Intinti Gruhalakshmi Today Episode: ఫుల్లుగా తాగొచ్చిన లాస్య.. మత్తులో తులసితో ఆ విషయాలు చెప్పేసి!

దేశంలోని మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఎలాగోలా గొడవ చేసి మరీ లాస్యను గాయత్రి పూజలో కూర్చోబెడుతుంది. అయితే, ఆమెకు పూజ ఎలా చేయాలో తెలియకపోవడంతో బిత్తరపోయి చూస్తుంటుంది. అప్పుడు గాయత్రి డిమాండ్ చేయడంతో అనసూయ పూజ చేయిస్తుంది. అయితే, అప్పుడే నందూ.. లాస్యకు ఫోన్ చేసి రమ్మనడంతో మధ్యలోనే వెళ్లిపోతుంది. అక్కడకు వెళ్లిన తర్వాత అతడు ఐస్‌క్రీమ్ తెచ్చి సర్‌ప్రైజ్ చేయబోగా గొడవ పెడుతుంది. మరోవైపు.. గాయత్రి.. తన కూతురు, అల్లుడికి ఈ ఇంట్లో అన్యాయం జరుగుతుందని మరో గొడవ పెడుతుంది.

ప్రేమ్‌ను నోటికొచ్చినట్లు తిట్టిన అభి

ప్రేమ్‌ను నోటికొచ్చినట్లు తిట్టిన అభి

గాయత్రి రెచ్చగొట్టడంతో రెచ్చిపోయిన అభి ఏదేదో మాట్లాడుతుంటాడు. ఆ సమయంలోనే తమ్ముడు ప్రేమ్‌ను కూడా నోటికి వచ్చినట్లు తిడతాడు. 'నేను ప్రేమ్‌ను ఆదర్శంగా తీసుకుంటే ఏమొస్తుంది? వాడేదో కాలక్షేపం చేస్తున్నాడు' అంటూ అభి ప్రేమ్‌తో గొడవపడతాడు. అంతేకాదు, 'నాకు డబ్బే అవసరం. ఎవరు ఎప్పుడు పిలుస్తారా అని చేతులు కట్టుకొని కూర్చోవడం నాకు చేతకాదు. వాడు ఎదగలేడు. ఇక శృతి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు. మమ్మీ పక్కనే తానా అంటే తందానా అనడం తప్పితే ఇంకేం లేదు' అంటూ వీర లెవెల్లో సీరియస్ అవుతాడు.

తులసిపై తీవ్రంగా సీరియస్ అవుతూ

తులసిపై తీవ్రంగా సీరియస్ అవుతూ

శృతిని అనడంతో అభిపై ప్రేమ్ ఫైర్ అవుతాడు. దీంతో అభి 'ఏమైంది? అంకిత తప్పు చేసినప్పుడు తనను అందరి ముందు నువ్వు అడగలేదా? వాడు చేతగాని వాడు' అంటాడు. ఇంతలో తులసి కలగజేసుకుంటుంది. 'ప్రేమ్ నువ్వు ఆగు. అభి ఎందుకు ఇలా నోరు జారుతున్నావు' అంటూ మధ్యలోకి వస్తుంది. అయినా కూడా అభి వినడు. అంతేకాదు, తులసిపై కూడా సీరియస్ అవుతాడు. 'నాకు మీలాంటి జీవితం వద్దు. నాకు పనికిరాని సలహాలు ఇవ్వకు' అంటాడు అభి. దీంతో అందరూ షాక్ అవుతారు. అంకిత వద్దు అంటున్నా కూడా అభి అస్సలు వినడు.

తీసుకెళ్లిన అంకిత.. గాయత్రి మాత్రం

తీసుకెళ్లిన అంకిత.. గాయత్రి మాత్రం

అభి మాటలకు షాకైన అంకిత 'నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. లోపలికి వెళ్దాం పదా' అని తీసుకెళ్తుంది. అప్పుడు అనసూయ ఏమైంది వీడికి అని అంటుంది. ఇంతలో గాయత్రి కలుగజేసుకొని 'నా అల్లుడిని ఇప్పటి వరకు మీరు సపోర్ట్ చేయలేదు. ఇక నైనా నా అల్లుడు, బిడ్డ బాగుపడేలా చేయండి. మీకు చేతగాదంటే చెప్పండి నేను చూసుకుంటాను' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

తర్వాత అంకిత 'ఈ ఇంటి పెద్ద కొడుకుగా బాధ్యతలు తీసుకోవాల్సింది పోయి.. నువ్వే ఇలా చేస్తే ఎలా? నువ్వు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తున్నావు. నువ్వు అసలు ఏం చేస్తున్నావో నీకు అర్థం అవుతోందా' అంటూ ఎడాపెడా తిట్టేసి అభికి క్లాస్ పీకి వెళ్లిపోతుంది.

 తులసి లిస్టులో చేరిన మరో సమస్య

తులసి లిస్టులో చేరిన మరో సమస్య

అభిలో ఒక్కసారిగా వచ్చిన మార్పును చూసిన తులసి ఎంతగానో బాధ పడుతుంది. తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. అంతేకాదు, అప్పుడు అభి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే, 'నా జీవితానికి జరిగిన నష్టం నా వరకే అనుకున్నా. నా బాధను దిగమింగుతూ పిల్లలను చూసుకుంటూ సంతోషంగా ఉండొచ్చు అనుకున్నా కానీ.. అనుకున్నది ఒకటి జరుగుతున్నది ఇంకొకటి. వాళ్లలో క్రమశిక్షణ లోపించింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది. ఎలాగైనా నా పిల్లలను ఒక దారిలో పెట్టుకోవాలని. లేకుంటే అనర్థాలు జరుగుతాయి' అని అనుకుంటుంది.

 తాగొచ్చిన నందూ, లాస్య.. బ్రతిమాలి

తాగొచ్చిన నందూ, లాస్య.. బ్రతిమాలి

తులసి తన బాధలో తాను ఉండగా.. నందూ, లాస్య ఫుల్లుగా తాగి ఇంటికి వస్తారు. నందూ కారు దిగి వచ్చి తులసితో 'నీకు నచ్చదని తెలుసు. కోపం వస్తుందని తెలుసు అయినా సరే ఉండలేకపోయాను. ఆగలేకపోయాను. నా మనసు చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉంది. అందుకే పండుగ చేసుకున్నాను తులసి. నన్ను ఇప్పుడు ఏం అనొద్దు ప్లీజ్' అని బ్రతిమాలతాడు. అప్పుడు తులసి 'అనే అవకాశం ఉన్నప్పుడే ఏం అనలేదు. ఇప్పుడు మాత్రం ఎందుకు అంటాను. లాస్య ఎక్కడ ఉంది' అని అడుగుతుంది. అంతలో ఆమె కారులో నిద్రపోతుంటుంది.

తాగి వాగిన లాస్య.. తులసి కామ్‌గానే

తాగి వాగిన లాస్య.. తులసి కామ్‌గానే

ఫుల్లుగా తాగి పడుకున్న లాస్యను కారు నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది తులసి. అప్పుడామె ఇది ఎవరి ఇల్లు అని అడుగుతుంది. దీనికి తులసి మన ఇల్లే అని బదులిస్తుంది. దీంతో లాస్య 'అప్పుడెప్పుడో నీ ఇల్లు అన్నావు కదా. నేను నీ మొగుడిని లాక్కున్నాను. నిజంగానే లాక్కున్నాను. బాధగా అనిపించిందా లేదా? అది బాధ అని తెలిసి కూడా నాకు, నందూకు మధ్యలో దూరి నన్ను బాధపెడుతున్నావు. ఎందుకు అలా చిన్నపిల్లలా చేసి బాధపెట్టడం తప్పు కదా' అంటుంది. అయినప్పటికీ ఆమె తాగి వాగుతుందని గ్రహించి తులసి చాలా కామ్‌గానే ఉంటుంది.

ప్రేమ్‌కు మంచి మాట చెప్పిన శృతి

ప్రేమ్‌కు మంచి మాట చెప్పిన శృతి

అభి మాటలకు శృతి, ప్రేమ్ బాధ పడుతూ ఉంటారు. అప్పుడు ప్రేమ్ 'మనసు ఎప్పుడూ ఇష్టపెట్టేవాటినే గుర్తుపెట్టుకోవాలి. కష్టపెట్టేవాటిని కాదు. అవి మరిచిపో' అంటాడు. దీనికి శృతి 'అవి నేను ఎప్పుడో మరిచిపోయాను. అందుకే నువ్వు లైఫ్‌లో ఏదో ఒకటి సాధించు ప్రేమ్. అప్పుడే నువ్వు మాటల మనిషివి కాదు.. చేతల మనిషివి అని అనుకుంటారు' అంటుంది. దీంతో 'నేను ఇలా ఉండటం నీకు నచ్చలేదా' అని అంటాడు ప్రేమ్. దీనికామె 'నిన్ను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే నేను తట్టుకోలేను' అంటుంది. దీంతో ఇద్దరూ సాధారణ స్థితికి వస్తారు.

Recommended Video

Bigg Boss Telugu 5, Episode 17 Highlights || Filmibeat Telugu
నందూ, లాస్యకు క్లాస్ పీకిన తులసి

నందూ, లాస్యకు క్లాస్ పీకిన తులసి

రాత్రి తాగిందంతా తలకు పట్టేయడంతో తలలు పట్టుకుని బయటకు వస్తారు నందూ, లాస్య. రాత్రి ఎక్కువ తాగామేమో అనుకుంటారు. అప్పుడు తులసి వాళ్లకు ఎదురవుతుంది. దీంతో నందూ ఆమెకు ముఖం చూపించలేకపోతాడు. ఇక, తులసి 'నాకు మాత్రం మీమీద గౌరవం తగ్గింది. మీరు మీ విలువ పోగొట్టుకుంటున్నారు. మీరు ఇలా చేయడం వల్ల పిల్లలకు కూడా గౌరవం తగ్గిపోతుంది. అంతేకాదు, వాళ్లకు ఇలా ఆదర్శంగా నిలుస్తారా' అంటూ క్లాస్ పీకుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X