For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: నందూ పరువు తీసేసిన తులసి.. అంతలో బ్యాడ్ న్యూస్ చెప్పిన సామ్రాట్

  |

  ఎప్పటికప్పుడు కొత్త కొత్త షోలు ప్రారంభం అవుతోన్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. తులసితో గొడవ పెట్టుకున్న బెనర్జీ లాస్యకు ఫోన్ చేసి ఓ కాంట్రాక్ట్ ఇస్తున్నానని, అందుకోసం తన కంపెనీకి రావాలని చెప్తాడు. దీంతో లాస్య నందూకు అబద్ధం చెప్పి మరీ అతడి ఆఫీసుకు వెళ్తుంది. అక్కడ ఓ ఫైల్ ఇచ్చి.. ఆమె పేరు మీద ఓ కంపెనీని స్టార్ట్ చేస్తున్నట్లు చెబుతాడు. ఇక, గుడిలో పరందామయ్య, అనసూయ తమ కష్టాల గురించి మాట్లాడుతుండగా విన్న తులసి.. వాళ్ల కోసం సరుకులు తీసుకుని వెళ్తుంది. దీంతో నందూ ఆమెను ప్రశ్నిస్తాడు. అప్పుడామె లాస్య ఇంట్లో పెట్టిన కండీషన్స్ గురించి బయటపెట్టి షాకిస్తుంది.

  ఆరియానా ఎద అందాల దర్శనం: ఇంత హాట్ వీడియో ఎప్పుడైనా చూశారా!

  లాస్య నిజస్వరూపం బయటపెట్టి

  లాస్య నిజస్వరూపం బయటపెట్టి

  లాస్య నిజస్వరూపాన్ని బయటపెట్టేందుకు తులసి అందరితో నిజం చెప్పించే ప్రయత్నం చేస్తుంది. ఇందులో భాగంగానే అంకితను టీ పెట్టుకుని రమ్మని అడుగుతుంది. అప్పుడామె 'లాస్య ఆంటీ కిచెన్‌లోని అన్ని ర్యాక్‌లకు, ప్రిడ్జ్‌కు తాళాలు వేసింది. సొంత ఇంట్లోనే జైలులో బతుకుతున్నట్టు బతుకుతున్నాం. తాతయ్య గారికి షుగర్ డౌన్ అయినప్పుడు చెక్కర కావాలన్నా తాళాలు ఇవ్వలేదు' అని చెబుతుంది. తర్వాత దివ్య, శృతి 'తాతయ్య, అమ్మమ్మ ఇద్దరూ రోజూ డికాషన్ తాగుతున్నారు. ఫ్రిడ్జ్‌కు కూడా తాళం వేసింది' అని నందూతో చెప్పి లాస్యకు షాకిస్తారు.

  నందూ పరువు తీసేసిన తులసి

  నందూ పరువు తీసేసిన తులసి

  వాళ్లంతా చెప్పిన మాటలతో నందూకు లాస్యపై కోపం వస్తుంది. అప్పుడు తులసి 'తప్పు మీదే.. తప్పు మీ నుంచే ఉంది' అని నందూను నిందిస్తుంది. అప్పుడను 'అంతా బాగానే ఉందనుకున్నా. కానీ, ఇంత జరుగుతుందని నాకు తెలియదు' అంటాడు. అప్పుడు ప్రేమ్ 'మీకు ఈ విషయం చెప్పకుండా తాతయ్య మా నోళ్లు నొక్కేశాడు' అంటాడు. అప్పుడు తులసి 'ఏదో ఒకరోజు మీకు ఇవన్నీ తెలుస్తాయని వాళ్లు ఊరుకున్నారు. ఇవన్నీ నాకు కూడా తెలియలేదు. పరోక్షంగా తెలుసుకున్నా. అందుకే నా వాళ్లు ఇక నుంచి అలాంటి కష్టాలు పడకూడదు. అందుకే ఇవన్నీ తీసుకొచ్చా. ఈ ఇంటి పెద్దగా మీరు మీ బాధ్యతను ఫెయిల్ అయినన్ని రోజులు నేను ఈ ఇంటి విషయాలను పట్టించుకుంటూనే ఉంటాను. వాళ్లకు అన్నీ తీసుకొస్తాను' అంటుంది.

  నిధి అగర్వాల్ హాట్ వీడియో వైరల్: ప్రైవేట్ ప్లేస్‌లో టాటూ.. అలా చూపిస్తూ!

  తులసి అలా.. నందూ చిరాకుగా

  తులసి అలా.. నందూ చిరాకుగా


  ఆ తర్వాత కూడా తులసి 'నా వాళ్లను కష్టపెడితే మాత్రం చూస్తూ ఊరుకోను' అని నందూకు వార్నింగ్ ఇస్తుంది. దీంతో అతడు కోపంతో అక్కడి నుంచి పైకి వెళ్లిపోతాడు. ఆ తర్వాత 'ఈరోజు నుంచి ఈ ఇంట్లో నా వాళ్లు ఎవరూ బాధపడటానికి వీలు లేదు' అంటూ సరుకులు అన్నీ తెచ్చి వాళ్లకు ఇస్తుంది. శృతి నీకోసం పుల్లటి మామిడి కాయలు తీసుకొచ్చా అంటుంది. ఇక, కోపంతో రగిలిపోతోన్న అన్నీ ఆలోచిస్తూ చిరాకుగా ఉంటాడు. అప్పుడే లాస్య అక్కడకు వస్తుంది. నందూ.. అని మాట్లాడబోతుండగా అతడు షటప్ అంటాడు. అంతేకాదు, 'నాతో మాట్లాడుకు. కాసేపు నా కళ్ల ముందు కనబడకు. గెట్ అవుట్' అని చీదరించుకుంటాడు. దీంతో లాస్య నేను చెప్పేది కూడా ఒకసారి విను అంటే అస్సలు విననంటాడు.

  లాస్యపై ఓ రేంజ్‌లో ఫైరైన భర్త

  లాస్యపై ఓ రేంజ్‌లో ఫైరైన భర్త

  అనంతరం నందూ 'నా వాళ్లను నా ఇంటికి తెచ్చుకోవడానికి నానా తంటాలు పడ్డాను. తులసి ముందు కూడా నిలబడి చేతులు కట్టుకున్నాను. నా వాళ్లను జాగ్రత్తగా చూసుకుంటా అని మాటిచ్చాను. కానీ, నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు. అసలు నువ్వు ఏం చేస్తున్నావు అనేది నాకు కావాలి. వంటింట్లో ర్యాక్స్‌కు, ఫ్రిడ్జ్‌కు తాళం వేశావా లేదా? తిండి విషయంలో, కాఫీ విషయంలో రిస్ట్రిక్ట్ పెట్టడానికి నువ్వు ఎవరు? హవ్ డేర్ యూ? నిన్ను గదిలో పడేసి వారం రోజులు తిండి తిప్పలు లేకుండా చేస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంటో. నా ఇంట్లో నా వాళ్లకు తులసి సరుకులు తెచ్చి ఇస్తోంది. అది నీ చేతకానితనం వల్లనే అంటూ తులసి చెప్పుకొచ్చింది. నా వాళ్ల ముందు ఇంకా ఎలా తలెత్తుకొని నిలబడాలి' అని ఫుల్‌గా సీరియస్ అవుతాడు.

  బిడ్డకు పాలిచ్చే వీడియో వదిలిన సీరియల్ హీరోయిన్: ఆమె ఎందుకిలా చేసిందో తెలిస్తే!

  నందూను కూల్ చేసేసిన లాస్య

  నందూను కూల్ చేసేసిన లాస్య

  నందూ మాటలకు లాస్య 'అసలు నేను చెప్పేది విను నందూ. పిల్లల చాలీచాలని జీతంతో ఇంటిని నడిపించాలి కదా. అందుకే తప్పని సరై నియంతలా మారాను. ఫ్యామిలీ మంచి కోసమే అని అనుకొని చెడ్డదాన్ని అనిపించుకోవడానికి డిసైడ్ అయ్యాను. వాళ్లు ఏదో అన్నారని నేను బాధపడటం లేదు. చివరకు నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోవడం లేదు. అందుకే నా బతుకు మీద నాకు విరక్తి పుడుతోంది. మనం నవ్వల పాలు కాకూడదనే ఇలా చేశా తప్పితే ఎవరి మీద కోపంతో కాదు. అత్తయ్య, మామయ్య పట్ల నాకు బాధ్యత ఉంది. నా ప్రవర్తన హార్ష్‌గా ఉండొచ్చు కానీ, నా ఆలోచనలు మాత్రం సాఫ్ట్‌గా ఉన్నాయి నందూ' అంటూ అతడిని కూల్ చేసేస్తుంది.

  తులసికి బ్యాడ్ న్యూస్ చెప్పాడు

  తులసికి బ్యాడ్ న్యూస్ చెప్పాడు

  మరోవైపు తులసి 'నేను మీ అబ్బాయితో కలిసి ఉండమన్నాను కానీ.. కష్టపడమనలేదు కదా. నాకు ఈ విషయాలన్నీ చెప్పాలి కదా మామయ్యా? మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఇక్కడ ఉంచానని కోపమా' అంటుంది. దీనికి పరందామయ్య 'ఇంకొకరికి బరువుగా మారి బతుకుతున్న జీవితాలు మావి. ఒకరి మీద కంప్లయింట్ ఇచ్చే వయసు కాదు మాది' అంటాడు. ఆ తర్వాత తులసి తన ఇంటికి వెళ్తుంది. అప్పుడామెకు కళ్లు తిరగినట్టుగా అవుతుంటే కాసిన్ని మంచినీళ్లు తాగుతుంది. ఇంతలో సామ్రాట్ కాల్ చేసి బెనర్జీ ప్రాజెక్ట్‌ను లాస్య, నందూ టేకప్ చేయబోతున్నారు అంటాడు.

  HBD Deepika Padukone: మీరెప్పుడూ చూడని దీపికా హాట్ పిక్స్.. ఆమెనిలా చూశారంటే!

  వాళ్లకు హెల్ప్ చేయాలనుకుని

  వాళ్లకు హెల్ప్ చేయాలనుకుని

  బెనర్జీ ప్రాజెక్టును లాస్య, నందూ డీల్ చేయబోతున్నారని తెలుసుకున్న వెంటనే తులసి షాక్ అవుతుంది. అంతేకాదు, 'వాళ్లకు అసలు ఈ లైన్‌లో ఏం అనుభవం ఉందని ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు? ఆ ప్రాజెక్ట్ తీసుకోవద్దని బెనర్జీ ఫ్రాడ్ అని నేను వాళ్లకు నచ్చచెప్పుతాను' అంటుంది. దీంతో సామ్రాట్ మీ ఇష్టం అంటాడు. మరోవైపు నందూకు బెనర్జీ ప్రాజెక్ట్ గురించి లాస్య చెబుతుంది. 'మన కంపెనీ లాంచ్‌కు కూడా ఆయన ఫండింగ్ ఇస్తా అన్నారు' అని అంటుంది. అంతలో తులసి అక్కడికి వస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 835: Tulasi Gets Worried About Anasuya and Parandhamaiah Situation. After That She Plans to Helps Nandhu and Lasya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X