For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: లాస్యకు బెనర్జీ బంపర్ ఆఫర్.. ఆమెను అడ్డంగా బుక్ చేసిన తులసి

  |

  ఇండియాలో చాలా భాషలు ఉన్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

  దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ప్రేమ్, శృతి సరసాలాడుతూ ఉండగా దివ్య, అంకిత, అభిలు వచ్చి వాళ్లను ఆట పట్టిస్తుంటారు. అప్పుడే లాస్య అక్కడకు వచ్చి అంకితకు ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదని అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది. దీంతో అంకిత చాలా బాధ పడుతుంది. మరోవైపు, తులసి, సామ్రాట్, హనీలు గుడికి వెళ్తారు.

  అదే ఆలయంలో పరందామయ్య, అనసూయలు కూడా ఉంటారు. అప్పుడు పరందామయ్య ప్రసాదం ఎక్కువ కావాలని అడగడంతో ఓ వ్యక్తి ఆయనను అవమానిస్తాడు. మరోవైపు లాస్య మాటలకు అంకిత బాధ పడుతుంటే శృతి ఓదార్చుతుంది.

  ఆరియానా ఎద అందాల దర్శనం: ఇంత హాట్ వీడియో ఎప్పుడైనా చూశారా!

  లాస్యకు బెనర్జీ ఊహించని ఆఫర్

  లాస్యకు బెనర్జీ ఊహించని ఆఫర్

  లాస్య ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎంతో సంతోషంగా ఉంటుంది. అప్పుడామె 'ఇవాళ నాకు ఏదో అదృష్టం తలుపు తట్టనుంది అని జాతకంలో ఉంది. ఏం జరగబోతుందే ఏమో' అని అంటుంది. ఇంతలో బెనర్జీ.. లాస్యకు ఫోన్ చేస్తాడు. అప్పడతను 'హలో లాస్య గారేనా మాట్లాడేది. నా పేరు బెనర్జీ. మీకు ఒక అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నాను.

  నేను మీకు ఓ కాంట్రాక్ట్ ఇవ్వబోతున్నా. అది మీరైతేనే కరెక్టుగా చేస్తారని అనుకుంటున్నా' అంటాడు. కానీ, లాస్యకు ఏమీ అర్థం కాదు. 'నా పేరు లాస్యనే. కానీ, మీరు అనుకునే వ్యక్తిని నేను కాదేమో' అంటుంది. అప్పుడాయన 'నేను మీతోనే మాట్లాడుతున్నా. నా ఆఫీస్ అడ్రెస్ మీకు పంపుతాను. వెంటనే వచ్చేయండి. అన్నీ మాట్లాడుకుందాం' అంటాడు. దీంతో లాస్య ఓకే అంటుంది.

  బాధలు చెప్పుకున్న భార్యభర్తలు

  బాధలు చెప్పుకున్న భార్యభర్తలు

  పెద్ద అవమానం జరిగిన తర్వాత గుడిలో కూర్చున్న పరందామయ్య, అనసూయ ఇద్దరూ ప్రసాదం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడాయన 'లాస్య చేసిన అవమానాల ముందు వీడు అన్నమాటలు చాలా చిన్నవిగా ఉన్నాయి. రోషం, పౌరుషం లాంటివి లేకుండా పోయాయి. అసలు ఒక కాఫీ కూడా తాగలేని పరిస్థితి' అని అంటాడు.

  దీనికి అనసూయ 'షుగర్ డౌన్ అయితే కనీసం చెక్కర నీళ్లు కూడా తాగలేని పరిస్థితి కదా. ఇవన్నీ తులసికి తెలియదు కదా' అని అడుగుతుంది. దీంతో పరందామయ్య 'తులసికి తెలిసి మాత్రం ఏం చేస్తుంది' అని అంటాడు.

  Lakshmi Manchu హాట్ సెల్ఫీ వైరల్.. మీరెప్పుడూ చూడని గ్లామర్ ట్రీట్!

  అత్తమామ బాధలు విన్న తులసి

  అత్తమామ బాధలు విన్న తులసి

  పరందామయ్య, అనసూయ చెప్పుకునే బాధలను తులసి, సామ్రాట్ అక్కడే ఉండి వింటూ ఉంటారు. ఆ సమయంలో పరందామయ్య 'తులసికి ఇవేమీ తెలియకూడదు. తనను అక్కడైనా సంతోషంగా ఉండనివ్వు. ఈ గుడి కాకపోతే ఇంకో గుడి. కడుపు నింపుకోవడానికి ప్రసాదం దొరకకపోతుందా' అని అంటాడు.

  దీంతో అనసూయ 'ఇలా తయారయింది ఏంటండి.. మన పరిస్థితి. దానం చేయడమే కానీ.. మనం ఏరోజూ ఎవరి ముందు చేయి చాచకుండా బతికాం' అంటుంది. దీనికతడు ఈరోజు మనం భూమికి భారం అయ్యాం అంటాడు. తర్వాత అనసూయ ప్రసాదం తినండి అంటే.. గొంతు దిగడం లేదు అనసూయ అంటాడు. దీంతో అది తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోతారు.

  లాస్య మాటలను నమ్మని నందూ

  లాస్య మాటలను నమ్మని నందూ

  బెనర్జీ ఫోన్ చేయడంతో లాస్య చక్కగా రెడీ అయి బయటకు వస్తుంది. అంతలోనే అక్కడకు నందూ కూడా వస్తాడు. ఇంట్లో నందూను చూడగానే షాకైన లాస్య ఇప్పుడే వస్తాను అంటూ బయలుదేరబోతుంది. అప్పుడు నందూ అసహనంగా 'ఎప్పుడు వస్తావో చెప్పావు కానీ.. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పవా' అని ప్రశ్నిస్తాడు.

  దీంతో లాస్య మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నా అంటుంది. కానీ, నందూ మాత్రం ఆమె మాటను నమ్మడు. ఇది ఆమెకు చెప్పగానే ఆ తర్వాత అసలు విషయం చెబుతుంది. అయినా నందూ నమ్మకుండా ఆమెను అక్కడి నుంచి వెళ్లిపోమని అంటాడు.

  స్విమ్మింగ్ పూల్‌లో హాట్‌గా భూమిక: తడిచిన బట్టల్లో యమ ఘాటుగా!

  ఆయనకు ఈ విషయం తెలీదని

  ఆయనకు ఈ విషయం తెలీదని

  పరందామయ్య వాళ్ల మాటలు విన్న తర్వాత సామ్రాట్ 'మీ అత్తయ్య, మామయ్య ఇద్దరూ అంత బాధపడుతుంటే మీరు ఏం మాట్లాడరేంటి' అని ప్రశ్నిస్తాడు. దీనికి తులసి 'వాళ్లకు ఎదురుగా వెళ్తే నోరు విప్పరు' అంటుంది. దీనికతడు 'వాళ్ల కష్టానికి వాళ్లను అలాగే వదిలేస్తారా? మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. మొదటిసారి మీరు సరైన నిర్ణయం తీసుకెళ్లడంలో తడబడుతున్నారు' అని అంటాడు.

  దీంతో తులసి 'ఈ సమస్యను పెంచాలనుకోవడం లేదు. తగ్గించాలని అనుకుంటున్నా. వాళ్లనలా చూసి నేను ఎలా ప్రశాంతంగా ఉంటాను? నా అత్తమామలను ఏడిపిస్తుంటే చూస్తూ నేను ఎలా ఊరుకుంటాను. అయితే, ఈ విషయం నందగోపాల్ గారికి తెలీదు అని అనుకుంటున్నా' అంటుంది.

  లాస్యకు ఆఫర్ ఇచ్చిన బెనర్జీ

  తర్వాత లాస్య బెనర్జీ దగ్గరకు వెళ్తుంది. అప్పుడామె 'నేను రాంగ్ ప్లేస్‌కు వచ్చానని తెలుసు. మీకు కావాల్సింది నాలాంటి క్యాండిడేట్ కూడా కాదు. అయినా వచ్చాను' అంటుంది. దీంతో బెనర్జీ 'మీరు చాలా టాలెంటెడ్. మీ కెపాసిటీకి సరిపడ అవకాశాలు రాక మీరు అక్కడే ఉండిపోయారు' అంటాడు. దీంతో లాస్య మీకు ఎలా తెలిసింది అని ప్రశ్నిస్తుంది. దీనికతడు 'మల్లెపూలను ఎక్కడున్నా వాటి సువాసన ఆధారంగా తెలుసుకోవచ్చు.

  మీకు సరైన అవకాశం కల్పించి మీకు గుర్తింపు తీసుకురావాలన్నదే నా ప్రయత్నం. అందుకే మిమ్మల్ని ఏరికోరి పిలిపించాను. ఇదిగో మీరు టేకప్ చేయాల్సిన ప్రాజెక్టు ఫైల్. మీరే కంపెనీ పెట్టాలి' అంటాడు. దీంతో నా గురించి ఎవరు చెప్పారు అంటే.. మీ ఫ్రెండ్ షీలా మిమ్మల్ని రిఫర్ చేశారు అని అంటాడు.

  Anchor Prashanthi: గృహలక్ష్మి లాస్య హాట్ షో.. ఎద భాగాన్ని హైలైట్ చేస్తూ అరాచకంగా!

  సరుకులు తీసుకెళ్లిన తులసి

  సరుకులు తీసుకెళ్లిన తులసి

  అనంతరం తులసి ఇంటికి కావాల్సిన సరుకులు అన్నీ తీసుకొస్తుంది. ఇంతలో అందరూ వస్తారు. అప్పుడామె 'ఏంటి అందరూ అలా నిలబడి చూస్తున్నారు. ఇంటికి గెస్ట్ వచ్చింది కాస్త మంచినీళ్లు కూడా ఇవ్వరా' అంటుంది. అంతలో లాస్య, నందూ వచ్చి ఆ సరుకులు ఎందుకు తెచ్చావని ప్రశ్నిస్తారు. అప్పుడు లాస్య పెట్టిన కండీషన్స్ గురించి తులసి బయటపెడుతుంది. అంతేకాదు, అంకితతో ఒక కప్పు కాఫీ తీసుకొస్తావా అని అడుగుతుంది. దీనికామె 'కుదరదు.. ఎందుకంటే లాస్య ఆంటీ అన్ని ర్యాకులకు తాళం వేశారు' అంటుంది. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 834: Tulasi Hears Anasuya and Parandhamaiah Conversation. Then Her Heartbroken. After That Banerjee Strikes Deal with Lasya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X