Don't Miss!
- Sports
Australia Open 2023 క్వీన్ అరినా సబలెంక..!
- Lifestyle
Astrology Tips: స్త్రీలు చేయకూడని పనులు.. వాటిని చేయడం వల్ల ఇంట్లో దరిద్రమే
- News
YCPకి నియోజకవర్గాన్ని రాసిస్తున్న TDP సీనియర్ నేత!
- Travel
పచ్చని గిరులు మధ్య దాగిన పుణ్యగిరి జలపాతం!
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Automobiles
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
Intinti Gruhalakshmi Today Episode: అంకిత, శృతి మధ్య చిచ్చు.. లాస్య సరికొత్త ప్లాన్.. ఆయనకు అవమానం
సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే
మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. బెనర్జీతో డీల్ వద్దని అనగానే అతడు తులసిపై ఫైర్ అవుతాడు. ఆ సమయంలో నీ కాంట్రాక్ట్ ఎక్కడా సెట్ కాకుండా చేస్తానంటూ తులసి ఛాలెంజ్ చేస్తుంది. మరోవైపు, శృతి టెర్రస్ మీద ఉండగా ప్రేమ్ ఆమెకు తల తుడుస్తాడు. అనంతరం అంకిత అక్కడకు రావడంతో గతంలో జరిగిన అబార్షన్ గురించి మాట్లాడుకుంటారు. అదంతా విన్న లాస్య తనకు మరో ఆయుధం దొరికిందని అనుకుంటుంది. ఇక, సామ్రాట్ తులసిని కంపెనీకి సీఈవోను చేస్తానని అంటాడు. ఆ తర్వాత హనీతో తులసి మాట్లాడి ఉత్సాహ పరుస్తుంది.

ముద్దు పెడుతూ దొరికిన ప్రేమ్
టెర్రస్ మీద ప్రేమ్, శృతి సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ సమయంలో ఆమె పెదాలపై అన్నం ఉండడంతో దాన్ని తన పెదాలతో తీస్తానని ప్రేమ్ అంటాడు. ఆ వెంటనే ఆమెను కిస్ చేసేందుకు ప్రయత్నం చేస్తుంటాడు. ఆ సమయంలోనే అక్కడకు అంకిత, అభి, దివ్య వస్తారు. వాళ్లను ఫన్నీగా కామెంట్లు చేస్తూ ఆటపట్టిస్తారు. దీంతో వాళ్లు షాక్ అవుతారు. అప్పుడు దివ్య 'మా అన్నయ్య నీకు ఏమాత్రం ఇబ్బంది లేకుండా పనులు చేస్తున్నాడు. నిన్ను అస్సలు కష్టపడనీయకుండా చేస్తున్నాడు' అంటుంది. దీంతో శృతి సిగ్గుపడగా అందరూ నవ్వుతారు.

లాస్య ఎంట్రీ.. అంకిత గురించి
వాళ్లంతా అక్కడ నవ్వుతూ ఉండగా.. లాస్య వస్తుంది. వచ్చీ రావడమే చప్పట్లు కొడుతూ 'వావ్.. అందరూ సంతోషంగా ఉన్నారు. ఇలా ఉంటేనే ఇంట్లో పాజిటివ్ వైబ్స్ వస్తాయి. కానీ.. నేను కూడా సంతోషపడాలంటే.. అంకిత కూడా తల్లి అవుతుందనే శుభవార్త చెప్పినప్పుడే. నువ్వు పెద్దకోడలువు. ఇంకా నీకు ఆ అదృష్టం లేకపోయిందే. కాబట్టి మీకు ఒక సలహా ఇస్తున్నాను. మీరిద్దరూ వెంటనే డాక్టర్‌ను సంప్రదించండి' అంటుంది. దీంతో అంకిత అందుకు నాకేం బాధ లేదు అంటుంది. దీంతో లాస్య ఖచ్చితంగా నీకు బాధ ఉంటుంది కానీ.. బయటపడటం లేదు అంటుంది.

ప్రసాదం కోసం వాళ్లు గుడికెళ్లి
పరందామయ్య, అనసూయ గుడికి వెళ్తారు. అప్పుడు అనసూయ 'ఎప్పుడు గుడికి రమ్మన్నా రాకపోయేవారు. ఈరోజు ఏంటి గుడికి వచ్చారు. భక్తి పెరిగిందా' అని అడుగుతుంది. దీనికి పరందామయ్య 'దేవుడి మీద శ్రద్ధ పెరిగింది. అయినా ఈ గుడిలో ప్రసాదం కూడా బాగుంటుందట. ఈ గుడి ప్రసాదానికి ఎక్కువ రేటింగ్ వచ్చింది. చాలా బాగుంటుందట' అని చెబుతాడు. దీంతో షాకైన అనసూయ 'అంటే.. మీరు ప్రసాదం కోసం వచ్చారా? చెంపలు వేసుకోండి. పదండి.. దేవుడికి దండం పెట్టుకుందాం' అంటూ ఆయనను గుడి లోపలికి తీసుకుని వెళ్తుంది.

జంటగా గంట కొట్టించడంతో
పరందామయ్య, అనసూయ వెళ్లిన గుడికి సామ్రాట్, హనీ, తులసిలు వస్తారు. అప్పుడు సామ్రాట్ మీరు తరుచూ ఈ గుడికి వస్తారా అని అడుగుతాడు. దీంతో ఆమె అవును.. ఇక్కడ ప్రశాంతంగా ఉంటుంది అంటుంది. తర్వాత పరందామయ్య, అనసూయ గుడిలోపలికి వెళ్లి దేవుడికి పూజ చేస్తారు. అనంతరం ఆయన ప్రసాదం ఎక్కడ పెడుతున్నారో అని వెతుకుతుంటాడు. అదే సమయంలో తులసి, సామ్రాట్, హనీ దేవుడి దగ్గరికి వెళ్లి పూజ చేస్తారు. హనీతో గంట కొట్టించేందుకు ఇద్దరూ వంగబోతారు. దీంతో ఇద్దరూ కలిసి కొట్టండి. ఏం అనుకోను అంటుంది. తర్వాత ఇద్దరూ కలిసి హనీకి గంట కొట్టిస్తారు.

తులసి, సామ్రాట్ కపుల్ అని
తులసి, సామ్రాట్ కలిసి హనీతో గంట కొట్టిస్తూ ఉండగానే పూజారి అక్కడకు వస్తారు. వచ్చీ రావడమే ఆయన 'భార్యాభర్తలు అన్నాక పిల్లలకు ఇద్దరూ కలిసి అలాగే గంట కొట్టించాలి' అంటాడు. దీంతో తులసి 'పూజారి గారు మేము ఇద్దరం భార్యాభర్తలం కాదు.' అని చెబుతుంది. దీనికాయన 'తప్పు అయింది క్షమించండి. మరి ఆయన మీకు ఏమవుతారు' అని ప్రశ్నిస్తాడు. అప్పుడు తులసి 'సామ్రాట్ గారు నాకు స్నేహితుడు మాత్రమే' అని వెళ్లిపోతుంది. ఆ తర్వాత తులసి ఆంటి నాకు ఐస్ క్రీమ్ కొనిస్తా అన్నారుగా అని హనీ అనగానే.. తులసి కొనిస్తా అని తీసుకెళ్తుంది.
వాళ్లు అంకితను ఓదార్చుతూ
లాస్య అన్న మాటలు గుర్తు తెచ్చుకొని అంకిత బాధపడుతుంటుంది. ఇంతలో శృతితో వచ్చిన ప్రేమ్ అంకితను ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతాడు. దీంతో ఏం లేదు అంటుంది. అప్పుడు శృతి 'లాస్య అన్నమాటలకు బాధపడుతున్నావా' అని అడగ్గా ప్రేమ్ 'ఆమె సంగతి తెలుసు కదా. నలుగురు కూర్చొని మాట్లాడుకుంటే, ఆనందంగా ఉంటే తట్టుకోలేదు' అంటాడు.
అప్పుడు అంకిత 'శృతి ఈ ఇంటికి వచ్చిన కొత్తలో మా మధ్య కొన్ని మనస్పర్థలు ఉండేవి. కానీ, ఆ తర్వాత అవి తగ్గిపోయాయి. అప్పటి నుంచి ఇద్దరం ఒక కన్నతల్లి బిడ్డల్లా కలిసిపోయాం. ఎప్పుడైనా నీ విషయంలో ఈర్ష్యా ద్వేషం కనిపించాయా? అలా బిహేవ్ చేశానా' అంటుంది. దీంతో శృతి 'తనేదో వాగింది ఎందుకు అలా సీరియస్‌గా తీసుకుంటున్నావు' అంటుంది.

పరందామయ్యకు అవమానం
పరందామయ్య ప్రసాదం కోసం ఆరాటపడడంతో అనసూయ విసుక్కుంటుంది. అప్పుడు పరందామయ్య 'కాస్త అయినా కడుపు నిండుతుంది కదా. నీకు తెలుసు కదా. ఇంటికి వెళ్తే ఇది కావాలి అని అడిగే దిక్కు లేదు. ఇక్కడ తింటే కాస్తయినా కడుపు నిండుతుంది కదా' అంటాడు. దీంతో వెళ్లి ప్రసాదం తీసుకురండి అంటుందామె. అప్పుడు పరందామయ్య ప్రసాదం కోసం లైన్‌లో నిలబడతాడు. తన వంతు రాగానే ఇంకో కప్పు ఇవ్వుమని అడుగుతాడు. దీంతో ప్రసాదం పెట్టే వ్యక్తి పరందామయ్యను తిట్టి ఘోరంగా అవమానిస్తాడు. దీంతో అనసూయ వెళ్లి అతడితో గొడవ పెట్టుకుంటుంది. ఇదంతా సామ్రాట్, తులసి చూస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.