Intinti Gruhalakshmi Today Episode: భాగ్య ఎంట్రీతో లాస్య ప్లాన్.. లెటర్ కనిపించడంతో ఇంట్లో రచ్చ
తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. దివ్యకు అన్న తినిపిస్తూ తులసి కొన్ని జాగ్రత్తలు చెబుతుంది. అలాగే, పిల్లల వల్ల తల్లిదండ్రులు ఎలా భయపడుతూ బతుకుతారు అనేది వివరిస్తుంది. దీంతో దివ్య ఇకపై ఎప్పుడూ తప్పు చేయనని తల్లికి హామీ ఇస్తుంది. అనంతరం తులసిలా మారాలనుకున్న లాస్య ఉదయాన్నే లేపమని రాములమ్మకు చెబుతుంది. దీంతో బకెట్ నీళ్లు కొట్టి లేపుతుంది. మరోవైపు, ఇక నుంచి ఇంట్లో వాళ్లకు ఏం కావాలన్న లాస్య గారే చేస్తారంట అని రాములమ్మ ఇంట్లో వాళ్లకు చెబుతుంది. చివర్లో శృతిని చూసి టెంప్ట్ అయిన ప్రేమ్.. ఆమెను హగ్ చేసుకుంటాడు.

లాస్యకు ప్రశ్న.. పబ్లిసిటీ కోసమే
తులసిలా గెటప్ వేసుకున్న లాస్య పనులు చేయడానికి ప్రయత్నిస్తుంది. దీంతో ఇంట్లో వాళ్లు ఆమెను తలో మాట అంటుంటారు. 'నువ్వు తులసిలా గెటప్ వేసుకున్నా.. తనలా మారలేవు' అంటారు. ఆ సమయంలోనే వాళ్లలో ఒకరు అసలు నువ్వు తులసిలా ఎందుకు మారావు అని ప్రశ్నిస్తారు. దీనికి లాస్య 'ఇన్నాళ్లూ నా అనుకున్న కుటుంబం కోసం కష్టపడుతూనే ఉన్నా.. కానీ పొగడాల్సిన నోళ్లు పొగడటం లేదు. ఎందుకంటే ఎవరికైనా ఒకరు నచ్చితే వాళ్ల పనులే కనిపిస్తాయి. నాకు తెలిసి వచ్చింది ఏంటి అంటే.. ఈ ఇంట్లో పనిచేయడం ఒక్కటే ముఖ్యం కాదు.. అందరికీ తెలియడం ముఖ్యం' అంటుంది.

పెర్ఫార్మెన్స్ నచ్చితే ఓట్ అని
ఆ తర్వాత కూడా లాస్య 'మన ఇంట్లో పని చేయడం కంటే పబ్లిసిటీ ముఖ్యం అని తెలుసుకున్నా. అందుకే ఉత్తమ ఇల్లాలుగా అందరి దృష్టిలో పడటానికి నా ప్రయత్నం నేను చేస్తున్నా. అందుకే ఇలా పనులు చేస్తున్నా. దయచేసి నన్ను ఆదరించండి' అంటూ వాళ్లకు సమాధానం చెబుతుంది. దీంతో పక్కనే ఉన్న దివ్య అంటే 'నా పెర్ఫామెన్స్ మీకు నచ్చినట్టు అయితే ఈ నెంబర్‌కి మిడ్స్ కాల్ చేయండి' అన్నట్టుగానా అంటూ వెటకారం ఆడుతుంది. ఆ తర్వాత కూడా ఇంట్లో వాళ్లు అందరూ లాస్యని తలోమాట అని హేళన చేస్తారు. దీంతో లాస్యకు కోపం వస్తూ ఉంటుంది. కానీ, మౌనంగా భరిస్తుంది.

లాస్యను అవమానించేసిన భర్త
ఇంట్లోని వాళ్లంతా అనే మాటలకు కోపాన్ని దిగమింగుకుని ఉన్న లాస్యను వెనుక నుంచి చూసి నందూ పొరబడతాడు. అప్పుడతను లాస్యను చూసి రాములమ్మ అనుకుని 'రాములమ్మా.. నీకు చెవులు పనిచేయడం లేదా? కాఫీ తీసుకుని రమ్మని చెప్పాను కదా' అని అంటాడు. అప్పుడు లాస్య అటు తిరిగే సరికి.. నందూ షాక్ అయిపోతాడు. దీంతో 'నువ్వా.. వెనకనుంచి చూసి పని మనిషి అనుకున్నా' అని అంటాడు. అప్పుడు తులసి 'పని మనిషి అనుకున్నారా' అని హేళన చేస్తుంది. దీంతో లాస్య నువ్వు కావాలనే నన్ను పని మనిషి అని వెటకారం చేస్తున్నావు కదూ అంటుంది. దీంతో నందూ 'అదేం లేదు.. నిజంగానే పని మనిషి అనుకున్నా. అయినా ఈ గెటప్ ఏంటి' అని ప్రశ్నిస్తాడు. దీంతో లాస్య నాకు బోలెడు పనులున్నాయి అంటుంది. దీంతో ఇవన్నీ నువ్వే చేస్తావా? అంటే... లాస్య అంటే ఏంటో చూపిస్తా అంటుంది.

భాగ్య ఎంట్రీ... లాస్య ప్రశ్నలు
లాస్య ఇంటి ముందర ముగ్గు పెడుతూ ఉండగా.. భాగ్య ఎంట్రీ ఇస్తుంది. లాస్యను వెనుక నుంచి చూసి.. ఏమ్మా ఇంట్లో లాస్య ఉందా? అని అడుగుతుంది. ఆ మాట విన్న లాస్య.. 'ఇది కూడా నన్ను గుర్తు పట్టడం లేదా' అనుకుని వెంటనే భాగ్య వైపు తిరుగుతుంది. దీంతో ఆమె ఒక్కసారిగా షాక్ అవుతుంది. అప్పుడామె 'నిజంగానే పని మనిషిలా ఉన్నావు. ఎవర్నైనా కొత్తగా పెట్టుకున్నారేమో అనుకున్నా' అంటూ పంచ్ వేస్తుంది. దీంతో లాస్య 'తులసిలా నేను మారాలి అనుకుంటే.. మీరంతా పని దాన్ని చేస్తున్నారు. ఇదే గెటప్‌లో తులసి.. తులసిలా అనిపించినప్పుడు.. నేను నాలా ఎందుకు కనిపించడం లేదు' అని ప్రశ్నిస్తుంది.

లాస్యను ఏడిపించి.. రెచ్చగొట్టి
లాస్య మాటలకు భాగ్య 'నువ్వు తులసిలా కనిపించడం ఏంటి? తులసక్క తులసక్కే.. ఆ హైటూ.. పర్సనాలిటీ. అయినా తులసిలా మారాలని నీకు ఎందుకు అనిపించింది లాస్యా' అని ప్రశ్నిస్తుంది. దీంతో లాస్య 'మీ బావగారికి ఉత్తమ ఇల్లాలు అంటే తులసే అంట. అందుకే నేను ఉత్తమ ఇల్లాలును కావాలని అనుకుంటున్నాను' అని అంటుంది. దీంతో భాగ్య.. 'లాస్య అనుకుంటే సాధించి తీరుతుంది. తులసి దగ్గర నుంచి బావగారినే లాక్కున్నావు. ఉత్తమ ఇల్లాలు కావడం నీకో లెక్కా.. తప్పకుండా అవుతావు. అయినా అందంగా ఉండాలంటే ఐశ్వర్యరాయ్ కానవసరంలేదు. తులసిలా మారాలంటే తులసి గెటప్‌లో ఉండాల్సిన అవసరం లేదు' అని రెచ్చగొడుతుంది. దీంతో లాస్య సరే అంటూ వెంటనే ఇంట్లోకి పరుగులు పెడుతుంది.

నందూ కోపం.. అరటిపండునా
ఇక, తులసి ఇంటికి ఓ కొరియర్ వస్తుంది. అది తీసుకుని చూసిన నందూ.. వెంటనే తులసి అని అరుస్తాడు. అంతేకాదు, 'నేను ఏంటో.. నాకు ఈ ఇంట్లో ఉన్న విలువ ఏంటో ఈరోజుతో తెలిసిపోవాలి. పేరుకి మాత్రమే నేను ఈ ఇంటికి పెద్దను. ఆటలో అరటిపండును చేస్తున్నారా? డైరెక్టుగా విషయం చెప్పింది' అని ప్రశ్నిస్తాడు. దీంతో తులసి నేనేం చేశానండీ అంటుంది. ఆ మాటతో నందూ.. దివ్య నీ కూతురా.. నా కూతురా? అని అడుగుతాడు. దీనికామె 'మన కూతురు' అని చెప్తుంది. దీంతో నందూ 'అలాంటప్పుడు.. దివ్యకి సంబంధించిన విషయం ఇద్దరం కలిసే తీసుకోవాలి.. కానీ నువ్వు చేసింది ఏంటి? ఎవర్నీ అడిగి.. దివ్యను స్పెషల్ కోర్స్ కోసం ఢిల్లీకి పంపిస్తున్నావు' అని నిలదీస్తాడు.

నందూ ఎమోషనల్ డైలాగ్స్
ఆ తర్వాత నందూ 'నా కూతురికి సంబంధించిన విషయం నా దగ్గర ఎందుకు దాచావు. నేను వెధవను.. చేతకాని వాడిని.. దద్దమ్మని అనుకుంటున్నావా? నా దగ్గర డబ్బు లేకపోవచ్చు.. కానీ దివ్యలో నా రక్తం ఉంది. అది సరిపోదా? నేను చచ్చిపోయానని అనుకుంటున్నారా' అని ప్రశ్నిస్తాడు. దీంతో తులసి 'మీతో చెప్పే అవకాశం మీరు ఇవ్వలేదు.. మీ దగ్గరకు వచ్చిన ప్రతిసారీ.. గొడవపడుతూ ఉన్నారు. మీరెప్పుడూ ప్రశాంతంగా లేరు. నేను మీరు అనుకున్నంత తెలివైన దాన్నే అయితే.. మీరు కట్టిన తాళిని మెడలో ఉంచుకుని మిమ్మల్ని వేరే ఆడదానికి వదిలిపెట్టేదాన్నే కాదు' అని అంటుంది. తర్వాత నందూ.. దివ్య దగ్గరకు వెళ్లి.. 'మీ అమ్మకు నేను శత్రువునే.. కానీ నీకు ఏమైంది? నీకు ఏం అన్యాయం చేశాను? ఈ నాన్నను దూరం పెట్టావు.. నువ్వు చదువుకుంటానంటే నేను అడ్డుపడతానని అనుకున్నావా?' అంటాడు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











