For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Intinti Gruhalakshmi Today Episode: నందూకు షాక్‌ల మీద షాక్‌లు.. నేను తులసిలా బ్రతకలేనంటూ ఘోరంగా!

  |

  చాలా దశాబ్దాలుగా తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా చూసేయండి!
  Photos Courtesy: Star మా and Disney+Hotstar

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

  గురువారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఇంటర్వ్యూ కోసం లాస్య, నందూ రెడీ అవుతారు. అయితే, లాస్యకు త్వరగా రమ్మని ఫోన్ రావడంతో ఆమె నందూను వదిలేసి కారు తీసుకుని వెళ్లిపోతుంది. దీంతో క్యాబ్ బుక్ చేసుకోబోతున్న నందూకు తులసి లిఫ్ట్ ఇస్తుంది. తన స్కూటీపై తీసుకెళ్లి ఆఫీస్ దగ్గర దింపుతుంది. అయితే, అక్కడ జరిగిన ఇంటర్వ్యూలో మాత్రం నందూకు నిరాశే ఎదురవుతుంది. దీంతో అతడు నిరాశగా ఇంటికి వస్తాడు. మరోవైపు, అభి, తన స్నేహితుడి దగ్గర అప్పు చేశానని చెప్పి.. అంకితను నగలు ఇవ్వమని అడిగి.. వాటిని తాకట్టు పెట్టేందుకు వెళ్తాడు.

  షణ్ముఖ్‌తో బ్రేకప్ తర్వాత దీప్తి సునైనా ఫస్ట్ పోస్ట్: నా వెనుక తను ఉన్నాడంటూ వీడియో రిలీజ్

  నందూకు ధైర్యం చెప్పిన తల్లితండ్రి

  నందూకు ధైర్యం చెప్పిన తల్లితండ్రి


  నందూకు జాబ్ రాకపోవడంతో నిరాశగా ఇంటికి చేరుకుంటాడు. అప్పుడు అతడికి తులసి ఎదరు పడినా మాట్లాడకుండా వెళ్లిపోతుంది. ఆ తర్వాత పరందామయ్య మాత్రం 'ఒరేయ్ నందూ.. నీ జాబ్ ఏమైందిరా' అని అడుగుతాడు. దీనికతడు ఉద్యోగం రాలేదని సమాధానం చెబుతాడు. దీంతో తల్లి 'జాబ్ రాలేదని బాధపడకు. ప్రయత్నం మాత్రం ఆపకు. నీకు ఇంతకన్నా మంచి ఉద్యోగమే వస్తుందిలే' అని ధైర్యం చెబుతారు. అప్పుడే తులసి తన అత్తామామకు టీ తీసుకుని వచ్చి ఇస్తుంది. ఇంతలో లాస్య కూడా ఇంటర్వ్యూ నుంచి వచ్చి హాయ్ ఎవర్రీబడీ అంటుంది.

  లాస్య ప్రవర్తనకు షాకైన అత్తమామలు

  లాస్య ప్రవర్తనకు షాకైన అత్తమామలు

  లాస్య రాగానే సోఫా మీద కూర్చుని కాలు మీద కాలు వేసుకుంటుంది. దీంతో అత్తమామలు షాక్ అవుతారు. అప్పుడు లాస్య 'నందూ ఈరోజు నేను చాలా అలిసిపోయాను' అని చెబుతుంది. దీనికి అనసూయ 'కాళ్లు టేబుల్ మీద పెట్టుకోవడం ఎందుకు. తెచ్చి నా నెత్తి మీద పెట్టు' అంటుంది. దీంతో లాస్య అత్తయ్య నాకు చిరాకు తెప్పించకండి అంటుంది. అప్పుడే నందూ 'నీకు ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదు' అని అడుగుతాడు. దీనికామె 'బిజీగా ఉండి మరిచిపోయాను నందూ. అందుకే ఫోన్ లిఫ్ట్ చేయలేదు' అంటూ చిరాకుగా సమాధానం చెబుతుంది.

  ఉల్లిపొర లాంటి డ్రెస్‌తో రెచ్చిపోయిన చరణ్ హీరోయిన్: తల్లైన తర్వాత కూడా ఇంత దారుణంగా!

  నందూను టీ పెట్టుకోమని అన్న లాస్య

  నందూను టీ పెట్టుకోమని అన్న లాస్య

  అసలే జాబ్ రాలేదన్న కోపంతో ఉన్న నందూను లాస్య తన పొగరు మాటలతో మరింతగా రెచ్చగొడుతుంది. అప్పుడు ఇంతకీ నాకు ఎందుకు ఫోన్ చేశావని అడుగుతుంది. దీనికి నందూ 'నీ ఇంటర్వ్యూ ఏమైందో తెలుసుకుందామని ఫోన్ చేశాను' అంటాడు. దీనికి లాస్య 'నీకు ముందే చెప్పాను కదా.. జాబ్ వచ్చేసినట్టే అని. రేపు కాల్ చేసి చెబుతాం అన్నారు' అంటుంది. అప్పుడు నందూ నా ఇంటర్వ్యూ గురించి తెలుసుకోవా అని ప్రశ్నించగా.. నేను బిజీగా ఉన్నానని చెప్పగా అంటూ చిరాకు పడుతుంది. ఆ తర్వాత నందూను టీ అడగ్గా.. వెళ్లి పెట్టుకో అంటుంది.

  నేను తులసిలా ఉండలేనన్న లాస్య

  నేను తులసిలా ఉండలేనన్న లాస్య

  తనను టీ పెట్టుకోమన్న లాస్యతో నందూ 'తులసి కూడా ఫ్యాక్టరీకి వెళ్లి అలసిపోయింది. అయినా కూడా వచ్చి అమ్మానాన్నకు టీ ఇచ్చింది. మరి నీకు ఏమైంది' అని అడుగుతాడు. అప్పుడు లాస్య 'నేను తులసిని కాదు. తులసిలా నేను ఉండను. తులసి వేరు.. నేను వేరు. తులసి చేసే పనులు నచ్చకనే కదా.. నువ్వు నన్ను ప్రేమించింది. మీకు అంతగనం టీ కావాలంటే చెప్పండి.. ఒక పనిమనిషిని పెట్టుకుందాం. తను ఇంటి పనులు అన్నీ చూసుకుంటుంది' అంటుంది. దీంతో తులసి మధ్యలోకి రాగా.. నేను నీలాగా గొడ్డు చాకిరి చేయలేను అంటుంది లాస్య.

  జాకెట్ తీసేసి రచ్చ చేసిన రష్మిక మందన్నా: ఘాటు ఫోజుతో కసిగా కవ్విస్తోన్న హీరోయిన్

  అలా మారతారని భయపడిన ప్రేమ్

  అలా మారతారని భయపడిన ప్రేమ్

  పని మనిషిని పెట్టుకుందామని లాస్య అనగానే 'అంత ఈజీ కాదు లాస్య. తనకు అన్నీ చెప్పాలి. అన్నీ నేర్పించాలి' అని అంటుంది తులసి. అప్పుడు లాస్య 'తనతో పని ఎలా చేయించాలో నాకు బాగా తెలుసు. తను నాకు మాత్రమే పని చేస్తుంది. నా కోసం మాత్రమే నేను తనను రేపే తీసుకొస్తాను' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత తులసి ఆ విషయాన్ని ప్రేమ్‌తో చెబుతుంది. దీనికి అతడు 'రాములమ్మ ఉండగా మరో పనిమనిషి ఎందుకు. ఆ లాస్యను చూసి మీరు కూడా ఎక్కడ మారిపోతారో అని భయమేస్తుంది' అని శృతితో అని భయప డతాడు.

  లాస్యపై నందూ ఫైర్... భార్యనంటూ

  లాస్యపై నందూ ఫైర్... భార్యనంటూ

  టీ పెట్టుకోమందన్న కోపంతో నందూ, లాస్యతో గొడవ పెట్టుకుంటాడు. అప్పుడు లాస్య 'అందులో తప్పేముంది నందూ. నువ్వు టీ పెట్టి నాకు తెచ్చిస్తే తప్పేముంది' అంటుంది. అప్పుడు నందూ 'పాతికేళ్ల మా కాపురంలో ఏనాడూ నేను టీ పెట్టలేదు తెలుసా? వాళ్ల ముందు నన్ను అవమానించావు' అంటాడు. దీనికామె 'ఈ లాస్యను మరో తులసిలా మార్చి పెత్తనం చెలాయించాలని చూస్తున్నావా? అది ఎప్పటికీ జరగదు. జరగనివ్వను. నువ్వు నా బాస్‌వు కాదు. నా భర్తవు' అంటుంది. దీనికి నందూ 'భర్తకు విలువ ఇవ్వని నువ్వు భార్యవు ఎలా అవుతావు' అని ప్రశ్నిస్తాడు. అప్పుడామె 'ఈ జనరేషన్ భార్యలు వేరు. ఈ లాస్య నీకు భార్య స్థానంలో వచ్చింది కానీ నీకు బానిసలా బతకడానికి కాదు. నేను ఎందులోనూ నీకంటే తక్కువ కాదు' అంటుంది.

  Unstoppable with NBK: బాలకృష్ణ సెన్సేషనల్ రికార్డు.. తెలుగులో నెంబర్ వన్.. ఇండియాలో ఐదో ర్యాంక్

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  అనసూయలో మొదలైన భయాలు

  అనసూయలో మొదలైన భయాలు

  లాస్య ప్రవర్తన చూసి విసిగిపోయిన అనసూయ.. పరందామయ్యతో కూర్చుని మాట్లాడుతుంది. ఆ సమయంలో ఆమె 'లాస్యను చూస్తుంటే భయమేస్తుంది? మనకు అత్తామామల స్థానం ఏమో కానీ, స్టోర్ రూమ్‌లోని వస్తువుల్లా కూడా చూడడం లేదు' అని అంటుంది. అంతలో తులసి వచ్చి వాళ్లిద్దరికీ ధైర్యం చెప్పేలా మాట్లాడుతుంది. దీంతో అనసూయ కూల్ అవుతుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

  English summary
  Intinti Gruhalakshmi Episode 523: Nandhu Gets Frustrated For Lasya Behavior. Then She Angry on Him. After That Tulasi Helped to Anasuya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X