Intinti Gruhalakshmi Today Episode: డబ్బుల కోసం అభి కొత్త నాటకం.. ఇంట్లోకి ఆమెను తీసుకు రావడంతో!

తెలుగు బుల్లితెరపై వచ్చే సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రదర్శితం అవుతున్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' ఒకటి. దాదాపు ఏడాది నుంచీ ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఆసక్తికరంగా సాగుతోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' శనివారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరు కూడా ఓ లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శుక్రవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. ఉద్యోగం రాలేదని బాధగా ఇంటికి తిరిగి వచ్చిన నందూ చిరాకుగా ఉంటాడు. అంతలో అక్కడకు వచ్చిన లాస్య వింత ప్రవర్తనతో అందరికీ షాకిస్తుంది. అప్పుడు నందూ టీ తెచ్చివ్వమని ఆమెను అడుగుతాడు. దీనికి తాను తీసుకు రానని తేల్చి చెబుతుంది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరుగుతుంది. ఆ తర్వాత కూడా ఇద్దరూ గొడవ పడతారు.

లాస్య తీరు చూసి ప్రేమ్ భయపడిపోతాడు. అంతేకాదు, అనసూయ కూడా తమను ఇంటి నుంచి గెంటేస్తుందని ఆందోళన చెందుతుంది. దీంతో తులసి ఆమెకు ధైర్యం చెప్పి కూల్ చేస్తోంది.

మందు కొడుతూ కొత్త ప్లాన్ వేసిన అభి

మందు కొడుతూ కొత్త ప్లాన్ వేసిన అభి

డాక్టర్‌గా ఉద్యోగం చేస్తున్న అభి చెడు అలవాట్లను నేర్చుకుని.. దాని కోసం చేసిన అప్పులను తీర్చడం కోసం అంకితకు అబద్ధం చెప్పి ఆమె బంగారాన్ని తాకట్టు పెట్టాడు. అయితే, తాజా ఎపిసోడ్‌లో అతడు మనోజ్ అనే స్నేహితుడితో కలిసి మందు కొడుతూ కనిపించాడు. అంతేకాదు, 'జూనియర్ డాక్టర్‌గా నా జీతం సరిపోవడం లేదు. లైఫ్ ఎక్కడికి వెళ్తుందో అర్థం కావడం లేదు' అని బాధ పడతాడు. దీంతో అతడు షేర్ మార్కెట్‌లో ఇన్‌వెస్ట్ చేసి కోట్లు సంపాదించానని.. అతడిని కూడా చేయమని చెబుతాడు. అలా ఇంటికి వెళ్లిన అభి.. దాని గురించే ఆలోచిస్తూ ఉంటాడు.

నేను ఎవరికీ తక్కువ కాదని చూపిస్తా

నేను ఎవరికీ తక్కువ కాదని చూపిస్తా

ఇంటికి వచ్చిన తర్వాత అభి.. తన ఫ్రెండ్ మనోజ్ చెప్పిన మాటలనే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అంతలో అంకిత అక్కడకు వచ్చి దేని గురించి ఆలోచిస్తున్నావని ప్రశ్నిస్తుంది. దీంతో అభి 'మన బతుకులు ఇంతేనా? లైఫ్ అంటే ఇంతేనా? అవసరం కోసం చేతులు చాచడంతోనే సరిపోతుంది.. కష్టాల్లో పడి ఈదుతూనే ఉండాలా? బావిలో కప్పలా బతుకుతున్నా.. ఈరోజు నా ఫ్రెండ్‌ను కలిస్తే లైఫ్ అంటే ఏంటో తెలిసింది. కాలేజ్‌లో వాడికంటే నేను బ్రిలియంట్. నేను ఎవరికీ తక్కువ కాదని నిరూపిస్తా. నేనేంటో చూపిస్తా' అంటూ ఆవేశంగా ఛాలెంజ్ చేస్తాడు.

తులసి విషయంలో నందూ డైలమా

తులసి విషయంలో నందూ డైలమా

మొదటి ఇంటర్వ్యూలోనే నిరాశ ఎదురవడంతో నందూ తన ఉద్యోగం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలా అసలు తనకు ఇంకో ఉద్యోగం వస్తుందా రాదా అని తెగ టెన్షన్ పడుతుంటాడు. అంతేకాదు, 'తులసిని నేను కాదనుకున్నాను. తులసి కూడా నన్ను కాదనుకుంది. అయినా ఎందుకు ఇంకా తులసి నా మనసులో నుంచి వెళ్లిపోవడం లేదో అర్థం కావడం లేదు. ఇంటర్వ్యూలో తులసి గురించి ఉక్రోశంతో తెచ్చానా.. కోరి సమస్యలు తెచ్చుకుంటున్నానా ఏంటి' అని నందూ తనలో తాను అనుకుంటాడు. అంతలోనే తులసి అతడికి టీ ఇవ్వడానికి వస్తుంది.

లాస్యతో కలిసి ఉండలేనని చెబుతూ

లాస్యతో కలిసి ఉండలేనని చెబుతూ

నందూకు తులసి టీ తీసుకు రాగా అతడు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడామె 'టీ తేవడంలో నా మనసులో వేరే ఏ ఉద్దేశం లేదు. ఈ ఇంటి మనిషిగా అర్థం చేసుకొని టీ తెచ్చాను తీసుకోండి. ఏమనుకోకపోతే ఒక విషయం చెబుతాను. ఏ విధంగా చూసినా నేను, లాస్య ఒకే ఇంట్లో ఉండటం కరెక్ట్ కాదు. కానీ.. నా చుట్టూ ఉన్న బంధాలు నన్ను ఇక్కడ బంధించాయి.

అడుగడుగునా నేను మిమ్మల్ని తప్పించుకొని ఉండలేను. దయచేసి లాస్యను, నన్ను ఏ విషయంలోనూ పోల్చకండి. నేను నచ్చకే కదా.. తనను పెళ్లి చేసుకున్నారు. దీని వల్ల మా ఇద్దరి మధ్య గొడవ వస్తుంది. ఏదైనా సమస్య ఉంటే.. మీరు, లాస్య తేల్చుకోండి' అంటుంది.

నందూను ఎంకరేజ్ చేసిన తులసి

నందూను ఎంకరేజ్ చేసిన తులసి

తులసి మాటలకు నందూ 'ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన చికాకుతో అలా మాట్లాడాను తప్పే. కానీ, లాస్య అలా మాట్లాడకుండా ఉండాల్సింది కదా' అంటాడు. దీనికామె 'మీకు ఇంకో విషయం తెలుసా. లాస్య తులసి కాదు.. తులసి లాస్య కాదు. లాస్య తులసిలా మారాలని కోరుకోండి. ఉద్యోగం విషయంలో ఏం దిగులు పడకండి.

మంచి రోజులు ఎలా శాశ్వతం కావో.. చెడ్డ రోజులు కూడా శాశ్వతం కావు. ధైర్యంగా ఉండాలి. ఒడ్డున కూర్చున్న నాలాంటి వాళ్లు చాలా సలహాలు ఇస్తారు కానీ, ఈదేవాడికే ఆ బాధ తెలుస్తుంది. నేను ఈ సమాజంతో పోరాడి గెలుస్తున్నప్పుడు మీరెందుకు గెలవకూడదు. మీరు గెలుస్తారు.. గెలవాలి' అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

పని మనిషి ఎంట్రీ.. కండీషన్స్ పెట్టి

పని మనిషి ఎంట్రీ.. కండీషన్స్ పెట్టి

ఇక, ఉదయమే అందరూ టిఫిన్ తింటూ ఉంటారు. ఇంతలో లాస్య వచ్చి నందూకు బ్రేక్ ఫాస్ట్ ఇస్తుంది. అది కూడా సలాడ్. కుటుంబ సభ్యులు మాత్రం మంచిగా వడ, దోశ తింటూ ఉంటారు. ఈ పనికిమాలిన టిఫిన్ ఏంటి అంటాడు నందూ. దీంతో నాకు ట్రెడిషనల్ బ్రేక్ ఫాస్ట్ చేయడం రాదు అంటుంది లాస్య. అంతలో నేను చేస్తాను అంటూ వస్తుంది లాస్య ఏర్పాటు చేసిన వారెవ్వా వసంత. కాకపోతే ఆమె కొన్ని కండిషన్లు పెడుతుంది. ఆ కండిషన్లు విని అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఆమె తన పాత్రను పరిచయం చేస్తుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X