For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: నందూకు షాకిచ్చిన లాస్య.. తులసిని చిక్కుల్లోని నెట్టిన సామ్రాట్

  |

  చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

   శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంటికి వచ్చిన తులసి కుటుంబ సభ్యుల కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా శృతి కోసం పని మనిషి రాములమ్మను మళ్లీ పనిలో పెట్టుకుంటుంది. అప్పుడామె వద్దని చెప్పినా తులసి వినదు. ఇక, ఫ్రిడ్జ్‌కు తాళం వేసి ఉండడంతో లాస్యపై గొడవకు దిగుతుందామె. అనంతరం ఇద్దరూ చాలా సేపు వాగ్వాదానికి దిగుతారు. తర్వాత తులసికి లాస్య ఛాలెంజ్ విసురుతుంది. ఇక, ప్రేమ్ తాకట్టు పెట్టిన గిటారును తులసి తీసుకొచ్చి అతడికే ఇస్తుంది. దీంతో ప్రేమ్ ఏడుస్తూ తల్లిని హత్తుకుని క్షమాపణలు చెబుతాడు.

  హీరోయిన్ హన్సిక అందాల ఆరబోత: పెళ్లైన కొత్తలోనే ఊహించని విధంగా హాట్ షో

  లాస్య కోరిక.. నందూ మాటలతో

  లాస్య కోరిక.. నందూ మాటలతో


  తులసితో ఛాలెంజ్ చేసిన తర్వాత లాస్య ఉత్తమ ఇల్లాలిగా మారిపోవాలని అనుకుంటుంది. ఆ వెంటనే రూమ్‌లో కూర్చుని ఏదో పని చేసుకుంటోన్న నందూ దగ్గరకు వెళ్లి నేను ఎలాగైనా ఉత్తమ ఇల్లాలిని అయిపోవాలి అంటుంది. దీంతో అతడు ఏంటీ అంటూ షాకింగ్‌గా అడుగుతాడు. అప్పుడు లాస్య 'నేను ఉత్తమ ఇల్లాలిగా మారిపోవాలి. దానికి ఏం చేయాలి' అంటుంది. దీంతో నందూ 'అది నీ వల్ల కాదులే. అయినా ఇప్పుడా అవసరం ఎందుకొచ్చింది' అని ప్రశ్నిస్తాడు. దీంతో లాస్య 'అవన్నీ ఎందుకు? నేను ఉత్తమ ఇల్లాలిని అవ్వాలంటే ఏం చేయాలి చెప్పు' అంటుంది.

  నందూ చెప్పడంతో లాస్య షాక్

  నందూ చెప్పడంతో లాస్య షాక్


  ఎంత చెప్పినా లాస్య వినకపోవడంతో నందూ 'ఉదయం 5 గంటలకే లేవాలి. పొద్దున్నే లేచి ఇంటి ముందు ఊడ్చి.. ముగ్గు వేసి స్నానం చేసి దేవుడి ముందు దీపం పెట్టడం ఉత్తమ ఇల్లాలి లక్షణం' అంటాడు. దీంతో లాస్య 'ఏడు గంటలకు లేచి ముగ్గు వేసుకోకూడదా? ఇల్లు ఊడవకూడదా' అని ప్రశ్నిస్తుంది. దీంతో నందూ 'అసలు ఉత్తమ ఇల్లాలికి అర్థం అదే. మరి నీకు ఎలా అనిపిస్తుందో తెలియడం లేదు' అంటాడు. దీంతో లాస్య చెప్పమనగా 'ఏడు గంటలకల్లా అందరికీ కాఫీ ఇవ్వాలి. నువ్వు అప్పుడే లేస్తే.. అవన్నీ పనులు చేయాలి' అని అంటాడు నందూ.

  బీచ్‌లో రెచ్చిపోయిన జబర్ధస్త్ రీతూ: హాట్ షోలో గీత దాటి లోపలివి కూడా చూపిస్తూ!

  తులసిలా మారాలని ప్లాన్ చేసి

  తులసిలా మారాలని ప్లాన్ చేసి


  ఆ తర్వాత నందూ 'అందరికీ ఇష్టమైన వంటలు చేసి పెట్టాలి. ఎప్పుడూ ముఖం మీద చిరునవ్వు ఉండాలి. ముఖ్యంగా మా నాన్న, అమ్మను మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్లకు సమయానికి మెడిసిన్ ఇవ్వాలి. ఇంట్లో వాళ్లకు ఏం కావాలో అది చేసి పెట్టాలి' అంటాడు. దీంతో లాస్య మొత్తానికి తులసిలా మారాలి అంటావు అంతే కదా అంటుంది. దీంతో అతడు అంతేగా అంటూ చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత లాస్య మంచి చీర కట్టుకొని కొంగు ఇలా మెడ మీద వేసుకోబోతుంది. కానీ, మరీ ఇంత ఉత్తమంగా అవసరం లేదు అని అనుకుంటుంది. అంతేకాదు, చీర దగ్గరే చిరాకు పడితే ఎలా? అర్జెంట్‌గా తులసి క్యారెక్టర్‌లోకి పరకాయ ప్రవేశం చేయాలి అని తనలో తాను అనుకుని నడవడం ట్రై చేస్తుంది.

   యాక్షన్‌లోకి దిగిపోయిన లాస్య

  యాక్షన్‌లోకి దిగిపోయిన లాస్య


  అనంతరం లాస్య నడక కన్నా.. తులసిలా మాట్లాడటం ప్రాక్టీస్ చేస్తే బెటర్ అనుకొని.. మామయ్య గారు.. అత్తయ్య గారు అంటూ ఆమెలా మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. మరోవైపు, తులసి అందరి కోసం వంటలు వండుతుంది. అందరూ భోజనానికి రండి.. నేను వడ్డిస్తున్నాను అంటుంది. అప్పుడు లాస్య అందరికీ నేను కదా వడ్డించాల్సింది అని అనుకుంటుంది. అందరూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొంటారు. దీంతో తులసి రా లాస్య నువ్వు కూడా కూర్చో. నేను వడ్డిస్తాను అంటుంది. దీంతో లాస్య నేనే వడ్డిస్తా నువ్వు కూర్చో అంటుంది. దీంతో అంతా షాక్ అవుతారు.

  యాంకర్ విష్ణుప్రియ ఎద అందాల జాతర: బీచ్‌లో తడిచిన శరీరంతో ఘాటుగా!

   నందూ మీద సాంబార్ వేసేసి

  నందూ మీద సాంబార్ వేసేసి


  ఇక, తులసిని కూర్చోమన్న లాస్య అందరికీ వడ్డిస్తూ ఉంటుంది. దీంతో లాస్యను నందూ విచిత్రంగా చూస్తాడు. లాస్య వడ్డిస్తుండగా అందరూ కమ్మగా తింటుంటారు. అప్పుడు లాస్య 'ప్రేమ్ వడ్డించేది మీ అమ్మే అనుకో.. అస్సలు మొహమాట పడకు. మామయ్య గారు.. అత్తయ్య గారు.. ఇంకాస్త వడ్డించనా' అంటుంది. దీంతో వాళ్లు చాలమ్మా అంటారు. తర్వాత లాస్య నందూ దగ్గరికి వెళ్తుంది. అప్పుడామె 'నీకు సాంబారు వడ్డిస్తాను. పక్కన ఉన్న అన్నం కూడా కలుపుకో' అంటుంది. అలా సాంబారు వేస్తుండగా అతడి షర్ట్‌పై పడుతుంది. దీంతో అందరూ నవ్వుకుంటారు. దీంతో నందూ కోపంగా లేచి వెళ్లిపోతాడు. అప్పుడు లాస్య వెళ్లి అడగ్గా.. ముందు నువ్వు పనులు నేర్చుకో.. తర్వాత ఉత్తమ ఇల్లాలు అవుదువుగానీ అంటాడు.

   సామ్రాట్‌తో పంచుకుంటూనే

  సామ్రాట్‌తో పంచుకుంటూనే

  తర్వాత తులసి ఆఫీసుకు వెళ్తుంది. సామ్రాట్, తులసి ఇద్దరూ కలిసి బిజీగా పని చేస్తుంటారు. ఇంతలో ఆమె తనలో తాను నవ్వుకుంటూ ఉండగా సామ్రాట్ చూసి షాక్ అవుతాడు. అప్పుడతను నన్ను చూసా నవ్వుతున్నారు అని అడగ్గా.. లాస్య మంచిదాన్ని అనిపించుకోవడం కోసం రాత్రి నంద గోపాల్ మీద సాంబారు పోసింది అని జరిగింది చెప్తుంది. దీంతో మీ కోరిక అయితే తీరింది కదా అంటాడు సామ్రాట్. దీనికామె 'అవును. మీ పుణ్యమాని సరైన సమయానికి సరైన నిర్ణయం తీసుకున్నా. ఇప్పుడు నేను చేయాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. మా పిల్లలను సెటిల్ చేయాలి. నా సంపాదనతోనే దివ్య పెళ్లి కూడా చేయాలి' అని అతడికి చెప్పగా.. సామ్రాట్ ఎంకరేజ్ చేస్తూ మాట్లాడతాడు.

  నగ్నంగా ఆదా శర్మ అరాచకం: వీటిలో మీ ఫేవరెట్ ఏది అంటూ పచ్చిగా!

  ఆమెకు కొత్త ప్రాజెక్ట్.. లాస్యేమో

  ఆమెకు కొత్త ప్రాజెక్ట్.. లాస్యేమో


  తులసితో మాట్లాడుతోన్న సమయంలో సామ్రాట్ 'అమెరికన్ ప్రాజెక్ట్‌కు మీరే హెడ్ అంటాడు సామ్రాట్. లాభాల్లో 50, 50 అంటాడు. మీకు ఓకే కదా' అని అడుగుతాడు. అప్పుడామె 'నాకు ఓకే కాదు.. నేను ఇప్పుడిప్పుడే ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను' అంటుంది. దీంతో సామ్రాట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. ఈలోపు మీరు ఇంగ్లీష్ నేర్చుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అప్పుడు తులసి ఇంగ్లీష్ నేర్చుకోవడం కోసం బుక్స్ కొంటుంది. మరోవైపు, తులసి లేనిది చూసి లాస్య అనసూయకు మర్ధనా చేయబోతుంది. దీంతో ఆమెకు నొప్పి వస్తుంది. దీంతో అంతా నవ్వుకుంటారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 843: Lasya Plan to Impress Nandhu Family goes for a toss. After That Samrat Assigns The New Project Responsibilities To Tulasi.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X