For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: దివ్యను అలా కాపాడిన తులసి.. వాళ్లకు రిక్వెస్ట్.. లాస్యకు షాక్

  |

  ఇండియాలోని చాలా భాషల్లో వస్తున్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే


  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్య గురించి నిజం తెలుసుకున్న తర్వాత ప్రేమ్, తులసి, నందూలు ఆమెను వెతుక్కుంటూ వెళ్తారు. అదే సమయంలో తన స్నేహితులు ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటారు. ఇక, లాస్యకు పంపిన లొకేషన్‌ ఆధారంగా తులసి, ప్రేమ్ అక్కడకు వెళ్లగా ఆమెను కారులో తీసుకెళ్లిన విషయం వాచ్‌మన్ చెప్తాడు. అనంతరం దివ్యను ఓ రూమ్‌లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసే ప్రయత్నం చేస్తారు. మరోవైపు, జీపీఎస్ ఆధారంగా దివ్య ఫోన్‌ను కనిపెట్టవచ్చని తులసి అనడంతో ప్రేమ్.. ఆ దిశగా ప్రయత్నం మొదలు పెడతాడు.

  హాట్ షోతో ఫిదా చేస్తోన్న ఆదా శర్మ: ఒంటి మీద బట్టలు నిలవట్లేదుగా!

  పోలీస్ సహాయం కోరిన నందూ

  పోలీస్ సహాయం కోరిన నందూ

  రూమ్‌లో దివ్య తనను వదిలేయమని కార్తీక్‌ను బ్రతిమాలుతుంది. కానీ, అతడు మాత్రం అస్సలు వినడు. అప్పుడు చేతన్ దివ్యను వదిలేద్దాం అంటాడు. దీంతో అతడిని బయటకు వెళ్లిపోమని అంటాడు. ఇక, తన స్నేహితుడైన పోలీస్ అధికారి రామారావును నందూ కలుస్తాడు. అప్పుడతను 'నా కూతురు దివ్య కనిపించడం లేదు. ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ఏదైనా జరగకూడనిది జరుగుతుందేమో అని భయంగా ఉందిరా' అంటాడు. దీంతో ఆ పోలీస్ 'నువ్వేమీ భయపడకు. ఆ నెంబర్ నాకు ఫార్వర్డ్ చెయ్. నేను కంట్రోల్ రూమ్‌కు పంపుతా. నువ్వు నా వెనకాలే ఫాలో అవ్వు' అంటాడు.

  చేతన్‌ను పట్టుకుని.. కార్తీక్ అలా

  చేతన్‌ను పట్టుకుని.. కార్తీక్ అలా

  దివ్య ఫోన్‌ జీపీఎస్‌ను ఆధారంగా చేసుకుని వెతుకున్న తులసి, ప్రేమ్ ఆమె ఉన్న ఇంటి దగ్గరకు చేరుకుంటారు. అంతలో చేతన్ బయటకు వస్తాడు. 'వీడు వద్దు వద్దు అని చెప్పినా వినట్లేదు. చాలా మొండోడిలా తయారయ్యాడు' అని అనుకుంటాడు. అంతలోనే ప్రేమ్ వాళ్లను చూసి 'వీళ్లు కచ్చితంగా దివ్య వాళ్లే అయి ఉంటారు' అని పారిపోతూ కింద పడిపోతాడు. దీంతో ప్రేమ్ అతడిని పట్టుకుని కొడతాడు. ఆ సమయంలోనే తులసి నేరుగా ఇంట్లోకి వెళ్తుంది. అప్పుడు దివ్య ఎంత బ్రతిమాలుతున్నా కార్తీక్ వదలడు. అంతేకాదు, ఆమెపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నం చేస్తాడు.

  Suhana Khan: అందాల ఆరబోతతో షారుఖ్ కూతురు రచ్చ.. షార్ట్ డ్రెస్‌లో యమ హాట్‌గా!

  కార్తీక్‌ను కొట్టి.. దివ్యను కాపాడేసి

  కార్తీక్‌ను కొట్టి.. దివ్యను కాపాడేసి

  తులసి లోపలికి వెళ్లే సరికి దివ్యపై అఘాయిత్యం చేయడానికి కార్తీక్ ట్రై చేస్తుంటాడు. అంతలో తులసి అక్కడే ఉన్న ఫ్లవర్ వాజ్‌ను తీసుకుని అతడి తలపై కొడుతుంది. దీంతో కార్తీక్ ఒక్కసారిగా కుప్పకూలుతాడు. ఆ వెంటనే దివ్య తులసి దగ్గరకు వచ్చి గట్టిగా పట్టుకుని ఏడుస్తుంటుంది. అప్పుడే చేతన్‌ను పట్టుకని వచ్చిన ప్రేమ్.. కార్తీక్‌ను కూడా పిచ్చ కొట్టుడు కొడతాడు. ఆ సమయంలో తమను వదిలేయమని కార్తీక్ తులసిని బ్రతిమాలుతుంటాడు. అప్పుడామె 'మా దివ్య కూడా నిన్ను అలాగే బ్రతిమాలి ఉంటుంది కదా. కానీ, వదిలిపెట్టావా' అంటూ అతడిపై సీరియస్ అవుతుంది.

  ఎన్‌కౌంటర్ చేయమన్న నందూ

  ఎన్‌కౌంటర్ చేయమన్న నందూ


  కార్తీక్‌కు తులసి క్లాస్ పీకుతోన్న సమయంలోనే నందూ అక్కడకు వస్తాడు. వచ్చీ రావడమే వాళ్లిద్దరినీ బాగా కొడతాడు. అంతేకాదు, తన పోలీస్ ఫ్రెండ్ రామారావును 'ఇంకా చూస్తున్నావు ఏంటి.. వాళ్లను ఏదైనా చేయ్.. ఇక్కడే ఎన్‌కౌంటర్ చేయ్' అంటాడు. అప్పుడాయన 'తొందరపడకు నందూ. వాళ్ల గురించి నేను చూసుకుంటానులే' అంటాడు. దీంతో వాళ్లిద్దరూ 'వద్దు సార్. మమ్మల్ని ఏం చేయకండి. మా మీద కేసు పెడితే మా జీవితం నాశనం అవుతుంది. ప్లీజ్ మేడమ్.. మీ కాళ్లు పట్టుకుంటాం' అని బ్రతిమాలతారు. అప్పుడు రామారావు వాళ్ల మీద కేసు పెట్టి చట్టప్రకారం లోపల వేస్తాం అంటాడు. దీంతో తులసి 'నా కూతురు పేరు బయటికి రాకూడదు' అని దివ్యను అక్కడి నుంచి ఇంటికి తీసుకుని వెళ్లిపోతుంది.

  పైట తీసేసి పచ్చిగా హీరోయిన్ ఫోజులు: ఉప్పొంగిన అందాలతో రెచ్చగొడుతూ!

  దివ్యకు ధైర్యం చెప్పిన తులసి

  దివ్యకు ధైర్యం చెప్పిన తులసి

  దివ్య క్షేమంగానే ఉందని తెలుసుకున్న ఇంట్లో వాళ్లు ఆమె కోసం ఎదురు చూస్తుంటారు. అప్పుడు అనసూయ దేవుడి దయ వల్ల దివ్య మనకు దక్కింది అని అంటుంది. దీనికి అంకిత 'కానీ.. దివ్య మళ్లీ నార్మల్ అవ్వడానికి చాలా టైమ్ పడుతుంది' అంటుంది. ఇంతలో దివ్యను తీసుకొని తులసి ఇంటికి వస్తుంది. ఆ సమయంలో దివ్య తులసిని అస్సలు వదిలి పెట్టదు. ఎవరిని చూసినా చాలా భయపడుతూ ఉంటుంది. అప్పుడామె 'మామ్.. నువ్వు నన్ను వదిలి వెళ్లకు. మనం లోపలికి వెళ్దాం మామ్' అంటుంది. అప్పుడు అనసూయ ఒకసారి దిష్టి తీస్తాను అన్నా కూడా ఎవరితో మాట్లాడదు. గదిలోకి వెళ్దాం అనగానే తులసి తీసుకెళ్తుంది. అప్పుడామె 'పడుకో అమ్మ.. ఏం కాలేదు. ఊరుకో. ఏడవకు. ఏం కాలేదు. ధైర్యంగా ఉండు. నా బిడ్డ ఎంత మంచిదో నాకు తెలుసు. అదంతా ఓ పీడకలలా మర్చిపో' అంటూ ఓదార్చుతుంది.

  ఇంట్లో వాళ్లకు తులసి రిక్వెస్టు

  ఇంట్లో వాళ్లకు తులసి రిక్వెస్టు

  తులసి ఎంత ఓదార్చినా తప్పు చేశానని దివ్య ఏడుస్తుంది. దీంతో తులసి 'ఎంత గొప్ప మనిషికి అయినా కొన్న బలహీనమైన క్షణాలు ఉంటాయి. అవి తట్టుకోవాలంటే ఖచ్చితంగా ఎంతో మానసిక స్థైర్యం ఉండాలి. ఎక్కువ ఆలోచించకు. చేసిన తప్పును గుర్తు పెట్టుకుంటే అది ఎప్పుడూ మనిషిని వెంటాడి బాధపెడుతూనే ఉంటుంది. బాగా అలసిపోయావు. తర్వాత మాట్లాడుకుందాం. డ్రెస్ మార్చుకొని రెస్ట్ తీసుకో' అని వెళ్లిపోతుంది. అప్పుడు నందూ ఆమెను దివ్య గురించి అడుగుతాడు. 'దివ్య చాలా బాధపడుతుంది. కాబట్టి మీ అందరికీ ఇదే నా రిక్వెస్ట్. దయచేసి ఈ విషయం గురించి తనతో చర్చించకండి' అంటుంది.

  శృతి మించిన హీరోయిన్ హాట్ షో: బట్టలున్నా లేనట్లే.. మొత్తం కనిపించేలా!

  లాస్యకు దిమ్మతిరిగే వార్నింగ్

  లాస్యకు దిమ్మతిరిగే వార్నింగ్

  అందరూ వెళ్లిపోగానే లాస్యను ఆపిన తులసి 'నువ్వు చేసింది చిన్న తప్పే కావచ్చు. కానీ, ఫలితం ఎంత దారుణంగా ఉందో చూశావా? నీ జీవితం నీ ఇష్టం. నాశనం చేసుకో. నాకు సంబంధం లేదు. కానీ, నా పిల్లల జోలికి వస్తే మాత్రం వదిలిపెట్టను. తాచుపాములా పడగ విప్పుతాను. దేవుడి దయవల్ల నా కూతురు క్షేమంగా బయటపడింది కాబట్టి నువ్వు క్షేమంగా ఉన్నావు. లేదంటే ఈ తులసిలో మరో రూపాన్ని చూసి ఉండేదానివి. ఇది నా ఆఖరి వార్నింగ్. ఇంకోసారి వార్నింగ్‌లు ఉండవు. గుర్తు పెట్టుకో' అని లాస్యకు వార్నింగ్ ఇస్తుంది. ఆ తర్వాత దివ్య రూమ్‌లోకి వెళ్లి మరోసారి ఓదార్చుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 849: Tulasi Saves Divya From her Friends and Gets Them Arrest. After That Tulasi Warns Lasya to Stay away From her Children.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X