For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: నందూ సంచలన నిర్ణయం.. తులసికి తెలిసిన నిజం.. డబ్బు లాక్కుని మరీ!

  |

  కొత్త కొత్త షోలు మొదలవుతున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

  దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దీపక్‌ను కొట్టిన నందూపై సరస్వతి సీరియస్ అవుతుంది. అంతేకాదు, లాస్య కూడా నోటికొచ్చినట్లు ఒదురుతుంది ఆమెను కొట్టరా అని దీపక్‌ను పంపుతుంది. కానీ, వద్దులే అని ఆపుతుంది. ఆ తర్వాత వాళ్లను అక్కడి నుంచి వెళ్లిపోమని అనడంతో వెళ్లిపోతారు.

  ఇక, తులసి, సామ్రాట్ గురించి వాళ్లు అలా మాట్లాడడాన్ని సరస్వతి తప్పుబడుతుంది. మరోవైపు, బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇంటిని తాకట్టు పెడదామని నందూకు లాస్య సలహా ఇస్తుంది. ఇక, తులసిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకు వస్తారు.

  బట్టలు విప్పేసి షాకిచ్చిన హీరోయిన్: హాట్ షోలో ఎవరూ చేయని విధంగా!

  రెచ్చగొట్టిన లాస్య.. నందూ ఫైర్

  రెచ్చగొట్టిన లాస్య.. నందూ ఫైర్

  ఆస్పత్రిలో జరిగిన గొడవ గురించి మాట్లాడుకుంటోన్న సమయంలో లాస్య 'నాకైనా కాస్త వంకర బుద్ధి ఉండేది. కానీ, నువ్వు ఎప్పుడూ నీతిగా, న్యాయంగా, నిజాయితీగా ఆలోచిస్తావే. అలాంటిది మీ వాళ్లు అనుకున్న నీ కుటుంబ సభ్యుల ప్రవర్తన నీకే కోపం పుట్టేలా చేసిందంటే.. వాళ్లెంత అన్యాయంగా మాట్లాడారో అర్థం అవుతుంది.

  ఇక, నీ కోపం చిచ్చుబుడ్డిలా తుస్సని పోయేది కాదని వాళ్లకు నిరూపించు నందూ' అంటూ రెచ్చగొడుతుంది. ఇంతలో ఇంట్లోని వాళ్లంతా అక్కడకు వస్తారు. అప్పుడు నందూ వాళ్లను ఆపడంతో పాటు వాళ్లపై ఓ రేంజ్‌లో ఫైర్ అయిపోతాడు.

  ఆటలో అరటిపండునా అంటూ

  ఆటలో అరటిపండునా అంటూ

  ఆ తర్వాత నందూ 'ఏమనుకుంటున్నారు నన్ను. ఈ ఇంట్లో మనిషిగా ట్రీట్ చేయడం లేదా? ఆటలో అరటిపండు అనుకుంటున్నారా' అంటూ ఇంట్లో వాళ్లు ప్రశ్నిస్తాడు. అప్పుడు పరందామయ్య అలా అని మేము ఏం అనలేదు కదా అంటాడు. దీంతో నందూ 'మరి తులసి వాళ్ల అమ్మ ఎందుకు అలా మాట్లాడింది? నన్ను అన్ని మాటలు అంటుంటే మీరు ఎందుకు రెస్పాండ్ కాలేదు. మీరు ఒక్కరైనా నన్ను సమర్థించారా? అసలు ఇంట్లో ఏం జరుగుతోంది' అని ప్రశ్నిస్తాడు.

  దీంతో ప్రేమ్ 'ఏం జరుగుతోందో నీ ఆంతరాత్మకే తెలుసు నాన్న. ఆసుపత్రిలో జరిగిన గొడవను అక్కడే వదిలేయండి. అమ్మ కోలుకుంది. తిరిగి నార్మల్ అయింది. మళ్లీ దాని గురించి మాట్లాడకండి' అంటాడు.

  Varisu Twitter Review: విజయ్ మూవీకి షాకింగ్ టాక్.. అసలైందే మిస్ చేసి.. తమిళంలోనే ఇలా ఉంటే!

  నందూపై సీరియస్ అవుతూనే

  నందూపై సీరియస్ అవుతూనే

  నందూ మాటలకు అనసూయ 'మా నుంచి నువ్వే వేరు పడ్డావు. నిన్ను మేమెప్పుడూ వేరే చేయలేదు' అంటుంది. అలాగే, కుటుంబ సభ్యులు అందరూ అతడిపైనే రెచ్చిపోతారు. అంతేకాదు, నందునే తప్పుపడతారు. అభి వాళ్లతోనే ఏకీభవిస్తూ తండ్రిపై విమర్శలు చేస్తాడు. అప్పుడు ప్రేమ్ 'తప్పు మీవైపు ఉన్నా మీరు మా మనిషి కాబట్టి నోరెత్తకుండా పడి ఉన్నాం.

  ఇది కూడా ఒక రకంగా మిమ్మల్ని సపోర్ట్ చేయడమే. సామ్రాట్ గారు అమ్మను అనుమానించలేదు.. చావు బతుకుల మధ్య పడి ఉంటే.. హాస్పిటల్ కు తీసుకొని చేర్పించారు' అంటాడు. వెంటనే పరందామయ్య 'తులసిని కాపాడుకోవాలనే తొందరలో ఏం చేయాలో తెలియక తన భర్తగా సైన్ చేశాడు' అంటాడు.

   నీది తప్పు కాదా అని ప్రశ్నిస్తూ

  నీది తప్పు కాదా అని ప్రశ్నిస్తూ

  అప్పుడే అనసూయ 'చేయాల్సిందంతా చేసి ఇప్పుడు ఏం తెలియని అమాయకురాలిగా ఎంత సైలెంట్‌గా ఉందో చూడు' అంటూ లాస్యపై విరుచుకుపడుతుంది. దీంతో లాస్య 'అయినా చెప్పాల్సింది వీళ్లు కాదు కదా.. చెప్పాల్సింది తులసి' అంటుంది. దీనికి ప్రేమ్ 'అయినా మా అమ్మ ఇప్పటికే ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేసింది' అంటాడు.

  దీంతో నందూ మీరు ఒప్పుకుంటారేమో కానీ.. మేము ఒప్పుకోం అంటాడు. దీనికి ప్రేమ్ 'నువ్వు ఎందుకు దీపక్ మామయ్యను కొట్టావు. అది తప్పు కాదా' అని ప్రశ్నిస్తాడు. దీనికాయన 'నీ భార్యను ఎవరైనా ఏదైనా అంటే అప్పుడు నీకు తెలుస్తుంది' అంటాడు. అప్పుడు శృతి 'అలాంటి పరిస్థితి నేను తెచ్చుకోను. నేను దిగజారి అలా ప్రవర్తించను' అంటుంది.

  కిటికీ లాంటి టాప్‌లో సీతా రామం హీరోయిన్: ఏం దాచాలో అవే కనిపించేలా!

  ఇల్లు తాకట్టు పెడుతున్నా అని

  ఇల్లు తాకట్టు పెడుతున్నా అని

  శృతి మాటలకు లాస్య చూశావా నందు.. ఎలా మాట్లాడుతుందో అంటుంది. దీంతో నందూ.. శృతి, లాస్యకు క్షమాపణ చెప్పు అంటాడు. దీంతో నేను చెప్పను అంటుంది. అప్పుడు నందూ 'దరూ మీ ఇష్టం ఉన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నమాట. అందుకే నా నిర్ణయం కూడా వినండి. నా బిజినెస్ డెవలప్‌మెంట్ కోసం ఈ ఇంటిని తాకట్టు పెట్టాలని అనుకుంటున్నా. కానీ, మిమ్మల్ని కన్విన్స్ చేసి దీనికి ఒప్పించాలని అనుకున్నా. కానీ, మీకు అస్సలు ఈ విషయంపై సమాచారం ఇస్తే చాలని ఇప్పుడే తెలిసింది. ఈ ఇల్లు రేపే తాకట్లోకి వెళ్తుంది' అని వెళ్లిపోతాడు.

  తులసికి నిజం చెప్పేసిన శృతి

  తులసికి నిజం చెప్పేసిన శృతి

  ఇక, ఇంట్లో ఉన్న తులసికి శృతి ఫోన్ చేస్తుంది. ఏమైందని ఆమె అడగ్గా శృతి 'ఇంట్లో పరిస్థితి ఏం బాగోలేదు. డాక్టర్ మిమ్మల్ని ప్రశాంతంగా ఉంచమన్నారు. కానీ, నేను మాత్రం మీ ప్రశాంతతను చెడగొట్టడానికి ఫోన్ చేస్తున్నాను. అంకుల్, లాస్య ఆంటి కలిసి ఇంటిని తాకట్టు పెట్టడానికి రెడీ అయ్యారు' అని చెబుతుంది.

  దీంతో తులసి అంత అవసరం ఏమొచ్చింది అని అడగ్గా.. బిజినెస్ కోసం అంట అంటుంది. అంతేకాదు, 'అంకుల్ ఎవరి మాట వినేలా లేరు. ఇంటి విషయంలో ఆయన నిర్ణయం ఆయనే తీసుకున్నారు' అని చెబుతుంది. దీంతో తులసి ఏం జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అనుకుంటుంది.

  బ్రాలో టెంపరేచర్ పెంచేసిన దివి: అందాల ఆరబోతకు హద్దే లేదుగా!

  ప్రేమ్ జీతం లాక్కున్న లాస్య

  ప్రేమ్ జీతం లాక్కున్న లాస్య

  ఇక, ప్రేమ్ ఆఫీసుకు వెళ్లే ముందు తన జీతం అంతా ఇంట్లో దాచి పెడదామని అనకుంటాడు. అలా డబ్బు లెక్కపెడుతూ ఉండగా లాస్య అక్కడకు వస్తుంది. అప్పుడామె 'ఒకసారి నువ్వు, మీ అన్నయ్య.. తొడ గొట్టి చెప్పారు కదా. ఈ ఇంటి బాధ్యతలను చూసుకుంటామని' అంటుంది. దీంతో అతడు అవును ఇచ్చాం. మాట తప్పేదే లేదు అంటాడు. తర్వాత డబ్బు లెక్కబెట్టి ఇవ్వబోతుండగా మొత్తం డబ్బు లాక్కుంటుంది. దీంతో ప్రేమ్ తనకు తులసి ఇచ్చిన గిటార్‌ను తాకట్టు పెట్టడానికి వెళ్తాడు. అలా తాకట్టు పెట్టి డబ్బు తీసుకుంటాడు. ఆ విషయాన్ని తులసి చూస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 839: Nandhu Takes A Shocking Decision for His Business. After That Tulasi Gets Emotional After Hears Prem Conversation with Friends.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X