేజ్ చేసే విధంగా మాట్లాడుతుంది. ఆ తర్వాత కొత్త పనిమనిషి వార్రెవా వందన తులసి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది. రావడం రావడమే ఎన్నో కండీషన్లు పెట్టి అందరినీ షాక్‌కు గురి చేస్తుంది.
Bigg Boss OTT: బిగ్ బాస్ ప్రేమజంటకు అదిరిపోయే ఆఫర్.. మరోసారి హౌస్‌లో రొమాన్స్ చేసేందుకు రెడీ

వసంతకు ఆదేశాలు ఇచ్చిన లాస్య
ఇంటికి వచ్చిన కొత్త పనిమనిషి కండీషన్స్‌కు అందరూ షాక్ అవగా.. ఆమెతో లాస్య మాట్లాడుతుండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. 'వాళ్ల గురించి నువ్వు పట్టించుకోకు. నువ్వు కేవలం ఈ ఇంట్లో నాకు, నా భర్తకు సంబంధించిన పనులు మాత్రమే చేయాలి. వేరే ఎవ్వరు ఏ పని చెప్పినా చేయకూడదు. నిర్మోహమాటంగా నో అని చెప్పు. మరిచిపోకు.. నీకు శాలరీ నేను మాత్రమే ఇస్తున్నాను' అని ఆదేశాలు ఇస్తుంది. ఆ తర్వాత ఆమెను కిచెన్ లోపలికి తీసుకెళ్లి ఏం చేయాలో మొత్తం చెబుతుంది. అనంతరం తమకు టిఫిన్ చేసి తీసుకురా అని చెబుతుంది లాస్య.

తులసి చేసిన పనికి షాకైన వసంత
వసంతకు లాస్య సూచనలు ఇస్తున్న సమయంలో తులసి కూడా వంటగదిలోకి వస్తుంది. అప్పుడామె పనిమనిషితో 'కిచెన్‌లో ఏమైనా కావాలంటే నన్ను అడుగు. నేను సహాయం చేస్తాను' అని చెబుతుంది. దీనికామె 'ఏం అవసరం లేదు. నాకేం కావాలో నేనే వెతుక్కుంటాను' అని పొగరుగా సమాధానం చెబుతుంది.
అప్పుడు తులసి 'ముందు ఈ టీ తాగు.. తర్వాత పని చేద్దువు కానీ' అని చెప్పి వసంతకు టీ ఇచ్చి వెళ్లిపోతుంది. అది తాగి ఆమె షాక్ అవుతుంది. ఇంత బాగుందేంటి అంటూ తనలో తానే అనుకుంటుంది. ఆ తర్వాత వసంత అంతా పరిశీలించుకుంటుంది.
Disha Patani: లోదుస్తులతో పచ్చిగా హీరోయిన్ ఫోజు.. ప్రైవేటు భాగాలను చూపిస్తూ దారుణంగా!

లాస్యను చెడామడా తిట్టిన నందూ
వసంతకు టిఫిన్ తయారు చేయమని చెప్పి వచ్చిన తర్వాత లాస్య.. నందూతో తన డ్రెస్ ఆల్టరేషన్ చేయించుకు రమ్మని చెబుతుంది. దీంతో నాకు ఏం పనిలేదా అని అడుగుతాడు. అప్పుడామె నువ్వు ఖాళీయే కదా అంటుంది. దీంతో నందూకు కోపం వస్తుంది. దీంతో లాస్య 'వద్దు నందూ.. ఈరోజు నేను మంచి మూడ్‌లో ఉన్నాను. ఈరోజు గొడవలు వద్దు. మన కోసమే నేను పని మనిషిని పెట్టాను కదా నందూ. ఇప్పుడు నీకు కావాల్సిన ఫుడ్‌ను తను వండి పెడుతుంది' అని చెబుతుంది. దీంతో పనిమనిషి మనతో ఉంటే ప్రైవసీ వద్దా అని లాస్యను చెడామడా తిట్టేస్తాడు నందూ.

టిఫిన్ తిన్న నందూకు అస్వస్థత
కొద్దిసేపటి తర్వాత నందూను టిఫిన్ చేయడానికి రమ్మంటుంది లాస్య. అప్పుడు వసంత తయారు చేసినవన్నీ తీసుకుని వస్తుంది. బాగా ఆకలి మీద ఉన్న నందూ అన్నింటినీ రుచి చూస్తాడు. లాస్య కూడా తినేసి అన్నీ బాగున్నాయని అంటుంది. కానీ, నందూకు మాత్రం అవి తింటుండగా విపరీతంగా దగ్గు వస్తుంది. ఊపరి కూడా ఆడదు.
వెంటనే తులసి వచ్చి వాటర్ ఇస్తుంది. ఆ తర్వాత 'ఆయనకు దోసకాయ అంటే అలెర్జీ అని తెలుసు కదా. నీకు గుర్తుండకపోతే అన్నీ ఒకచోట రాసుకో. అంతే కానీ.. ఆయన ఇబ్బంది పడేలా చేయకు' అంటూ లాస్యను తిడుతుంది.
టాప్ విప్పేసి మరీ రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: తొలిసారి ఇంత ఘాటుగా కనిపించిన వకీల్ సాబ్ భామ

కాల్ మాట్లాడిన లాస్య.. నందూ ఫైర్
నందూకు అలెర్జీ వచ్చిన కొద్దిసేపటి తర్వాత అతడు తేరుకుంటాడు. అప్పుడు తులసి అక్కడి నుంచి వెళ్లిపోగా నందూకు ఫోన్ వస్తుంది. అప్పుడు సరేనని బయలుదేరుతున్నా అంటాడు. ఆ తర్వాత లాస్య 'నాకు ఇంతకుముందు ఫోన్ వచ్చిందా' అని అడుగుతాడు. దీనికామె 'అవును.. నువ్వు రావని చెప్పా. అది స్టార్టప్ కంపెనీ' కదా అంటుంది. దీంతో నందూకు తీవ్రంగా కోపం వస్తుంది. దీంతో ఆమెపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతాడు. అంతలో లాస్యకు ఫోన్ వస్తుంది. దీంతో ఆమె అక్కడి నుంచి లేచి వెళ్లిపోతుంది. అప్పుడు నందూ తనలో తానే రగిలిపోతుంటాడు.

తండ్రిని చూసి బాధ పడిన పిల్లలు
లాస్య జీవితంలోకి వచ్చిన తర్వాత నందూకు ఎదురవుతున్న పరిస్థితులు చూసిన ప్రేమ్, దివ్య, అభిలు ఫీల్ అవుతుంటారు. అదే సమయంలో వాళ్ల ముందే ఇప్పుడు గొడవ జరగడంతో వాళ్లంతా ఆందోళన చెందుతుంటారు. 'పాపం నాన్నకు ఎన్ని కష్టాలు వచ్చాయో. చేచేతులా ఆయనే ఇలా చేసుకున్నారు' అని అంటాడు. దీనికి దివ్య 'అవును అన్నయ్య.. డాడ్‌ను చూస్తుంటే భయంగా ఉంది. ఆయన పరిస్థితి తలచుకుంటేనే బాధగా అనిపిస్తుంది' అని అంటుంది. ఇదంతా చూసిన తులసికి లాస్యపై కోపం వస్తుంది. వెంటనే ఆమె గదిలోకి ఆగ్రహంగా వెళ్తుంది.
షర్ట్ మొత్తం విప్పేసి అఖండ హీరోయిన్ రచ్చ: ఘాటు ఫోజులో అందాలన్నీ చూపిస్తూ అలా!

లాస్యకు వార్నింగ్ ఇచ్చిన తులసి
నందూ పరిస్థితి చూసి పిల్లలు బాధ పడడాన్ని తట్టుకోలేకపోయిన తులసి.. కోపంగా లాస్య దగ్గరకు వెళ్లి 'మీకు గొడవలు ఏవైనా ఉంటే మీ రూమ్‌లో చూసుకోండి. పిల్లల ముందు నువ్వు ఆయన్ను ఏదైనా అంటే.. అది పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. ఆయన్ను తక్కువ చేసి ఇంకోసారి మాట్లాడకు. ఆయనకు మర్యాద ఇవ్వడం నేర్చుకో' అంటూ వార్నింగ్ ఇస్తుంది. దీంతో లాస్య కూడా ఏదో చెప్పబోతుంది. కానీ, ఆమె మాత్రం వినకుండానే తాను ఏమి చెప్పాలనుకుందో అవి మాత్రమే చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.