Intinti Gruhalakshmi Today Episode: వాళ్ల రాకతో సంతోషం.. సీసీ కెమెరాలతో ట్విస్ట్.. నందూకు జాక్‌పాట్

జనరేషన్లు ఛేంజ్ అవుతోన్నా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. అందరూ తన మాటను వ్యతిరేకించడంతో దివ్యను ఢిల్లీ పంపేందుకు నందూ అంగీకరిస్తాడు. ఆ తర్వాత నందూ కారు కావాలని అడిగితే అభి ఇవ్వనంటాడు. ప్రేమ్ బైకును కూడా ఇవ్వనని చెబుతాడు. దీంతో నందూ బాధ పడతాడు. అది చూసిన తులసి అతడికి జాబ్ చూడాలని అనుకుని.. దివాకర్ అనే వ్యక్తికి ఫోన్ చేస్తుంది.

అతడితో సీక్రెట్‌గా మాట్లాడి నందూకు జాబ్ వచ్చేలా చేస్తుంది. అనంతరం దివాకర్.. నందూకు ఫోన్ చేసి ఉదయాన్నే ఇంటర్వ్యూకు రమ్మని చెబుతాడు. నందూకు సాయం చేసినందుకు పరందామయ్య ప్రశ్నించగా.. కుటుంబం కోసమే చేశానని తులసి అంటుంది.

నందూ ఇంటికి వచ్చిన మాధవి

నందూ ఇంటికి వచ్చిన మాధవి

తులసి ఫ్యామిలీ మొత్తం సంక్రాంతి సంబరాలు జరుపుకుంటూ ఉంటుంది. అప్పుడే నందూ దివాకర్ ఆఫీసుకు ఇంటర్వ్యూకు బయలుదేరుతాడు. అప్పుడు దివ్య 'నేను ఈరోజే డాడ్ ఢిల్లీ వెళ్లేది.. నాతో ఉండొచ్చు కదా' అని అంటుంది. దీంతో లాస్య 'లేదమ్మా.. మీ డాడ్ ఓ ముఖ్యమైన పనిమీద బయటకు వెళ్తున్నారు. శుభవార్తతో తిరిగి వస్తారు' అంటుంది.

తర్వాత అతడు తండ్రి కాళ్లకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటాడు. దీంతో అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతారు. అప్పుడు 'ఆల్ ది బెస్ట్ రా అన్నయ్యా' అంటూ నందూ చెల్లెలు మాధవి తన భర్త మోహన్‌తో కలిసి వస్తుంది. వెంటనే అన్నను హత్తుకుంటుంది.

పశ్చాత్తపం వ్యక్తం చేసిన నందూ

పశ్చాత్తపం వ్యక్తం చేసిన నందూ

చెల్లిని చూసి నందూ సంతోషిస్తాడు. అప్పుడామె 'నన్ను చూడగానే ఎందుకు వచ్చావని మెడపట్టి గెంటేస్తావని అనుకున్నా. కానీ, నన్ను చూసి నవ్వావు. మమ్మల్ని ఈ పూటకి ఇక్కడ ఉండనివ్వరా. మా భోజనం ఖర్చు, టిఫిన్ ఖర్చు ఇచ్చేసి వెళ్తాం' అని సెటైర్ వేస్తుంది. దీంతో నందూ పశ్చాత్తాప పడుతూ.. 'నా చెల్లెల్ని నేను ఆరోజు ఎందుకు అంత అవమానిస్తూ మాట్లాడానా? అని బాధగా ఉందమ్మా' అని అంటాడు.

అప్పుడు అనసూయ 'పండగ పూట అన్నా చెల్లెల్లు కలిశారు. మాకు ఇదే నిజమైన సంక్రాంతిలా ఉంది' అంటుంది. అప్పుడు మోహన్.. కూతురితో పాటు అల్లుడు కూడా వచ్చాడని అంటాడు.

తులసి వల్లే వాళ్లు.. లాస్య ఎదురు

తులసి వల్లే వాళ్లు.. లాస్య ఎదురు

మోహన్ మాటలకు పరందామయ్య 'నువ్వు మా అల్లుడివి కాదు బాబు.. మా కొడుకువే' అని అంటాడు. తర్వాత వచ్చినందుకు థ్యాంక్స్ అని నందూ అనగానే.. రక్త సంబంధం కోసం వచ్చామని మాధవి.. తులసిని చూస్తూ అంటుంది. అప్పుడే మాధవి, మోహన్‌ను ఇంటికి రమ్మని తులసి పిలిచిన సన్నివేశాలను చూపిస్తారు. మరోవైపు ఇంటర్వ్యూకు వెళ్తున్న నందూకు లాస్య ఎదురొస్తానని అంటుంది. దీంతో ప్రేమ్ వద్దు అంటాడు. అప్పుడు భాగ్య 'ఆల్రెడీ నువ్వు ఎదురురావడం వల్ల.. ఉద్యోగం రావడం అటుంచితే ఉన్న కారు కూడా పోయింది.. ఒక్కసారి ఆలోచించుకో' అంటుంది. అయినా లాస్య పంపిస్తుంది.

నందూను చూసి సార్ అనుకుని

నందూను చూసి సార్ అనుకుని

దివాకర్ ఆఫీసుకు నందూ ఇంటర్వ్యూ కోసం వెళ్తాడు. అప్పుడు అక్కడ అంతా అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటారు. నందూ అక్కడకు వెళ్లేసరికి అతడు కూడా ఇంటర్వ్యూకు వెళ్లాడని తెలియని వాళ్లంతా లేచి గుడ్ మార్నింగ్ అంటారు. దీంతో అతడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు.

తర్వాత నందూ కూడా ఇంటర్వ్యూకే వచ్చాడని తెలుసుకుని అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యంగా చూస్తారు. అంతేకాదు, 'ఇంటర్వ్యూకు జీవిత కాలం లేట్ అనుకుంటా.. కొడుకుల్లాంటి మేం ఇంటర్వ్యూకు వస్తే.. తండ్రి లాంటి మీరు మాకు కాంపిటేషన్ ఏంటి సార్' అని అని అక్కడున్న వాళ్లు హేళన చేస్తుంటారు.

నందూ వివరణ.. జాబ్ వచ్చింది

నందూ వివరణ.. జాబ్ వచ్చింది

వాళ్లు హేళన చేయగానే నందూ 'తండ్రి కూడా కొడుకులపై ఆధారపడకుండా తన కాళ్లపై తాను నిలబడాలనుకోవడం తప్పేం కాదు కదా. ప్రతి మనిషికీ అవసరాలు ఉంటాయి. అవి వయసును బట్టి కాదు.. పరిస్థితిని బట్టి ఉంటాయి. నేను ఓటమిని అస్సలు ఒప్పుకోను. ఓటమి అంటే ఒకరు ఇస్తే రాదు.. మనకి చేతకాదు అనుకున్నప్పుడు వస్తుంది.

అందరికీ ఆల్ ది బెస్ట్' అని వివరణగా క్లాస్ పీకుతాడు. ఆ దెబ్బతో అక్కడున్న యంగ్ బ్యాచ్ అంతా నందుకి ఆల్ ది బెస్ట్ చెప్తారు. అప్పుడు దివాకర్ వచ్చి 'ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లని అసలు లోపలికి పిలవకుండానే.. ప్రాసెస్ కంప్లీట్ అయింది. ఇది అన్ని చోట్లా జరిగే రొటీన్ ఇంటర్వ్యూ కాదు. మిమ్మల్ని గంట నుంచి సీసీ కెమెరాల ద్వారా పరిశీలిస్తున్నాం. మీరు మాట్లాడుకునేది వింటున్నాం.. మిస్టర్ నందగోపాల్‌లో మాకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్నాయి. కంగ్రాట్స్' అంటాడు.

ముగ్గుల పోటీలో విజేత మాధవి

ముగ్గుల పోటీలో విజేత మాధవి

ఇంట్లో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలో.. తులసి, లాస్య, భాగ్య, దివ్య, శృతి, అంకిత, మాధవిలు పోటీ పడతారు. దీనికి పరందామయ్య, మోహన్ జడ్జ్‌లుగా వ్యవహరిస్తారు. ఆ సమయంలో లాస్య ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లి అదిరిపోయే యాక్టింగ్ చేస్తుంది. అప్పుడు భాగ్య వచ్చి ఆమె గాలి తీసేస్తుంది.

అనంతరం విజేతలను ప్రకటించే సమయం వస్తుంది. అప్పుడు తులసి మనమంతా విజేతలమే అంటుంది. ఇక, విన్నర్‌ను ప్రకటించేందుకు చాలా ఇబ్బంది పడిన మోహన్.. మాధవి గెలిచిందని చెప్పి అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. దీంతో ముగ్గుల పోటీలో ఉన్న లేడీస్ అంతా ఢీలా పడిపోతారు.

మీరెప్పుడూ ఇలాగే ఉండాలని

మీరెప్పుడూ ఇలాగే ఉండాలని

ఆ తర్వాత మోహన్, మాధవిని తులసి తన రూమ్‌లో కూర్చోబెట్టి మాట్లాడుతుంది. ఆ సమయంలో ఆమె 'మీ అన్నయ్య మిమ్మల్ని బాగా అవమానించారు. ఆత్మాభిమానం అవమానాన్ని మర్చిపోనివ్వదు. తాళ్లతో కట్టేస్తుంది. కానీ ఈరోజు నా మాటని కాదనలేక ఇక్కడికి వచ్చావు. మీ అన్నా చెల్లెల్లు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి' అని కోరుకుంటుంది. దీనికి మాధవి నువ్వు పిలిస్తే నేను రాకుండా ఉంటానా వదిన అంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X