For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: పరందామయ్యకు ప్రాబ్లం.. సాయం చేయని లాస్య.. అతడికి తులసి షాక్

  |

  దాదాపు మూడు దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

  దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఆస్పత్రిలోనే సామ్రాట్, తులసితో నందూ గొడవ పడతాడు. అప్పుడే డాక్టర్ వచ్చి శృతి సేఫ్‌గానే ఉందని, ఆమె గర్భానికి ఎలాంటి ప్రమాదం లేదని చెబుతుంది. దీంతో తులసి ఒక్కసారిగా నందూపై విరుచుకుపడుతుంది. వెన్నుపోటు అంటే ఏంటో సరైన ఉదాహరణలు చెప్పి అతడికి, లాస్యకు బిగ్ షాక్ ఇస్తుంది. అనంతరం ఇంటికి వెళ్తూ నందూ తీరుపై సామ్రాట్ దగ్గర అసహనం వ్యక్తం చేస్తుంది. ఇక, చివర్లో శృతి కోసం తులసి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడం నందూకు నచ్చదు. కానీ అనసూయ మాత్రం ఆమెనే సపోర్ట్ చేస్తుంది.

  హీరోయిన్‌పై వర్మ సంచలన పోస్ట్: ఆమె రెండు కాళ్లను ఎడం చేసి.. F** అంటూ ఘోరంగా!

  నందూకు అడ్డు చెప్పిన పిల్లలు

  నందూకు అడ్డు చెప్పిన పిల్లలు

  తులసి వల్లే శృతికి సమస్య వచ్చిందని నందూ ఆరోపిస్తూ ఉంటాడు. అంతేకాదు, తులసి వల్లే గతంలో కూడా చాలా రకాల సమస్యలు వచ్చాయి. ఇది వరకు అంకితకు అబార్షన్ అవడానికి కూడా తులసే కారణం అంటాడు. దీనికి అంకిత 'నా అబార్షన్‌కు, ఆంటీకి ఎలాంటి సంబంధం లేదు అంకుల్. మా అమ్మ వల్లే అలా జరిగింది' అని చెబుతుంది. దీంతో నందూ 'మీ అమ్మతో తులసి సరిగా ఉండకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది' అంటాడు. అప్పుడు ప్రేమ్ 'మేము ఇక్కడ ఉండటానికి కారణమే అమ్మ. అమ్మ చెప్పింది కాబట్టే ఇక్కడ ఉన్నాం' అంటాడు.

  తులసి చుట్టం మాత్రమేనంటూ

  తులసి చుట్టం మాత్రమేనంటూ

  ప్రేమ్ మాట్లాడిన తర్వాత దివ్య కూడా తండ్రితో విభేదిస్తుంది. 'మా కాళ్లకు సంకెళ్లు వేయడానికి ట్రై చేయకండి. ఇక్కడ మేమంతా బలవంతంగానే ఉండాల్సి వస్తుంది. మామ్ కావాలా.. డాడ్ కావాలా అని డిసైడ్ చేసుకునే పరిస్థితి తీసుకురాకండి' అంటుంది. దీంతో నందూ 'అసలు తులసి వల్ల ఇక్కడ ఇలాంటి డిస్కర్షన్ జరగడానికి వీలులేదు. తను మన ఇంటికి వచ్చి వెళ్లే చుట్టం మాత్రమే. మనమంతా ఒక ఫ్యామిలీ. కాబట్టి అందరం ఎలాంటి గొడవలు లేకుండా కలిసే ఉందాం. ఇలాంటి సిచ్యుయేషన్స్ ఈ ఇంట్లో మళ్లీ రాకూడదు' అని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

  Bigg Boss 7: బిగ్ బాస్ సంచలన నిర్ణయం.. కొత్త హోస్టుగా మంచు హీరో.. బాలకృష్ణ చేసిన పని వల్లే ఇలా!

  తులసికి సహాయం చేసిన దివ్య

  తులసికి సహాయం చేసిన దివ్య

  ఇక, ఆఫీసులో మీటింగ్‌కు సంబంధించిన ఫైల్స్‌ను సామ్రాట్ తులసికి అప్పగిస్తాడు. అయితే, అవన్నీ ఇంగ్లీష్‌లో ఉంటాయి. దీంతో తులసికి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు వెంటనే దివ్యకు ఫోన్ చేస్తుంది. అప్పుడు దివ్యతో నాకో ప్రాబ్లం వచ్చిందమ్మా. ప్రాజెక్టు రిపోర్ట్ ఒకటంతా ఇంగ్లీష్ లో ఉంది. చదవడం కష్టంగా ఉంది. అది తెలుగులో కావాలి. ఏం చేయాలి' అని అడుగుతుంది. దీంతో దివ్య 'లాప్‌టాప్ ఓపెన్ చేసి నేను చెప్పినట్టుగా చేయి. అందులో ట్రాన్స్‌లేటర్ ఓపెన్ చేయి' అంటుంది. దివ్య చెప్పినట్లుగా చేసి ఆ రిపోర్టును తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేస్తుంది.

  పరందామయ్యకు షుగర్ డౌన్

  పరందామయ్యకు షుగర్ డౌన్

  పరందామయ్యకు ఒంట్లో నలతగా ఉంటుంది. దీంతో నిద్రిస్తోన్న అనసూయను లేపుతాడు. దీంతో ఆయన చెమటలు చూసిన ఆమె షుగర్ డౌన్ అయిందేమో అంటుంది. అప్పుడు వెళ్లి చక్కెర కలిపిన నీళ్లు తీసుకురా అంటాడు. దీంతో అనసూయ కిచెన్‌లోకి వెళ్తుంది. కానీ, అక్కడ ప్రతి దానికీ లాక్ చేసి ఉంటుంది. దీంతో చేసేదేం లేక లాస్య దగ్గరకు వెళ్తుంది. ఆమెతో 'మామయ్య గారికి షుగర్ డౌన్ అయింది చెక్కర నీళ్లు కావాలి' అంటుంది.

  దీంతో లాస్య దానికి నన్ను ఎందుకు లేపారు అంటుంది. దీనికి అనసూయ కిచెన్ లో అన్నీ లాక్ వేసి ఉన్నాయి అని బదులిస్తుంది. అప్పుడు లాస్య 'ఆ లాక్ ఎక్కడుందో నాకు గుర్తు లేదు. తెల్లారి చూసుకుందాం' అని తలుపు మూసుకుంటుంది. దీంతో అంకిత కనిపించి శృతి దగ్గర గ్లూకోజ్ తీసుకొచ్చి ఇస్తుంది.

  మళ్లీ తెగించిన అషు రెడ్డి: అమాంతం షర్ట్ విప్పేసి ఎద అందాల ఆరబోత

  తులసి ఆలస్యం.. బెనర్జీ ఫ్రాడ్

  తులసి ఆలస్యం.. బెనర్జీ ఫ్రాడ్

  మరోవైపు, ఆఫీసులో సామ్రాట్ తులసి కోసం వేచి చూస్తూ ఉంటాడు. పీఏని అడగ్గా ఆమె ఇంకా రాలేదు కానీ, బెనర్జీ గారు వచ్చారు అని చెప్తాడు. దీంతో సామ్రాట్ 'టైమ్‌కు ఉండాలి కదా. ఇంకా ఎందుకు రాలేదు తులసి. సరే బెనర్జీని లోపలకి రమ్మను' అని అంటాడు. ఇక, తులసి మాత్రం రోడ్డు మీద ఎవరి కోసమో వెయిట్ చేస్తూ ఉంటుంది.

  అప్పుడు బెనర్జీ కంపెనీలో పని చేసే ఒక వ్యక్తి వచ్చి అర్జెంట్‌గా మాట్లాడాలన్నారేంటి అని అంటాడు. దీంతో తులసి 'గవర్నమెంట్ స్కూల్ ప్రాజెక్ట్‌ను హ్యాండిల్ చేసింది మీరే కదా. బెనర్జీ గారి గురించి చెప్పండి' అని అడుగుతుంది. దీంతో 'వాడు ఒక ఫ్రాడ్. అలాంటి వాడిని పొరపాటున కూడా మీ కంపెనీలోకి ఎంటర్ చేయొద్దు' అంటాడు. దీంతో 'విలువైన సమాచారం ఇచ్చినందుకు థాంక్స్' అని ఆఫీసుకు వెళ్తుంది.

  మీ తల పగలగొడతారు అంటూ

  ఉదయం కాగానే అంకితను కాఫీ తీసుకు రమ్మని లాస్య అడుగుతుంది. దీంతో అంకితకు రాత్రి పరందామయ్య విషయంలో ఆమె చేసింది గుర్తుకు వస్తుంది. దీంతో వెంటనే ఆమెపై ఫైర్ అవుతుంది. 'అంకుల్ నీతో మాట్లాడనందుకే తల పగుల గొట్టుకున్నావు. తాతయ్యకు ఏమైనా అయితే అంకుల్ నీ తల పగులగొడతారు. నైట్ ఏం జరిగిందో అంకుల్‌కు చెప్పమంటావా' అంటూ ఝలక్ ఇస్తుంది. దీంతో లాస్య ఒక్కసారిగా కామ్ అయిపోతుంది. దీంతో అంకిత అక్కడ నుంచి వెళ్లిపోతుంది. అనంతరం లాస్య రాత్రి జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుని భయపడుతుంది.

  బికినీ సైజ్ తగ్గించిన సీరియల్ నటి: టెంప్ట్ చేసే షేపులతో బాబోయ్!

  బెనర్జీకి షాక్ ఇచ్చేసిన తులసి

  బెనర్జీకి షాక్ ఇచ్చేసిన తులసి

  బెనర్జీ, సామ్రాట్ ఇద్దరూ తులసి కోసం చూస్తుంటారు. అప్పుడు బెనర్జీ 'నాకు మినిస్టర్ అపాయింట్‌మెంట్ ఉంది. త్వరగా ప్రాజెక్ట్ డీల్ ఓకే అయితే వెళ్తా' అని కంగారు చేస్తుంటాడు. దీంతో తులసి కోసం చూస్తున్నా అనగా.. మీరే బాస్ కదా అంటూ బెనర్జీ ఫోర్స్ చేస్తాడు. దీంతో సామ్రాట్ ఆ ఫైల్‌పై సంతకం చేయబోతాడు. అంతలో అక్కడకు వచ్చిన తులసి సైన్ చేయకుండా ఆపుతుంది. అంతేకాదు, బెనర్జీ ఫ్రాడ్‌ను బయటపెడుతుంది. దీంతో బెనర్జీ 'లక్షల మంది బిజినెస్‌లు చేస్తున్నారు అందరికీ లైసెన్స్‌లు ఉన్నాయా? ప్రెజెంట్ సిచ్యుయేషన్‌లో ఇవన్నీ కామన్ సార్. మీరు చూసీ చూడనట్టు వదిలేయాలి' అంటాడు. దీంతో సామ్రాట్ 'మీకు ఉంది కానీ.. మాకు లేదు.. మీరు ఇక బయలుదేరొచ్చు' అంటాడు. ఇలా ఈ ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 831: Lasya Refuses to Help Anasuya and Parandhamaiah. Then Ankitha Fires on Her. After That Tulasi Reveals The Truth about Banerjee.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X