Intinti Gruhalakshmi Today Episode: అభి బండారం బట్టబయలు.. తులసికి గుడ్ న్యూస్ చెప్పిన అంకిత
చాలా ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అయ్యే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోందన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. నందూ, లాస్య ఇద్దరూ తాగి వచ్చారన్న కోపంతో ఉన్న తులసి.. ఉదయాన్నే వాళ్లకు క్లాస్ పీకుతుంది. అప్పుడు లాస్య ఎదురు తిరిగి మాట్లాడగా.. నందూ మాత్రం ఆమెకు సారీ చెబుతాడు. ఆ తర్వాత అంకితను ఇంటి పనులు చేయొద్దని చెప్పిన తులసి.. జూనియర్ డాక్టర్‌గా చేయమని కోరుతుంది. దీంతో ఆమె ఎంతగానో సంతోషిస్తుంది. అనంతరం తనను చేతకాని వాడినన్న శృతిపై ప్రేమ్ కోపంగా ఉంటాడు. అప్పుడు అంకిత ఆమెకు ధైర్యం చెబుతుంది. చివర్లో అభి.. మేనత్త మాధవి దగ్గరకు డబ్బుల కోసం వెళ్తాడు.

డబ్బు తీసుకున్నాక అభి కండీషన్
డబ్బుల కోసం మాధవి దగ్గరకు వచ్చిన అభికి అక్షరాల లక్ష రూపాయలు ఇచ్చేస్తుంది. ఆ సమయంలో అభి ‘నీ దగ్గర డబ్బు తీసుకున్నట్టు దయచేసి మామ్‌కు చెప్పకు అత్తయ్యా' అని కండీషన్ పెడతాడు. దీంతో అలా ఎందుకురా అమ్మ సంతోషపడుతుంది కదా అంటుంది మాధవి. దీంతో అభి ‘లేదు అడ్డుపడుతుంది అత్తయ్యా.. మామ్‌కు సెంటిమెంట్స్ ఎక్కువ. డాడ్ బిజినెస్‌లో ఫెయిల్ అయ్యారని, ఆయన వారసుడిగా నాకు కూడా బిజినెస్ అచ్చిరాదని తను అనుకుంటుంది' అంటాడు. దీంతో మాధవి సరే అంటుంది. అప్పుడు అభి వెళ్లిపోతాడు.

మాధవిని భయపెట్టిన భర్త మోహన్
అభి వచ్చి డబ్బులు తీసుకుని వెళ్లిపోయిన తర్వాత మోహన్ వచ్చి ‘అభి డబ్బులు తీసుకున్నాడని మీ వదినకు చెప్పకపోతే నువ్వే ఇబ్బందుల్లో పడతావు. వాడు ఏ బిజినెస్ చేస్తున్నాడో అడిగావా? పోనీ వాడైనా చెప్పాడా' అని అడుగుతాడు. దీనికామె అడగలేదని బదులిస్తుంది. అప్పుడు మోహన్ ‘ఒకపని చేయ్.. తులసి దగ్గరికి వెళ్లి సీక్రెట్‌గా ఈ విషయం చెప్పేయ్. ఏంటి ఆలోచిస్తున్నావు. వాడు చెప్పొద్దన్నాడని ఆలోచిస్తున్నావా? లేక వాడు ఫీల్ అవుతాడని ఆలోచిస్తున్నావా? డబ్బులు పోతే పోయాయి కానీ.. ఒకవేళ వాడు ఆ డబ్బులతో జీవితాన్ని పాడు చేసుకుంటే అప్పుడు నువ్వే బాధపడాల్సి వస్తుంది' అని భయపెడతాడు. దీంతో మాధవి ఆలోచనల్లో పడుతుంది.

సరుకులు తీసుకుని వచ్చిన లాస్య
మరోవైపు, పరందామయ్యకు రాములమ్మ టీ తెచ్చి ఇస్తుంది. అప్పుడామె ‘మీరు టీ తాగడం తగ్గించాల్సి ఉంటుంది. రోజు రెండు మూడు టీలు తాగితే గ్యాస్ ఎలా తగ్గుతుంది' అని అంటుంది. ఇంతలో లాస్య కొన్న కిరాణా సామాన్లు తీసుకొని కొందరు ఇంట్లోకి వస్తారు. వాటిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి వెళ్తారు. అప్పుడు తులసి ‘ఏం సామాన్లు తెచ్చావు. నేను తెచ్చేదాన్ని కదా' అంటుంది. దీంతో ‘ఏ.. నేను సరుకులు కూడా తేవద్దా' అంటుంది. ఆ తర్వాత లాస్య ఏఏ సరుకులు తీసుకుని వచ్చిందో అని రాములమ్మ చూస్తుంది. అందులో అవసరం లేనివి ఎక్కువ.. అవసరం ఉన్నవి తక్కువ ఉండడంతో ఆమెపై పంచులు వేస్తూ నవ్వుకుంటారు.

లాస్యతో మాధవి గొడవ.. తులసిపై
లాస్యను ఎగతాళి చేస్తుండగా ఆమె తులసిపై ఫైర్ అవుతుంది. అంతలో అక్కడకు మాధవి వస్తుంది. వచ్చీ రావడమే లాస్యను తిడుతూ ఉంటుంది. దీంతో ఇద్దరి మధ్య డిస్కర్షన్ జరుగుతుంది. అప్పుడు తులసి గొడవలు వద్దు అంటూ సర్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు లాస్య ‘నువ్వే రెచ్చగొట్టి గొడవలు పెడుతున్నావ్' అంటూ తులసిపై అరుస్తుంది. అయినా ఆమె మాత్రం కూల్‌గా ‘లాస్య.. ఈ సరుకులు ఎక్కడి నుంచి తెప్పించావో చెప్పు. అందులో అనవసరం అయినవి ఉంచి.. మిగతావి అన్నీ తీసుకెళ్లి ఇచ్చేసి వేరేవి తీసుకు వద్దాం' అంటుంది తులసి.

నువ్వే పనికి రాని దానివి అంటూనే
తులసి మంచిగా అడిగినా లాస్య మాత్రం ‘ఈ ఇంట్లో అవసరం లేని దానివి నువ్వే ఉన్నావు. నిన్ను తీసుకెళ్లి బయట పడేయాలా' అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు అక్కడే ఉన్న మాధవి ‘ఆ లాస్య అలా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నువ్వు ఏం మాట్లాడటం లేదు ఏంటి వదినా' అంటుంది. దీంతో తులసి ‘తప్పదు మాధవి. ఈ ఇంట్లో నా విలువ రోజు రోజుకూ పడిపోతూనే ఉంటోంది. ఇవన్నీ నాకు మామూలే. అయినా అవన్నీ పక్కన పెట్టు.. చాలా రోజుల తర్వాత ఈ వదిన గుర్తొచ్చింది ఏంటి సంగతి' అంటుంది.

అభి గురించి నిజం చెప్పిన మాధవి
తులసి అడగ్గానే మాధవి ‘నీకు చెప్పకుండా అభికి లక్ష రూపాయలు ఇచ్చాను. అవును వదిన. బిజినెస్ సంపాదించి డబ్బులు సంపాదించి నీకు తోడుగా నిలబడాలి అన్నాడు. దీంతో ఇచ్చాను' అంటుంది. అప్పుడు తులసి ‘ఇచ్చేముందు నాకు ఒక్కమాట చెప్పాల్సింది మాధవి. వాడు ఇదివరకు అభి కాదు.. మారిపోయాడు. వాడిని కాపాడుకోకపోతే వాడి జీవితం నాశనం అవుతుంది. వాడిని ఏమాత్రం బెదిరించినా వాడు దూరం అయిపోతాడు. నా గుండెలో ఈ బాధను ఇప్పటి వరకు నీకు తప్ప ఇంకెవరికీ చెప్పుకోలేదు. జరిగిందేదో జరిగిపోయింది. నాకు చెప్పిన విషయం వాడికి తెలియనీయకు. నేను ఎలాగోలా చూసుకుంటాను' అంటుంది. తర్వాత ‘నాకు కూడా తెలియకుండా డబ్బు తీసుకొని వీడు ఏం చేస్తున్నట్టు' అనుకుంటుంది తులసి.
Recommended Video

అభికి లాభం.. అంకితకు ఉద్యోగం
అభి డబ్బు తీసుకొని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు. వెంటనే డబ్బు షేర్ మార్కెట్‌లో పెట్టమని తన ఫ్రెండ్‌కు చెబుతాడు. అతడు అందులో పెట్టగానే మొదటి రోజు కొంచెం లాభం వస్తుంది. దీంతో అభి పొంగిపోతుంటాడు. మరోవైపు, అంకితకు ఆస్పత్రిలో ఉద్యోగం వస్తుంది. ఆ విషయాన్ని ఇంట్లో వాళ్లకు చెప్పగా అందరూ సంతోషిస్తారు. అంతలో గాయత్రి వచ్చి తాను రికమెండ్ చేయడం వల్లే ఉద్యోగం వచ్చిందని అంటుంది. దీంతో అంకిత ‘నువ్వు చెప్పావని ఇంటర్వ్యూకు వెళ్లలేదు. అసలు నువ్వు చెప్పిన ఆస్పత్రికి వెళ్లలేదు. తులసి ఆంటీ కోసమే వెళ్లాను. అది కూడా చిన్న ఆస్పత్రిలోనే ఉద్యోగం వచ్చింది' అని చెప్తుంది. దీంతో గాయత్రికి కోపం వస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











