For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: నందూకు హ్యాండిచ్చిన లాస్య.. తులసి సాయం చేసినా తప్పని నిరాశ

  |

  ఎన్నో ఏళ్లుగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' గురువారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  బుధవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఉదయాన్నే టీ, కాఫీ లాంటివి ఇవ్వలేదని లాస్యపై అనసూయ ఫైర్ అవుతుంది. అంతలో ఆమె నైట్ డ్రెస్ వేసుకుని అక్కడు వస్తుంది. దీంతో పరందామయ్య ఆమెను చూడలేక అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ తర్వాత తులసి, ఆమెకు క్లాస్ పీకుతుంది. దీంతో నందూ ఆమెపై కోప్పడతాడు. మరోవైపు, ప్రేమ్, శృతిని ఇంకా పిల్లలు కనట్లేదని పరందామయ్య ప్రశ్నిస్తాడు. దీంతో వాళ్లిద్దరూ తెగ బాధపడిపోతారు. ఇక, చివర్లో నందూ తినడానికి టిఫిన్ ఉండదు. దీంతో బాధ్యతగా ఉండట్లేదని లాస్యపై అతడు ఓ రేంజ్‌లో ఫైర్ అవుతాడు.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో రెచ్చిపోయిన చరణ్ హీరోయిన్: తల్లైన తర్వాత కూడా ఇంత దారుణంగా!

  నందూను వదిలేసి వెళ్లిపోయిన లాస్య

  నందూను వదిలేసి వెళ్లిపోయిన లాస్య

  ఉద్యోగం తెచ్చుకోవాలన్న పట్టుదలతో ఉన్న నందూ.. ఇంటర్వ్యూ కోసం రెడీ అవుతాడు. అతడితో పాటే లాస్య కూడా ఇంటర్వ్యూకు వెళ్లడానికి సిద్ధం అవుతుంది. అలా ఇద్దరూ ఉదయాన్నే రెడీ అయి టిఫిన్ చేస్తుంటారు. అంతలో లాస్యకు ఆఫీస్ నుంచి ఫోన్ వస్తుంది. దీంతో ఆమె 'నందూ.. నా ఇంటర్వ్యూ ప్రీపోన్ అయిందట. నన్ను ముందుగానే రమ్మని ఫోన్ చేశారు. నేను కార్ తీసుకుని వెళ్లిపోతాను' అంటూ అక్కడి నుంచి వెళ్తుంది. అప్పుడు నందూ తాను ఎలా రావాలని అడుగుతాడు. దీంతో తనకు కచ్చితంగా ఉద్యోగం వస్తుందని చెప్పి ఆఫీస్‌కు వెళ్లిపోతుంది.

  తులసి సహాయం తీసుకున్న నందూ

  తులసి సహాయం తీసుకున్న నందూ

  లాస్య కారు తీసుకుని వెళ్లిపోవడంతో నందూ ఒంటరిగా అక్కడే ఉండిపోతాడు. దీంతో ఇంటర్వ్యూకు వెళ్లేందుకు అతడు కార్ బుక్ చేసుకుంటుంటాడు. కానీ, అది మాత్రం బుక్ అవదు. అదే సమయంలో తులసి కూడా స్కూటీపై ఫ్యాక్టరీకి బయలుదేరుతుంది. దీంతో పరందామయ్య, అనసూయ.. తులసి సహాయం తీసుకోమని నందూకు చెబుతారు. అలా బయటకు వచ్చిన అతడు.. ఆమెను అడగకుండా నిల్చుని ఉంటాడు. అప్పుడు తులసి 'లిఫ్ట్ కావాలా? మిమ్మల్ని లాస్య వదిలేసిందా? అంటే తీసుకెళ్లకుండా వదిలేసిందా' అంటూ స్కూటీపై లిఫ్ట్ ఇస్తానని అంటుంది.

  Unstoppable with NBK: బాలకృష్ణ సెన్సేషనల్ రికార్డు.. తెలుగులో నెంబర్ వన్.. ఇండియాలో ఐదో ర్యాంక్

  అనుభవం ముందు అవసరం లేదని

  అనుభవం ముందు అవసరం లేదని

  తులసితో వెళ్లడానికి సిద్ధపడిన నందూ.. స్కూటీని డ్రైవ్ చేయనా అంటూ అడుగుతాడు. దీనికామె 'నా జీవితాన్ని, నా బండిని ఇంకొకరి చేతుల్లో పెట్టే ఉద్దేశం నాకు లేదు. రండి.. కూర్చొండి. నేను నడపగలను' అంటూ నందూను తీసుకుని వెళ్తుంది. అలా సరదాగా ఇద్దరూ స్కూటీపై వెళ్తారు. కొద్దిసేపటికి అతడి ఆఫీసు దగ్గర ఆపుతుంది. అప్పుడు 'ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయ్యారా' అని అడుగుతుంది నందూను అడుగుతుంది. దీనికతను 'పాతికేళ్ల అనుభవం.. ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏంటి థ్యాంక్స్ లాంటివి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా' అని అంటాడు.

  అభికి కొత్త సమస్య.. అంకిత సహాయం

  అభికి కొత్త సమస్య.. అంకిత సహాయం

  మరోవైపు, అభి చెమటలతో కంగారుగా ఇంటికి వస్తాడు. అంతేకాదు, అంకిత దగ్గరకు వచ్చి 'నీతో అర్జెంట్ గా మాట్లాడాలి. నాకు అర్జెంట్ గా 50 వేలు కావాలి. ఒక ఫ్రెండ్ దగ్గర లోన్ తీసుకున్నాను. ఈరోజే తిరిగి ఇవ్వాలి. వాడు చాలా ప్రెజర్ పెడుతున్నాడు' అని అంటాడు. దీనికామె 'ఎందుకు తీసుకున్నావ్' అని ప్రశ్నిస్తుంది. దీంతో అభి కోపంగా 'దాని గురించి ఎందుకు. ముందు ఇస్తావా ఇవ్వవా? నీ దగ్గర ఉన్న గోల్డ్ ఇవ్వు. ప్రస్తుతానికి ఈ గండం నుంచి గట్టెక్కుతాం' అంటాడు. దీంతో తన నగలు తాకట్టు పెట్టుకో అని చెబుతుంది. కానీ, పండగ ముందే ఇవ్వాలంటుంది.

  జాకెట్ తీసేసి రచ్చ చేసిన రష్మిక మందన్నా: ఘాటు ఫోజుతో కసిగా కవ్విస్తోన్న హీరోయిన్

  ఇంటర్వ్యూలో నందూకు షాకిచ్చారు

  ఇంటర్వ్యూలో నందూకు షాకిచ్చారు

  ఇంటర్వ్యూకు హాజరైన నందూ ఫైల్ చూసిన వ్యక్తి.. 'మిస్టర్ నందూ.. మీ ఫైల్ కాసేపు పక్కన పెడదాం. నా పాయింట్ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మాకు కావాల్సింది యువ రక్తం. యంగ్‌స్టర్స్ కొత్త ఐడియాలతో కంపెనీని అభివృద్ధి చేయాలని అనుకుంటారు. మీరు వెళ్లిపోవచ్చు' అని చెబుతాడు. దీనికి నందూ 'ఆవేశం మాత్రమే పనికిరాదు. దానికి అనుభవం కూడా తోడుండాలి. 46 ఏళ్ల ఒక మహిళ నాకు తెలుసు. తను పెద్దగా చదువుకోలేదు. తన జీవితం మొత్తం నాలుగు గోడల మధ్యే గడిపేసింది. ఇప్పుడు తను ఒక ఫ్యాక్టరీని ఎండీ. ఎంతో నేర్చుకొని ఇప్పుడు గొప్పగా బిజినెస్ రన్ చేస్తుంది' అని తులసి గురించి చెబుతాడు. కానీ, ఆయన మాత్రం ఉద్యోగం ఇవ్వకుండానే పంపిస్తాడు.

  నిరాశగా వచ్చిన నందూ.. లాస్య కోపం

  నిరాశగా వచ్చిన నందూ.. లాస్య కోపం

  ఉద్యోగం రాకపోవడంతో నందూ నిరాశగా బయటకు వస్తాడు. అప్పుడు లాస్యకు పలుమార్లు ఫోన్ చేస్తాడు. కానీ, ఆమె మాత్రం లిఫ్ట్ చేయదు. దీంతో తనకు అస్సలు బాధ్యత లేదు అనుకుంటూ కోప్పడతాడు. మరోవైపు, తులసి ఫ్యాక్టరీ నుంచి ఇంటికి వస్తుంది. అలాగే, అక్కడే ఉన్న అనసూయకు టీ తెస్తానని అంటుంది. అంతలో నందూ కూడా ఇంటికి వస్తాడు. అప్పుడు ఇద్దరూ ఒకరినొకరు ఎదురు పడతారు. కానీ, మాట్లాడుకోరు. అప్పుడు తులసికి సీన్ అర్థం అవుతుంది. ఇక, నిరాశగానే నందూ రూమ్‌లోకి వెళ్లిపోతాడు. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 522: Tulasi Gave Lift to Nandhu to Reach Office Early. But He Did Not Get Job. After That Abhi Unexpected Request to Ankitha.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X