For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: నందూ, లాస్య మధ్య కొత్త సమస్య.. శృతి గురించి నిజం తెలియడంతో!

  |

  భారతదేశంలోని మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతి వాంతులు అవడంతో ఆమె తల్లి కాబోతుందని అనసూయ అనుకుని తెగ సంతోష పడుతుంది. కానీ, అవి ఉత్తుత్తి వాంతులే అని శృతి చెప్పడంతో నిరాశ చెందుతుంది. ఆ తర్వాత అనసూయ.. పనిమనిషి వసంత టీవీ చూస్తుండగా ఆమెపై అరుస్తుంది. అప్పుడు తులసి వచ్చి ఆమెను కూల్ చేస్తుంది. అనంతరం నందూ ఉద్యోగం సంపాదించుకుని ఇంటికొస్తాడు. అందరికీ ఈ విషయం చెప్పడంతో సంతోషిస్తారు. ఇక, అభి.. తన స్నేహితుడు మనోజ్‌ను ఫోన్ చేసి సులభంగా డబ్బులు సంపాదించాలని చెబుతాడు.

  బ్రాతో కనిపించి రెచ్చిపోయిన వర్షిణి: ఘాటు ఫోజులతో రచ్చ.. ఆమెనిలా చూస్తే షాక్ అవుతారు!

  చివర్లో అభికి హ్యాండ్ ఇచ్చిన మనోజ్

  చివర్లో అభికి హ్యాండ్ ఇచ్చిన మనోజ్

  ఫాస్ట్ ఇన్‌కం కోసం ఫ్రెండ్ మనోజ్ చెప్పిన మాటలను ఆలోచిస్తూ ఉన్న అభి.. అతడికి ఫోన్ చేస్తాడు. ఆ సమయంలో తనకు ఈ లైఫ్ నచ్చడం లేదని, ఏదైన సైడ్ ఇన్‌కం సంపాదించాలని అనుకుంటున్నట్లు చెబుతాడు. అప్పుడతను 'నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావో సరైన నిర్ణయం తీసుకో. అన్ని విషయాలూ ఆలోచించుకుని ధైర్యంగా ముందుకు వచ్చేయ్. నన్ను నమ్ముకుని గుడ్డిగా వచ్చేయడం కాదు. ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు. ఏం జరిగినా నీదే బాధ్యత' అంటూ హ్యాండిస్తాడు. దీంతో అభి షాకైపోయి ఫోన్ కట్ చేసేస్తాడు.

  లాస్యపై అనసూయ ఫైర్ అవడంతో

  లాస్యపై అనసూయ ఫైర్ అవడంతో

  ఆఫీస్ నుంచి వచ్చిన లాస్య బాగా అలసిపోయానంటూ టేబుల్ మీద కాళ్లు పెట్టుకొని పడుకుంటుంది. అక్కడే ఉన్న తులసి, అనసూయ అది చూసి షాక్ అవుతారు. ఇంతలో వారవ్వా వసంత ఆమెకు మంచినీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడామె మూడీగా ఉండటం చేసి ఏమైంది వసంత అంత డల్‌గా ఉన్నావని అడుగుతుంది లాస్య. అంతేకాదు, తాను లేనప్పుడు ఏదైనా జరిగిందా అని అడుగుతుంది. దీంతో తాను చెబుతాను అంటూ వసంత చేసిన పనుల గురించి అనసూయ మొత్తం చెప్పేస్తుంది. దీంతో తులసే.. అనసూయను రెచ్చగొడుతుందని అంటుంది లాస్య.

  దీప్తి, షణ్ముఖ్ ఫ్యాన్స్‌కు శుభవార్త: సంచలన నిజాన్ని లీక్ చేసిన తండ్రి.. ఇద్దరూ మళ్లీ కలుస్తారా!

  నందూ లంచ్ చేయడంతో లాస్య ఫైర్

  నందూ లంచ్ చేయడంతో లాస్య ఫైర్

  వాళ్ల మధ్య డిస్కర్షన్ జరుగుతోన్న సమయంలోనే వసంతను లాస్య సార్ ఎక్కడున్నారు అని అడుగుతుంది. అప్పుడామె 'గదిలో ఉన్నారు. అన్నం తినలేదు. అంటే నేను వండింది తినలేదు. ఆవిడ గారు వండింది తిన్నారు' అని చెబుతుంది. దీంతో లాస్య కోపంతో రగిలిపోతుంది. అప్పుడు అనసూయను కూడా తిడుతుంది. దీంతో తులసి 'లాస్య నువ్వు అత్తయ్య గారి మీద ఎందుకు అరుస్తున్నావు' అంటూ ఫైర్ అవుతుంది. ఆ తర్వాత లాస్య, తులసి మధ్య కాసేపు గొడవ జరుగుతుంది. అనంతరం వసంతతో తాను ఏది చెబితే అదే వండాలి అని అంటుంది లాస్య.

  ఇల్లు కొందామన్న లాస్యకు మరో షాక్

  ఇల్లు కొందామన్న లాస్యకు మరో షాక్


  తులసి వాళ్లతో గొడవ పడిన తర్వాత లాస్య.. నందూ దగ్గరకు వెళ్తుంది. అప్పుడతను తనకు జాబ్ వచ్చిన విషయాన్ని ఆమెకు చెబుతాడు. దీంతో లాస్య 'ఏం జాబ్ వచ్చింది? ఏది ఆ స్టార్టప్ కంపెనీ వాళ్లదేనా?' అని అడుగుతుంది. దీనికి నందూ వేరే దగ్గర అని చెబుతాడు. అప్పుడామె 'అవునా.. ఇంత గుడ్ న్యూస్ అంత లేట్‌గా చెబుతావు ఏంటి నందూ. మనకు ఇక మంచి రోజులు రాబోతున్నాయి. వెంటనే లోన్ తీసుకొని మనకంటూ సొంత ఇల్లు తీసుకోవాలి' అంటుంది. దీంతో నందూ 'నా జాబ్‌కు లోన్ రాదు. అది సాఫ్ట్ వేర్ జాబ్ కాదు. అది ఫ్రెండ్ కేఫ్‌లో మేనేజర్ జాబ్' అంటాడు. దీంతో లాస్య ఒక్కసారిగా షాక్‌కు గురవుతుంది.

  అరాచకమైన ఫొటోలతో షాకిచ్చిన రష్మిక మందన్నా: వామ్మో తొలిసారి ఇంత ఘాటుగా కనిపించడంతో!

  నందూను తిట్టిన లాస్య.. తులసి బెస్ట్

  నందూను తిట్టిన లాస్య.. తులసి బెస్ట్


  నందూ కేఫ్‌లో జాబ్ అని చెప్పగానే లాస్యకు చిర్రెత్తుకొస్తుంది. అప్పుడామె 'ఏంటి నందూ నువ్వు జోక్ చేస్తున్నావా? లేక నిజమే చెబుతున్నావా? అదే నిజం అయితే నా రిప్యుటేషన్‌కు ఏం కావాలి?' అంటూ సీరియస్ అవుతుంది. అప్పుడు నందూ 'నాకు జాబ్ వచ్చింది అంటే అందరూ చాలా సంతోషించారు. కానీ, నువ్వు మాత్రం ఎలా చేస్తున్నావు. నీకన్నా తులసి బెస్ట్.. తను నాకు జాబ్ వచ్చిందంటే చాలా సంతోషించింది. కానీ, నువ్వు మాత్రం ఇలాగానా వ్యవహరించేది' అంటూ ఎదురుదాడికి దిగుతాడు. అప్పుడామె 'నువ్వు ఏమైనా చేసుకో నందూ. నువ్వు ఈ ఆఫర్‌ను రిజెక్ట్ చేస్తున్నావు అంతే' అంటుంది. దీంతో 'నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అంతే. నిన్ను చేరాలా వద్దా అని అడగట్లేదు. నన్ను కంట్రోల్ చేయాలని చూడకు' అంటాడతను.

  నందూ లాస్య మధ్య కొత్త సమస్య అని

  నందూ లాస్య మధ్య కొత్త సమస్య అని

  నందూ, లాస్య మధ్య జరుగుతున్న వ్యవహారాలు చూసిన పరందామయ్య తెగ బాధ పడుతూ ఉంటాడు. అదే సమయంలో తులసితో అతడు మనసు విప్పి మాట్లాడతాడు. అప్పుడు 'నేను ట్యాబ్లెట్లు మింగినట్టు.. లాస్య నందూ జీవితంలో సంతోషాన్ని మింగేస్తుంది. పాపం వాడు ఎన్నో బాధలు పడుతున్నా' అంటాడు. దీనికామె 'మనం ఏం చేస్తాం మామయ్య. వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కదా. వాళ్లే పరిష్కరించుకుంటారులే' అంటుంది. దీనికామె 'నాకు తెలిసి నందూకు కొత్తగా వచ్చిన ఉద్యోగం వాళ్ల మధ్య కొత్త సమస్యలు తీసుకొస్తుంది' అంటాడు.

  టాప్ విప్పేసి మరీ రెచ్చిపోయిన అనన్య నాగళ్ల: తొలిసారి ఇంత ఘాటుగా కనిపించిన వకీల్ సాబ్ భామ

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  శృతి ప్రేమ్ మాటలు వినేసిన లాస్య

  శృతి ప్రేమ్ మాటలు వినేసిన లాస్య

  అనసూయ అన్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది శృతి. ఇంతలో ప్రేమ్ అక్కడికి వస్తాడు. 'కడుపులో తిప్పుతోందని ఒక్కసారి వాంతి చేసుకుంటే ఏకంగా సీమంతమే చేసేలా ఉన్నారు' అంటుంది. దీనికి ప్రేమ్ 'టెన్షన్ ఎందుకు శృతి? మన గురించి పట్టించుకునే వాళ్లు ఎవరు ఉన్నారు. ఒక్క నానమ్మ, తాతయ్య తప్ప' అంటాడు. వీళ్లిద్దరూ మాట్లాడుకున్నదంతా లాస్య వింటుంది. మనకు పెళ్లయినా కలిసి కాపురం చేయడం లేదని అందరికీ తెలిసిపోకూడదని చెబుతుండగా లాస్య విని షాక్ అవుతుంది. ఈ విషయం నేను చెబుతాను కదా అని అనుకొని లాస్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 528: Lasya Tries to Dominate Nandhu. Then He Warns to Her. After That Lasya Create Another Cunning Plan.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X