Intinti Gruhalakshmi Today Episode: దివ్యపై అత్యాచారయత్నం.. నిజం చెప్పిన వాచ్‌మన్.. ఫోన్ సహాయంతో!

తరాలు మారుతూ ఉన్నా.. కొత్త కాన్సెప్టులతో షోలు వస్తున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసికి అబద్ధం చెప్పిన దివ్య.. లాస్య సహాయంతో ఫ్రెండ్ ఇంట్లో పార్టీకి వెళ్తుంది. అక్కడ ఇద్దరు కుర్రాళ్లు ఆమెకు డ్రింక్‌లో మత్తు మాత్రలు వేసి తాగిస్తారు. దీంతో దివ్యకు మత్తుగా ఉంటుంది. ఇక, తను ఎంత సేపటికీ రాకపోవడంతో ఇంట్లో వాళ్లు టెన్షన్ పడుతుంటారు.

అప్పుడు లాస్య ద్వారా నిజం తెలుసుకున్న నందూ.. దివ్య పార్టీకి వెళ్లిందన్న నిజాన్ని ఇంట్లో వాళ్లకు చెబుతాడు. దీంతో లాస్యపై తులసి ఓ రేంజ్‌లో ఫైర్ అవుతుంది. ఆ తర్వాత దివ్య తనకు లొకేషన్ పంపించిందని లాస్య ఇంట్లోని వాళ్లకు చెబుతుంది.

దివ్య కోసం వెతుకులాట మొదలు

దివ్య కోసం వెతుకులాట మొదలు

దివ్య గురించి నిజం తెలుసుకున్న తర్వాత తులసి.. అసలు దివ్య ఎక్కడికి వెళ్తుందో నీకు చెప్పిందా అని ప్రశ్నిస్తుంది. దీంతో లాస్య 'ఎందుకైనా మంచిదని లొకేషన్ పెట్టమంటే పెట్టింది' అంటుంది. దీంతో ప్రేమ్ దాన్ని తనకు ఫార్వర్డ్ చేయమంటాడు. ఆ వెంటనే తులసి, నందూ, ప్రేమ్‌లు దివ్యను వెతకడానికి బయలుదేరుతారు. మరోవైపు, దివ్యను చేతన్, కార్తీక్‌లు వాళ్ల కారులో తీసుకెళ్తూ ఉంటారు. ఆ సమయంలో ఆమెకు డౌట్ వచ్చి ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని ప్రశ్నిస్తుంది. దీంతో కార్తీక్ 'మీ ఇంటికే వెళ్తున్నాం. చీకటిగా ఉందిగా నీకు అర్థం కావట్లే' అంటాడు.

బ్రతిమాలినా వదిలిపెట్టిన కార్తీక్

బ్రతిమాలినా వదిలిపెట్టిన కార్తీక్

ఇంటికి తీసుకెళ్తామని చెప్పి కారును వేరే రూట్‌లో తీసుకు వెళ్తుండడంతో దివ్యకు డౌట్ ఇంకా పెరుగుతుంది. దీంతో 'కార్తీక్ అసలు మీరు మా ఇంటికే కారు తీసుకెళ్తున్నారా? ఆ చేతన్ గాడికి మా ఇంటి అడ్రెస్ తెలుసు కదా. మరి ఎటు తీసుకెళ్తున్నాడు' అని ప్రశ్నిస్తుంది. అంతేకాదు, కారు ఆపమంటుంది.

దీంతో కార్తీక్ 'మనం ఫ్రెండ్స్ కదా. ఎంజాయ్ చేద్దాం. కాసేపు అలా బయట తిరుగుదాం' అంటాడు. అప్పుడు దివ్య 'నన్ను చీట్ చేస్తున్నారా.. కారు ఆపండి.. హెల్ప్ హెల్ప్' అంటూ గట్టిగా కేకలు వేస్తుంటుంది. దీంతో పక్కనే కూర్చున్న కార్తీక్ ఆమె అరవడకుండా నోరు మూస్తాడు.

దివ్య గురించి చెప్పిన వాచ్‌మన్

దివ్య గురించి చెప్పిన వాచ్‌మన్

లాస్య ఇచ్చిన లొకేషన్ ప్రకారం తులసి, ప్రేమ్ కలిసి దివ్య ఫ్రెండ్ పార్టీ జరిగిన ప్రదేశానికి వస్తారు. అప్పుడు వాళ్లు వాచ్‌మన్‌ను ఆ గెస్ట్ హౌస్ గురించి అడుగుతారు. అప్పుడతను 'ఈ గెస్ట్ హౌస్ మా చిన్నమ్మగారిది. ఇవాళ ఆమె పుట్టినరోజు పార్టీ జరిగింది. కొద్ది సేపటి క్రితమే అందరూ వెళ్లిపోయారు' అని అంటాడు. అప్పుడు తులసి వాళ్లు దివ్య ఫొటోను అతడికి చూపిస్తారు.

దీంతో వాచ్‌మన్ 'ఈ అమ్మాయి అందరి కంటే చివర్లో వెళ్లింది. కొద్దిగా మత్తులో ఉంది. ఇద్దరు కుర్రాళ్లు తనను ఒక కారులో తీసుకుని వెళ్లారు' అంటాడు. దీంతో ప్రేమ్ 'వాళ్లు ఎవరు? కారు నెంబర్ చూశావా' అని అడుగుతాడు. దీనికి వాచ్‌మన్ చూడలేదు అని సమాధానం చెప్తాడు. ఇంతలో నందూ అక్కడకు వస్తాడు. అతడికి విషయం చెప్తారు. ప్రేమ్ పోలీస్ కంప్లైంట్ ఇద్దామంటే తులసి మాత్రం వద్దంటుంది.

దివ్యకు అబద్ధం చెప్పిన కార్తీక్

దివ్యకు అబద్ధం చెప్పిన కార్తీక్

తనను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని దివ్య కంగారు హెల్ప్ హెల్ప్ అంటూ గట్టిగా కేకలు వేస్తుంటుంది. అప్పుడు కార్తీక్ 'దివ్య అరవకు.. నిన్ను మీ ఇంటి దగ్గర దింపాలి అంతే కదా.. సరదాగా ఫ్రెండ్ షిప్‌తో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాం. ఇష్టం లేకపోతే వద్దులే' అంటాడు.

ఆ తర్వాత కారు డ్రైవ్ చేస్తున్న కుర్రాడితో దివ్య వాళ్ల ఇంటి దగ్గరికి కారును తీసుకెళ్లు అంటాడు. అప్పుడు దివ్య వాళ్లతో 'మా ఇల్లు వచ్చేసిందా అని అడుగుతుంది. దీంతో కార్తీక్ కనిపిస్తోంది కనిపిస్తోంది అంటాడు. అయినా కూడా దివ్యకు మాత్రం ఇంకా వాళ్ల తీరుపై డౌట్ వస్తూనే ఉంటుంది.

నందూ చెప్పిన విషయానికి షాక్

నందూ చెప్పిన విషయానికి షాక్

ఇక, ఇంట్లో వాళ్లందరూ దివ్య గురించి ఏమీ తెలియకపోవడంతో టెన్షన్ పడుతూ కూర్చొంటారు. ఆ సమయంలో అనసూయ ఏడుస్తుంటే పరందామయ్య ఓదార్చుతాడు. అప్పుడామె 'నాకెందుకో భయంగా ఉంది. ఇన్ని సార్లు ఫోన్ చేశాం. కనీసం క్షేమంగానే ఉన్నాను అని ఎవరికైనా మెసేజ్ అయినా పెట్టాలి కదా' అంటుంది. అప్పుడు లాస్య 'ఎందుకు టెన్షన్ పడుతున్నారు.. దివ్య వెళ్లింది బర్త్ డే పార్టీకే కదా.

దివ్య నందూ వాళ్లతోనే ఉండొచ్చు.. వెంటనే ఫోన్ చేస్తా ఆగండి' అని నందూకు కాల్ చేయగా కుర్రాళ్లు కారుతో తీసుకెళ్లిన విషయం చెప్తాడు. దీంతో అంతా షాక్ అవుతారు. దీంతో లాస్య పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు కదా అంటుంది. అప్పుడు నందూ తులసి వద్దంది అని చెప్తాడు. దీంతో లాస్య 'నీ ఫ్రెండ్ రామారావు పోలీస్ కదా. ఆయన హెల్ప్ తీసుకో' అనగానే నందూ ఓకే అంటాడు.

నీ పరువు కూడా పోతుంది అని

నీ పరువు కూడా పోతుంది అని

ఇక, దివ్యను కార్తీక్, చేతన్‌లు కలిసి చివరికి తమ రూమ్‌కు తీసుకొస్తారు. దీంతో ఆమె ఏడుస్తుంది. అప్పుడు కార్తీక్ 'పిచ్చి దానిలా ఏడుపు ఏంటి దివ్య. అస్సలు బాగోలేదు. నువ్వు ఇంకా బావిలో కప్పలా ఉన్నవు. మారాలి. చూడు.. అరిస్తే నష్టం మాకే కాదు. నీకు కూడా. నీ పరువు కూడా పోతుంది. పర్లేదా? చిన్న విషయాన్ని అరిచి గగ్గోలు పెట్టి పెద్ద చేస్తున్నావు' అంటాడు. దీంతో చేతన్ 'అరేయ్ కార్తీక్.. తప్పు చేస్తున్నాం అనిపిస్తోందిరా. దివ్యను వదిలేద్దాంరా' అంటాడు. దీనికతడు 'ప్లాన్ చేసింది వదిలేయడానికా? నువ్వు బయటకు వెళ్లి కాపలా ఉండు' అని పంపిస్తాడు.

జీపీఎస్ ట్రాకర్‌తో వెతుకులాట

జీపీఎస్ ట్రాకర్‌తో వెతుకులాట

ఎంత వెతికినా దివ్య దొరకకపోవడంతో తులసి 'కంటికి రెప్పలా కాపాడుకుంటే.. ఈరోజు అబద్ధం చెప్పి మోసపోయింది' అంటుంది. ఇంతలో ప్రేమ్‌కు శృతి ఫోన్ చేయగా.. తులసికి జీపీఎస్ గురించి గుర్తొస్తుంది. అప్పుడామె ప్రేమ్‌తో 'దివ్య ఫోన్‌ను బట్టి తను ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు కదా. జీపీఎస్ యాప్ ఉంటుంది కదా' అని అంటుంది. దీంతో అతడు 'టైమ్‌కు భలే గుర్తు చేశావు అమ్మా. మొన్నే దివ్య జీపీఎస్ యాప్ డౌన్‌లోడ్ చేసింది. నా మొబైల్ నుంచి జీపీఎస్ ద్వారా ట్రాక్ చేయొచ్చు' అంటూ వెంటనే దివ్య మొబైల్‌ను ట్రాక్ చేస్తాడు. దానిబట్టి ఇద్దరూ వెళ్తారు. ఇక, దివ్య తప్పించుకోవాలని చూడగానే కార్తిక్ పట్టుకుని ఆమెను లవ్ చేస్తున్నానని, ఎలాగైనా ఎంజాయ్ చేయాలని అనుకున్నానని చెప్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X