twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: కుర్రాళ్ల ట్రాప్‌లో దివ్య.. నిజం చెప్పిన నందూ.. టెన్షన్ టెన్షన్

    |

    ఎప్పటికప్పుడు కొత్త కొత్త షోలు వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తన కారును బ్యాంకు వాళ్లు తీసుకెళ్లిపోయారన్న విషయాన్ని నందూ ఇంట్లోని వాళ్లకు చెబుతాడు. దీంతో తులసి అతడిని ఓదార్చుతూనే క్లాస్ పీకుతుంది. అనంతరం లాస్య వచ్చి అతడిని లక్షన్నర కావాలని అడుగుతుంది. దీనికతడు కుదరదు అని చెప్పడంతో దివ్యకు తన దగ్గర ఉన్న ల్యాప్‌టాప్‌ను ఇస్తుంది. ఆ సమయంలో ఆమెను మరింతగా రెచ్చగొట్టి తులసి మీద కోపాన్ని పెంచే ప్రయత్నం చేస్తుంది. తర్వాత దివ్య తన తల్లికి అబద్ధం చెప్పి ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్లాలని అనుకుంటుంది. అందుకు లాస్య కూడా సహాయం చేస్తుంది.

    Shraddha Das: లోదుస్తులు లేకుండా శ్రద్దా దాస్ రచ్చ.. బాబోయ్ ఇలా తెగించిందేంటి!Shraddha Das: లోదుస్తులు లేకుండా శ్రద్దా దాస్ రచ్చ.. బాబోయ్ ఇలా తెగించిందేంటి!

    తులసికి మస్కా కొట్టేసిన దివ్య

    తులసికి మస్కా కొట్టేసిన దివ్య


    లాస్య ప్లాన్ ప్రకారం స్పెషల్ క్లాస్ ఉందని దివ్య, తులసికి చెబుతుంది. కానీ, అప్పుడామె మాత్రం షార్ట్ డ్రెస్ వేసుకుని ఉంటుంది. దీంతో తులసి 'స్పెషల్ క్లాసా.. ఎప్పుడూ లేని స్పెషల్ క్లాస్ ఇప్పుడేంటి? అయినా స్పెషల్ క్లాస్‌కు ముందే చెబుతారు కదా. అయినా ఈ డ్రెస్ ఏంటి' అని వరుసగా ప్రశ్నలు అడుగుతుంది. దీంతో దివ్యకు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు సమాధానం చెప్పలేక సైలెంట్‌గా ఉండిపోతుంది. అప్పుడే లాస్య వచ్చి 'స్పెషల్ క్లాస్ అని చెబుతోంది కదా.. వెళ్తే ఏంటి సమస్య' అని అంటుంది. దీంతో తులసి సరే వెళ్లు అని చెబుతుంది. అప్పుడు లాస్యకు దివ్య థ్యాంక్స్ చెబుతుంది.

    దివ్య డ్రింక్‌లో నిద్రమాత్రలేసి

    దివ్య డ్రింక్‌లో నిద్రమాత్రలేసి

    తులసి పర్మీషన్ ఇవ్వడంతో దివ్య పార్టీకి వెళ్తుంది. అక్కడ తన స్నేహితులతో కలిసి బాగా ఎంజాయ్ చేస్తుంది. ఆ సమయంలో అక్కడ డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమె ఫ్రెండ్స్‌లో ఇద్దరు యువకులు దివ్య తాగే డ్రింక్‌లో నిద్ర మాత్రలు వేసి ఇస్తారు. ఆ విషయం తెలియని దివ్య దాన్ని తాగేస్తుంది. మరోవైపు స్పెషల్ క్లాసుకు వెళ్లిన దివ్య ఇంకా ఇంటికి రాకపోయే సరికి అందరూ కంగారు పడుతూ ఉంటారు. దీంతో లాస్య ఆమెకు ఫోన్ చేస్తుంది. అప్పుడు దివ్య 'పార్టీలో ఉన్నాను. ఇంకో గంట పడుతుంది' అని చెబుతుంది. ఇంతలో దివ్య ఫ్రెండ్ వచ్చి నో ఫోన్స్ అంటూ మొబైల్ లాక్కొని టేబుల్ మీద పెట్టేస్తుంది.

    తెలుగు పిల్ల డింపుల్ అందాల జాతర: ఎద భాగం కనిపించేలా ఏకంగా ఫ్లైట్‌లోనే!తెలుగు పిల్ల డింపుల్ అందాల జాతర: ఎద భాగం కనిపించేలా ఏకంగా ఫ్లైట్‌లోనే!

    దివ్య కోసం ఇంట్లో వాళ్ల టెన్షన్

    దివ్య కోసం ఇంట్లో వాళ్ల టెన్షన్

    స్పెషల్ క్లాస్ అని వెళ్లిన దివ్య ఇంకా రాకపోయే సరికి తులసి టెన్షన్ పడుతుంది. అప్పుడు శృతి దివ్య ఇంకా రాలేదా అని అడుగుతుంది. దీంతో తులసి 'అవును.. స్పెషల్ క్లాస్ కదా.. అది ఎప్పుడు అయిపోతుందో తెలియదు' అంటుంది. అప్పుడు అంకిత 'లేట్ అవుతుందని ఫోన్ చేయలేదా ఆంటి' అని అడుగుతుంది. దీనికి తులసి 'ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు. కనీసం మెసేజ్‌లు కూడా పెట్టడం లేదు' అంటుంది. దీంతో అంకిత 'నేను కాల్ చేస్తాను ఆంటి' అని ఫోన్ చేస్తుంది. కానీ, దివ్య మాత్రం లిఫ్ట్ చేయదు. దీంతో అంకిత రింగ్ అవుతున్నా ఆన్సర్ చేయడం లేదు అంటుంది. దీంతో శృతి క్లాస్‌లో ఉందేమో.. ఎలా ఎత్తుతుంది అంటుంది. దీంతో తులసి మెసేజ్ అయినా పెట్టొచ్చు కదా అంటుంది. అప్పుడు శృతి తను ఏ పొజిషన్‌లో ఉందో అంటుంది.

    దివ్య కోసం ప్లాన్‌ను మార్చేస్తూ

    దివ్య కోసం ప్లాన్‌ను మార్చేస్తూ

    పార్టీలో ఉండగానే దివ్యకు మత్తు ఎక్కుతుంటుంది. ఇక, పార్టీ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లేందుకు దివ్య క్యాబ్‌ను బుక్ చేస్తుంది. దీంతో ఆ ట్యాబ్లెట్లు కలిపిన కుర్రాళ్లు వచ్చి ఏం చేస్తున్నావని అడుగుతారు. అప్పుడామె 'క్యాబ్ బుక్ చేస్తున్నా' అని చెప్తుంది. దీంతో వాళ్లు 'ఈ సమయంలో క్యాబ్ సేఫ్ కాదు. కారులో వెళ్దాం పదా' అంటారు. దీంతో వద్దులే అంటుంది. అయినా ఆమెకు క్యాబ్ మాత్రం బుక్ కాదు. దీంతో వాళ్లు మా కారులో డ్రాప్ చేస్తాం పదా. ఈ టైమ్‌లో ఒక్కదానివి వెళ్లడం సేఫ్ కూడా కాదు' అంటారు. దీంతో దివ్య ఇంటి దాకా వద్దు.. ముందే దించండి అనగా.. వాళ్లు సరే అంటారు.

    జబర్ధస్త్ వర్ష సొగసుల జాతర: అతి చిన్న డ్రెస్‌లో ఆ పార్ట్ కనిపించేలా!జబర్ధస్త్ వర్ష సొగసుల జాతర: అతి చిన్న డ్రెస్‌లో ఆ పార్ట్ కనిపించేలా!

    నందూకు నిజం చెప్పిన లాస్య

    నందూకు నిజం చెప్పిన లాస్య

    దివ్య ఎంతకూ రాకపోయే సరికి ఇంట్లో వాళ్లంతా ఆమె కోసం ఎదురు చూస్తుంటారు. అప్పుడు అంకిత ఎంత స్పెషల్ క్లాస్ అయినా ఇంత సేపు ఉండదు కదా అంటుంది. ఇక, అప్పుడే వచ్చిన ప్రేమ్ 'ఈరోజు ఎలాంటి స్పెషల్ క్లాస్ లేదట.. వాచ్‌మెన్‌కు ఫోన్ చేస్తే చెప్పాడు' అంటాడు. అప్పుడే నందూ కూడా చిరాకులో ఉంటాడు. ఆ సమయంలో లాస్య వచ్చి.. 'దివ్య ఫ్రెండ్ ఇంట్లో ఏదో పార్టీ ఉందని చెప్పింది. గంటలో వస్తానని చెప్పింది. అమ్మ ఒప్పుకోదంటే.. స్పెషల్ క్లాస్ అని అబద్ధం చెప్పి పంపించాను' అంటుంది. దీంతో లాస్యను నందూ కొట్టబోతాడు. అంతేకాదు, వెళ్లి తులసికి చెప్పుపో అంటాడు. దీంతో లాస్య నేను చెప్పను.. నువ్వే చెప్పు అని అంటుంది. దీంతో ఆమెను తీసుకుని నందూ కిందకు వస్తాడు.

    ఆ నిజాన్ని చెప్పేసిన నందూ

    ఆ నిజాన్ని చెప్పేసిన నందూ


    లాస్యను తీసుకొస్తూ నందూ 'నువ్వు నువ్వులా ఉండాలి. నీ జాగ్రత్త నువ్వు తీసుకోవాలి. వెనక్కి తగ్గడం వల్లనే ఈ తలనొప్పి' అంటాడు. అదంతా విన్న తులసి 'తలనొప్పి ఏంటి? ఏం జరిగింది' అని అడుగుతుంది. దీంతో నందూ 'దివ్య స్పెషల్ క్లాస్‌కు కాదు వెళ్లింది.. తన ఫ్రెండ్ బర్త్ డే పార్టీకి' అని అసలు నిజాన్ని అందరికీ చెప్పేస్తాడు. దీంతో తులసి 'ఈ విషయం మీకెలా తెలుసు? మరి నాకెందుకు తను అబద్ధం చెప్పింది' అని ప్రశ్నిస్తుంది. దీంతో నందూ 'లాస్య చెప్పింది. అడిగితే పార్టీకి వెళ్లనివ్వు అని ఏడిస్తే అబద్ధం చెప్పు అని లాస్య ఎంకరేజ్ చేసింది' అని నిజం చెప్పేస్తాడు.

    ఆ ఇద్దరి వల్లే జబర్ధస్త్ మానేసిన అనసూయ: అన్ని లక్షలు ఆఫర్ చేసినా.. పర్సనల్ సీక్రెట్ లీక్ఆ ఇద్దరి వల్లే జబర్ధస్త్ మానేసిన అనసూయ: అన్ని లక్షలు ఆఫర్ చేసినా.. పర్సనల్ సీక్రెట్ లీక్

    లాస్యకు క్లాస్.. వాళ్ల ప్రయత్నం

    లాస్యకు క్లాస్.. వాళ్ల ప్రయత్నం

    నందూ నిజం చెప్పగానే లాస్య 'గంటలో వస్తానని చెప్పింది. అందుకే ఓకే చెప్పాను' అని అంటుంది. దీంతో తులసి 'నోర్మూయ్.. నా పిల్లల విషయంలో కల్పించుకోవడానికి నువ్వెవరు? అసలు ఏ ఉద్దేశంతో తనను పంపించావు' అంటూ ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతుంది. మరోవైపు, దివ్యను ఎక్కించుకున్న ఫ్రెండ్స్ కారును రూట్ మార్చి కారును తీసుకెళ్తుంటారు. తను కిందకు దిగేందుకు ప్రయత్నించినా అడ్డుకుంటారు. ఇక, ఇంట్లో వాళ్లు పార్టీ ఎక్కడో చెప్పిందా అని లాస్యను అడుగుతారు. దీనికామె పార్టీ లొకేషన్ పంపింది అని దాన్ని ప్రేమ్‌కు షేర్ చేస్తుంది. దీంతో తులసి, నందూ, ప్రేమ్‌లు దివ్య కోసం వెళ్తారు.

    English summary
    Intinti Gruhalakshmi Episode 847: Divya Lands in Danger As Her Friends Spike her Drink at The party. Then Tulasi Fires on Lasya About This.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X