Don't Miss!
- Automobiles
కార్లలో బెస్ట్ ఆడియో సిస్టమ్స్ కోసం చూస్తున్నారా..? అయితే ఇవిగో..!
- Finance
ఇండియాకు మెట్రో గుడ్‌బై? కొనుగోలుకు అమెజాన్, డీమార్ట్, రిలయన్స్ పోటీ?
- News
మంకీపాక్స్ కలవరం: 10 రోజుల్లో 12 దేశాలకు వ్యాప్తి, వేగం పెరగనుందని డబ్ల్యూహెచ్ఓ అలర్ట్
- Sports
IND vs SA 2022: సన్‌రైజర్స్ ప్లేయర్స్‌కు పిలుపు?: రెండుగా టీమిండియా: కోచ్‌గా వీవీఎస్?
- Technology
OnePlus స్నాప్‌డ్రాగన్ కొత్త చిప్ ఫీచర్లతో వన్‌ప్లస్ బ్రాండ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది
- Lifestyle
ఈ వారం మీ రాశి ఫలాలు మే 22 నుండి 28వ తేదీ వరకు..
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Intinti Gruhalakshmi Today Episode: తులసికి నిజం చెప్పేసిన లాస్య.. వాళ్ల మధ్య చిచ్చు పెట్టిన వసంత
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్లో జరిగింది ఇదే
గురువారం ప్రసారమైన ఎపిసోడ్లో.. సహాయం చేయమని ఫ్రెండ్‌కు కాల్ చేసిన అభికి అతడు హ్యాండ్ ఇస్తాడు. ఆ తర్వాత ఆఫీస్ నుంచి ఇంటికొచ్చిన లాస్య.. టేబుల్‌పై కాళ్లు పెట్టుకుని కూర్చుంటుంది. దీంతో అనసూయ, తులసి ఆమెపై మండిపడతారు. అనంతరం నందూ దగ్గరకు వెళ్లగా ఉద్యోగం వచ్చిన విషయం చెబుతాడు.
కానీ, కేఫ్‌లో పని చేయడానికి ఆమె ఇష్టపడదు. అంతేకాదు, ఆ ఉద్యోగాన్ని చేయనని చెప్పమని అంటుంది. కానీ, అతడు మాత్రం ఆమె మాట వినడు. చివర్లో శృతి, ప్రేమ్ మాట్లాడుకుంటుండగా.. లాస్య చాటుగా విని కన్నింగ్ ప్లాన్ వేస్తుంది.
చిన్న క్లాత్ చుట్టుకుని ప్రియాంక చోప్రా రచ్చ: బాడీ అంతా కనిపించేలా మరీ ఘోరంగా!

తులసితో గొడవ పడడానికి లాస్య రెడీ
ప్రేమ్, శృతి మాట్లాడుకుంటోన్న అన్ని విషయాలనూ వినేసిన లాస్య.. వాటిని చెప్పడానికి తులసి దగ్గరకు వస్తుంది. అప్పుడు డైరెక్టుగా విషయం చెప్పకుండా ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తుంది. లాస్య మాటలకు తట్టుకోలేకపోయిన తులసి 'మాట అనేటప్పుడు ముందు వెనుక ఆలోచించుకొని మాట్లాడు లాస్య. అయినా నీతో గొడవ పడే ఓపిక నాకు లేదు. వదిలేయ్' అని చెప్పి వెళ్లబోతుంది. అప్పుడు లాస్య ఆమెను వెళ్లకుండా ఆపుతుంది. అంతేకాదు, 'నేను లోపలికి వెళ్లి పడుకుంటాను కానీ, నీకు నిద్రపట్టని ఒక విషయం చెబుతాను వింటావా' అంటుంది.

ప్రేమ్, శృతి గురించి నిజం చెప్పేస్తూ
తులసిని ఆపిన లాస్య 'ఎప్పుడూ నా గురించి, నందూ గురించి తప్పితే నీ కొడుకులు ఏం చేస్తున్నావో ఎప్పుడైనా ఆలోచించావా? వాళ్లను పట్టించుకున్నావా' అంటుంది. అప్పుడామె 'నా కొడుకుల గురించి నాకు తెలుసు. వాళ్లెప్పుడూ నా గీత దాటరు' అంటుంది. దీనికి లాస్య 'పిచ్చి తులసి.. పెళ్లి వరకు మాత్రమే నీ కొడుకులు నీ మాట విన్నారు. ఆ తర్వాత వాళ్లు ఎప్పుడో నీ చేయి జారి పోయారు.
సుఖపడతాడు కదా అని నీ చిన్న కొడుకుకు నచ్చిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశావు. పెళ్లి అయితే చేశావు కానీ.. వాళ్లు సుఖపడటం లేదు తులసి. నిజం.. రేపో మాపో మనవడో మనవరాలో వస్తారని నువ్వు ఆశపడుతున్నావు. కానీ.. వాళ్లు మాత్రం అసలు కాపురమే చేయడం లేదు' అని అసలు నిజం చెబుతుంది లాస్య. అలాగే ప్రేమ్‌పై ఎక్కేసి చెబుతుంది.
దారుణమైన ఫొటోలు వదిలిన సీరియల్ నటి: బాడీ పార్టులు మొత్తం చూపిస్తూ రెచ్చిపోయిందిగా!

లాస్య మాటకు ప్రేమ్‌ను కొట్టిన తులసి
ఆ తర్వాత లాస్య 'ప్రేమ్ నీ ముందు ఒకలా.. నీ వెనుక ఒకలా నటిస్తున్నాను. నిన్ను నమ్మించాడు. కొడుకు విషయంలో నువ్వు ఓడిపోయావు తులసి. మోసపోయావు' అంటుంది. కానీ, తులసి నమ్మదు. అప్పుడు లాస్య 'ఒకవేళ నేను చెప్పేది అబద్ధం అయితే నందూను నీకు ఒప్పజెప్పి నేను నా దారి చూసుకుంటా' అంటుంది. దీంతో తులసి నమ్ముతుంది. అప్పుడు కోపంతో హాల్లోకి వచ్చి ప్రేమ్ ప్రేమ్ అంటూ అరుస్తుంది. దీంతో అతడు అక్కడికి వస్తాడు. ఆ వెంటనే కొడుకు చెంపపై కొడుతుంది. దీంతో ప్రేమ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత అందరూ అక్కడకు చేరుకుంటారు.

కొడుకును కోపంగా నిలదీసిన తులసి
ప్రేమ్‌ను కొట్టిన తర్వాత తులసి 'ఎందుకురా నన్ను మోసం చేశావు? చెప్పరా ఎందుకు ఈ అమ్మను మోసం చేశావు?' అని నిలదీస్తుంది. దీంతో అప్పుడు అనసూయ ఏమైందని అడగ్గా 'బతికుండగానే నన్ను చంపేశాడు.
అన్నింటికీ తెగించి, అందరినీ ఎదిరించి నీకు, శృతికి పెళ్లి చేశాను. నా బతుకులో లేని ఆనందం నీ బతుకులో ఉండాలనుకున్నాను. కానీ, మీరు చేసిందేంటి? పేరుకే భార్యాభర్తలుగా ఉన్నారు కానీ, నిజంగా భార్యాభర్తలుగా ఉన్నారా? మీరిద్దరూ కలిసి కాపురం చేస్తున్నారా?' అని ప్రశ్నిస్తుంది. దీంతో ప్రేమ్, శృతి షాక్ అవుతారు.
Bangarraju Twitter Review: బంగార్రాజుకు అలాంటి టాక్.. ప్లస్ మైనస్‌లు ఇవే.. ఫైనల్ రిపోర్ట్ ఏంటంటే!

ఒట్టు వేయమంటూ.. దౌర్భాగ్యం అని
ఆ తర్వాత తులసి 'మీ వైవాహిక జీవితానికి న్యాయం చేస్తున్నారా చెప్పండి?' అని సూటిగా అడుగుతుంది. దీంతో ప్రేమ్ ఏం మాట్లాడడు. అమ్మా అంటూ ఏదో చెప్పబోయే సరికి అతడి చేయి తీసుకొని తల మీద పెట్టుకుని నిజం చెప్పమంటుంది. దీంతో ఇంటి సభ్యులు అందరూ షాక్ అవుతారు. అనంతరం చేయి తీసి ఏం మాట్లాడడు ప్రేమ్. అప్పుడు 'అదేమిటిరా.. పెళ్లి అయి ఇన్ని నెలలు అయినా దూరంగా ఉంటారా' అంటుంది అనసూయ. అప్పుడు తులసి 'దీన్ని మోసం చేయడం అనరా. నాకొడుకుతో నిజం చెప్పించుకోవడానికి ఒట్టు వేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటే మీ అమ్మ ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉందో తెలుస్తోంది . అమ్మ అనే పిలుపు వింటేనే విరక్తి పుట్టింది. ఈ అమ్మ దగ్గర ఈ విషయం దాచడమే నా గుండెను తొలిచేస్తుంది' అంటుంది.

శృతికి కూడా గట్టి క్లాస్ పీకిన తులసి
ప్రేమ్‌తో మాట్లాడిన తర్వాత తులసి.. శృతికి కూడా క్లాస్ పీకుతుంది. 'ఏమ్మా శృతి. నాలో అమ్మను చూసుకుంటా అంటావు కదా. విషయం దాచి నువ్వు కూడా నన్ను మోసం చేస్తావా? మీరు అసలు ఒకరికి మరొకరు దూరంగా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది. ఒక ఆడపిల్లలను ఇంతలా బాధపెట్టాల్సిన అవసరం ఏంటి?' అని ప్రశ్నిస్తుంది.
దీంతో 'ఇది మేమిద్దరం కలిసి తీసుకున్న నిర్ణయం ఆంటి' అంటుంది శృతి. ఆ తర్వాత అసలు నిజం చెబుతాడు ప్రేమ్. 'నీ కోసమే మేము ఒకరికి మరొకరం దూరంగా ఉన్నాం. ఈ నిర్ణయం తీసుకుంది నీకోసమే. నువ్వు బాగు పడ్డాక మేము కలవాలనుకున్నాం. నీకంటూ ఓ స్థాయి వచ్చాక మేము భార్యాభర్తల్లా కాపురం చేయాలనుకున్నాం' అంటాడు ప్రేమ్.
దీప్తి, షణ్ముఖ్ ఫ్యాన్స్‌కు శుభవార్త: సంచలన నిజాన్ని లీక్ చేసిన తండ్రి.. ఇద్దరూ మళ్లీ కలుస్తారా!

కూల్ అయిన తులసి.. ఫస్ట్ నైట్‌కు
తులసికి నిజం చెప్పిన తర్వాత శృతి 'ప్రేమ్ చెప్పింది నిజం ఆంటీ. మమ్మల్ని క్షమించండి' అంటుంది. దీంతో తులసి కూల్ అవుతుంది. అప్పుడు అనసూయ 'సరే. జరిగిందేదో జరిగింది. ఇక ఆలస్యం జరగకుండా వెంటనే వీళ్లకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేయించండి' అంటుంది. అప్పుడు తులసి కూడా 'ఏమ్మా తొందరలోనే నన్ను నానమ్మను చేయాలి' అంటుంది. కట్ చేస్తే.. ఆ తర్వాత ప్రేమ్, శృతి ఫస్ట్ నైట్‌కు ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. దీంతో 'ఆల్రేడీ జరిగింది కదా. మళ్లీ ఇవన్నీ ఎందుకు' అని అడుగుతుంది శృతి. కానీ, తులసి మాత్రం ఒప్పుకోదు.

తులసిని పొగిడి.. చిచ్చు పెట్టేసింది
కిచెన్‌లో పని చేసుకుంటోన్న వసంత 'తులసి ఒక్కతే ఎలా పనిచేస్తుందో. అయినా ఆమె చాలా గ్రేట్. ఇంత మందికి పని చేయడం అంటే మాటలు కాదు' అనుకుంటుంది. అప్పుడా మాటలు విన్న లాస్య కోప్పడుతుంది. దీంతో వెంటనే తేరుకున్న వసంత 'మీరు సార్ మీద చూపించే ప్రేమ గొప్పది మేడమ్. కానీ, సార్ మాత్రం ఎప్పుడూ వాళ్లతోనే ఎక్కువగా గడుపుతున్నారు. సార్‌కు బొత్తిగా మీరంటే ఇష్టం లేనట్లు అనిపిస్తుంది' అంటూ లాస్యను నందూ వైపు డైవర్ట్ చేస్తుంది. దీంతో లాస్య కోపంతో రగిలిపోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.