For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: నందూకు ఉద్యోగం రావడంతో అంతా హ్యాపీ.. అంతలోనే అభి వల్ల సమస్యలు

  |

  దేశంలోని మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

  మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్య వద్దని రిజెక్ట్ చేసిన జాబ్‌ కోసం నందూ ఇంటర్వ్యూకు వెళ్తాడు. అయితే, కేఫ్‌లో తన స్నేహితుడు ప్రకాశ్ కలుస్తాడు. అది తనదే అని చెప్పిన అతడు.. అందులో జాబ్ ఇస్తానని నందూకు ఆఫర్ ఇస్తాడు. దీంతో అక్కడ పని చేసేందుకు అతడు ఓకే చెబుతాడు. మరోవైపు, వారెవ్వా వసంత.. తులసి నందూకు మొదటి భార్య అని, తన ఓనర్ రెండో భార్య అని, ఆమెకు పని చేయడం అంతగా రాదని ఎవరికో ఫోన్‌లో చెబుతుంది. దీంతో అవన్నీ తులసి వింటుంది. ఆ తర్వాత ఆమెకు అబద్ధాలు మాత్రం చెప్పొద్దని వార్నింగ్ ఇస్తుంది.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన రష్మిక మందన్నా: వామ్మో తొలిసారి ఇంత ఘాటుగా కనిపించడంతో!

  శృతి వాంతులు.. అనసూయ సలహా

  శృతి వాంతులు.. అనసూయ సలహా

  ప్రేమ్, అభిలను తలచుకుంటూ తనకు మునిమనవళ్లను ఇవ్వమని అనసూయ దేవుడిని కోరుకుంటుంది. అంతలోనే శృతి వాంతులు చేసుకుంటుంది. అది చూసిన అనసూయ 'నా మొర అప్పుడే ఆలకించావా? ఇలా కోరుకున్నానో లేదో.. అలా చేసి చూపించావ్' అంటూ తెగ సంతోష పడుతుంది. అంతేకాదు, శృతిని జాగ్రత్తగా ఉండమని, విశ్రాంతి తీసుకోమని చెబుతుంది. అప్పుడు శృతి ఇవి ఉత్తుత్తి వాంతులే అంటుంది. దీంతో అనసూయ 'నెల ఇప్పుడే తప్పలేదా.. లేక ఎప్పుడూ తప్పకూడదనుకుంటున్నావా' అని ప్రశ్నించగా.. అలా ఏం లేదని అంటుంది.

  పనిమనిషికి క్లాస్ పీకేసిన అనసూయ

  పనిమనిషికి క్లాస్ పీకేసిన అనసూయ


  కొత్తగా పనిమనిషిగా వచ్చిన వారెవ్వా వసంత టీవీలో సినిమా చూస్తూ నవ్వుతూ ఉంటుంది. అది చూసిన అనసూయ ఒక్కసారిగా షాక్ అవుతుంది. దీంతో వెంటనే టీవీ రిమోట్ ఇవ్వమని అడుగుతుంది. దీంతో వసంత 'మీకు ముందే చెప్పా కదా టీవీ చూసేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేయొద్దని' అంటుంది. అప్పుడు అనసూయ 'నీకు నోటి దురుసు ఎక్కువైంది. స్క్రూ బిగిస్తే కానీ సెట్ కావు' అంటుంది. ఇంతలో పరందామయ్య వచ్చి కళ్లజోడు చూశావా అని భార్యను అడుగుతాడు. టేబుల్ మీద ఉన్న కళ్లజోడును చూసిన అనసూయ.. దాన్ని తెమ్మని వసంతకు చెప్తుంది.

  దీప్తి సునైనాకు షణ్ముఖ్ ముద్దులు: బెడ్‌పై ఒకరి మీద ఒకరు పడుకుని.. బ్రేకప్ తర్వాత బయటకొచ్చిన వీడియో

  అనసూయకు అర్థమయ్యేలా చెప్పగా

  అనసూయకు అర్థమయ్యేలా చెప్పగా

  పరందామయ్య కళ్లజోడును తీసుకు రమ్మని చెప్పిన అనసూయతో.. నేను ఇవ్వను అని ముఖం ముందే చెబుతుంది వసంత. అంతలో అటుగా వస్తున్న తులసి వాటిని తీసుకొచ్చి ఇస్తుంది. దీంతో అనసూయ 'దానికి చెబితే నువ్వెందుకు తెచ్చి ఇచ్చావు. అది ఎందుకు పని చేయదో నేను కూడా చూస్తాను. అయినా దానికి నోటి దురుసు బాగా ఎక్కువ అయిపోయింది' అని అంటుంది. దీనికి తులసి 'తను వాళ్లిద్దరి పనులే చేయాలని లాస్య చెప్పింది కదా. ఆమె మాటను కాదని మీకు ఎలా చేస్తుంది' అని అర్థం అయ్యేలా చెబుతుంది. ఇంతలో నందు వస్తాడు.

  నందూకు ఉద్యోగం... అంతా హ్యాపీగా

  నందూకు ఉద్యోగం... అంతా హ్యాపీగా

  వీళ్ల మధ్య మాటలు సాగుతుండగా నందూ చాలా సంతోషంగా ఇంట్లోకి వస్తాడు. వచ్చీ రావడమే తనకు ఉద్యోగం వచ్చిందని తల్లిదండ్రులకు చెబుతాడు. దీంతో అందరూ సంతోషిస్తారు. అప్పుడు 'నా ఫ్రెండ్ కేఫ్ బాధ్యతలను చూసుకునే జాబ్ అది. మీరేమంటారు' అని అడుగుతాడు నందూ. అప్పుడు తండ్రి 'ఏ జాబ్ అయితే ఏంటిరా.. ఎక్కువ కష్టపడితే.. కాలం కలిసి వస్తే నువ్వు ఎంతో ఎత్తుకు ఎదగొచ్చు' అంటాడు. సరే నాన్న అని లోపలికి వెళ్తూ.. 'నిన్ను నువ్వు నిరూపించుకోవడానికి నీకు దేవుడు మరో అవకాశం ఇచ్చాడు' అని తనలో తానే అనుకుంటాడు.

  టాప్ విప్పేసి మరీ రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: తొలిసారి ఇంత ఘాటుగా కనిపించిన వకీల్ సాబ్ భామ

  తులసి వంటలతో నందూ భోజనం

  తులసి వంటలతో నందూ భోజనం

  ఇక, తులసి తన అత్తయ్య, మామయ్యలకు భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అంతలో నందూ కూడా అక్కడకు వస్తాడు. వచ్చీ రావడమే అతడు వసంతను పిలవగా.. ఆమె వంట రెడీ అని చెప్పి కూరలన్నీ తీసుకు వస్తుంది. కానీ, అవి నందూకు అంతగా నచ్చవు. అప్పుడు వాటిని ఏం చేయాలో అతడికి అర్థం కాదు. వాటితో భోజనం చేయలేకపోతాడు. అప్పుడు నందూ తినకుండానే వెళ్లిపోవాలని అనుకుంటాడు. అంతలో అనసూయ 'ఒరేయ్ నందు.. ఈ అమ్మ బతికి ఉండగా నువ్వు ఆకలితో ఈ డైనింగ్ టేబుల్ మీద నుంచి లేవాల్సిన అవసరం లేదురా' అని తులసి వండిన వంటలను అన్నింటినీ వడ్డిస్తుంది. దీంతో నందు వాటిని లొట్టలేసుకుంటూ తింటాడు.

  తులసికి కంగ్రాట్స్ చెప్పిన నందూ

  తులసికి కంగ్రాట్స్ చెప్పిన నందూ

  భోజనం చేస్తున్న సమయంలో పరందామయ్య 'ఫ్యాక్టరీ ఎలా నడుస్తుంది అమ్మా. అంతా సవ్యంగానే ఉంది కదా' అని అడుగుతాడు. దీనికి తులసి 'కొత్త కాంట్రాక్ట్ వచ్చింది మామయ్యా. మన వర్క్ నచ్చిన వాళ్లు ఈ సారి ఎక్కువ మెటీరియల్ పంపించారు. అదంతా సవ్యంగానే జరుగుతుంది. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు' అని సమాధానం చెబుతుంది. దీంతో అక్కడే ఉన్న నందూ కంగ్రాట్స్ తులసి అని అంటాడు. దీంతో ఆమె నవ్వుతూ థ్యాంక్స్ అంటుంది. అలా కాసేపు వాళ్లిద్దరి మధ్య గతంలో జరిగిన కొన్ని సన్నివేశాలను చూపిస్తారు.

  Bigg Boss OTT: బిగ్ బాస్ ప్రేమజంటకు అదిరిపోయే ఆఫర్.. మరోసారి హౌస్‌లో రొమాన్స్ చేసేందుకు రెడీ

  చెడ్డ దారిలో నడిచేందుకు అభి ప్లాన్

  చెడ్డ దారిలో నడిచేందుకు అభి ప్లాన్


  గతంలో తన స్నేహితుడు మనోజ్ చెప్పిన షార్ట్ కట్ బిజినెస్ గురించి అభి ఆలోచిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే అతడికి ఫోన్ చేస్తాడు. అప్పుడు 'లైఫ్‌లో అనుకున్నది సాధించాలంటే షార్ట్‌కట్స్ వెతుక్కోవాలి అని నిర్ణయించుకున్నా' అని అతడికి చెబుతాడు. అప్పుడు మనోజ్ 'మరోసారి ఆలోచించుకొని ముందుకురా' అంటాడు. దీనికి అభి 'అన్నీ ఆలోచించుకునే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఏది ఏమైనా రంగంలోకి దిగాల్సిందే' అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 527: Anasuya Gave Some Advices to Shruthi. After That Total Family Happy for Nandhu Gets a Job.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X