Intinti Gruhalakshmi Today Episode: నందూకు బంపర్ ఆఫర్.. నిజం చెప్పొద్దన్న తులసి.. ఇక అంతా హ్యాపీసే

భారతదేశంలోని చాలా భాషల కంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి.

అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గరువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

 బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసిలా మారేందుకు ప్రయత్నిస్తున్న లాస్యను ఇంట్లో వాళ్లంతా హేళన చేసి మాట్లాడుతుంటారు. అంతేకాదు, నువ్వెందుకు అలా మారాలనుకుంటున్నావు అని ప్రశ్నిస్తారు. దీంతో తనకు పబ్లిసిటీ కావాలని, అందుకే ఇలా చేశానని అంటుంది. ఆ సమయంలోనే నందూ వచ్చి కూడా లాస్యను అవమానిస్తాడు. అనంతరం భాగ్య అక్కడకు ఎంట్రీ ఇస్తుంది.

అంతేకాదు, లాస్యకు కొన్ని సలహాలు ఇస్తుంది. ఇక, చివర్లో దివ్య అడ్మీషన్ లెటర్ చూసిన నందూ కోపంతో ఊగిపోతాడు. తనకు చెప్పకుండా ఎందుకు అప్లై చేశారని తులసిపై ఓ రేంజ్‌లో సీరియస్ అయిపోతాడు.

గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన నందూ

గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన నందూ

అందరూ తనను విలన్‌గా చూస్తుండడంతో నందూ 'దివ్యిను ఒంటరిగా ఢిల్లీ పంపడం భయంగా ఉంది. మనసు గింజుకుంటుంది' అని చెప్పి ఎమోషనల్ అవుతాడు. దీంతో అభి 'దివ్య వెళ్లే కాలేజ్‌‌లో క్రమశిక్షణ చాలా బాగుంటుంది.. నన్ను నమ్మండి డాడ్' అంటాడు.

ఆ మాటతో నందూ.. 'మీ అందరికీ దివ్యను పంపించాలని ఉంటే.. నేనొక్కడినే ఎందుకు కాదనాలి? మీ ఇష్టం.. అలాగే కానివ్వండి' అని అంటాడు. నందూ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేయడంతో అనసూయ 'రేపు ఘనంగా సంక్రాంతి పండుగ జరుపుకుని హ్యాపీగా ఢిల్లీకి పంపింద్దాం' అని అంటుంది. తర్వాత పరందామయ్య కామెడీ చేస్తాడు.

నందూను అవమానించిన అభి

నందూను అవమానించిన అభి

నందూ బయటకు వెళ్లేందుకు అభిని కారు అడగాలని అనుకుంటాడు. దీనికోసం అతడి దగ్గరకు వెళ్లి 'పది నిమిషాల్లో తిరిగి వచ్చేస్తా.. ఒక్కసారి నీ కారు ఇవ్వరా అభి' అని అడుగుతాడు. దీనికతడు 'నాకు అర్జెంట్ పని ఉంది.. హాస్పటల్‌కి వెళ్లాలి.. నా ఎమర్జెన్సీ మీకు తెలియదు.. మీరు ఖాళీగానే ఉన్నారు కదా.. పనేం లేదు కదా' అని అవమానిస్తాడు. ఆ మాటలు విన్న తులసి 'పావుగంటలో వచ్చేస్తారు కదా ఇవ్వొచ్చు కదా' అని అంటుంది. అప్పుడు నందూ 'వద్దులే.. వాడు చెప్పింది నిజమే. నేను ఖాళీగానే ఉన్నాను కదా. నడుచుకుంటూనే వెళ్తా. వాడు డాక్టర్ కదా బిజీగా ఉంటాడు' అని అంటాడు.

ప్రేమ్ మాటకు ఫీలైన నందూ

ప్రేమ్ మాటకు ఫీలైన నందూ

అభి కారు ఇవ్వనని అనేసరికి పరందామయ్య 'ప్రేమ్ బండి ఖాళీగానే ఉందేమో వాడ్ని అడగనా' అని అంటాడు. ఇది విన్న అతడు 'నేనేం ఖాళీగా లేను. బయటకు వెళ్తున్నా. కావాలంటే డ్రాప్ చేస్తా. వచ్చేటప్పుడు నడిచిరమ్మనండి. అయినా ఆయనకి పెద్ద పనేం లేదు కదా' అని అవమానిస్తాడు.

కొడుకులు ఇద్దరూ హేళనగా మాట్లాడడంతో నందూ కుమిలిపోతూ.. సోఫాలో కుప్పకూలిపోతాడు. అంతేకాదు 'సంపాదన లేకపోతే మగాడి విలువ ఇంత దారుణంగా పడిపోతుందని అస్సలు ఊహించలేదు. నేను పెంచిన నా పిల్లలే నన్ను హీనంగా చూస్తున్నారు' అని బాధపడతుంటాడు. అప్పుడే లాస్య కాఫీ తీసుకొచ్చి నందూకు తప్ప అందరికీ ఇస్తుంది. దీంతో అతడు మళ్లీ ఫీల్ అయిపోతాడు. ఇదంతా చూసిన తులసి అతడిపై జాలి పడుతుంది.

లాస్య కూడా అవమానిస్తూనే

లాస్య కూడా అవమానిస్తూనే

నందూకు కాఫీ అడగడంతో 'ఆయన తిని ఖాళీగా కూర్చోవడం వల్ల అజీర్తి చేస్తుంది. అందుకే ఈరోజు కడుపునకు రెస్ట్ ఇస్తారని కాఫీ ఇవ్వలేదు. అయినా పాలు కూడా లేవు. పక్కనే కదా షాప్‌. వెళ్లి రెండు పాల ప్యాకెట్లు తీసుకుని రండి.. అంతా బిజీగా ఉన్నారు. వెళ్లండి ఖాళీగానే ఉన్నారు కదా' అని అవమానిస్తుంది. ఆ మాటలు విన్న తులసి 'ఎవరూ వెళ్లాల్సిన అవసరం లేదు. ఫోన్ చేస్తే వాళ్లే తీసుకొచ్చి ఇస్తారు' అంటుంది. దీంతో లాస్య 'నందూకు అన్నీ అలా కలిసి వస్తాయి.. కూర్చున్న చోటు నుంచి లేవకుండానే అన్ని పనులు అయిపోతున్నాయి' అని సెటైర్ వేస్తుంది. దీంతో తులసి బాగా బాధపడుతుంది.

నందూను ఓదార్చిన తండ్రి

నందూను ఓదార్చిన తండ్రి

నందూ పరిస్థితి చూసి బాధ పడిన పరందామయ్య తన కాఫీని ఇవ్వబోతాడు. దీంతో నందూ 'నేను పనికి రాని వాడిని. లెక్క కట్టి ఇంటి లెక్కల్లో నుంచి తీసేసింది. మీరెందుకు నాన్నా జాలి చూపిస్తారు' అని అంటాడు. దీంతో 'నీకంటే నేనే పెద్ద పనికి రాని వాడినిరా కూర్చుంటే లేవలేని వాడిని' అని అంటాడు. దీనికతడు 'నీకు కనీసం పెన్షన్ అయినా వస్తుంది.. నాకు అది కూడా లేదు' అంటాడు. అప్పుడు తండ్రి 'నీకు జాబ్ వస్తే.. సమస్యలు అన్నీ పోతాయి. ముందు ఆ ప్రయత్నంలో ఉండరా' అంటాడు. ఆ మాటతో నందూ 'ఎంత సిన్సియర్‌గా ట్రై చేసినా జాబ్ రావడం లేదు నాన్నా.. నాపై నాకే నమ్మకం పోతుంది' అని ఎమోషనల్ అవుతాడు. ఇదంతా విన్న తులసి అతడిపై జాలి పడడంతో పాటు జాబ్ ప్రయత్నాలు కూడా మొదలు పెడుతుంది.

 దివాకర్‌తో మాట్లాడిన తులసి

దివాకర్‌తో మాట్లాడిన తులసి

నందూకు జాబ్ ఇప్పించడం కోసం తులసి.. దివాకర్ అనే వ్యక్తికి ఫోన్ చేస్తుంది. అప్పుడామె హెల్ప్ కావాలి అనే సరికి 'అయ్యో మీరు మాకు ఎన్నోసార్లు హెల్ప్ చేశారు.. మీలాంటి వాళ్లకి హెల్ప్ చేయడం మా అదృష్టం' అని అంటాడు. దీంతో తులసి 'ఏం లేదండీ.. నాకు తెలిసిన ఒకాయనకి మీ కంపెనీలో జాబ్ ఇప్పించాలి. నాకు బాగా కావాల్సిన వ్యక్తి.. సొంతంగా సాఫ్ట్‌వేర్ కంపెనీ రన్ చేసిన అనుభవం కూడా ఉంది. కావాలంటే సామ్రాట్ గారితో కూడా ఒక మాట చెప్పిస్తా' అంటుంది. దీంతో దివాకర్.. 'మీరు చెప్తే సామ్రాట్ గారు చెప్పినట్టే.. ఆయన్ని రేపు వచ్చి కలవమనండి.. రేపే జాయిన్ చేసుకుంటాం' అంటాడు.

 సీక్రెట్‌గానే.. నందూకు ఆఫర్

సీక్రెట్‌గానే.. నందూకు ఆఫర్

దివాకర్‌తో మాట్లాడుతోన్న సమయంలోనే తులసి 'నా వల్లే నందూ గారికి జాబ్ వచ్చిన విషయం ఆయనకు చెప్పొద్దు' అని మాట తీసుకుంటుంది. ఇదంతా విన్న పరందామయ్య తులసిని ప్రశ్నిస్తాడు. దీనికామె 'మాజీ భర్త అని కాదు.. మీకు కొడుకు అని కాదు.. నా బిడ్డలకు తండ్రి అని కాదు.. ఈ ఇల్లు ప్రశాంతంగా ఉండాలనే ఒకే ఒక్క కారణం. మీ అందరిలో సంతోషం ఉండటం కోసమే. నాకు ఆయనకు ఒక జబ్బు ఉంది. తినడానికి లేకపోయినా ఆత్మాభిమానం చంపుకోం అందుకే ఇలా సీక్రెట్‌గా హెల్ప్ చేస్తున్నా' అంటుంది. తర్వాత నందూతో లాస్య తులసిపై ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. కానీ, నందూ మాత్రం ఆమెను తిడతాడు. అనంతరం దివాకర్ ఫోన్ చేసి నందూకు జాబ్ ఆఫర్ ఇస్తాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X