Intinti Gruhalakshmi Today Episode: వాళ్లను అనుమానించిన పరందామయ్య.. లాస్య వల్ల నందూకు కొత్త కష్టం

సుదీర్ఘ కాలంగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' బుధవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూడండి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిందిదే

మంగళవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. శృతి, తులసి మాట్లాడుతూ ఉండగా మధ్యలోకి వచ్చిన భాగ్య.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది. అప్పుడు తులసి బాధ పడినా ఏమీ అనకుండా ఉంటుంది. ఆ తర్వాత లాస్య, తులసి రూమ్‌ను తీసుకుంటుంది. అంతేకాదు, కబోర్డులో ఉన్న ఆమె హ్యాండ్‌ బ్యాగ్‌ను సైతం డస్ట్‌బిన్‌లో వేస్తుంది.

దీంతో నందూకు కోపం వచ్చి ఆమెను తిడతాడు. అనంతరం తులసి ఇకపై ఫ్యాక్టరీకి వెళ్తానని అంటుంది. దీనికి లాస్య పెద్ద రాద్దాంతం చేయడంతో నందూ వచ్చి తులసిపై సీరియస్ అవుతాడు. దీంతో ఆమె ఎంతగానో బాధ పడుతుంది.

లాస్య ఏదని ప్రశ్నించిన అనసూయ

లాస్య ఏదని ప్రశ్నించిన అనసూయ

తులసిపై కోప్పడుతున్న నందూను మరింత రెచ్చగొడుతూ ఉంటుంది లాస్య. అంతేకాదు, నువ్వు ఉద్యోగం తెచ్చుకొని తులసికి సరైన బుద్ధి చెప్పాలి అంటూ అతడిని ఎక్కేస్తుంది. ఆ తర్వాత ఉదయాన్నే తులసి.. పరందామయ్య, అనసూయకు టీ తీసుకొచ్చి ఇస్తుంది. ఇంతలో నందూ కూడా అక్కడకు వస్తాడు. అప్పుడు అనసూయ 'ఏదిరా నీ పెళ్లాం. వెల్‌నెస్ సెంటర్‌లో ఉన్నప్పుడు అత్తా మామ అంటూ మా వెనకాలే తిరిగేది. ఇప్పుడేమైపోయింది?' అంటూ ప్రశ్నిస్తుంది. అంతలో నైట్ డ్రెస్‌లోనే లాస్య బయటికి వచ్చి గుడ్ మార్నింగ్ అత్తయ్య, మామయ్య అంటుంది.

లాస్య డ్రెస్ చూసి వెళ్లిపోయిన మామ

లాస్య డ్రెస్ చూసి వెళ్లిపోయిన మామ

లాస్య డ్రెస్ చూసి పరందామయ్య ఒక్కసారిగా షాక్ అవుతాడు. దీంతో అందరూ ఆశ్చర్యంగా ఆమెను చూస్తుంటారు. అప్పుడామె ప్రొటీన్ షేక్ ఎలా తయారు చేయాలో చెప్పమని నందూను అడుగుతుంది. దీంతో తులసి ఎలా చేయాలో చెబుతుంది. దీంతో లాస్యకు కోపం వచ్చి 'ఇదే నాకు నచ్చనిది. నేను అడిగింది నందూను.. నిన్ను కాదు' అంటూ సీరియస్ అవుతుంది.

ఆ తర్వాత పరందామయ్య లాస్య డ్రెస్‌ను చూసి ఉండలేక అక్కడ నుంచి వెళ్లిపోతాడు. దీంతో అనసూయ 'నీ పెళ్లాం డ్రెస్ చూడలేకే మీ నాన్న వెళ్లిపోయారు' అంటూ నందూతో అంటుంది.

లాస్యకు క్లాస్ పీకిన తులసి, అత్తయ్య

లాస్యకు క్లాస్ పీకిన తులసి, అత్తయ్య

తన డ్రెస్ గురించి అనసూయ అనగానే లాస్యకు కోపం వస్తుంది. అప్పుడామె నాకు నచ్చిన డ్రెస్ నేను వేసుకోవడం తప్పా? అని ప్రశ్నిస్తుంది. దీనికి తులసి 'వేసుకోవచ్చు కానీ.. సందర్భాన్ని బట్టి.. ఎప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలో తెలుసుకొని వేసుకోవాలి' అని చెబుతుంది. దీంతో సారీ అత్తయ్య తెలియక తప్పు చేశాను. ఇక నుంచి అలా జరగదు అంటుంది లాస్య. అంతేకాదు, 'ఇటువంటి డ్రెస్ వేసుకొని నలుగురిలోకి రాకూడదని నువ్వైనా చెప్పాల్సింది కదా. ఇప్పుడు చూడు అత్తయ్య గారు, తులసితో గొడవలు పడాల్సి వచ్చింది. సరేలే మార్చుకుంటా' అంటుంది.

శృతి, ప్రేమ్‌ను అనుమానించిన తాత

శృతి, ప్రేమ్‌ను అనుమానించిన తాత

తర్వాత ప్రేమ్.. ఫోన్‌లో మాట్లాడుతూ.. 'లేదురా నేను ఫంక్షన్‌కు రాలేను.. ఏమీ అనుకోవద్దు' అని ఎవరితోనే చెబుతాడు. ఇంతలో పక్కనే ఉన్న తాత పరందామయ్య ఎవరురా అని అడగ్గా.. తన ఫ్రెండ్ వాళ్ల అబ్బాయి ఊయల ఫంక్షన్‌కు రమ్మంటున్నాడని అంటాడు. దీనికి తాత 'సరే వెళ్లి రండి.

మీరు ఈరోజు వెళ్తేనే కదా.. రేపు మీ బాబు ఫంక్షన్ కు వాళ్లు వచ్చేది. ఏంట్రా మీరు లైఫ్, సెటిల్‌మెంట్ అంటూ పిల్లలను కనడం పక్కన పెట్టారా ఏంటి' అని ప్రశ్నిస్తాడు. దీనికి ప్రేమ్ మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చిందని అడగ్గా.. ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేదు కదా అంటాడు.

లాస్య వల్ల తులసితో నందూ గొడవ

లాస్య వల్ల తులసితో నందూ గొడవ

ఆ తర్వాత తులసితో నందూ మాట్లాడడం మొదలెడతాడు. ఆ సమయంలో 'లాస్యకు నచ్చజెప్పాలన్నా.. కోప్పడాలన్నా నాకు మాత్రమే అధికారం ఉంటుంది. నువ్వు ఎవరు ఆమెకు చెప్పడానికి' అని ప్రశ్నిస్తాడు. దీంతో 'ఇది నా ఇల్లు కూడా. అందుకే ఎవరి మధ్య ఎలా ఉండాలి అనేది నేర్చుకోవాలి. మంచి నేర్చుకోవడం కోసం అహంకారం ఎందుకు? లాస్యకు కూడా నేర్చుకోవాలి. లాస్యకు ఏదో నేర్పించాలని ఉత్తమురాలిని చేయాలన్న ఆశ నాకు అస్సలు లేదు. ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నాకు. అత్తయ్య, మామయ్య తన వల్ల చాలా బాధపడటం చూసి నేను తట్టుకోలేకపోయాను' అని బదులిస్తుంది తులసి.

ప్రేమ్, శృతి బాధ.. పునరాలోచనతో

ప్రేమ్, శృతి బాధ.. పునరాలోచనతో

పరందామయ్య పిల్లల గురించి అడిగిన దానికి శృతి బాధ పడుతూ ఉంటుంది. అప్పుడే వచ్చిన ప్రేమ్ 'ఏమైంది శృతి? ఎందకలా బాధగా ఉన్నావు. ఏదో ఒకటి చేసే చేతులు ఖాళీగా ఉన్నాయంటే ఏదో ఆలోచన ఉన్నట్లే' అని అంటాడు. దీంతో శృతి 'తాతగారు అలా అడగడం గురించి బాధ లేదు కానీ, మనం అబద్ధం చెప్పామనే బాధగా ఉంది' అంటుంది. దీనికి ప్రేమ్ 'ఒక్కోసారి అబద్ధం చెప్పడంలో తప్పులేదు. నువ్వు నన్ను ప్రేమించినా అబద్ధం చెప్పలేదా? పోనీ నిర్ణయం మార్చుకుని పిల్లల్ని కందామా' అనగా.. ఆమె వద్దని సమాధానం చెబుతుంది.

Recommended Video

Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
లాస్య పొరపాటు.. నందూ సీరియస్

లాస్య పొరపాటు.. నందూ సీరియస్

మరోవైపు, ఉదయాన్నే నందూ ఇంటర్వ్యూకు వెళ్లేందుకు రెడీ అవుతాడు. అంతలో పరందామయ్య, అనసూయ.. తులసి చేసిన టిఫిన్ గురించి మాట్లాడతారు. దీంతో నందూకు ఆశ పుట్టి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తాడు. కానీ, అక్కడ టిఫిన్ ఉండదు. అప్పుడేమైందని అడుగుతాడు. దీనికి అనసూయ నీ పెళ్లామే వండొద్దని చెప్పింది అని అంటుంది. దీంతో నందూకు కోపం వస్తుంది. అప్పుడు బాధ్యత ఉండాలి కదా అంటూ లాస్యను తిడతాడు. ఆ సమయంలో పరందామయ్య, అనసూయ అతడిని మరింత ఉడికిస్తారు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X