Intinti Gruhalakshmi Today Episode: తులసి ఫ్యామిలీకి జాక్‌పాట్.. అలా చేతికొచ్చిన విలువైన ఆస్తి
చాలా ఏళ్ల తరబడి నడుస్తోన్న ట్రెండ్ ప్రకారం తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' మంగళవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

సోమవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే
సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసిపై నందూ కోప్పడిన విషయాన్ని గుర్తు చేసుకుని ఇంట్లో వాళ్లంతా బాధ పడుతూ ఉంటారు. అప్పుడామె వచ్చి వాళ్లను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఎప్పటికీ నందూకు లొంగిపోయే ఉంటావా అన్నట్లుగా వాళ్లు ప్రశ్నిస్తారు. దీంతో తులసి వాళ్లకు క్లాస్ పీకుతుంది. ఆ తర్వాత నందూ తన కోసం రాడని దివ్య బాధపడుతుంది. దీంతో తులసి వెళ్లి అతడిని బ్రతిమాలుతుంది. అప్పటికే లాస్య నందూను రెచ్చగొడుతుంది. దీంతో నందూ తప్పక ఒప్పుకుంటాడు. ఆ తర్వాత అందరూ కలిసి ఏడుస్తూ ఆమెను ఢిల్లీకి పంపేందుకు ప్రయత్నాలు చేస్తారు.

తల్లికి దివ్య సలహా.. బాధపడుతూ
ఢిల్లీ వెళ్తున్న దివ్యకు ఇంట్లో వాళ్లు ఏడుస్తూనే సెండాఫ్ ఇస్తారు. ఆ సమయంలో దివ్య 'నా గురించి ఎక్కువ ఆలోచించకు. దిగులు పడకు. ప్రశాతంగా ఉండు.. పక్కనే ఒక దిండు పెట్టుకో అది నేనే అనుకో' అని సలహాలు ఇస్తుంది. ఆ తర్వాత ప్రేమ్, అభి, శృతి, అంకిత, దివ్యలు ఒకరినొకరు పట్టుకుని బాగా ఏడుస్తారు. తర్వాత ఆమెను ఎయిర్‌పోర్టుకు తీసుకెళ్లి ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కిస్తారు. దివ్య వెళ్లిపోయిన తర్వాత తులసికి అస్సలు నిద్రపట్టదు. ఆమెకు కూతురే గుర్తుకు వస్తుండటంతో చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. అలా కూతురు ఫొటోలను ఫోన్‌లో చూసుకుని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది.

దివ్యను చూస్తూ.. తులసి కన్నీరు
దివ్య ఫొటోను ఫోన్‌లో చూస్తోన్న సమయంలో తులసి 'ఈ అమ్మని ఒంటరిగా వదిలేసి దూరంగా వెళ్లిపోయావు. ఊరు కానీ ఊరిలో ఒక్కదానివే ఎలా ఉంటావో? ఎలా తింటావో? అన్న భయం అస్సలు లేదు. నేను ఎలా ఉండాలా? అన్న దిగులు మాత్రమే ఉంది. నువ్వు వెళ్లిపోయిన తర్వాత ఈ ఇల్లు అంతా బోసిగా అనిపిస్తుంది తల్లీ. ఏ పని చేస్తున్నా నువ్వే గుర్తొస్తున్నావు. నీ గురించే నా ఆలోచనలు.. నువ్వు ఎక్కడున్నా బాగుండాలి తల్లీ' అని అనుకుంటుంది. ఆ తర్వాత నిద్ర పోవడానికి తులసి ఎంతగానో ప్రయత్నిస్తుంది. కానీ, ఆమెకు మాత్రం దివ్యనే గుర్తుకు వస్తూ ఉంటుంది.

గునపంతో నందూ.. తులసి వెళ్లి
తులసి అలా నిద్రపోదాం అనుకున్న సమయంలోనే నందూ గునపం తీసుకుని ఏదో తవ్వుతూ ఉంటాడు. అది తులసి చూసి షాక్ అవుతుంది. ఆ వెంటనే అతడి దగ్గరకు వెళ్లి 'ఏంటండీ.. ఏం చేస్తున్నారు? దయచేసి ఈ పిచ్చి పనిని ఆపండి' అని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో నందూ కోపంతో ఒక్కసారిగా ఆమెను తోసేస్తాడు. దీంతో తులసి పక్కనే ఉన్న టేబుల్ మీద పడిపోతుంది. అలా పడిపోయినా తులసి వెంటనే లేస్తుంది. అంతేకాదు, అసలేం చేస్తున్నారు చెప్పండి అంటూ గట్టిగా అరుస్తుంది. దీంతో 'లోలోపల తట్టుకోలేని కోపం ఉంది' అంటాడు. దీంతో తులసి 'కోపం ఎవరి మీద? ఎందుకు' అని ప్రశ్నిస్తుంది. అప్పుడు నందూ 'నామీద నాకే కోపం.. నా చేతకానితనం మీద కోపం' అని అంటాడు.

చేతులు చూసి బాధ పడుతూనే
నందూ మాట్లాడిన తర్వాత తులసి అతడిపై జాలి పడుతుంది. అంతేకాదు, 'కోపం ఉంటే మిమ్మల్ని మీరు గాయపరుచుకుంటారా? మీ చేతులు చూపించండి' అని అడుగుతుంది. అప్పుడతను చూపించగానే చేతులు కమిలిపోయి ఉంటాయి. దీంతో తులసి 'హయ్యయ్యో.. మీ చేతులు కందిపోయాయి. రక్తం వచ్చేట్టు ఉంది. ఎందుకు ఈ పిచ్చిపని? ఏం సాధిద్దాం అని' అంటూ సీరియస్ అవుతుంది. దీనికి నందూ 'నేను ఎవర్ని సాధిస్తాను? అందరికీ నేనే లోకువ అయ్యాను. నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు. నేను ఈ ఇంట్లో ఉన్నా లేనట్టే. అందుకే నాకు ఎవరూ విలువ ఇవ్వడం లేదు' అని ఏడుస్తాడు. దీంతో నందూకు ఆమె హితబోధ చేస్తుంది.

పందికొక్కులు అంటూ హేళన
తులసి ఉదయాన్నే అనసూయ కాళ్లు పడుతూ ఉంటుంది. ఇంతలో పరంధామయ్య వచ్చి.. రాత్రి పంది కొక్కు గార్డెన్‌లో తవ్వేసింది అంటూ తిడుతుంటాడు. అయితే అది నందూ తవ్వాడని తెలిసిన తులసి.. అతడిని చూసి నవ్వుకుంటుంది. ఇది గమనించిన నందూ తెగ ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇంతలో రాములమ్మ వచ్చి మాయదారి పందికొక్కు అని అంటుంది. అప్పుడే పరంధామయ్య.. 'ఒరేయ్ నందు.. బయటకు వెళ్లినప్పుడు పందికొక్కుకి పెట్టడానికి మందు తీసుకుని రారా' అని అంటాడు. దీంతో నందూ ఈసారి తవ్వితే చూద్దాం అంటాడు. అప్పుడు తులసి 'మళ్లీ తవ్వుతుందని అంటారా? ఈసారి తవ్వదేమో అనుకుంటున్నా. నచ్చజెప్పినా వినదంటరా' అంటుంది. దీంతో నందూ ఈ పందికొక్కుల గొడవ ఆపండి అని అంటాడు.

పరందామయ్య చేతికి ఆస్తులు
అందరూ మాట్లాడుతుండగా ఓ కొరియర్ వస్తుంది. అది చూసిన తులసి ఓపెన్ చేయబోతుండగా.. లాస్య లాక్కుంటుంది. అంతేకాదు, ఆమె తీసుకుని చదువుతుంది. ఆ తర్వాత ఆమె 'మామయ్య గారు.. కుక్కని తన్నినా కలిసి వచ్చేట్టు ఉంది. అప్పట్లో మీకు సిటీలో ఉన్న స్థలం ఎవరో కబ్జా చేశారని కేసు వేశారు కదా.. దాని జడ్జిమెంట్ మనకు అనుకూలంగా వచ్చింది. కబ్జా అయిన భూమి మళ్లీ మన చేతికి వచ్చింది' అని శుభవార్త చెబుతుంది. అది వినగానే నందూ 'ఈ ఆస్తి కలిసి రావడం నాకోసమేనేమో.. నా బిజినెస్‌కి నాన్న సహాయంగా నిలబడటం కోసమేనేమో' అని మనసులో అనుకుంటాడు.

ఆస్తి గురించి తీవ్ర ప్రయత్నాలు
ఆస్తి గురించి తెలిసిన వెంటనే తులసి 'మన కష్టాలు తీరిపోయినట్టే మామయ్యా.. మనకు మంచిరోజులు వచ్చినట్టే' అంటుంది. ఆ తర్వాత నందూను తన బిజినెస్‌కు మనీ ఇవ్వమని అడగమంటూ లాస్య రెచ్చగొడుతుంది. కానీ, పరందామయ్య మాత్రం ఆ ఆస్తిని ఏం చేయాలి అని తులసిని అడుగుతాడు. ఆ సమయంలో తులసి ఆ ఆస్తిని మీ దగ్గరే ఉంచుకోండి అంటుంది. దీంతో పరందామయ్య అది నా దగ్గర ఉంటే నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు అంటాడు. ఈ చర్చలు మాత్రం ఇలా కొనసాగుతూనే ఉంటాయి. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











