India
  For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: తులసికి మాట ఇచ్చిన నందూ.. పండుగ ముందు లాస్యకు కోలుకోలేని షాక్

  |

  దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

   శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. లాస్య మాటలకు రెచ్చిపోయిన నందూ.. తులసి మీద గొడవ పడుతాడు. ఆమెకు పిల్లల్ని పెంచడం రాదని, అందుకే వాళ్లు బాధ్యత లేకుండా తయారయ్యారని అంటాడు. అంతేకాదు, అభి అప్పుల గురించి కూడా అందరి ముందే బయటపెడతాడు.

  ఆ తర్వాత ప్రేమ్‌తో సైతం గొడవకు దిగుతాడు. దీంతో తులసి ఏడుస్తూ లోపలికి వెళ్లిపోతుంది. ఆ తర్వాత పరందామయ్య నందూను పిలిచి బుద్ది వచ్చేలా మాట్లాడతాడు. దీంతో నందూ సిగ్గుపడతాడు. ఆ తర్వాత తులసి, తన కోడళ్లు ఇద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది.

  నా బాడీలో అవి అంటేనే ఇష్టం: నెటిజన్ వింత ప్రశ్నకు శృతి హాసన్ ఊహించని జవాబు

  పిల్లల గురించి తులసి కీలక నిర్ణయం

  పిల్లల గురించి తులసి కీలక నిర్ణయం

  ఇంట్లో జరిగిన గొడవలో నందూ.. తులసిని తల్లిగా ఓడిపోయావంటూ ఘోరంగా అవమానిస్తాడు. దీంతో తులసి ఏడుస్తూ ఇకపై పిల్లలు తనపై ఆధారపడకుండా.. ఎవరి పనులు వాళ్లు చేసుకోవాలని అనుకుంటుంది. అప్పుడే భాగంగానే సంక్రాంతి పండుగకు ఏమేం కావాలని కోడళ్లు శృతి, అంకిత ఆమెను అడుగుతారు.

  దీంతో తులసి వాళ్లపై సీరియస్ అవుతూ.. 'నేను లేకుంటే చేయరా.. పండక్కి ఏం కావాలి అనేది మీరే చూసుకోండి. నేను లేకపోతే ఏం చేస్తారు. సరుకులు మీరే తీసుకొచ్చి అన్ని పనులు మీరే దగ్గరుండి చేయాలి' అని వాళ్లపై కేకలు వేసేస్తోంది.

  తులసి దగ్గరకొచ్చి మాట్లాడిన నందూ

  తులసి దగ్గరకొచ్చి మాట్లాడిన నందూ

  అప్పుడు అనసూయ అడగ్గా 'పిల్లలు ఇంకా నా మీదనే ప్రతి పనికి ఆధారపడుతున్నారు' అంటూ చాలా బాధపడుతూ ఉంటుంది తులసి. అదే సమయంలో నందూ అన్న మాటలు గుర్తొచ్చి ఇంకా బాధపడుతుంది. ఇంతలో నందూ అక్కడికి వచ్చి.. తులసి నీతో మాట్లాడుదామని వచ్చాను అంటాడు.

  దీనికామె 'నాతో మాట్లాడడానికి మీ భార్య పర్మిషన్ తీసుకొని వచ్చారా? లేక చెప్పి వచ్చారా? నేను మీ గురించి టెన్షన్ పడటం లేదు. నా గురించి.. నా పిల్లల గురించి ఆలోచిస్తున్నారు' అని అంటుంది. దీంతో అతడు నా మీద కోపంగా ఉందా అని తులసిని అడుగుతాడు.

  Priyanka Chopra: సీక్రెట్‌గా తల్లైన ప్రియాంక చోప్రా.. అందరినీ సర్‌ప్రైజ్ చేస్తూ సంచలన ప్రకటన

  తులసికి సహాయం చేస్తానన్న నందూ

  తులసికి సహాయం చేస్తానన్న నందూ

  తులసి మాటలకు నందూ 'నిన్న పిల్లల ముందు అవమానించాను కదా' అంటాడు. దీనికామె 'పాతికేళ్ల పాటు సంసారం చేసిన బంధం మనది. మీకు అనే హక్కు ఉంది. దీనికే నేను బాధ పడను. నా జీవితంలో ఇంతకంటే పెద్దవే జరిగాయి కదా' అంటుంది. అప్పుడు నందూ 'నేను ఆవేశంతో మాట్లాడానేమో కానీ, నిజమే మాట్లాడాను. ఎందుకంటే పిల్లలు దారితప్పుతారేమోనని అలా అన్నాను. నువ్వు పిల్లల విషయంలో నా నుంచి నీకు ఎలాంటి సాయం కావాలన్నా అడుగు. పిల్లలతో నువ్వు బాగా ఉండు. అలా అరిచేయకు తులసి' అంటూ సర్దిచెబుతాడు.

  అంకిత, శృతి సహాయం చేసిన తులసి

  అంకిత, శృతి సహాయం చేసిన తులసి

  ఇదిలా ఉండగా.. తులసి కోపంతో ఆర్డర్ వేసే సరికి అంకిత, శృతి కలిసి సంక్రాంతికి కావాల్సిన సరుకుల లిస్టు రాస్తూ ఉంటారు. ఏం సరుకులు కావాలి.. అది కావాలి ఇది కావాలి అని లిస్టు రాస్తూ ఉంటారు. బెల్లం, నూనె, రవ్వ, పాయసం కోసం చక్కెర రాయి అని శృతి చెబుతూ ఉంటుంది.

  ఇంతలో తులసి వచ్చి ఏమైంది లిస్టు రాయడం పూర్తయిందా అని అడుగుతుంది. అప్పుడు 'సరుకుల లిస్టు రాయడం ఇలా కాదు.. ఇలా రాస్తే ఏదో ఒకటి మరిచిపోతాం. అందుకే ఉదయం లేచినప్పటి నుంచి ఏ పనులు చేస్తామో వాటిని రాయాలి' అంటూ ఓ లిస్టు తీసుకొచ్చి ఇస్తుంది.

  దారుణమైన ఫొటోలతో షాకిచ్చిన అమలా పాల్: ఆమెను ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు

  అనసూయకు కూడా చెప్పిన తులసి

  అనసూయకు కూడా చెప్పిన తులసి

  అప్పుడే అనసూయ అక్కడకు వచ్చి తులసితో 'అయిందా? కోడళ్లకు పని చెప్పడం పూర్తయిందా తులసి' అని అడుగుతుంది. దీంతో తులసి 'వాళ్లకు కూడా బాధ్యత తెలియాలి కదా. ఈరోజంటే నేను ఉన్నాను.. రేపు అనే రోజు నేను లేకుంటే ఇక పండుగలు చేసుకోరా? అందుకే వాళ్లపై అరిచాను. మీరు కూడా మీ మందులు ఎప్పుడు వేసుకోవాలో అన్నీ ఇక నుంచి మీరే చూసుకోవాలి' అని చెబుతుంది. దీంతో అందరూ ఆలోచనలో పడతారు. ఇంతలో లాస్య వచ్చి 'అత్తయ్య నాకు ఏదైనా పని చెప్పండి' అని అడుగుతుంది. కానీ, వాళ్లు మాత్రం ఏమీ చెప్పరు.

  తులసిని వెళ్లమన్న లాస్యకు బిగ్ షాక్

  తులసిని వెళ్లమన్న లాస్యకు బిగ్ షాక్

  ఎలాగైనా తులసిని దెబ్బకొట్టాలని అనుకుంటోన్న లాస్య 'తులసి.. నువ్వు ఈ పండుగ సమయంలో కొన్ని రోజులు మీ పుట్టింటికి వెళ్లిరా' అంటుంది. అప్పుడు తులసి 'నా గురించి నువ్వు అంత బాధపడాల్సిన అసవరం లేదు. అయినా రేపు పూజ చేయబోతోంది నువ్వు కాదు. మన తర్వాతి తరం కోడళ్లు. ఈ ఇంటికి నువ్వు కోడలుగా రాలేదు.

  అత్తగా వచ్చావు' అని చెబుతుంది. దీంతో లాస్య షాక్ అవుతుంది. అప్పుడు 'అత్తయ్య నువ్వు నాకు మాటిచ్చావు కదా.. మళ్లీ ఇలా చేశారేంటి? మీరిద్దరూ కలిసి నన్ను మోసం చేస్తారా?' అని చెప్పి వెంటనే నందూ దగ్గరికి వెళ్తుంది లాస్య.

  ముక్కు అవినాష్‌కు షాకిచ్చిన ఛానెల్: జబర్ధస్త్ మానేసి వస్తే.. వీళ్లు కూడా పక్కన పెట్టేశారంటూ!

  నందూ కూడా లాస్యకు షాక్ ఇవ్వగా

  నందూ కూడా లాస్యకు షాక్ ఇవ్వగా

  నందూ దగ్గరకు వెళ్లిన లాస్య 'మన ఇంట్లో ధాన్యలక్ష్మి పూజను సంక్రాంతి రోజున చేస్తారు కదా. మరి ఆ పూజలో మనిద్దరం కూర్చోవాలి కదా. కానీ, ఈసారి కొత్త తరం కోడళ్లు అంకిత, శృతితో చేయిస్తారట' అని చెబుతుంది. దీనికి నందూ 'దాంట్లో తప్పేముంది? నువ్వు ఈ ఇంటికి కోడలుగా రాలేదు. కోడళ్లకు అత్తగా వచ్చావు. నాకు ఎదిగిన కూతురు ఉంది.

  ఇద్దరు కోడళ్లు ఉన్నారు' అని అంటాడు. నందూ కూడా తన మాట వినకపోయేసరికి ఈ పూజ ఎలాగైనా తనే చేసేలా చేయాలి అని అనుకుంటుంది లాస్య. ఆ తర్వాత రాములమ్మ ఇంటికి వస్తుంది. దీంతో ఆమెకు పని చెబుతారని అంతా అనుకుంటారు. కానీ, తులసి మాత్రం పిల్లలు, కోడలితోనే పనులన్నీ చేయించాలని అనుకుంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 536: Tulasi Serious on Shruthi and Ankitha. Then Nandhu Met and Spoke to Tulasi. After That Tulasi Gave Shock to Lasya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X