Intinti Gruhalakshmi Today Episode: తులసికి తెలిసిన నిజం.. ఆయనకు బాధను చెప్పుకుంటూ ఎమోషనల్

తెలుగు బుల్లితెరపై సుదీర్ఘ కాలంగా ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. మనోజ్ చెప్పిన మాటల గురించి అభి ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో అంకిత అక్కడకు వచ్చి తన నగల గురించి అడుగుతుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. ఆ తర్వాత ఇంట్లో గొడవల కారణంగా తలనొప్పి వచ్చిందని అనసూయ బాధ పడుతుంది. అనంతరం నందూ ఉద్యోగంలో చేరేందుకు కేఫ్‌కు వెళ్లాలని రెడీ అవుతుంటాడు. కానీ, అతడికి లాస్య టిఫిన్ రెడీ చేయదు. ఇక, తులసి ఫ్యాక్టరీకి వెళ్లేందుకు సిద్ధం అవుతుండగా.. ప్రేమ్ మాత్రం పట్టుబట్టి మరీ ఆమెను ఆస్పత్రిలో చెకప్‌కు తీసుకు వెళ్లానని అంటాడు.

ఫస్ట్ డే గొడవ.. పరిష్కరించిన నందూ

ఫస్ట్ డే గొడవ.. పరిష్కరించిన నందూ

నందూ కేఫ్‌లో మొదటి రోజు ఉద్యోగానికి హాజరు కావడంతో ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. విధి నిర్వహణలో భాగంగా అతడు కస్టమర్లకు అట్రాక్ట్ చేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తాడు. కేఫ్ మొత్తం కలియ తిరుగుతూ సందడి చేస్తుంటాడు. సరిగ్గా అప్పుడే బేరర్ ఓ కస్టమర్‌తో గొడవ పెట్టుకుంటాడు. దీంతో వాళ్లు తిట్టుకుంటూ వెళ్లిపోవాలని అనుకుంటారు. అప్పుడు నందూ ఎంట్రీ ఇచ్చి వాళ్లకు సర్ధి చెబుతాడు. అంతేకాదు, వాళ్లు బయటకు వెళ్లిపోకుండా ఆపడంతో పాటు హుందాగా వ్యవహరిస్తాడు. ఆ తర్వాత బేరర్‌తో కొన్ని విషయాలను చర్చించి పంపుతాడు.

అనసూయను కాకాపట్టాలని ప్లాన్ చేసి

అనసూయను కాకాపట్టాలని ప్లాన్ చేసి

ఇంట్లో అనసూయ కూరగాయలు తరుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడకు లాస్య వస్తుంది. అప్పుడు మనసులో 'ఈ ముసలిది ఏంటి కూరగాయలు తరుగుతోంది. అంటే తులసి ఇంకా రాలేదన్నమాట. దీన్ని కాకా పట్టాలంటే ఇదే సరైన సమయం' అని అనుకుంటుంది. ఆ తర్వాత ఆమె దగ్గరకు వెళ్లి కూర్చుంటుంది. అత్తయ్యా ఏం చేస్తున్నారు అంటూ తెగ ప్రేమ ఒలకబోస్తుంది. అందుకు అనుగుణంగానే అనసూయ కూడా ఇదేంటి.. తెగ ప్రేమ ఒలకబోస్తుంది అని అనుకుంటుంది. అప్పుడే లాస్య.. అత్తయ్యా టీ తాగుతారా అంటూ అడుగుతుంది.

బాధ్యతలను ఇవ్వమని అడిగిన లాస్య

బాధ్యతలను ఇవ్వమని అడిగిన లాస్య

టీ తాగుతారా అని లాస్య అడగ్గానే.. అనసూయ 'అదా నీ ప్లాన్. నేను ఆరోజు నుంచి టీ పెట్టడం లేదు కదా' అంటుంది. దీనికి లాస్య 'మీరేం పెట్టాల్సిన అవసరం లేదు. నేను పెడతాను' అని అంటుంది. ఆ తర్వాత టీ పెట్టుకుని వచ్చి ఇద్దరూ కలిసి తాగుతారు. అప్పుడు లాస్య 'సంక్రాంతి పండుగ వస్తుంది కదా.. ఆనవాయితీ ప్రకారం కోడలు నేనే పూజ చేయాలి కదా. ఆ పూజలు ఏంటో ఎలా చేయాలో నాతో చేయించండి' అంటుంది. దీనికామె 'నీకు తెలియకపోతే తులసి చేస్తుందిలే' అంటుంది. అప్పుడు లాస్య 'తను ఎందుకు చేస్తుంది? ఈ ఇంటి కోడలును నేను కదా పండుగ పూట నా చేతుల మీదుగా పూజ జరగాలి' అంటుంది. అప్పుడు అనసూయ 'సరే.. నేను తులసికి చెబుతానులే' అంటుంది.

బాధగా వచ్చిన తులసి... అందరి వల్ల

బాధగా వచ్చిన తులసి... అందరి వల్ల

కొత్త జాబ్ మొదటి రోజు పూర్తి చేసుకొని ఇంటికి వస్తాడు. తులసి కూడా ఆసుపత్రి నుంచి ఇంటికి వస్తుంది. తనకు క్యాన్సర్ మళ్లీ వచ్చే ప్రమాదం ఉందని చెప్పడంతో ఏం చేయాలో అర్థం కాదు. దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక, అనసూయను టీ పెట్టమంటాడు పరందామయ్య. కానీ, ఇంట్లో టీ పౌడర్ ఉండదు. దీంతో పరందామయ్య ఆమెపై సీరియస్ అవగా.. 'నాకేం తెలుసు. ఇంట్లో పనులన్నీ తులసే కదా చూసుకునేది' అంటుంది అనసూయ. తులసి అది విని ఇంట్లోకి వస్తుంది. చూస్తే అంకిత, అభి ఇద్దరూ పోట్లాడుకుంటారు. ప్రేమ్, శృతి కూడా ఏదో మాట్లాడుకుంటారు. ఇవన్నీ విన్న తులసి తనలో తానే బాధ పడుతూ ఉంటుంది.

మీ అమ్మ లేకపోతే ఏం చేస్తావ్ అంటూ

మీ అమ్మ లేకపోతే ఏం చేస్తావ్ అంటూ

ఇక, దివ్య రూమ్‌లో పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తుంది. అప్పుడు తులసి వెళ్లి చదువుకోవడం అయిందా అని అడుగుతుంది. 'నీ రూమ్ సర్దుకొమ్మని ఉదయమే చెప్పాను కదా నువ్వు సర్దుకున్నావా' అని అడుగుతుంది. దీనికామె 'నువ్వు సర్దుతావు కదా. అన్ని నువ్వు చూసుకుంటావు కదా' అంటుంది. దీనికి తులసి 'ఇప్పుడు నేను ఉన్నాను.. తర్వాత నేను లేకపోతే ఎలా' అంటుంది. దీంతో దివ్యకు డౌట్ వస్తుంది. అప్పుడు తులసి 'అదే రేపు అత్తారింటికి వెళ్లినప్పుడు మీ అమ్మ ఏం పనులు నేర్పించలేదా అంటే ఏం చేయాలి' అంటూ కవర్ చేసుకుంటుంది.

దేవుడి దగ్గర బాధ చెప్పుకున్న తులసి

దేవుడి దగ్గర బాధ చెప్పుకున్న తులసి

ఇంట్లో ఉన్న అందరి పరిస్థితులు చూసిన తర్వాత తులసి దేవుడి గదిలోకి వెళ్తుంది. అప్పుడు కన్నీరు పెట్టుకుంటూ తన మనసులోని బాధనంతా చెప్పుకుంటుంది. 'నేను పోతే నా వాళ్లు ఏమైపోతారో అని తెగ బాధపడిపోతుంది. నా బాధ్యతలు ఇంకా తీరలేదు. నేను ఏం చేయాలి? అభి వాళ్లు ఇంకా సెటిల్ అవ్వలేదు. ప్రేమ్ శృతి దారి చూసుకోలేదు. దివ్యకు ఇంకా పెళ్లి కూడా కాలేదు' అంటూ తనలో తానే బాధ పడుతుంది. అంతేకాదు, 'ఈ తులసి బతికి ఉన్నా.. లేకున్నా వాళ్ల బతుకు వాళ్లు బతికేలా చేస్తాను. ఎవరికీ కష్టం రానివ్వను' అని అనుకుంటుంది.

తులసికి అసలు నిజం చెప్పిన అంకిత

తులసికి అసలు నిజం చెప్పిన అంకిత

అభి ప్రవర్తనతో వచ్చిన మార్పులు చూసి అంకితకు ఏం చేయాలో అర్థం కాదు. ఆమె ఏదో ఆలోచిస్తోందని చూసి తులసి అక్కడికి వస్తుంది. అంతేకాదు, ఏమైందని అడుగుతుంది. అంతేకాదు, 'పర్లేదమ్మా నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు' అంటుంది. దీనికి 'అభి మారిపోయాడు ఆంటి. చేసింది చెప్పడం లేదు. చెప్పింది చేయడం లేదు. ఊరికే ఊరికే కోపం తెచ్చుకుంటున్నాడు. ఈ మధ్య అప్పులు చేస్తున్నాడు. అర్జెంట్‌గా ఫ్రెండ్ దగ్గర తీసుకున్న అప్పు తీర్చాలని నా నగలు కూడా తాకట్టు పెట్టుకున్నాడు' అని నిజం చెబుతుంది. దీనికి తులసి 'ఎందుకు ఇచ్చావమ్మా? ఈ విషయం మీ అమ్మ గారికి తెలిస్తే ఊరుకోదు. అసలు నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది' అని చెబుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X