Intinti Gruhalakshmi Today Episode: హగ్ చేసుకున్న నందూకు లాస్య షాక్.. తులసి ఐడియాతో కొత్త ప్లాన్

చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. పండుగ కోసం తన ప్రమేయం లేకుండానే ఏర్పాట్లన్నీ చేయాలని తులసి పిల్లలకు పనులను కేటాయిస్తుంది. వాటిని చాలా ఇబ్బంది పడుతూనే చక్కగా నిర్వర్తిస్తారు. ఇక, కేఫ్ గురించి టెన్షన్ పడుతోన్న నందూకు తులసి అదిరిపోయే ఐడియా ఇస్తుంది. దీంతో అతడు ఆమెను అభినందిస్తాడు.

ఇక, తర్వాతి రోజు తెల్లవారుజామునే భోగి మంటలు వెలిగించి అందరూ సంతోషంగా గడుపుతారు. మరోవైపు, లాస్య అందంగా రెడీ అవడంతో నందూ ఆమెను చాలా బాగున్నావంటూ కాంప్లిమెంట్ ఇస్తాడు. దీంతో ఆమె సంతోషంగా ఉంటుంది.

 హగ్ చేసుకున్న నందూకు లాస్య షాక్

హగ్ చేసుకున్న నందూకు లాస్య షాక్


చాలా అందంగా ఉన్నావని లాస్యను నందూ పొగుడుతోండగా ఈరోజు ఎపిసోడ్ ప్రారంభం అయింది. లాస్య అందాన్ని అభివర్ణించిన తర్వాత ఆమెతో సరసాలు ఆడుతుంటాడు. ఆ సమయంలో ఆమెను గట్టిగా హగ్ చేసుకుంటాడు. దీంతో ఆమె ‘వదులు నందూ.. చెమట వాసన వస్తుంది. ముందు వెళ్లి స్నానం చేసిరా' అంటూ సీరియస్‌గా తిట్టేసి వెళ్లిపోతుంది. అప్పుడు నందూ గతంలో ఇలాగే తులసిపై అరిచిన విషయాన్ని గుర్తు చేసుకుని బాధ పడతాడు. అంతేకాదు, ‘సారీ తులసి.. అప్పుడు నువ్వు ఎంత బాధపడి ఉంటావో ఇప్పుడు అర్థం అవుతుంది' అని అనుకుంటాడు.

తులసికి గట్టి వార్నింగ్ ఇచ్చిన లాస్య

తులసికి గట్టి వార్నింగ్ ఇచ్చిన లాస్య

మంచిగా రెడీ అయి హాల్ లోకి వెళ్లిన లాస్య తులసి దగ్గరకు వెళ్లి కావాలనే గొడవ పడుతుంది. దీంతో తన జోలికి రావొద్దని తులసి సీరియస్‌గా హెచ్చరిస్తుంది. అయినా వినకుండా ఏదేదో అనబోతుంది. కానీ, తులసి మాత్రం ఆమెను పట్టించుకోదు. అప్పుడు లాస్య ‘నేను నీ మొగుడిని లాక్కున్నాను అని నాకు దక్కాల్సింది దక్కకుండా చేస్తున్నావు కదా. నువ్వు తోడు గోడు లేని ఒంటరి ఆడదానివి. పూజకు పనికిరాని దానివి. నువ్వు ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా పండుగ పూజ చేసేది నేనే. ఏం చేస్తావో చేసుకో' అని చెప్పి లాస్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

లాస్యకు అలా ఝలక్ ఇచ్చిన నందూ

లాస్యకు అలా ఝలక్ ఇచ్చిన నందూ

తులసితో గొడవ పడి రూమ్‌లోకి వెళ్లగానే లాస్యకు రెడీ అయిన నందూ కనిపిస్తాడు. అతడిని సూట్‌లో చూసిన లాస్య ఒక్కసారిగా ఫ్లాట్ అయిపోతుంది. అంతేకాదు, అన్ని డ్రెస్సుల కన్నా.. నీకు సూట్ బాగా సూట్ అవుతుంది అని చెప్పి అతడిని హగ్ చేసుకుంటుంది. దీంతో నందూ వద్దంటూ ఆమెను దూరం జరుపుతాడు. దీనికి లాస్య ‘ఏంటి టిట్ ఫర్ టాటా.. ఇంతకుముందు నిన్ను దూరం పెట్టానని.. ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నవా' అని అడుగుతుంది. ఇంతలో నందూ ఏదో జ్యూస్ తాగబోతాడు. దీంతో లాస్య తాగొద్దు ఈరోజు మనం పూజ చేయాలి అంటుంది.

లాస్యకు హ్యాండిచ్చి వెళ్లిపోయిన భర్త

లాస్యకు హ్యాండిచ్చి వెళ్లిపోయిన భర్త

భార్య భర్తలం కలిసి పూజ చేయాలి కాబట్టి అది అయిపోయే వరకూ ఉపవాసం ఉండాలని నందూకు చెబుతుంది లాస్య. దీంతో అతడికి కోపం వస్తుంది. అప్పుడు ‘నన్ను అడగకుండా నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? అయినా నేను ఇంట్లో ఇవాళ ఉండలేను. నాదేమీ సాఫ్ట్‌వేర్ జాబ్ కాదు. నాది కెఫేలో జాబ్. నేను ఆఫీస్‌కు వెళ్తున్నాను' అని చెప్పి లాస్యకు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతాడు. దీంతో లాస్య తెగ గింజుకుంటుంది. అంతేకాదు, నందూ కెఫేకు వెళ్లాడని ఇంట్లో వాళ్లకు ఎలా చెప్పాలి అని తనలో తానే అనుకుంటుంది. కానీ, ఇదంతా దివ్య చాటుగా వినేస్తుంది.

 పిల్లలందర్నీ అభినందించిన తులసి

పిల్లలందర్నీ అభినందించిన తులసి

మరోవైపు.. ప్రేమ్, అభి, దివ్యలు కలిసి పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. తులసిని పిలిచి ‘అమ్మా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి' అని అడుగుతారు. దీనికి తులసి ‘ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి కానీ.. మీరు వృథా చేసిన పూలే ఎక్కువగా ఉన్నాయి. వృథా సంగతి పక్కన పెడితే పూజ ఏర్పాట్లు బాగా ఉన్నాయి' అని అందరినీ అభినందిస్తుంది. దీంతో అందరూ ఖుషీ అవుతారు. ఇంతలో పరందామయ్య, అనసూయ వస్తారు. అందరూ కలిసి సంతోషంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఇంతలో అంకిత, శృతి వస్తారు. ఆ తర్వాత అందరూ సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తారు.

రాములమ్మను దిష్ఠి తీయమన్న లాస్య

రాములమ్మను దిష్ఠి తీయమన్న లాస్య

అందరితో పాటే నందూ, లాస్య కూడా అక్కడకు వస్తారు. అప్పుడు లాస్య ‘రాములమ్మా.. మా జంటను చూసి కడుపు మండేవాళ్ల దిష్టి తగిలేలా ఉంది. మా ఇద్దరికి దిష్టి తీయి' అంటుంది. దీంతో ‘ఈ ఇంట్లో వాళ్లంత మంచి మనుషులు ఇంకెవరూ ఉండరమ్మ. మీకు ఏం కాదు. నిశ్చింతగా ఉండండి. అయితే గియితే అంకిత, శృతికి దిష్టి తగులుతుంది' అంటుంది రాములమ్మ.

ఆ తర్వాత దిష్టి తీయడానికి తులసి పర్మీషన్ అడుగుతుంది. దీంతో లాస్య ‘ఏంటి రాములమ్మా? దిష్టి తీయడానికి కూడా తులసి పర్మిషన్ కావాలా? చూశావా నందూ.. ఈ ఇంట్లో ఇలాంటి రూల్స్ కూడా ఉంటాయా' అంటుంది. అప్పుడు నందూ నేను కెఫెకు వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
ఐడియా చెప్పిన నందూకు ప్రశంసలు

ఐడియా చెప్పిన నందూకు ప్రశంసలు

ఎవరు ఏమనుకున్నా పూజ మాత్రం తానే స్వయంగా చేస్తానని లాస్య అనుకుంటుంది. ఆ తర్వాత అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక, కేఫ్‌కు వెళ్లిన నందూ.. ఓనర్ అయిన తన స్నేహితుడికి తులసి చెప్పిన ఐడియా గురించి వివరిస్తాడు. దీంతో అతడు చాలా బాగుందని అంటాడు. అప్పుడు నందూ ‘ఎందుకు బాగోదు.. తులసి ఇచ్చిన ఐడియా కదా' అని మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత కస్టమర్స్ కోసం నందూ వెయిట్ చేస్తుంటాడు. కానీ ఎవ్వరూ రారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X