twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Intinti Gruhalakshmi Today Episode: నిజం తెలుసుకున్న నందూ.. ఆఫీస్‌లో వీరంగం.. తులసికి బిగ్ షాక్

    |

    చాలా భాషలతో పోల్చుకుని చూస్తే తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

    దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

    Photos Courtesy: Star మా and Disney+Hotstar

    శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

    శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసి రికమెండ్ చేసిన దివాకర్ కంపెనీకి నందూ ఇంటర్వ్యూకు వెళ్లేందుకు బయలుదేరుతాడు. తులసి ఇంట్లో సంక్రాంతి వేడుకల కోసం మాధవి, మోహన్ కూడా వస్తారు. ఇక, నందూ అక్కడకు వెళ్లగానే ఇంటర్వ్యూకు వచ్చిన యంగ్ బ్యాచ్ మొత్తం ఆయనను హేళన చేసి మాట్లాడుతుంది.

    దీంతో నందూ వాళ్లకు క్లాస్ పీకుతాడు. ఆ వెంటనే దివాకర్ బయటకు వచ్చి.. సీసీ కెమెరాల ద్వారా ఇంటర్వ్యూ జరిగిందని, ఇందులో నందూ సెలెక్ట్ అయ్యాడని చెబుతాడు. ఇక, తులసి ఇంట్లో జరిగిన ముగ్గుల పోటీలో మాధవి గెలిచినట్లు జడ్జ్ మోహన్ ప్రకటిస్తాడు.

    Taraka Ratna: తారకరత్న ఆరోగ్యం విషమం.. గుండెపోటుతో పాటు మరో సమస్య.. దానివల్లే చికిత్స ఆలస్యం!Taraka Ratna: తారకరత్న ఆరోగ్యం విషమం.. గుండెపోటుతో పాటు మరో సమస్య.. దానివల్లే చికిత్స ఆలస్యం!

    అన్నయ్య గురించి భయపడ్డాను

    అన్నయ్య గురించి భయపడ్డాను

    తులసి కోరిక మేరకు నందూ ఇంటికి వచ్చిన తర్వాత మోహన్ 'హమ్మా తులసీ.. నా భార్య మళ్లీ ఈ ఇంటి గుమ్మం తొక్కకూడదని అనుకుంది. కానీ నీ ఫోన్ కాల్ తన మనసును మార్చేసింది. ఇక్కడికి వచ్చేలా చేసింది' అని అంటాడు. దీంతో తులసి 'మనిషికి విలువ ఇవ్వాల్సిన టైంలో ఇవ్వకపోతే.. మనం ఇద్దాం అనుకున్న టైంలో అది వాళ్లు ఒప్పుకోకపోవచ్చు. బంధాలు చెల్లెచెదురు అయిపోతున్నాయి.

    నా మాట మన్నించి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మాధవి' అని అంటుంది తులసి. దీంతో మాధవి 'నాతో తెగతెంపులు చేసుకుని వెళ్లిపోయిన తర్వాత మళ్లీ ఎందుకొచ్చావు అని అన్నయ్య నిలదీస్తాడేమో అనుకున్నా. భయపడ్డాను. కానీ అన్నయ్య నాపై ప్రేమ చూపించడం సంతోషంగా ఉంది వదినా' అని అంటుంది.

    మార్కెట్‌ ఉన్నట్లే.. అంతలో షాక్

    మార్కెట్‌ ఉన్నట్లే.. అంతలో షాక్

    తనకు ఉద్యోగం వచ్చిందన్న సంతోషంలో నందూ పొంగిపోతూ ఉంటాడు. అంతేకాదు, 'కష్టానికి సుఖానికి మధ్య ఎంత గ్యాప్ ఇవ్వాలో.. దేవుడు భలే డిసైడ్ చేస్తాడు. జీవితం అంటే ఇదే. ఏది ఏమైనా నేను లక్కీ. నా టాలెంట్ గురించి నేను చెప్పుకోకుండానే ఈ కంపెనీ వాళ్లు గుర్తించి నాకు ఉద్యోగం ఇచ్చారు. అంటే మార్కెట్‌లో నాకు రేంజ్ ఉన్నట్టే' అని సంబరపడిపోతుంటాడు.

    అంతలోనే ఇంటర్వ్యూకు వచ్చిన కొందరు 'ఇతనికి టాలెంట్ లేదు ఏమీ లేదు. ఎవరో తులసి అంట. అతడి ఉద్యోగం కోసం స్ట్రాంగ్‌గా రికమండ్ చేశారట.. వాడేం పెద్ద పోటుగాడు కాదు' అని మాట్లాడుకుంటూ ఉంటారు.

    యాంకర్ ప్రదీప్‌కు పవన్ కల్యాణ్ సర్‌ప్రైజ్: ఒకేసారి నాలుగు ఆఫర్లు.. ఆ సాయం గుర్తుంచుకుని మరీ!యాంకర్ ప్రదీప్‌కు పవన్ కల్యాణ్ సర్‌ప్రైజ్: ఒకేసారి నాలుగు ఆఫర్లు.. ఆ సాయం గుర్తుంచుకుని మరీ!

    రికమండ్ చేయడం ఎందుకని

    రికమండ్ చేయడం ఎందుకని

    ఆ తర్వాత కూడా అక్కడున్న వాళ్లు 'వాడు సాఫ్ట్‌వేర్ కంపెనీ పెట్టి మూసేశాడు. ఇప్పుడు ఆడదాన్ని అడ్డుపెట్టుకుని సెలక్ట్ అయ్యాడు. వీడిదీ ఉద్యోగమేనా? ఇలాంటి ఇంటర్వ్యూలలో సెలెక్ట్ కావాలంటే ఉండాల్సింది టాలెంట్ కాదు.. ఆడది. అది రికమండ్ చేస్తే సరిపోతుంది' అని అనుకుంటూ ఉంటారు.

    అంతలోనే తులసికి దివాకర్‌ నుంచి ఫోన్ చేస్తుంది. 'ఆయనలో టాలెంట్ ఉంటేనే ఉద్యోగం ఇవ్వండి.. నేను రికమండ్ చేసినందుకు ఇవ్వొద్దు. అలాంటప్పుడు.. నేను రికమండ్ చేయడం ఎందుకు? అని అనుకోవచ్చు.. వేరే అభ్యర్ధితో పోటీ టై అయితే తులసిదళం నంద గోపాల్ గారి వైపు వేస్తారని' అని అంటుంది.

    ఆ లెటర్‌ను చించేసిన నందూ

    ఆ లెటర్‌ను చించేసిన నందూ

    తులసి మాటలకు దివాకర్ 'మీరు రికమండ్ చేశారంటే.. ఆ వ్యక్తి ఎంత విషయం ఉన్నవాడో అర్ధమౌతుంది తులసి గారూ.. ఆయన పెద్ద మనిషిగా చాలా బాధ్యతగా ఉన్నారు. అందుకే సెలెక్ట్ చేశాం. కాసేపట్లో ఆయన చేతిలో అపాయింట్‌మెంట్ లెటర్ పెడుతున్నాం. ఈ మాట ముందుగా మీకు చెప్పడానికే కాల్ చేశాం' అని అంటాడు. అదే సమయంలో నిజం తెలుసుకున్న నందూ కోపంతో రగిలిపోతుంటాడు.

    అప్పుడు 'ఈ కొత్త ఉద్యోగంతో కొత్త జీవితం ప్రారంభించాలని అనుకున్నా.. పండుగ పూట సంతోషం లేకుండా చేసింది' అని మేనేజర్ దగ్గరకు వెళ్తాడు. అప్పుడాయన అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వడంతో.. నందూ దాన్ని తీసుకుని ముక్కలు చేసి విసిరికొడతాడు.

    యాంకర్ విష్ణుప్రియ ఇంట్లో తీవ్ర విషాదం: ఉన్న ఒక్క బంధం దూరం.. ఇద్దరు యాంకర్లకూ ఒకేసారి!యాంకర్ విష్ణుప్రియ ఇంట్లో తీవ్ర విషాదం: ఉన్న ఒక్క బంధం దూరం.. ఇద్దరు యాంకర్లకూ ఒకేసారి!

    జాబ్ వద్దు.. హారతిని విసిరేస్తూ

    జాబ్ వద్దు.. హారతిని విసిరేస్తూ

    అపాయింట్‌మెంట్ లెటర్ చించేసిన తర్వాత నందూ 'తులసి రికమండేషన్‌తో నాకు జాబ్ ఇచ్చి.. నా టాలెంట్‌తో ఇస్తున్నట్టు బిల్డప్ ఎందుకు ఇస్తున్నారు. రికమండ్ చేయడానికి ఆమెకి సిగ్గులేదు సరే.. రికమండ్ చేయడానికి మీకు సిగ్గులేదా' అని ఫైర్ అవుతాడు. అనంతరం ఆవేశంగా ఇంటికి వెళ్లి గేట్లను కూడా తన్నేస్తాడు. నందూ వచ్చే సరికి తులసి హారతి పళ్లెంతో రెడీగా ఉంటుంది. అప్పుడామె హారతి తీసుకోండి అని ఇవ్వగా ఆ పళ్లాన్ని విసిరికొడతాడు. దీంతో పరందామయ్య ఒరేయ్ పవిత్రమైన హారతిని విసిరికొడతావా అంటాడు. దీంతో నందూ 'హారతి పవిత్రమే కానీ ఇలాంటి వాళ్ల చేతుల్లో ఉండకూదు' అంటాడు.

    తులసిపై నందూ ఆగ్రహంగా

    తులసిపై నందూ ఆగ్రహంగా

    నందూ మాటలకు అనసూయ అంత తప్పు తులసి ఏం చేసిందిరా? అని ప్రశ్నిస్తుంది. దీంతో నందూ 'మోసంతో నన్ను తన చేతుల్లోకి తీసుకోవాలని అనుకుంది. నన్ను కీలుబొమ్మని చేయాలని అనుకుంది' అని అంటాడు. ఆ తర్వాత నందూ ఎవరికీ అర్థం కాని విధంగా మాట్లాడుతుంటారు. అప్పుడు లాస్య ఏమైందో చెప్పమంటుంది. దీంతో నందూ 'ఇన్నాళ్లూ జాబ్ రాకుండా చేసి.. ఇప్పుడు జాబ్ వచ్చేట్టు చేసింది.. జీవితాంతం నన్ను తనకి బానిసని చేసుకోవాలని అనుకుంది' అంటూ అసలు నిజం చెప్తాడు. దీంతో అందరూ ఆశ్చర్యపోగా.. లాస్య మాత్రం ఇంకా రెచ్చగొడుతోంది.

    ఉల్లిపొర లాంటి షర్ట్‌లో బిగ్ బాస్ లహరి రచ్చ: లోపలికి కనిపించేలా హాట్ షోఉల్లిపొర లాంటి షర్ట్‌లో బిగ్ బాస్ లహరి రచ్చ: లోపలికి కనిపించేలా హాట్ షో

    తప్పైంది అంటూ నమస్కారం

    తప్పైంది అంటూ నమస్కారం


    నందూ మాటలకు తులసి 'నేను ఒక్కసారి కూడా మిమ్మల్ని చేతకాని వాడు అని అనలేదు. మీకు మీరే వందసార్లు అనుకుంటూ ఆ నింద నాపై వేస్తున్నారు. మీకు తెలియకుండానే సాయం చేయాలని అనుకున్నాను. ఇలా అవుతుందని అనుకోలేదు. ఈ ఇంట్లో ప్రశాతంగా ఉండలేకపోతున్నారనే ఇలా చేశాను. కొత్త ఏడాదిలో అయినా సంతోషంగా ఉంటారనే ఇలా చేశాను.. పాతికేళ్లు కాపురం చేసినప్పుడు కూడా నాతో మీకు ఇదే గొడవ' అంటుంది. కానీ, నందూ మాత్రం వినడు. దీంతో తులసి 'తప్పు నాదే.. బుద్దితక్కువై మీ విషయంలో జోక్యం చేసుకున్నా.. బుద్ధి వచ్చింది.. ఇంకెప్పుడూ ఇలా జరగదు' అంటుంది. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

    English summary
    Intinti Gruhalakshmi Episode 854: Nandhu Gets Aggressive and Lashes Out At Tulasi for Trying to Help Him. Then They Get into Heated Argument.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X