Intinti Gruhalakshmi Today Episode: తులసిని గెంటేసేందుకు లాస్య ప్లాన్.. హనీమూన్‌ అనడంతో చీవాట్లు

మిగిలిన భాషలతో పోల్చుకుంటే తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూడండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

 శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కుటుంబ సభ్యులు అందురూ అడ్డు పడడంతో పాటు ఇంట్లో నుంచి వెళ్లిపోతామని బెదిరించడంతో తులసి బయటకు వెళ్లిపోవాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుంది. దీంతో లాస్య నిరాశకు లోనవుతుంది. ఆ సమయంలో తులసికి హారతి ఇవ్వడంతో భాగ్య పుల్లలు పెడుతుంది. దీంతో లాస్య కూడా ఇంట్లో వాళ్లపై ఫైర్ అవుతుంది. అప్పుడామెకు కూడా హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అప్పుడు పూసల దండ జారి పడుతుంది. దీంతో ఏదో అశుభం జరగబోతుందని అందరూ భయపడతారు. ఇక, తులసి కోలుకుని నడుస్తుంది.

దివ్య చేసిన పనికి అందరూ సంతోషం

దివ్య చేసిన పనికి అందరూ సంతోషం

తులసి క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో అందరూ సంతోషంగా ఉంటారు. అప్పుడు దివ్య పాయసం చేసి తీసుకొస్తుంది. దీంతో అది రుచి చూసిన అందరూ కాసేపు టెన్షన్ పెట్టి.. బాగుందని చెబుతారు. అంతలో నందూ అక్కడకు వస్తాడు. అప్పుడు అతడికి కూడా దివ్య ఇస్తుంది. అతడు తిన్న తర్వాత 'బాగుందమ్మా. నా బంగారు తల్లి వంటలు కూడా నేర్చుకుంటుందా?' అని మెచ్చుకుంటాడు. ఇంతలో లాస్య అక్కడికి వస్తుంది. దీంతో దివ్య చెప్పకుండా ఆగిపోతుంది. దివ్యను లాస్యకు కూడా పాయసం ఇవ్వు అంటాడు పరందామయ్య. దీంతో ఆమె వద్దని చెబుతుంది.

హనీమూన్ అంటూ లాస్య చెప్పడంతో

హనీమూన్ అంటూ లాస్య చెప్పడంతో

పాయసం గురించి అయిపోయిన తర్వాత లాస్య 'తులసి.. నువ్వు త్వరగా రికవరీ అవ్వాలి. నువ్వు త్వరగా కోలుకుంటేనే కదా మాకు సెండాఫ్ ఇచ్చేది' అంటుంది. దీంతో నందూ 'మనం ఎక్కడికి వెళ్తున్నాం' అని అడుగుతాడు. అప్పుడామె మన హనీమూన్‌కు అని చెబుతుంది. దీనికి అనసూయ 'నీకు అసలు సిగ్గు ఉందా? పిల్లల ముందు ఈ మాటలు మాట్లాడుతావా?' అంటూ సీరియస్ అవుతుంది. దీనికి లాస్య 'నేను ఏం చేయను అత్తయ్య. ఎప్పుడు చూసినా నందు మీతోనే ఉంటున్నాదు కదా. తులసి దగ్గరే ఎక్కువగా ఉంటున్నాడు' అంటూ ఏదోదే చెబుతుంది.

సాక్ష్యం మీరే ఉండాలి అంటూ లాస్య

సాక్ష్యం మీరే ఉండాలి అంటూ లాస్య

అనసూయతో లాస్య మాట్లాడుతూ.. 'ఇంతకీ మమ్మల్ని హనీమూన్‌కు ఎక్కడికి వెళ్లమంటారు? మీరు ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్తాం. సాక్ష్యం ఉండాలి కదా. పెళ్లి ముందు పారిపోయిన వాడు.. ఫస్ట్ నైట్ ముందు పారిపోయిన వాడు.. హనీమూన్‌కు పారిపోడని నమ్మకం ఏంటి? అందుకే మీరు ఉంటే అప్పుడు సాక్ష్యం ఉంటుంది' అంటూ ఎడాపెడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. దీంతో తులసికి ఓ రేంజ్‌లో కోపం వస్తుంది. అప్పుడామె 'మీ భార్యకు చెప్పండి.. ఇక్కడ పనికిమాలిన మాటలు మాట్లాడొద్దని' అని నందూతో గంభీరమైన స్వరంతో చెబుతుంది.

లాస్యను అరిచిన నందూ.. వాగ్వాదం

లాస్యను అరిచిన నందూ.. వాగ్వాదం

తులసి చెప్పగానే.. 'లాస్య ఇంక చాలు.. ఇక్కడి నుంచి వెళ్లిపో. నాకు ఇంకేం చెప్పొద్దు. ఇక్కడి నుంచి తక్షణమే వెళ్లిపో' అని అరుస్తాడు. దీంతో లాస్య ఏదో మాట్లాడబోయి వెళ్లిపోతుంది. ఆ తర్వాత నందూ కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అనంతరం అతడు గదిలోకి వెళ్లగానే 'నందూ నువ్వు అందరి ముందు నన్ను ఎందుకు ఎగతాళి చేస్తున్నావు. అవమానిస్తున్నావు. పెళ్లికి ముందు నువ్వు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు' అంటుంది. దీనికతడు 'ఎందుకు మారాలి? నేను అప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నా' అంటూ బదులిస్తాడు.

లాస్యను ఎడాపెడా తిట్టేసిన నందూ

లాస్యను ఎడాపెడా తిట్టేసిన నందూ

ఆ తర్వాత నందూ 'నువ్వు ఈ ఇంటి కోడలువు. కోడలుగా ప్రవర్తించాలి. కోడలుగా నడుచుకోవాలి. కోడలుగా అనిపించుకోవాలి. ముందు మా అమ్మ నాన్నలను మంచిగా చేసుకో. వాళ్ల గురించి ఆలోచించు. నువ్వు భర్తనే పట్టించుకోవు. ఇక.. వాళ్లను ఏం పట్టించుకుంటావు. నా గర్ల్ ఫ్రెండ్‌గా ఉన్నప్పుడు పట్టించుకోలేదు. ఇప్పుడు నువ్వు నా భార్యవు. ఇప్పుడు కూడా అంతేనా? నీకు ఎదుటివాళ్ల గురించి అస్సలు పట్టదు. మనం హనీమూన్ గురించి మాట్లాడుకునే వయసులో లేము. ఇంకోసారి ఆ పంచాయితీ పెట్టి నాకు తలనొప్పి తీసుకురాకు' అని సీరియస్ అవుతాడు.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
తులసికి పంపేందుకు లాస్య వ్యూహం

తులసికి పంపేందుకు లాస్య వ్యూహం

ఇక, తులసి పూజ చేసేందుకు దేవుడి గదిలోకి వెళ్తుంది. అప్పుడు లాస్య అడ్డుపడుతుంది. పూజ చేయబోతుండగా ఆపుతుంది. అప్పుడు 'నేను నందూను పెళ్లి చేసుకుంది నాలుగు గోడల మధ్య కూర్చొని కాపురం చేసుకోవడం కోసం కాదు. కోడలుగా నా బాధ్యతను నిర్వర్తించడానికి. నువ్వు పూజ చేయడానికి వీలు లేదు. ఇప్పుడు నేను ఈ ఇంటి కోడలును. నా హక్కులకు అడ్డురాకు. పూజలు నేనే చేయాలి. కోడలుగా నేను చేసే పనులకు నాకు అడ్డు రాకు' అంటుంది లాస్య. దీంతో తులసి వెళ్లిపోతుంటే శృతి, అంకిత ఆపుతారు. కానీ, గొడవ వద్దని వెళ్లిపోతుంది తులసి. అంతేకాదు, తులసి కోట దగ్గరకు వెళ్లి పూజ చేసుకుంటుంది. దీంతో ఈ ఎపిసోడ్ పూర్తైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X