twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: తులసికి మరో దెబ్బ.. లాస్య బుట్టలో పడి.. తప్పుడు దారిలోకి!

    |

    ఇండియాలో ఎన్నో భాషలు ఉన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంటర్వ్యూ కోసం నందూ కారులో వెళ్తుండగా బ్యాంక్ వాళ్లు ఆపి తాళం తీసుకుని వెళ్లిపోతారు. ఇక, సామ్రాట్ మాత్రం తులసికి ఓ మీటింగ్‌లో పాల్గొనాలని చెబుతాడు. దీంతో ఆమె కొందరితో సమావేశం అవుతుంది. అప్పుడు వాళ్లు ఇంగ్లీష్‌‌లో మాట్లాడుతుండడంతో తెలుగులో చర్చించమని వాళ్లకు క్లాస్ పీకుతుంది. దీంతో అందరూ తెలుగులోనే మాట్లాడుకుంటారు. ఫలితంగా మీటింగ్ సక్సెస్ అవుతుంది. మరోవైపు, దివ్యను బుట్టలో వేసుకునేందుకు లాస్య ప్లాన్ చేస్తుంది. ఇందుకోసం ఆమెకు స్వయంగా ల్యాప్‌టాప్ కొనిస్తానని హామీ ఇస్తుంది.

    తెలుగు పిల్ల డింపుల్ అందాల జాతర: ఎద భాగం కనిపించేలా ఏకంగా ఫ్లైట్‌లోనే!తెలుగు పిల్ల డింపుల్ అందాల జాతర: ఎద భాగం కనిపించేలా ఏకంగా ఫ్లైట్‌లోనే!

    ఇంట్లో వాళ్లకు చెప్పిన నందూ

    ఇంట్లో వాళ్లకు చెప్పిన నందూ

    కారును బ్యాంక్ వాళ్లు తీసుకెళ్లిన తర్వాత నందూ వచ్చి ఇంట్లో నిరాశగా కూర్చుంటాడు. దీంతో అనసూయ వచ్చి 'ఏమైందిరా... ఏంటి ఇలా ఉన్నావు. ఒంట్లో బాగోలేదా? రా.. అలా కూర్చుందువు' అని అంటుంది. ఇంతలో తులసి మంచినీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది. అప్పుడు అభి 'అదేంటి డాడ్.. మీరు వచ్చారు. కారు సౌండ్ వినిపించలేదు' అని అడుగుతాడు. దీంతో నందూ 'కారు లేదు. 4 నెలల నుంచి ఈఎంఐ కట్టలేదు. అందుకే కారును బ్యాంక్ వాళ్లు తీసుకెళ్లారు' అని చెబుతాడు. అప్పుడు అభి 'అప్పుడు వాళ్లతో వడ్డీతో సహా మొత్తం చెల్లిస్తా అని చెప్పాల్సింది' అంటాడు.

    బ్యాంక్ వాళ్లు ఎలా నమ్ముతారు

    బ్యాంక్ వాళ్లు ఎలా నమ్ముతారు


    అభి ఆ మాట అనగానే నందూ 'ఇంట్లో వాళ్లే నన్ను నమ్మడం లేదు. బ్యాంక్ వాళ్లు ఏం నమ్ముతారు? అసలు ఏ నమ్మకంతో నేను వాళ్లతో ఆ మాట అనాలి' అంటాడు. అప్పుడు తులసి 'నమ్మకం అనేది నిస్వార్థమైన ప్రేమతో వస్తుంది' అంటుంది. దీంతో నందూ నాది స్వార్థమైన ప్రేమ అంటావా? అని ప్రశ్నిస్తాడు. దీనికి తులసి 'నేను అలా అనను కానీ.. నిస్వార్థంగా ప్రేమిస్తే ఖచ్చితంగా మనకు అవసరాలకు ఆ ప్రేమ ఆదుకుంటుంది. జీవితంలో ఓటమి అనేది ఒక భాగం. అంతేకానీ, అదే జీవితం కాదు' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దీంతో నందూ కూడా వెళ్లిపోతాడు.

    Shraddha Das: లోదుస్తులు లేకుండా శ్రద్దా దాస్ రచ్చ.. బాబోయ్ ఇలా తెగించిందేంటి!Shraddha Das: లోదుస్తులు లేకుండా శ్రద్దా దాస్ రచ్చ.. బాబోయ్ ఇలా తెగించిందేంటి!

    అప్పు కావాలని అడిగిన లాస్య

    అప్పు కావాలని అడిగిన లాస్య

    రూమ్‌లో కూర్చుని ఉన్న నందూకు కాళ్లు నొప్పులు వస్తుంటాయి. ఇంతలో లాస్య అక్కడకు వస్తుంది. అంతేకాదు, నందూకు కాళ్లు నొక్కుతూ యాక్టింగ్ చేస్తుంది. ఆ సమయంలో లాస్య 'నందూ.. ఎవరైనా లక్షన్నర మనకు అప్పు ఇచ్చేవాళ్లు ఉన్నారా' అని అడుగుతుంది. దీంతో నందూ 'అనుకున్నా.. నీ వాలకం చూస్తే ఇలా అడుగుతావని అనుకున్నా. నా పర్సులో వంద రూపాయలు లేవు. ఇంటర్వ్యూకే ఆటోకు డబ్బులు లేక నడుచుకుంటూ వెళ్లి వచ్చాను' అంటాడు. దీంతో లాస్య కారు ఉంది కదా అంటుంది. దీంతో ఈఎంఐ కట్టలేదని బ్యాంకు వాళ్లు కారును లాక్కెళ్లారు అని చెప్తాడు.

    నిన్ను అమ్మకానికి పెట్టాలని

    నిన్ను అమ్మకానికి పెట్టాలని

    నందూ కారు గురించి చెప్పగానే లాస్య 'కారును తీసుకెళ్లిపోయారా? మరి ఇప్పుడెలా? మనం ఏం చేయాలి' అని అంటుంది. అప్పుడు నందూ 'ఆ కారు సంగతి పక్కన పెట్టు. ముందు అసలు నీకు ఆ లక్షన్నర ఎందుకు కావాలో ఆ విషయం చెప్పు' అని అడుగుతాడు. అప్పుడు లాస్య 'దివ్యకు కొత్త లాప్ టాప్ కావాలట. తనకు స్టడీ పర్పస్ అది ఉపయోగపడుతుందట' అని చెప్తుంది. దీంతో నందూ దివ్య నిన్ను అడిగిందా అని ప్రశ్నిస్తాడు. దీనికి లాస్య లేదు అంటుంది. మరి నీకెందుకు కొనివ్వాలనిపిస్తుంది అని అడుగుతాడు. దీంతో లాస్య 'నేను కొనిస్తా అని మాటిచ్చా' అంటుంది. దీనికతడు 'ఇప్పటికిప్పుడు లక్షన్నర కావాలంటే నిన్ను అమ్మకం పెట్టాలి' అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

    జబర్ధస్త్ నూకరాజు ఆసియా లవ్ స్టోరీలో ట్విస్ట్: పెళ్లికి ముందు షాక్!జబర్ధస్త్ నూకరాజు ఆసియా లవ్ స్టోరీలో ట్విస్ట్: పెళ్లికి ముందు షాక్!

    శృతి పుట్టేది ఆడపిల్లే అంటూ

    శృతి పుట్టేది ఆడపిల్లే అంటూ


    శృతి రూమ్‌లో మొబైల్ చూసుకుంటూ ఉండగా తులసి పాలను తీసుకొచ్చి ఆమెకు ఇస్తుంది. అంతేకాదు, 'శృతి ఇదిగో.. ఈ పాలు తాగు. ముందు నీ దగ్గర ఉన్న ఫోన్ పక్కన పెట్టు. కడుపుతో ఉన్న వాళ్లు దాన్ని ఎక్కువగా వాడకూడదు. లోపల నా లక్ష్మీదేవికి డిస్టర్బ్ అవుతుంది' అంటుంది. ఇంతలో అంకిత వస్తుంది. అప్పుడామె 'శృతి కడుపులో ఉన్నది ఆడపిల్ల అని మీరు ఫిక్స్ అయ్యారా' అంటుంది. దీంతో తులసి 'అవును.. ఆడపిల్ల దేంట్లో తక్కువ కాదు. ఆడపిల్ల అనుకుంటే ఏదైనా సాధించగలదు' అంటూ అమ్మాయిల గొప్పదనం గురించి వాళ్లిద్దరికీ చెబుతుంది.

    దివ్యకు ల్యాప్‌టాప్ ఇచ్చేసి

    దివ్యకు ల్యాప్‌టాప్ ఇచ్చేసి


    తల్లి అన్న మాటలను గుర్తు చేసుకుంటోన్న దివ్య దగ్గరకు లాస్య ల్యాప్‌టాప్ పట్టుకుని వస్తుంది. దీంతో దివ్య 'ఇలా మాటిచ్చారో లేదో అప్పుడే కొత్త లాప్‌టాప్ కొనేశారా' అని అడుగుతుంది. దీంతో లాస్య 'కొత్తది కొంటాను కానీ.. దానికి కొంచెం సమయం పడుతుంది. అప్పటి వరకు నా లాప్‌టాప్ వాడుకో' అంటుంది. దీంతో దివ్య అయ్యో వద్దు ఆంటి. మీకు అవసరం కదా అంటుంది. దీంతో లాస్య 'ఒకప్పుడు అవసరం ఉండేది. ఇప్పుడేముంది.. ఉద్యోగమా.. సద్యోగమా. ఏదైనా నీకు కొత్త లాప్‌టాప్ కొనిస్తాను. అప్పటి వరకు ఇది వాడుకో' అని చెబుతుంది.

    యాంకర్ హరితేజ రొమాన్స్ వీడియో వైరల్: ముద్దుల వర్షం కురిపిస్తూ రచ్చయాంకర్ హరితేజ రొమాన్స్ వీడియో వైరల్: ముద్దుల వర్షం కురిపిస్తూ రచ్చ

    దివ్యను బట్టలో వేసిన లాస్య

    దివ్యను బట్టలో వేసిన లాస్య


    ఆ తర్వాత లాస్య 'నాకు నువ్వంటే చాలా ఇష్టం. నిన్ను దగ్గరికి తీసుకోవాలని నా మనసులో ఉండేది. కానీ, మీ అమ్మకు నా మీద ఉన్న కోపం దగ్గర కానివ్వలేదు. నువ్వు కూడా మా అమ్మతో పాటు నన్ను ధ్వేషించేదానివి' అంటుంది. దీంతో దివ్య 'నాకు తెలియలేదు ఆంటి. నాకు తెలియక మిమ్మల్ని హర్ట్ చేశాను. సారీ ఆంటి. నేను ఇప్పటి నుంచి ఎవరు మీ గురించి ఏం చెప్పినా వినను. ఏమీ నమ్మను. నాకు ఏం కావాలన్నా మీరు చెప్పినట్టే వింటాను' అంటుంది. దీంతో లాస్య 'అలా చేస్తే మీ అమ్మకు కోపం వస్తుందేమో' అంటుంది. దీనికి దివ్య 'రానివ్వండి. నాకు కావాల్సింది ఇవ్వకపోతే నేను ఎలా ఉంటాను. మా అమ్మకు నేనంటే ఇష్టమే కానీ.. స్వేచ్ఛ ఇవ్వదు. పంజరంలో పెట్టి చూసుకుంటుంది' అని చెబుతుంది. తర్వాత దివ్య తనకు పార్టీ ఉన్న విషయం లాస్యకు చెప్పగా.. ఆమె సలహా మేరకు అబద్ధం చెప్పి వెళ్లబోతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 846: Lasya Turns Divya Against Tulasi by Making Fake Promises. After That Nandhu Shares His Grief with His Family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X