Intinti Gruhalakshmi Today Episode: తులసి సహాయం తీసుకున్న నందూ.. ఇంట్లోని దరిద్రాన్ని పోగొట్టాలని!

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ ఇష్టం వచ్చినట్లు తిట్టి వెళ్లిపోయిన తర్వాత తులసి తన గదిలోకి వెళ్లి ఏడుస్తుంది. ఆ తర్వాత బయటకు వచ్చిన వెంటనే సరుకుల చీటీ రాసివ్వమన్న ఇద్దరు కోడళ్లపై సీరియస్ అవుతుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత నందూ వచ్చి ఆమెను కూల్ చేసే ప్రయత్నం చేస్తాడు. అనంతరం లాస్యను పూజలో ఉండొద్దని తులసి, అనసూయ అంటారు. దీంతో ఈ విషయాన్ని ఆమె నందూకు చెబుతుంది. కానీ, అతడు కూడా వాళ్ల మాటకే గౌరవిస్తాడు. అప్పుడు ఎలాగైనా పూజలో ఉండాలని లాస్య ప్లాన్ చేస్తుంది.

తులసి దెబ్బకు ప్రేమ్, అభికి కష్టాలు

తులసి దెబ్బకు ప్రేమ్, అభికి కష్టాలు

సంక్రాంతి పండుకు సమయం దగ్గర పడడంతో తులసి ఇంట్లో సంబరాలు చేయాలని అనుకుంటారు. అంతకు ముందే తులసి ఈ పనుల్లో తాను భాగం కానని చెబుతుంది. అంతేకాదు, అందరూ పనులు చేయాలని చెప్పి.. తలో వర్క్ చేయమని ఆదేశిస్తుంది. అప్పుడు అభి, ప్రేమ్‌కు ఇంట్లో బూజు దులపమని చెబుతుంది. దీంతో వాళ్లిద్దరూ ఇదే పెద్ద పనా అన్నట్లు కామెంట్ చేసి పనిలో దిగుతారు. కానీ, కాసేపు చేయగానే వాళ్లిద్దరికీ నడుము నొప్పి వస్తుంది. అప్పుడు ఇంత పని అమ్మ ఒక్కతే ఎలా చేస్తుందో ఏమో అని అనుకుంటారు. ఇదంతా చూసిన తులసి నవ్వుకుంటుంది.

మీరు మా నీడలా మారిపోయారు అని

మీరు మా నీడలా మారిపోయారు అని

ఇక, శృతి.. అంకిత పండుగ కోసం పిండి వంటలు రెడీ చేయడానికి సిద్ధం అవుతారు. దీనికంటే ముందు తులసి కాళ్లకు దండం పెట్టుకొని పని ప్రారంభిస్తారు. అప్పుడు తులసి ‘మీ ఇద్దరిని ఇలా చూస్తుంటే ఇక నాకు ఏమైపోయినా పర్వాలేదు అని అనిపిస్తోంది' అంటుంది. అప్పుడు అంకిత, శృతి ‘ఇన్నాళ్లు మీ నీడలా బతికాం. కానీ ఇప్పటి నుంచి మీరు మా నీడలా మారిపోయారు' అని అంటారు. ఆ తర్వాత గ్యాస్ స్టవ్‌కు పూజలు చేసి వెలిగించి పిండి వంటలు స్టార్ట్ చేస్తారు. వీళ్లిద్దరికీ పరందామయ్య, అనసూయ కూడా సహాయం చేస్తుంటారు. ఇలా పిండి వంటలు చేస్తారు.

నందూ టెన్షన్.. తులసిని అడగడంతో

నందూ టెన్షన్.. తులసిని అడగడంతో

ఇంట్లో వాళ్లంతా చేస్తున్న పనులు చూస్తూ ఉన్న తులసికి టెన్షన్ పడుతోన్న నందూ కనిపిస్తాడు. దీంతో తులసి ‘ఏమైంది ఈయనకు? ఎందుకు టెన్షన్ పడుతున్నాడు?' అని అనుకుంటుంది. అప్పుడు అతడి దగ్గరకెళ్లి ఏమైందని అడగ్గా.. తనకు సలహా కావాలని అడుగుతాడు. దీనికి తులసి ‘మీకు నేను భార్యగా ఉన్నన్నాళ్లు నన్ను ఎప్పుడూ సలహా అడగలేదు. ఇప్పుడేమో నా సలహాలనే మీరు అడుగుతున్నారు. మీకు విడాకులు ఇచ్చాక నాకు తెలివి పెరిగిందేమో అని అనుకున్నాను. మీరు లాస్యను సీరియస్‌గా తీసుకోండి' అంటూ ఏదేదో చెప్పబోతుంది.

తులసి ఐడియా.. అదిరిందన్న నందూ

తులసి ఐడియా.. అదిరిందన్న నందూ

ఐడియా అడిగిన నందూతో ‘సమస్య అడిగే ముందు ఒక విషయం గుర్తు పెట్టుకోండి. నేను చదువురాని మొద్దును. నా లెవల్‌కు తగ్గ సమస్య అయితేనే అడగండి. నేనేదో కక్ష సాధించడానికి అడగం లేదు. సమస్య ఏంటో అడగండి' అని అడుగుతుంది తులసి. దీనికతడు ‘నా కేఫ్‌కు సంబంధించిన విషయం. ఇవి పండుగ రోజులు కదా. ఈ సమయంలో బిజినెస్ డల్ అవుతుంది. ఈ సందర్భంలో కస్టమర్లను ఆకర్షించి బిజినెస్ పెంచుకోవడం కోసం ఏం చేయాలి' అని అడుగుతాడు. దీంతో తులసి సీరియస్‌గా ఆలోచిస్తూ ఒక ఐడియా చెప్పగా అదిరిందని అంటాడు.

 పండగ అంటేనే భయంగా ఉందంటూ

పండగ అంటేనే భయంగా ఉందంటూ

మరోవైపు.. పనులు చేసి కష్టపడిన అభి, ప్రేమ్ ‘ఇంతకుముందు పండుగ వస్తుందంటే హుషారుగా ఎగిరి గంతేసేవాళ్లం. ఇప్పుడు పండుగ పేరు చెబితేనే పారిపోవాలనిపిస్తోంది' అంటారు. ఇంతలో తులసి వచ్చి ‘ఏంటి అలా కూర్చున్నారు? భోగి మంటలకు కావాల్సిన పాత వస్తువులు అన్నింటినీ గార్డెన్‌లో పెట్టండి' అంటుంది. ఇక, తెల్లారగానే భోగి మంటలు వేయాడానికి అందరూ రెడీ అవుతారు. ఒక్కొక్కరుగా లేచి గార్డెన్ ఏరియాలోకి వస్తారు. ఆ తర్వాత పూజా చేసి మంట వెలిగిస్తారు. ఇక, దివ్య భోగి మంటలు ఎందుకు వెలిగిస్తారని తల్లిని అడుగుతుంది.

దరిద్రాన్ని బయటకు పంపించాలని

దరిద్రాన్ని బయటకు పంపించాలని

దివ్య అడిగిన ప్రశ్నకు తులసి సమాధానం చెబుతూ.. ‘ఇంట్లో ఉన్న దరిద్రాన్ని బయటికి పంపించడం కోసం ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు' అని చెబుతుంది. ఆ తర్వాత ‘ఈరోజు నుంచి ఎవరి ఆధారం లేకుండా మీ పనులు మీరు చేసుకుంటారని మొక్కుకొని భోగి మంటలు వెలిగించండి' అని చెబుతుంది. దీంతో భోగి మంటలను వెలిగిస్తారు. ఆ తర్వాత ఇక పండుగ పనులు పూర్తయ్యాయా అని అడిగిన ప్రేమ్, అభితో.. ‘అప్పుడేనా.. ఇప్పుడే మొదలయ్యాయి. పూలను దండలుగా చేసి ఇంట్లోని గుమ్మాలకు అమర్చాలి' అని చెబుతుంది తులసి.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
లాస్య రెడీగా... బాగున్నావన్న నందూ

లాస్య రెడీగా... బాగున్నావన్న నందూ

ఇక, ఉదయాన్నే లాస్య అందంగా రెడీ అవుతుంది. నందూ ఆమెను అలాగే చూస్తూ ఉండిపోతాడు. దీంతో ఏంటి అలా చూస్తున్నావు అని అడుగుతుంది. ‘అంత ముద్దొస్తున్నానా? కాంప్లిమెంట్ ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు కదా. నేను గర్ల్ ఫ్రెండ్‌గా ఉన్నప్పుడు నా అందాన్ని ఎప్పుడూ పొగుడుతుండేవాడివి. ఇప్పుడు మాత్రం మానేశావు. రోజూ ఉదయమే లేచి ఇలా అందంగా ముస్తాబు అయ్యేది నా కోసం కాదు.. నీ కోసమే. ఎప్పటికైనా నువ్వు నా అందాన్ని మెచ్చుకోకపోతావా అని' అని అంటుంది. దీంతో నందూ బాగున్నావ్ అని చెబుతాడు. అప్పుడు లాస్య ‘ఈరోజే బాగున్నానా? రోజూలా ఉన్నానా' అని ప్రశ్నిస్తుంది. దీనికి నందూ ‘రోజు బాగుంటావ్. ఈరోజు ఇంకా బాగున్నావ్' అంటాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X