For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: లాస్య వల్ల పరువు పోగొట్టుకున్న నందూ.. కోడళ్లపై తులసి సీరియస్

  |

  భారతదేశంలోని మిగిలిన భాషలతో పోలిస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అభి తాకట్టు పెట్టిన నగలు అభి విడిపించకపోవడంతో తులసి భయపడుతుంది. అంతేకాదు, అప్పటి వరకూ తన నగలు వాడుకోమని చెబుతుంది. ఇక, లాస్య కావాలనే శృతితో గొడవకు దిగుతుంది. దీంతో ఇద్దరి మధ్య డిస్కర్షన్ జరుగుతుంది. ఆ సమయంలో నందూ మళ్లీ తులసిని పెళ్లి చేసుకుంటాడేమో అని అంటుంది శృతి. దీంతో లాస్య నందూ ముందర ఓవర్ యాక్షన్ చేస్తూ అతడికి లేనిపోనివి చెప్పి రెచ్చగొడుతుంది. ఆ తర్వాత అతడు శృతిపై గొడవకు దిగుతాడు. దీంతో ప్రేమ్ ఎంట్రీ ఇచ్చి తండ్రితో వాదన పెట్టుకుంటాడు.

  దారుణమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు

  తులసిపై నందూ నిందలు.. గొడవతో

  తులసిపై నందూ నిందలు.. గొడవతో

  లాస్య చెప్పిన మాటలు విని గొడవ పడేందుకు వచ్చిన నందూ.. 'నీ పిల్లలను పెంచిన విధానం ఇదేనా? నీ పిల్లలను నా మీదికి ఉసికొల్పుతున్నావా?' అంటూ తులసిపై ఫర్ అవుతాడు. అప్పుడు అనసూయ ఎందుకురా అలా నిందలు వేస్తున్నావు అని అంటుంది. దీనికతడు 'ఎవరు ఏమన్నారో చూశావు కదా. ప్రతి ఒక్కరికి లాస్యను ఎగతాళి చేయడం తమాషా అయిపోయింది' అంటాడు. దీనికి తులసి 'నిజంగానే నేనలా అనుకోవాలనుకుంటే లాస్య ఇప్పటి వరకు ఇక్కడ ఉండేదే కాదు. ఈ ఇంట్లో ఉండేదే కాదు' అంటూ సమాధానం చెప్పడంతో గొడవ పెరుగుతుంది.

   తులసి మాటలు పట్టించుకోని నందూ

  తులసి మాటలు పట్టించుకోని నందూ

  లాస్య రెచ్చగొట్టగానే వచ్చి గొడవకు దిగిన నందూతో 'లాస్యను శత్రువుగా చిత్రీకరించడం వల్ల నాకొచ్చే లాభం ఏంటి? నేను మంచిదాన్ని అని నిరూపించుకోవడానికి ఇంకొకరిని తక్కువ చూపించి పేరు తెచ్చుకోవాల్సిన అవసరం నాకు పట్టలేదు. అలాంటి అవసరమే నాకు ఉంటే.. ఈరోజు ఈగతి నాకు పట్టేదే కాదు' అంటుంది. కానీ, ఆమె ఏం చెప్పినా నందూ మాత్రం అస్సలు పట్టించుకోడు. పైగా 'నువ్వు ఒక భార్యగా గెలిచి ఉండొచ్చు.. ఒక కోడలుగా గెలిచి ఉండొచ్చు కానీ ఒక తల్లిగా నువ్వు ఓడిపోయావు. ఈ విషయం నీకూ తెలుసు. నువ్వు ఒప్పుకో' అంటాడు నందూ.

  ముక్కు అవినాష్‌కు షాకిచ్చిన ఛానెల్: జబర్ధస్త్ మానేసి వస్తే.. వీళ్లు కూడా పక్కన పెట్టేశారంటూ!

  పిల్లలు దారి తప్పారని అన్న నందూ

  పిల్లలు దారి తప్పారని అన్న నందూ

  తులసిపై నిందలు వేసే క్రమంలో పిల్లలను కూడా తప్పుబడతాడు నందూ. దీంతో 'తల్లిగా ఓడిపోయానంటే నేను ఒప్పుకోను. తల్లిగా నేను నా పిల్లలకు 100 శాతం అందిస్తున్నాను. గుండెల్లో పెట్టుకొని పెంచుకుంటున్నాను. కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను. ఇన్నాళ్లుగా నా జీవితంలో తల్లిగా మాత్రమే పరిపూర్ణమైన తృప్తిని పొందుతున్నాను' అంటుంది తులసి. దీనికి నందూ 'ప్రేమగా జోల పాట పాడినంత మాత్రాన నువ్వు తల్లివైపోవు. వాళ్లు అడిగింది కొనిచ్చినంత మాత్రాన.. నువ్వు తల్లివైపోవు. తల్లి బాధ్యత అంటే పిల్లలు దారితప్పకుండా చూడాలి' అంటాడు.

   అభి బండారం బయటపెట్టిన తండ్రి

  అభి బండారం బయటపెట్టిన తండ్రి

  ఈ గొడవలో తల్లిగా నువ్వు నిలదీసేంత తప్పు తులసి ఏం చేసిందిరా అంటూ అనసూయ ప్రశ్నిస్తుంది. దీనికి నందూ తన కొడుకు అభి బండారాన్ని బయట పెడతాడు. 'నీ పెద్ద కొడుకు అభి.. అంకితకు తెలియకుండా ఎంత అప్పు చేశాడో తెలుసా? చివరకు తన పెళ్లాం మెడలోని నగలు కూడా తాకట్టు పెట్టాడు. చెప్పు తులసి.. నేను వేసింది నిందా నిజమా? ఆ విషయం తెలిసి కూడా ఇంతవరకు వాడిని నువ్వు నిలదీయలేదు. కనీసం ఆ విషయం తండ్రిని అయిన నాకు చెప్పలేదు. ఇదేనా పిల్లలను పెంచడం అంటే' అని అందరి ముందే ఆమెను నిలదీస్తాడు నందూ.

  నా బాడీలో అవి అంటేనే ఇష్టం: నెటిజన్ వింత ప్రశ్నకు శృతి హాసన్ ఊహించని జవాబు

  ప్రేమ్‌ను కూడా తప్పుబట్టిన నందూ

  ప్రేమ్‌ను కూడా తప్పుబట్టిన నందూ

  అభి గురించి అయిపోయిన తర్వాత నందూ.. ప్రేమ్ గురించి చెప్తాడు. 'నీ రెండో కొడుకు ప్రేమ్.. తండ్రికే మాటకు మాట సమాధానం చెప్పేంత గొప్పగా పెంచావు. వీడికి నీ వెనుకే తిరుగుతూ నీ భజన చేయడం తప్ప.. లైఫ్‌లో ఏం చేయాలి అని ఆలోచించాడా?' అని ప్రశ్నిస్తాడు. దీనికి ప్రేమ్ 'మీరు అన్యాయం చేశారని నేను అమ్మకు అన్యాయం చేయలేను' అంటాడు. అప్పుడు నందూ 'మీ అమ్మకు ఓపిక ఉన్నంత కాలం మీ అమ్మ చుట్టూ తిరుగుతావు. ఆ తర్వాత నీ బతుకు ఏంట్రా? ఎదగాలి కదా. ఇదేనా తల్లిగా నువ్వు ప్రేమ్‌లో కోరుకునేది. వాడి భవిష్యత్తు ఏంటో చూసుకోవద్దా?' అంటాడు. ఆ తర్వాత దివ్య చదువు గురించి కూడా నిందిస్తాడు నందూ.

   తులసిని ఒప్పించడంతో ఏడుస్తూనే

  తులసిని ఒప్పించడంతో ఏడుస్తూనే

  పిల్లలందరినీ ప్రస్తావిస్తూ నిందించిన తర్వాత నందూ 'ఇప్పుడు చూశావు కదా. మాట అన్నందుకు నా మీద ఎలా విరుచుకుపడుతున్నారో. నీ గారాబం వల్లే ఇలా పిల్లలు పనికిరాకుండా అయ్యారు. ఇప్పుడు చెప్పు తులసి.. తల్లిగా నువ్వు ఓడిపోయావా లేదా? ఒప్పుకో తులసి.. ఒప్పుకో' అని బలవంత పెడతాడు నందూ. దీంతో ఆమెకు ఏం చేయాలో అర్థం కాదు. వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది తులసి. అప్పుడు ప్రేమ్ 'పొరపాటు చేస్తున్నారు నాన్న. లాస్య దృష్టిలో గొప్పగా కనిపించాలని అమ్మను తక్కువ చేసి మాట్లాడారు. ఆ తర్వాత మీరే బాధపడతారు. పశ్చాతాపపడతారు' అని అంటాడు.

  Bigg Boss OTT: షోలోకి అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్ ఎంట్రీ.. రెండోసారి ఆఫర్ పట్టేసిన టాలీవుడ్ హీరో
  l

  తులసి బాధగా.. పరందామయ్య ఫైర్

  తులసి బాధగా.. పరందామయ్య ఫైర్


  ఏడుస్తూ లోపలికి వెళ్లిన తులసి 'నా పిల్లలు బాగుపడటం.. నా మీద ఆధారపడకుండా వాళ్ల బతుకు వాళ్లు బతకడం ముఖ్యం. నా గారాబంతో వాళ్లను చెడగొట్టుకోకూడదు. దేవుడు నాకు ఎక్కువ టైమ్ ఇవ్వలేదు. ఏం చేయాలనుకున్నా వెంటనే చేయాలి' అని అనుకుంటుంది. ఆ తర్వాత పరందామయ్య.. నందూను నిలదీస్తాడు. 'లాస్యను సపోర్ట్ చేస్తూ మాట్లాడటం మొదలుపెట్టి చేతగాక తులసి మీద నిందలు వేసి పారిపోయావు. పిల్లల మీద నీ పరువు తీయకూడదని తులసి నీ గురించి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయింది' అని అంటాడు.

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
   నువ్వు కూడా ఓడిపోయావురా అంటూ

  నువ్వు కూడా ఓడిపోయావురా అంటూ

  ఆ తర్వాత పరందామయ్య 'తల్లిగా తులసి ఓడిపోయింది అంటే.. తండ్రిగా నువ్వు ఓడిపోయినట్టేరా. పిల్లల ముందే నువ్వు ఇంకో ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. ఇలాంటి తండ్రిని చూసి పిల్లలు ఏం నేర్చుకోవాలిరా? కేవలం లాస్యను సంతోషపెట్టి నీ అధికారం చూపించుకోవడానికి మాట్లాడటం కాదు. నీ పెద్ద కొడుకు కేసులో ఇరుక్కున్నప్పుడు ఆరాటపడి కాపాడుకుంది ఎవరు? నువ్వా తులసా? నీ రెండో కొడుకు ప్రేమను గెలిపించింది ఎవరు? నీ కూతురును ఎవరో కిడ్నాప్ చేసినప్పుడు ఈ కొడుకు ఏమయ్యాడు? ఎక్కడికి పోయాడు? ఇప్పుడు చెప్పు పిల్లల పట్ల బాధ్యత లేనిది ఎవరికి?' అంటూ నిలదీస్తాడు. ఆ తర్వాత తులసి ఇద్దరు కోడళ్లపై సీరియస్ అవుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 535: Nandhu Fired on Tulasi about her Responsibllities. Then Parandamaiah Anger on His Son.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X