twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: లాస్యను కొట్టబోయిన నందూ.. చిచ్చు పెట్టిన గాయత్రికి అభి సపోర్ట్

    |

    ఇండియాలోని మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి ఇచ్చిన సలహాతో కేఫ్‌ను రన్ చేస్తోన్న నందూ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. దీంతో అతడి స్నేహితులు ప్రకాశ్ అభినందిస్తాడు. ఇక, తనను పూజ చేయొద్దని చెప్పడంతో లాస్య.. అంకిత తల్లి గాయత్రికి ఫోన్ చేసి లేనిపోనివి అన్నీ చెప్పి రెచ్చగొడుతుంది.

    అంతేకాదు, ఈ ఒక్కసారి సహాయం చేస్తే అంకితను అత్తగా మంచిగా చూసుకుంటానని చెబుతుంది. ఆమె మాట ప్రకారం.. గాయత్రి తులసి ఇంటికి వచ్చి గొడవ చేస్తుంది. అంతేకాదు, లాస్యతోనే పూజ చేయించాలని అక్కడున్న వాళ్లందరినీ ఒప్పిస్తుంది.

    రిపబ్లిక్ డేన బుక్కైన అనసూయ: టీ షర్ట్‌పై ఆయన బొమ్మ.. అలా కూర్చుని కనిపించడంతో!రిపబ్లిక్ డేన బుక్కైన అనసూయ: టీ షర్ట్‌పై ఆయన బొమ్మ.. అలా కూర్చుని కనిపించడంతో!

    పూజకు ముందు బిక్కమొఖంతో లాస్య

    పూజకు ముందు బిక్కమొఖంతో లాస్య

    గాయత్రి వచ్చిన తర్వాత అందరినీ మార్చేసిన గాయత్రి.. లాస్యతో పూజ చేయించడానికి ఒప్పిస్తుంది. దీంతో చాలా డిస్కర్షన్ల తర్వాత లాస్య పీటల మీద కూర్చుంటుంది. పూజకు అయితే రెడీ అవుతుంది కానీ, ఆమెకు ఎలా చేయాలో మాత్రం అర్థం కాదు. దీంతో బిక్కముఖం వేసుకుని అటు ఇటు చూస్తుంటుంది. దీంతో అక్కడే ఉన్న అభి, ప్రేమ్, అంకిత, శృతిలు చూసి నవ్వుతారు. అప్పుడు గాయత్రి పూజ మొదలెట్టు లాస్య అంటుంది. అప్పుడామె అన్నీ చూస్తున్నా ఆగండి అంటుంది. దీనికి అనసూయ 'దాని ముఖం.. లాస్కు పూజ చేయడమే తెలియదు' అంటుంది.

    పూజ కోసం గొడవ.. ఒప్పేసుకున్న అత్త

    పూజ కోసం గొడవ.. ఒప్పేసుకున్న అత్త

    లాస్యకు పూజ చేయడం రాదని అనసూయ అన్న వెంటనే గాయత్రి మరి మీరే తనకు చెప్పొచ్చు కదా అంటుంది. దీంతో తులసి ముందు గణపతి పూజతో ప్రారంభించు అంటుంది. అప్పుడు లాస్య నువ్వు మధ్యలో రాకు అంటుంది. దీంతో ఇద్దరి మధ్య గొడవ మొదలవుతుంది.

    ఆ తర్వాత తులసి 'అమ్మ వారి ముందు గొడవలు వద్దు.. అత్తయ్యా లాస్యకు పూజ చేసే విధానం నేర్పించండి' అంటుంది. అప్పుడే గాయత్రి కూడా కొత్త కోడలికి దగ్గరుండి పూజ చేయించడం ఆనవాయితీ కదా అంటుంది. దీంతో లాస్య పక్కన కూర్చొని పూజ చేయిస్తుంటుంది అనసూయ.

    సమంత, నాగ చైతన్య విడాకుల కథలో బిగ్ ట్విస్ట్: ఆ పార్టీ తర్వాతే విభేదాలు.. ముందు అడిగింది తనేనట!సమంత, నాగ చైతన్య విడాకుల కథలో బిగ్ ట్విస్ట్: ఆ పార్టీ తర్వాతే విభేదాలు.. ముందు అడిగింది తనేనట!

    నందూ ఫోన్ చేయగా వెళ్లిపోయిన లాస్య

    నందూ ఫోన్ చేయగా వెళ్లిపోయిన లాస్య

    లాస్య పూజ చేస్తుండగా.. లాస్యకు నందూ ఫోన్ చేస్తాడు. అప్పుడామెను అర్జెంట్‌గా బయలుదేరి కేఫ్ దగ్గరికి రమ్మని అంటాడు. దీంతో 'ఏమైంది? ఎందుకు ఇంత హడావుడి' అని అడుగుతుంది. అప్పుడు నందూ 'ముందు నువ్వు ఒక్కదానివేరా.. ఎవ్వరికీ చెప్పొద్దు' అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. దీంతో లాస్య 'అంత అర్జెంట్‌గా ఎందుకు పిలుస్తున్నాడు? ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా?' అని అనుకొని వెంటనే పూజలో నుంచి లేచి అత్తయ్య నేను ఇప్పుడే వస్తాను అంటూ కంగారుగా చెప్పి వెళ్లిపోతుంది. దీంతో అక్కడున్న వాళ్లందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తుంటారు.

    తిట్టిన అనసూయ.. నందూతో గొడవకు

    తిట్టిన అనసూయ.. నందూతో గొడవకు

    లాస్య పూజ మధ్యలోనే వెళ్లిపోవడంతో అనసూయ.. గాయత్రిపై ఫైర్ అవుతుంది. 'ఇదేనా ఇంటి కోడలు పూజ చేసే విధానం. దీనికోసమేనా నువ్వు వకల్తా పుచ్చుకుంది' అని అంటుంది. ఆ తర్వాత అంకిత, శృతితో పూజను చేయిస్తుంది అనసూయ. ఇక, ఫోన్ కాల్‌తో పరిగెత్తుకుంటూ లాస్య నందూ కేఫ్‌కు వస్తుంది. తీరా చూస్తే నందు కేఫ్‌లో కనిపించడు. ఆ తర్వాత కంగారుగా బయటికి వచ్చి చూస్తే కోన్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చి సర్‌ప్రైజ్ అంటాడు. దీంతో లాస్యకు తీవ్రంగా కోపం వస్తుంది. అర్జెంట్‌గా రమ్మంటే ఏమైందో అని అనుకుంటున్నా అంటూ గొడవ పడుతుంది.

    ప్యాంటు విప్పేసి షాకిచ్చిన ప్రగ్యా జైస్వాల్: పైన కూడా ఓ రేంజ్‌లో.. వామ్మో ఇది మరీ ఘోరం!ప్యాంటు విప్పేసి షాకిచ్చిన ప్రగ్యా జైస్వాల్: పైన కూడా ఓ రేంజ్‌లో.. వామ్మో ఇది మరీ ఘోరం!

    స్టాఫ్ ముందు పరువు తీసేసిన లాస్య

    స్టాఫ్ ముందు పరువు తీసేసిన లాస్య

    సర్‌ప్రైజ్ చేయడానికి పిలిచిన నందూతో 'కొత్త కోడలుగా ధాన్యలక్ష్మి పూజ చేస్తుండగా నువ్వు ఫోన్ చేశావు. పూజ మధ్యలో వదిలేసి వచ్చాను.. నా మూడ్ అంతా నాశనం చేశావు' అంటూ గట్టిగట్టిగా అరుస్తుంది. ఇదంతా కేఫ్‌లో ఉన్న స్టాఫ్ చూస్తారు. దీంతో ఆమెను నందూ కార్ ఎక్కించుకుని తీసుకెళ్తాడు. ఒక దగ్గర ఆపి మాట్లాడే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఇక్కడికెందుకు తీసుకొచ్చావు నందూ అని అడగ్గా.. నిన్ను వదిలేద్దామని అని బదులు ఇస్తాడు. 'సరే మంచిది అయితే.. వెళ్లిపో ఇక్కడి నుంచి. ఇక్కడైనా ప్రశాంతంగా ఉంటా' అంటుంది లాస్య.

    లాస్యను కొట్టబోయిన నందూ తర్వాత

    లాస్యను కొట్టబోయిన నందూ తర్వాత

    లాస్య మాటలకు చిర్రెతుకొచ్చిన నందూ 'నా స్టాఫ్ ముందు అక్కడ నాతో గొడవ పడితే.. రేపు నా స్టాఫ్ ముందు నేను ఎలా తల ఎత్తుకొని తిరగగలను. వాళ్లు నాకు వాల్యూ ఇస్తారా' అంటాడు. దీనికి లాస్య 'అదో జాబ్.. మళ్లీ పరువు పోయిందని ఫీల్ అవుతున్నావు. నీకన్నా నాకే అక్కడ ఎక్కువగా అవమానం అనిపించింది' అని మరింత రెచ్చగొడుతుంది.

    దీంతో నందూ కోపంలో లాస్యను కొట్టబోతాడు. కానీ, ఆగిపోతాడు. ఆ తర్వాత 'నిన్ను పిలవడం నాదే తప్పు లాస్య' అని చెప్పి వెళ్లి కారులో కూర్చుంటాడు. దీంతో లాస్య 'నేనే తప్పు చేశానేమో.. మారిపోతున్న నందూను నేనే రెచ్చగొట్టానేమో' అనుకుంటుంది లాస్య. దీంతో మళ్లీ ఇద్దరూ కలిసిపోతారు. ఇద్దరూ కలిసి కాఫీ తాగడానికి వెళ్తారు.

    Bigg Boss OTT: షోలోకి ఫేమస్ హీరోయిన్ ఎంట్రీ.. ఈమెకు మాత్రమే అంత రెమ్యూనరేషన్‌కు డీల్Bigg Boss OTT: షోలోకి ఫేమస్ హీరోయిన్ ఎంట్రీ.. ఈమెకు మాత్రమే అంత రెమ్యూనరేషన్‌కు డీల్

     చిచ్చు పెట్టిన గాయత్రి.. అభి సపోర్ట్

    చిచ్చు పెట్టిన గాయత్రి.. అభి సపోర్ట్

    పూజ తర్వాత అందరూ సంతోషంగా ఉండగా.. గాయత్రి 'నా కూతురును ఈ ఇంట్లో పనిమనిషిని చేశారు. నా అల్లుడు ఇంకా అసిస్టెంట్ డాక్టర్‌గానే ఉన్నాడు' అంటూ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తుంది. దీంతో పండుగ పూట ఏంటి అమ్మ ఇవన్నీ అంటుంది అంకిత. దీనికామె 'నిన్ను మేము ఎలా పెంచుకున్నాం? కానీ, ఇప్పుడు చూస్తే నా కడుపు తరుక్కుపోతోంది' అంటుంది. దీనికి అభి 'నేను కూడా మిమ్మల్నే సపోర్ట్ చేస్తాను ఆంటి. అంకిత చెప్పిన బంధాలు బతకడానికి సరిపోవు. బతకడానికి డబ్బే కావాలి' అంటాడు. ఆ సమయంలో పరందామయ్య ఏదో చెప్పబోతాడు. కానీ, అభి మాత్రం అత్తగారికే సపోర్టు చేస్తాడు. మధ్యలో ప్రేమ్‌ను కూడా అవమానించేలా మాట్లాడతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 540: Anasuya Agreed to Help to Lasya. Then Lasya Went To Nandhu's Cafe After His Phone Call.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X