For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసితో నందూ పెళ్లి.. లాస్య ప్లాన్ వర్కౌట్ అవడంతో మరో రచ్చ

  |

  మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఉద్యోగంలో చేరిన హుషారులో ఉన్న నందూ.. చకచకా పనులు చేస్తూ రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తాడు. అంతలో కేఫ్‌లో గొడవ జరగ్గా.. వెళ్లి సర్ధి చెబుతాడు. ఆ తర్వాత లాస్య.. అనసూయను కాకా పట్టేందుకు ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే ఆమెకు టీ పెట్టుకుని వచ్చి ఇస్తుంది.

  ఆ తర్వాత తనకు కోడలి హోదా ఇవ్వమని అడుగుతుంది. అనంతరం ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తులసి.. బాధగా కనిపిస్తుంది. ఆ తర్వాత దేవుడి ముందు తన బాధనంతా చెప్పుకుంటుంది. ఇక, అంకిత, అభి గురించి తులసికి నిజం చెప్తుంది.

  Bigg Boss OTT: షోలోకి అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ ఎంట్రీ.. రెండోసారి ఆఫర్ పట్టేసిన టాలీవుడ్ హీరో

  అంకిత సమస్యకు తులసి పరిష్కారం

  అంకిత సమస్యకు తులసి పరిష్కారం

  అభికి లేనిపోని అలవాట్లు వచ్చాయని, ఏం చేస్తున్నాడో అర్థం కావడం లేదని, తన నగలు తీసుకెళ్లి తాకట్టు పెట్టాడని అంకిత.. తులసికి చెబుతుంది. దీంతో ఆమె ఎంతగానో భయపడిపోతుంది. అప్పుడు అంకిత ‘పండుగ వచ్చే సరికి నగలు విడిపిస్తా అన్నాడు. ఇప్పుడు ఇంకా టైం పడుతుంది అంటున్నాడు' అని చెబుతుంది. దీంతో తులసి ‘పండగకు నీకు నా నగలు ఇస్తానులే.. ఏం కాదు. వాడిని కొన్ని రోజులు అలా వదిలేయ్. వాడే తప్పు తెలుసుకుంటాడు' అని సర్ది చెబుతుంది. దీనికి అంకిత కూడా ఒప్పుకుంటుంది. దీంతో తులసి కూడా ఊపిరి పీల్చుకుంటుంది.

  శృతిపై లాస్య ప్లాన్.. ఇద్దరి మధ్య వార్

  శృతిపై లాస్య ప్లాన్.. ఇద్దరి మధ్య వార్

  ఏదో పని చేసుకుంటోన్న శృతిని లాస్య ఏయ్ ఇటు చూడు అంటూ పిలుస్తుంది. దీనికామె నా పేరు ఏయ్ కాదు శృతి అంటూ ధీటుగా బదులివ్వడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలు అవుతుంది. ఆ సమయంలో లాస్య ‘నేను మాట్లాడుతుంటే నిర్లక్ష్యంగా ఎందుకు వెళ్తున్నావు?' అని ప్రశ్నిస్తుంది.

  దీంతో శృతి ‘నాకు కోపం కంట్రోల్ చేసుకోవడం రాదు. అందుకే నేను వెళ్లిపోతున్నాను' అంటుంది. అప్పుడు లాస్య ‘సరే గానీ.. బయటి నా చీరలు ఆరేసి ఉన్నాయి వెళ్లి తీసుకురా' అంటుంది. దీనికి శృతి ‘నువ్వు ఆర్డర్ వేస్తే తెచ్చి ఇచ్చేవాళ్లు ఇక్కడ ఎవ్వరూ లేరు' అంటుంది.

  బ్రేకప్ తర్వాత గుడ్ న్యూస్ చెప్పిన షణ్ముఖ్: ఆ ప్రేమ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నా అంటూ పోస్ట్

  తులసి ఆంటీ మళ్లీ కోడలు అవుతుంది

  తులసి ఆంటీ మళ్లీ కోడలు అవుతుంది

  లాస్య మాటలకు శృతి ‘మా వరకు మాకు అత్తయ్య తులసి గారే. నువ్వు ఎప్పుడూ అత్తయ్య కాలేవు' అంటుంది. దీంతో లాస్య ‘నీకు ఎందుకు తలపొగరు. తులసిని చూసుకొనా. త్వరలోనే తులసి ఇంట్లో నుంచి వెళ్లిపోవాల్సిందే' అంటుంది. దీనికి శృతి ‘నువ్వు అనుకున్నది జరుగుతుందనుకోవడం నీ అవివేకం. నువ్వు ఎప్పటికీ ఈ ఇంటి కోడలువు కాలేవు. మాకు అత్తయ్య కాలేవు. అంతే కాదు, మళ్లీ తులసి ఆంటి ఈ ఇంటి కోడలు కాదనే గ్యారెంటీ కూడా లేదు' అంటుంది. దీంతో లాస్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. అదే సమయంలో ఆమెలో ఆలోచనలు వస్తాయి.

  అంకుల్ మళ్లీ పెళ్లి... తులసి క్లాస్ పీకి

  అంకుల్ మళ్లీ పెళ్లి... తులసి క్లాస్ పీకి

  తులసి ఇంటి కోడలు అవుతుందని శృతి అనగానే అలా ఎలా అవుతుందని ప్రశ్నిస్తుంది లాస్య. దీంతో శృతి ‘ఏమో.. మిమ్మల్ని అంకుల్ ఎలా పెళ్లి చేసుకున్నాడో.. మళ్లీ తులసి ఆంటిని కూడా చేసుకుంటారేమో' అంటుంది. దీంతో లాస్యకు ఒక డౌట్ క్రియేట్ చేస్తుంది. ఆ తర్వాత ఇవన్నీ విన్న తులసి.. ‘ఉన్న తలనొప్పులు సరిపోవా.. లేనితలనొప్పి ఎందుకు తీసుకొస్తున్నావు. మళ్లీ నాకు ఈ ఇంటి కోడలు అవ్వాలని నేను అన్నానా? నేను మళ్లీ ప్రయత్నిస్తున్నానని నీకు ఎలా అనిపిస్తోంది? నువ్వు లాస్యతో అన్న మాటలను నేను విన్నాను' అని క్లాస్ పీకుతుంది.

  సుడిగాలి సుధీర్‌పై లేడీ ఆర్టిస్ట్ వివాదాస్పద కామెంట్స్: బేవార్స్ అంటూ అతి దారుణంగా!

  తులసికి లాస్య గురించి చెప్పిన శృతి

  తులసికి లాస్య గురించి చెప్పిన శృతి

  లాస్యతో మాట్లాడినందుకు తులసి తనను మందలించడంతో శృతి నొచ్చుకుంటుంది. అదే సమయంలో లాస్య క్యారెక్టర్ గురించి ఆమెకు వివరించి చెబుతుంది. ‘మీ మంచితనాన్ని లాస్య అలుసుగా తీసుకుంటోంది. మీ గురించి దురుసుగా మాట్లాడుతోంది' అంటూ చెబుతుంది. దీంతో తులసి ‘ఏదైనా మాట్లాడుకోనీ. నువ్వు ఆమె మాటలను అస్సలు పట్టించుకోవద్దు. అది అందిరకీ మంచిది' అని సలహా ఇస్తుంది. దీంతో ‘మీకు మీ అత్తగారంటే మీకు ఎంత అభిమానమో.. ఎంత గౌరవమో.. మాకు కూడా మా అత్తగారంటే అంత ప్రేమ' అంటుంది శృతి.

  లాస్య ఓవర్ యాక్షన్‌... నందూ ఫ్లాట్

  లాస్య ఓవర్ యాక్షన్‌... నందూ ఫ్లాట్

  తన ప్లాన్‌లో భాగంగా రూమ్‌లోకి వెళ్లిన లాస్య నందూ ముందు ఏడుస్తున్నట్లు ఓవర్ యాక్షన్ చేస్తోంది. దీంతో అతడు ఏమైందని అడుగుతాడు. అప్పుడామె ‘నువ్వు తెలుసుకొని మాత్రం ఏం చేస్తావు? ఈ ఇంట్లో నేను తప్ప అందరూ నీ వాళ్లే. నీ దృష్టిలో అందరూ మంచివాళ్లే. నిన్ను కూడా దారుణంగా శృతి కామెంట్ చేసింది' అంటూ లేనిపోనివి చెబుతుంది.

  దీంతో అతడు ఏమైందని అడగ్గా.. వద్దులే నందూ.. అంటూ కాసేపు నాన్చుతూ ‘మరేమో నీది చాపల బుద్ధి అట. ఎప్పుడు ఎలా ఆలోచిస్తావో.. ఎప్పుడు ఏం చేస్తావో తెలియదట. మళ్లీ తులసి దగ్గరికి వెళ్లిపోతావట.. తులసినే మళ్లీ పెళ్లి చేసుకుంటావట.. నువ్వు నిజంగానే తులసి దగ్గరికి వెళ్లిపోతే నాకు చావు తప్పితే ఇంకో మార్గం లేదు నందూ' అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది లాస్య.

  హాట్ డోస్ మరింత పెంచేసిన పూజా హెగ్డే: ఆమెను ఇంత ఘాటుగా ఎప్పుడూ చూసుండరు

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  రెచ్చిపోయిన నందూ.. గొడవకు సై

  రెచ్చిపోయిన నందూ.. గొడవకు సై

  లాస్య మాటలకు రెచ్చిపోయిన నందూ ‘ఏదో ఒక ఇష్యూలో తులసి వైపు మాట్లాడినంత మాత్రాన తులసి వైపు ఉన్నట్టా. ఊరుకో లాస్య నేను నిన్ను ఎప్పటికీ వదిలిపెట్టను. ఇక నుంచి అలా జరగదు లాస్య. ఇంట్లో వాళ్లంతా నీ మాట వినేలా చేస్తాను. ఒకవేళ ఎవరైనా అలా చేయకపోయినా ఏం జరుగుతుందో చూస్తాను' అంటాడు. వెంటనే వెళ్లి ‘లాస్య ఈ ఇంటి మనిషి కదా.. ఎందుకు శృతి అంత నిర్లక్ష్యంగా సమాధానం చెబుతోంది. రాను రాను ఈ ఇంట్లో ప్రతి ఒక్కరికి నోరు లేస్తోంది. పోనీలే అని అనుకుంటే దాన్ని చేతగానితనంగా తీసుకుంటున్నారు' అని గొడవ పడతాడు. దీంతో శృతి కూడా అతడికి సరైన సమాధానం చెబుతుంది. ఆ తర్వాత ప్రేమ్ కూడా తండ్రితో గొడవ పడతాడు. ఇలా ఈ ఎపిసోడ్ రచ్చ రచ్చగా ముగిసింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 534: Lasya Provokes Nandhu. Then He Serious on Shruthi. After That Prem Starts Fight with His Father.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X