Intinti Gruhalakshmi Today Episode: తులసి కొత్త కండీషన్‌తో చిక్కులు.. అభి బుట్టలో పడిపోయిన మాధవి
దాదాపు రెండు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. గాయత్రి రెచ్చగొట్టడంతో రెచ్చిపోయిన అభి.. ప్రేమ్‌ను నిందిస్తూ ఉంటాడు. ఆ సమయంలో అడ్డొచ్చిన తులసిపైన కూడా అతడు రంకెలేస్తాడు. దీంతో అంకిత అతడిని లోపలికి తీసుకెళ్లి క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత నందూ, లాస్య ఫుల్లుగా తాగి ఇంటికి వస్తారు.
ఇది తులసి చూడడంతో నందూ ఆమెకు సారీ చెబుతాడు. కానీ, లాస్య మాత్రం ఏదేదో మాట్లాడుతుంది. అభి తిట్టడంతో ఫీలైన ప్రేమ్, శృతి ఎలాగైనా అందరి నోర్లు మూయించాలని నిర్ణయించుకుంటారు. ఇక, ఉదయాన్నే నందూ, లాస్యకు తులసి గట్టిగానే క్లాస్ పీకుతుంది.

తులసి ఫైర్.. సారీ చెప్పేసిన నందూ
తాగి వచ్చినందుకు తులసి తిట్టడంతో లాస్య 'చూడు తులసి.. నువ్వు బావిలో కప్పవు. నీకు ప్రపంచం అంటే ఏంటో తెలియదు' అని హేళన చేస్తుంది. దీంతో తులసి 'నీ ప్రపంచం కన్నా నా ప్రపంచం చాలా మంచిది. మిస్టర్ నందు గారు.. మా పిల్లల ముందు ఇలా ప్రవర్తించకండి' అని వార్నింగ్ ఇస్తుంది. అప్పుడు నందూ తాను సర్ధి చెబుతానని అంటాడు. ఈ క్రమంలోనే 'తులసి మేము చేసింది తప్పే ఒప్పుకుంటున్నాను. నిన్న నేను ఉన్న ఆనందంలో నన్ను నేను మరిచిపోయి ప్రవర్తించాను. ఇంకెప్పుడు అలా జరగదు నాది బాధ్యత.. సారీ' అని చెబుతాడు.

నందూ సారీతో రగిలిపోయిన లాస్య
నందూ సారీ చెప్పడంతో తులసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ, లాస్యకు మాత్రం అతడలా ప్రవర్తించడం నచ్చదు. దీంతో కోపంగా 'ఏమైంది నందూ నీకు? నువ్వు ఇలా తగ్గిపోతున్నావు ఎందుకు? నువ్వు సారీ చెప్పడం వల్ల నన్ను కూడా నువ్వు అవమానించినట్టే. అసలు ఇప్పుడు మనమేం చేశామని సారీ చెప్పావ్? మనిద్దరం భార్యభర్తలం... మనకు నచ్చినట్లు ఉండే హక్కు మనకుంది' అంటుంది. దీంతో నందూ 'లాస్య థింక్ పాజిటివ్.. మన గురించే కదా తులసి చెప్పేది. అది మన మంచికే కదా. అందుకే చెప్పాను' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

అంకితను పని చేయొద్దన్న తులసి
వంటింట్లో పనిచేస్తున్న అంకితను చూసిన తులసి 'ఇక నుంచి నువ్వు ఇంట్లో పనులు చేయకు. నువ్వు నీ చదువు, కెరీర్ మీద దృష్టి పెట్టు' అంటుంది. దీంతో ఆమె 'మా అమ్మ అన్న మాటలకు నన్ను దూరం పెడుతున్నారా ఆంటి?' అని అడుగుతుంది. దీనికి తులసి 'మీ అమ్మ మాటలు నేను ఎప్పుడో మరిచిపోయాను. నీ భవిష్యత్తు కోసం.. నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. అవసరం ఉన్నప్పుడు చదువుకోవడం కాదు.. అవసరం ఉన్నప్పుడు ఉద్యోగం చేయడం కాదు.. ఆడది తన కాళ్ల మీద తాను నిలబడినప్పుడే విలువ ఉంటుంది' అని చెబుతుంది. అంతేకాదు, 'నేను నిన్ను డాక్టర్ గా చూడాలి. వెళ్లి జూనియర్ డాక్టర్‌గా ప్రయత్నించు' అంటుంది. దీంతో తులసిని హత్తుకున్న అంకిత.. వచ్చే జన్మలో ఆమె కడుపున పుట్టాలని కోరుకుంటుంది.

శృతి మాటలకు కోపంగా ఉన్న ప్రేమ్
ప్రేమ్ ఎక్కడికో వెళ్లేందుకు రెడీ అవుతుంటాడు. అప్పుడు కాఫీ తాగమంటుంది శృతి. కానీ, అతడు వద్దంటాడు. అప్పుడు శృతి 'కాఫీ మానేస్తే నా మీద కోపం తగ్గిపోతుందా? నువ్వు ఇలా ఉంటే నేను ఉండలేను ప్రేమ్' అంటుంది. ఇంతలో అంకిత అక్కడకొచ్చి వింటుంటుంది. శృతి మాటలకు ప్రేమ్ 'అనాల్సినవన్నీ అనేసి ఇప్పుడు మరిచిపో అంటే ఏంటి అర్థం? చేతగానివాడివి కాదు అని నిరూపించుకో అంటే దాని అర్థం నేను చేతగానివాడిని అనే కదా. నేను డబ్బులు సంపాదించాలి. నీ పరువు నిలబెట్టాలి అంతే కదా. నీ భర్తగా లూజర్ అని అనిపించుకోకుండా ఉండటం కోసం డబ్బు సంపాదిస్తా' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

శృతికి అలా ధైర్యం చెప్పిన అంకిత
ప్రేమ్ కోపవంగా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో అంకిత లోపలికి ఎంట్రీ ఇస్తుంది. అప్పుడామె 'ప్రేమ్ కోపంగా బయటికి వెళ్లడం నేను చూశాను. నేను మీ మాటలు విన్నాను శృతి. ఏంటో ఈ మగాళ్లంతా ఇంతేనేమో. తమ ప్రేమతో పెళ్లాన్ని ఆకాశానికి ఎత్తుతారు. భార్య నోరు తెరిచి అలా కాదు. ఇలా అంటే చాలు తట్టుకోలేరు. భార్యభర్తలు అన్నాక ఇలాంటి మనస్పర్థలు తప్పవేమో శృతి. అయినా ఎప్పుడూ భార్యలే తగ్గాలా?' అంటూ ఆమెకు ధైర్యం చెప్పేలా మాట్లాడుతుంది. దీనికి శృతి 'ఎవరు తగ్గాలి అనేది కాదు.. భార్యాభర్తల బంధం అనేది ముఖ్యం' అంటుంది.

కండీషన్ పెట్టిన తులసి.. అంతా ఓకే
అత్తమామల దగ్గరకు వచ్చిన తులసి.. 'అభి గురించి తలుచుకుంటే భయం వేస్తుంది' అంటుంది. దీనికి పరందామయ్య 'అవును అమ్మా.. నిన్నే ఎదిరించే స్థాయికి వాడు ఎదిగాడు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు' అని అడుగుతాడు. దీంతో 'ఒకసారి పిల్లలను పిలిచి మాట్లాడుదాం అని అనుకుంటున్నా' అని అందరినీ పిలుస్తుంది. దీంతో అందరూ అక్కడకు వస్తారు. అప్పుడు 'మీరు నాకు ప్రతి నెలా జీతం ఇస్తేనే మీ అందరి బాధ్యత నేను తీసుకుంటాను. లేదంటే ఎవరి ఇష్టం వాళ్లది' అని చెబుతుంది. దీనికి ప్రేమ్ వెంటనే ఓకే చెబుతాడు. కానీ, అభి మాత్రం ఎన్నో ఆలోచనల తర్వాత సరే అని బదులిస్తాడు. ఆ సమయంలో కూడా లాస్య గొడవ పెట్టాలని చూస్తుంది. కానీ, ఆమెను జోక్యం చేసుకోవద్దని తులసి వారిస్తుంది.
Recommended Video

మాధవి ఇంటికి అభి.. డబ్బులిచ్చేసి
మరోవైపు 'ఇప్పుడు ఎలాగైనా డబ్బు కావాలి. కానీ.. అంత డబ్బు ఎవరిస్తారు' అని ఆలోచిస్తుంటాడు అభి. ఇంతలో అతడికి మాధవి గుర్తొస్తుంది. వెంటనే ఆమె ఇంటికి వెళ్తాడు. దీంతో మాధవి 'ఎంత కాలానికి వచ్చావురా. కనీసం మీ నాన్న కన్నా మీకన్నా నేను గుర్తున్నాను' అంటుంది. అప్పుడు అభి 'నా సంపాదన ఎటూ సరిపోవడం లేదు. నా జాబ్‌ను నమ్ముకుంటే జీవితంలో ఎటూ ఏం సాధించలేను. అందుకే బిజినెస్ స్టార్ట్ చేద్దామనుకుంటున్నాను. దాని కోసం ఒక లక్ష రూపాయలు తక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో నువ్వు తప్ప నాకు హెల్ప్ చేసేవాళ్లు ఎవరూ లేరు అత్తయ్య' అంటాడు. దీంతో మాధవి డబ్బులు తీసుకొచ్చి ఇస్తానంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











