twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: బెడిసికొట్టిన లాస్య ప్లాన్.. ఇంట్లో అడుగు పెట్టగానే అపశృతి

    |

    ఇండియాలోని మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూడండి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. సర్జరీ తర్వాత తులసి ఆస్పత్రిలో కోలుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆమె స్పృహలోకి వస్తుంది. దీంతో అక్కడే ఉన్న నందూ, ప్రేమ్ సంతోషిస్తారు. అయితే, ఆమెకు ప్రశాంతత ఉంటేనే పూర్తిగా కోలుకుంటుందని డాక్టర్ అద్వైత కృష్ణ చెబుతాడు. ఇక, తులసి ఇంటికి చేరుకోవడంతో అందరూ బాగా సంతోషిస్తారు. కానీ, లాస్య, భాగ్య మాత్రం కుళ్లుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో తులసి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయం తీసుకుంటుంది. కానీ, ఆమె కంటే ముందే అందరూ వెళ్లిపోతామని అనడంతో ఆలోచనలో పడుతుంది.

    <strong>Shriya Saran: స్విమ్మింగ్ పూల్‌లో భర్తతో శ్రీయ రొమాన్స్.. నైట్ టైమ్‌లో రెచ్చిపోయి మరీ దారుణంగా!</strong><br />Shriya Saran: స్విమ్మింగ్ పూల్‌లో భర్తతో శ్రీయ రొమాన్స్.. నైట్ టైమ్‌లో రెచ్చిపోయి మరీ దారుణంగా!

    ఇంట్లో ఉండేందుకు ఒప్పుకున్న తులసి

    ఇంట్లో ఉండేందుకు ఒప్పుకున్న తులసి

    ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి వచ్చిన వెంటనే తులసి ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటుంది. దీంతో కుటుంబ సభ్యులందరూ ఆమె నిర్ణయాన్ని తప్పుబడతారు. అంతేకాదు, పరందామయ్య, అనసూయ అయితే ఇంట్లో నుంచి వెళ్లిపోయేందుకు రెడీ అవుతారు. అలా బయటకు కూడా వెళ్లిపోతూ అందరినీ తమ వెంట రమ్మని అడుగుతారు. దీంతో తులసి వాళ్లను ఆపుతుంది. 'ఆగండి.. దయచేసి ఎవ్వరూ ఎక్కడికీ వెళ్లొద్దు.. నేను మీతోనే ఉంటాను. అందరూ వెనక్కి వచ్చేయండి' అని అంటుంది. దీంతో అందరూ సంతోషంగా వెనక్కి వచ్చేస్తారు.

    ప్లాన్ బెడిసి కొట్టడంతో లాస్య నిరాశగానే

    ప్లాన్ బెడిసి కొట్టడంతో లాస్య నిరాశగానే

    కుటుంబాన్ని విడగొట్టాలని ప్లాన్ల మీద ప్లాను చేస్తున్న లాస్య.. తులసి ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని సంతోషిస్తుంది. అంతలో కథ అడ్డం తిరిగి ఎవరూ ఎక్కడికీ వెళ్లకుండా ఉంటారు. దీంతో ఆమె ప్లాన్ బెడిసి కొట్టిందని ఫీల్ అవుతుంది. అప్పుడు మనసులో 'ఛీ ఛీ.. ఎవరో ఒకరు వెళ్లిపోతారేమో పీడ విరగడ అవుతుంది అనుకున్నా కానీ.. ఇదేంటి ఇలా జరిగింది' అని అనుకుంటుంది లాస్య. ఆ తర్వాత 'రాములమ్మ నా కూతురు వచ్చింది ఇంట్లోకి వెళ్లి హారతి పళ్లెం తీసుకురా' అంటుంది అనసూయ. అనంతరం తులసికి స్వయంగా హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తుంది.

    Deepthi Shanmukh Breakup: దీప్తి సునైనా సంచలన ప్రకటన.. న్యూ ఇయర్‌ రోజు షణ్ముఖ్‌కు షాక్.. అందుకేనట!Deepthi Shanmukh Breakup: దీప్తి సునైనా సంచలన ప్రకటన.. న్యూ ఇయర్‌ రోజు షణ్ముఖ్‌కు షాక్.. అందుకేనట!

    పుల్లలు పెట్టిన భాగ్య.. లాస్య వార్నింగ్‌తో

    పుల్లలు పెట్టిన భాగ్య.. లాస్య వార్నింగ్‌తో

    తులసికి హారతి ఇవ్వగానే భాగ్య సీన్‌లోకి ఎంట్రీ ఇచ్చి 'అత్తయ్య మీరు చేసింది ఏమైనా బాగుందా? కొత్త కోడలు లాస్యకు మాత్రం హారతి పట్టలేదు. మాజీ కోడలుకు మాత్రం తెగ హారతి ఇచ్చేస్తున్నావు. కొత్త జంటకు కూడా హారతి ఇచ్చి ఉంటే మీ పెద్దరికం ఉండేది కదా' అంటూ పుల్లలు పెడుతుంది. దీంతో లాస్య కూడా 'మీరే మొదలుపెట్టారు అత్తయ్య గారు. నందూ మాజీ భార్యకు ఇచ్చే విలువ.. నందూ భార్యకు ఎందుకు ఇవ్వరు? నందూ నేను వేర్వేరుగా ఉన్నప్పుడు నేను నోర్మూసుకొని కూర్చున్నాను. కానీ, ఇప్పుడు ఊరుకునే ప్రసక్తే లేదు' అంటుంది.

    హారతిచ్చి లోపలికి ఆహ్వానించిన శృతి

    హారతిచ్చి లోపలికి ఆహ్వానించిన శృతి

    లాస్య మాటలకు 'కొత్త కోడలు ఆలోచించాల్సింది హక్కుల గురించి కాదు.. బాధ్యతల గురించి' అంటుంది అనసూయ. అప్పుడు లాస్య 'చూశావా నందూ.. నన్ను కావాలనే పక్కన పెట్టేస్తున్నారు. నన్ను పరాయి దానిలా చూస్తున్నారు. నేను ఈ ఇంటి కోడలినే కదా. కానీ, నన్ను గడ్డిపోచ కన్నా నీచంగా చూస్తున్నారు' అంటూ కంప్లైంట్ చేస్తుంది. దీంతో నందూ, లాస్యకు హారతి ఇవ్వమని అనసూయకు చెబుతాడు పరందామయ్య . దీంతో ఆమె చేయనని చెబుతుంది. అప్పుడు తులసి.. శృతికి ఆ పని చెప్పగా.. ఆమె హారతిచ్చి ఇద్దరినీ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది.

    సుధీర్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు: షేక్ హ్యాండ్ ఇస్తే అంతే సంగతులు.. దూరంగా ఉండమంటూ ఘోరంగా!సుధీర్‌పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు: షేక్ హ్యాండ్ ఇస్తే అంతే సంగతులు.. దూరంగా ఉండమంటూ ఘోరంగా!

    కింద పడిపోయిన దండ.. భయంగానే

    కింద పడిపోయిన దండ.. భయంగానే

    తులసి మాట కాదనలేక శృతి కొత్త జంట నందూ, లాస్యకు హారతి ఇస్తుంది. దీంతో లాస్య ఖుషీ అవుతుంది కానీ, కుటుంబ సభ్యులు ఎవ్వరూ మాట మాట్లాడరు. నందూ, శృతి ఇద్దరూ లోపల అడుగుపెట్టబోతుంటారు. ఇంతలో గడప మీద ఉన్న పూసల దండ తెగి కిందపడుతుంది. దీంతో 'అశుభం. పాతికేళ్లుగా గోడకు ఉన్న పూసల దండ తెగి కిందపడింది. దేవుడా ఈ కుటుంబాన్ని నువ్వే కాపాడాలి' అంటూ భయపడుతుంది అనసూయ. అంతేకాదు, లాస్య కోడలిగా ఇంట్లోకి అడుగు పెట్టగానే ఈ కుటుంబం ముక్కలవుతుందేమోనన్న భయం ఆమెలో కనిపిస్తుంది.

    లాస్యకు భాగ్య వార్నింగ్.. నందూ అలా

    లాస్యకు భాగ్య వార్నింగ్.. నందూ అలా

    ఇంట్లో జరుగుతున్న పరిణామాలు చూస్తున్న నందూకు ఏం చేయాలో అర్థం కాదు. ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని క్షణక్షణం భయంగా బతకాల్సి వస్తుంది అంటూ అనుకుంటాడు. లాస్య మాత్రం పూసల దండ తెగడం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో భాగ్య అక్కడికి వచ్చి 'ముందు నీ ప్లాన్‌లో ఒక పని అయిపోయింది. చివరకి నందూతో తాళి కట్టించుకున్నావు. కానీ, తులసి అక్కను దెబ్బ కొట్టడం అంత ఈజీ కాదేమో. అందరితో ఇప్పుడిప్పుడే నువ్వు చెడుగుడు ఆడుకోలేవు' అని వార్నింగ్ ఇవ్వడంతో ఆమె ఆలోచనలో పడుతుంది.

    RRR First Review: విడుదలకు ముందే లీకైన రిపోర్టులు.. అసలు పాయింట్ అదే.. సినిమా ఎలా ఉంటుందంటే!RRR First Review: విడుదలకు ముందే లీకైన రిపోర్టులు.. అసలు పాయింట్ అదే.. సినిమా ఎలా ఉంటుందంటే!

    Recommended Video

    Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
     భర్తను తులసి దగ్గరకు వెళ్లొద్దన్న లాస్య

    భర్తను తులసి దగ్గరకు వెళ్లొద్దన్న లాస్య

    తులసి ఇంట్లోకి వచ్చాక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సంతోషంగా ఉంటారు. తులసిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. మెల్లగా తులసి నడవడం కూడా ప్రారంభిస్తుంది. దీంతో అందరి ముఖాల్లో సంతోషం వస్తుంది. అందరూ కలిసి సరదాగా గడపడం చూసి నందూ కూడా సంతోషిస్తాడు. అంతలో తులసి కింద పడబోతుంది. దీంతో నందూ ఆమెను పట్టుకోడానికి వెళ్లాలని అనుకుంటాడు. కానీ, అతడిని లాస్య ఆపుతుంది. దీంతో ఏమీ అర్థంకాక నందూ అలా చూస్తూ ఉండిపోతాడు. ఆ తర్వాత తులసి చక్కగా నడుస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 518: Anasuya Family Celebrates After Tulasi Recovery. Then Lasya Restricts Nandhu From Interacting with Tulasi.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X