For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: లాస్యకు నందూ కొత్త కండీషన్.. తులసి దెబ్బకు ఇంట్లో నుంచి పరార్

  |

  ఇండియా వ్యాప్తంగా సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్య వల్ల నిజం తెలియడంతో ప్రేమ్, శృతి శోభనానికి ఇంట్లో వాళ్లంతా ఏర్పాట్లు చేస్తారు. ఆ తర్వాత శృతి పాల గ్లాసుతో గదిలోకి వెళ్తుంది. కానీ, ప్రేమ్ సెంటిమెంట్ వర్కౌట్ కాదని పాలు వద్దంటాడు. అలా ఇద్దరి మధ్య చాలాసేపు రొమాంటిక్ సన్నివేశాలను చూపించారు. మరోవైపు, అసలు ఫస్ట్ నైట్ జరగకపోవడంతో లాస్య కూడా నందూతో రొమాంటిక్‌గా మాట్లాడుతుంటుంది. కానీ, అతడు మాత్రం అస్సలు పట్టించుకోడు. పైగా తనకు ఉదయాన్నే ఆఫీస్‌కు వెళ్లే పని ఉందని వెంటనే పడుకుంటాడు. దీంతో లాస్య నీరుగారిపోతుంది.

  హాట్ వీడియోలో రెచ్చిపోయిన పాయల్ రాజ్‌పుత్: బాడీ పార్టులు మొత్తం చూపిస్తూ దారుణంగా!

  వసంత కంప్లైంట్.. లాస్య ఆగ్రహం

  వసంత కంప్లైంట్.. లాస్య ఆగ్రహం

  అనసూయ అన్న మాటకు మరిన్ని కలిపి వసంత లాస్యకు కంప్లైట్ చేస్తుంది. 'వీళ్లు టార్చర్ పెడుతున్నారు. నేను ఇప్పుడే పని వదిలేసి వెళ్తాను. నేను పేదదాన్నే కావచ్చు. కానీ, ఇలా మాటలు పడలేను. నన్ను మీ అత్తగారు, ఆవిడ మాజీ కోడలు టార్చర్ పెడుతున్నారు' అంటూ ఏడుస్తుంది వసంత. దీనికి లాస్య 'ఏంటి తులసి? పనిమనిషిని కూడా వదలవా? నా పనిమనిషిని విసిగించి తరిమేయాలని చూస్తున్నావా? ఈ ఇంట్లో ప్రతి వాళ్లు నన్ను శత్రువుగా చూస్తున్నారు. నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదు' అంటూ వీర లెవెల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

  లాస్య తులసి మధ్య భీకరమైన ఫైట్

  లాస్య తులసి మధ్య భీకరమైన ఫైట్

  లాస్య మాటల విన్న తర్వాత నువ్వు రాంగ్ రూట్‌లో వెళ్తున్నావని అంటుంది తులసి. అప్పుడు లాస్య 'నేను కాదు.. నువ్వు రాంగ్ రూట్‌లో వెళ్తున్నావు. ఏ సమస్య అయినా దానికి మూలకారణం మాత్రం తులసి. చాలా తెలివి అయిన దానిలా గొప్పగా కనిపించాలని నటిస్తావు. నందూకు దగ్గరవ్వాలని చూస్తున్నావు' అంటూ సీరియస్ అవుతుంది. అప్పుడు తులసి 'ఈ ఇంట్లో రాములమ్మకు ఎంత గౌరవం ఇస్తామో.. వసంతకు కూడా అంతే గౌరవం ఇస్తాం. అత్తయ్య నీతో ఏం తప్పు మాట్లాడిందో చెప్పు' అని అడుగుతుంది. దీంతో చెప్పలేకపోతుంది వసంత.

  Anasuya Bharadwaj తో అది కావాలన్న హైపర్ ఆది: పుష్ప నటుడితో బేరాలు.. వైరల్‌గా వీడియో!

  వివరించిన తులసి... నందూ కోపం

  వివరించిన తులసి... నందూ కోపం

  తులసి మాట్లాడుతూ.. 'తెల్లారినా నట్టింట్లో పడుకుంటే లేపడం తప్పా. వాషింగ్ పౌడర్ వృధా చేయొద్దు అని చెప్పడం తప్పా' అంటుంది. దీనికి లాస్య 'అత్తయ్య మీరు ముందు తులసిని లోపలికి తీసుకెళ్లండి' అంటుంది. దీనికి అనసూయ 'ముందు నువ్వు నీ పనిమనిషిని లోపలికి తీసుకెళ్లు' అంటుంది. దీనికి లాస్య 'నా ముఖం నీకు నచ్చదు. నేను ఈ ఇంట్లో ఉండటం నీకు నచ్చదు. నందూతో నేను ఉండటం నీకు నచ్చదు' అంటూ ఏవేవో అనబోతుంది. దీంతో నందూ ఆమెపై సీరియస్ అవుతాడు. కోపంతో రగిలిపోతూ లాస్యకు సరైన విధంగా రిప్లై ఇస్తాడు.

  నీకు ముందే చెప్పాను కదా అంటూ

  నీకు ముందే చెప్పాను కదా అంటూ

  లాస్యపై ఒక్కసారిగా ఫైర్ అయిన నందూ 'ఇక చాలు లాస్య ఆపు. పనిమనిషిని తీసుకొచ్చినప్పుడే చెప్పాను. పరాయి మనిషిని ఈ ఇంట్లో ఉంచుకోవడం మా ఇంట్లో వాళ్లకు ఇష్టం ఉండదు అని చెప్పాను కదా. తనను నువ్వే తీసుకొచ్చావు. తన ప్రవర్తన కూడా నీదే బాధ్యత. తన పిచ్చి వేషాలన్నీ రోజంతా మా వాళ్లు భరించాల్సి ఉంటుంది. ఇందులో తప్పు వసంతదో.. అమ్మదో.. తులసిదో కాదు నీది మాత్రమే' అంటాడు. దీంతో లాస్య షాక్ అవుతుంది. అప్పుడు 'మీ వాళ్లకు శత్రువును అయ్యాను. నీకు కూడా శత్రువును అయ్యానా నందూ' అని సూటిగా ప్రశ్నిస్తుందామె.

  బట్టలున్నా లేనట్లే రాశీ ఖన్నా ఫోజులు: తొలిసారి ఇంత హాట్‌గా కనిపించిన హీరోయిన్

  వాళ్లకు విలువ ఇవ్వడం లేదంటూ

  వాళ్లకు విలువ ఇవ్వడం లేదంటూ

  నందూ మాటలకు లాస్య 'అంతేలే నేను ఒంటరి దాన్ని. నాకు ఎవరూ లేరు కదా' అంటుంది. దీంతో నందూ 'వసంత నువ్వు లోపలికి వెళ్లు. చూడు లాస్య.. బయటి వాళ్ల ముందు ఇలా ఇంటి విషయాల్లో గొడవ పడటం పద్ధతా. మా అమ్మానాన్నలకు నువ్వు విలువ ఇవ్వడం లేదు. దీంతో తను కూడా ఇవ్వడం లేదు. నువ్వు అందరితో గొడవ పడటం చూసి తను కూడా పడుతోంది' అంటాడు. అప్పుడు తులసి 'తను వినకపోయినా పర్వాలేదు కానీ, ఒక పరాయిమనిషి ఈ ఇంట్లో ఉంటుంటే ఆ మనిషి బాధ్యత ఎవరైనా ఒకరు తీసుకోవాలి కదా. మేము తీసుకోలేకపోతున్నాం.. నువ్వు తీసుకోలేకపోతున్నావు' అంటుంది.

  మెడపట్టి గెంటేస్తానని తులసి ఫైర్

  మెడపట్టి గెంటేస్తానని తులసి ఫైర్

  ఆ తర్వాత తులసి మాట్లాడుతూ.. 'అత్తయ్యతో కానీ, మామయ్యతో కానీ అమర్యాదగా ప్రవర్తిస్తే నేను ఊరుకోను. మెడ పట్టి బయట గెంటేస్తాను. అది పనిమనిషిని అయినా పనిమనిషిని పెట్టుకున్న వాళ్లు అయినా సరే.. గెంటేయడం నాకు పెద్ద పని కానే కాదు' అంటూ లాస్యకు సీరియస్ వార్నింగ్ ఇస్తుంది. దీనికి లాస్య 'ఈ ఇంట్లో బయట వాళ్లు ఉన్నది నువ్వే తులసి. గొడవలు పెట్టుకోవడానికి నువ్వు ఉంటే చాలు. ఇంకెవరూ అవసరం లేదు. అందరితో పాటు నేను కూడా ఈ ఇంట్లో పనిమనిషిగా మారాలా? అదేనా మీ కోరిక' అని అడుగుతుంది లాస్య.

  బిడ్డకు పాలు పడుతోన్న ఫొటోను షేర్ చేసిన శ్రీయ: ఇలాంటివి కూడా వదులుతారా అంటూ దారుణంగా!

  లాస్యకు కండీషన్.. వసంత ఔట్

  లాస్యకు కండీషన్.. వసంత ఔట్

  లాస్య అడిగిన వెంటనే నందూ 'అవును.. అదే మా కోరిక. ఈ ఇంట్లో మగాడు కూరగాయలు తీసుకొస్తే అతడు పనోడు అవుతాడా? నీ భర్తకు నువ్వు వండి పెడితే నువ్వు పనిమనిషివి అవుతావా? ఈరోజు నుంచి నువ్వే నాకు వండి పెట్టాలి. టీ, కాఫీ, అన్నీ నువ్వే చేయాలి. తులసే కాదు.. నేను కూడా ఆ పనిమనిషిని తీసేయాలనుకుంటున్నాను' అంటాడు. ఆ తర్వాత వసంత వచ్చి 'మీరేంది తీసేది.. నేనే వెళ్లిపోతాను. నా జీతం నాకు ఇచ్చేయండి' అంటుంది. దీంతో నందూ డబ్బులు ఇస్తాడు. ఆ తర్వాత వసంత బ్యాగ్ సర్ధుకుంటూ ఉండగా తులసి వెళ్లి ఆమెకు కొన్ని సలహాలు ఇస్తుంది. అంతేకాదు, లడ్డూలు అంటే ఇష్టమని ఇస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 531: Tulasi Fighted with Lasya for Anasuya and Parandamaiah. Then Lasya Created Evil Plan for Them.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X