Intinti Gruhalakshmi Today Episode: తులసి భర్తగా సామ్రాట్.. బజారు మనిషి అంటూ.. ఆస్పత్రిలో పెద్ద గొడవ

జనరేషన్లు మారుతున్నా.. తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రమే ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్‌ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!

Photos Courtesy: Star మా and Disney+Hotstar

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే

శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. బెనర్జీ చేస్తున్న మోసం గురించి లాస్య, నందూకు చెప్పి హెల్ప్ చేయాలని తులసి అనుకుంటుంది. కానీ, వాళ్లు మాత్రం ఆమె మాటను అస్సలు వినరు. దీంతో కోపంగా ఇంటికి వెళ్లిపోతుంది. ఆ సమయంలోనే తులసి స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఆ తర్వాత మేల్కొని కొడుకులకు ఫోన్ చేసినా చూసుకోరు.

దీంతో సామ్రాట్‌కు కాల్ చేస్తుంది. అప్పుడు అతడు వెంటనే అక్కడకు వచ్చి తులసిని చూసి ఆస్పత్రిలో చేర్పిస్తాడు. మరోవైపు, లాస్య, నందూ తాము కొత్త బిజినెస్ మొదలు పెడుతున్నట్లు ఇంట్లో వాళ్లకు చెప్పగా వాళ్లంతా షాక్ అవుతారు.

అందుకే అందరికీ చెప్పానంటూ

అందుకే అందరికీ చెప్పానంటూ

బిజినెస్ ఐడియా గురించి నందూ వాళ్లు చెప్పగానే అభి 'బాధ్యత మీది.. బరువు మోయాల్సింది మీరు. మీ మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏమని అంటారు' అని అంటాడు. అప్పుడు నందూ 'ఈ ఇంట్లో అందరూ నా శ్రేయోభిలాషులే. నా మంచి కోరే వారే. అందుకే ఈ గుడ్ న్యూస్ అందరికీ చెప్పి.. నా సంతోషాన్ని అందరితో పంచాలనుకున్నాను' అని చెబుతాడు.

దీంతో పరందామయ్య 'నువ్వు చేయాలనుకున్న పని మంచిదేరా. నువ్వు పైకి ఎదిగితే మా అందరికీ సంతోషమే కదా' అంటాడు. దీంతో నందూ ఆయన కాళ్లకు నమస్కరించాలని చూస్తాడు.

నందూకు పరందామయ్య క్లాస్

నందూకు పరందామయ్య క్లాస్

నందూ చెప్పగానే పరందామయ్య 'రెక్కలు ఉన్నాయి కదా అని.. పక్షి ఎగిరి ఆకాశాన్ని తాకాలనుకోవడం అత్యాశే అవుతుంది. నువ్వు కూడా ఏది చేయాలనుకున్నా అలా ఆవేశ పడకు. ఏదీ నీ పర్సు చూపించు.. అందులో వంద రూపాయల నోట్లు కూడా లేవు కానీ.. లక్షలు పెట్టి ఎలా బిజినెస్ చేస్తావు? కాలు జారి పడితే ఏం చేస్తావురా' అని అంటాడు. అప్పుడు 'తప్పదు ఎలాగైనా ఏదైనా చేయాల్సిందే' అంటాడు. లాస్య కూడా 'మీరు ఆ వంద రూపాయాలతోనే ఈ కుటుంబాన్ని నెట్టుకు వచ్చారు. నందూ కూడా అలాగే' అంటుంది.

తర్వాత నందూ 'నా బిజినెస్ పెట్టుబడికి లాస్య ఫ్రెండ్ హెల్ప్ చేస్తానన్నది. సంవత్సరం తిరిగే లోపు ఆ అప్పు తీర్చేస్తాం నాన్న' అంటాడు. దీంతో పరందామయ్య నీకు ఆ నమ్మకం ఉంటే సరి అంటాడు.

తులసి గురించి సామ్రాట్ ఫోన్

తులసి గురించి సామ్రాట్ ఫోన్

నందూతో పరందామయ్య మాట్లాడుతున్నప్పుడే సామ్రాట్‌ కాల్ చేస్తాడు. అప్పుడు తులసికి జరిగిన విషయం గురించి మొత్తం ఆయనకు వివరించి చెబుతాడు. దీంతో పరందామయ్య కంగారుగా ఏ ఆస్పత్రి అని అడుగుతాడు. అంతేకాదు, ఇప్పుడే బయలుదేరుతున్నాం అంటాడు. దీంతో అనసూయ ఏమైందని అడుగుతుంది. అప్పుడాయన 'తులసికి లో బీపీ ఉండి కింద పడిపోయిందట. ఆసుపత్రిలో ఉందట.

మీకు ఫోన్లు చేస్తే ఎవ్వరూ తీయలేదట' అంటాడు. దీంతో వాళ్లు 'మా ఫోన్లన్నీ సైలెంట్‌లో ఉన్నాయి' అని చెప్పి అందరూ బయలుదేరుతారు.

 వాళ్లు ఎంట్రీ.. డాక్టర్ సీరియస్

వాళ్లు ఎంట్రీ.. డాక్టర్ సీరియస్

సామ్రాట్ ద్వారా విషయం తెలుసుకున్న దీపక్, సరస్వతి ఆస్పత్రికి చేరుకుంటారు. అప్పుడే డాక్టర్ వచ్చి 'ఆమె పరిస్థితి బాగోలేదు. పేషెంట్ కోమాలోకి వెళ్లడం కానీ, పెరాలసిస్ రావడం కానీ జరగొచ్చు. మీరు ఇంత కేర్ లెస్‌గా ఉంటే ఎలా? ఆమెను ఒంటరిగా ఎలా వదిలేశారు' అని సీరియస్ అవుతుంది. ఇంతలో తులసి ఫ్యామిలీ వాళ్లు అందరూ వస్తారు.

అప్పుడు ప్రేమ్ 'సామ్రాట్ గారు.. మా అమ్మకు ఎలా ఉంది' అని అడుగుతాడు. దీంతో దీపక్ 'చావు బతుకుల్లో ఉంది. వెళ్లి చూడండిరా. రోజూ నిష్టగా పూజ చేసి మొక్కుకుంటే కానీ దేవుడు వరిమివ్వడు' అంటాడు.

దీపక్ క్లాస్.. గొడవలు వద్దంటూ

దీపక్ క్లాస్.. గొడవలు వద్దంటూ

ఆ తర్వాత దీపక్ 'మీ అమ్మను అస్సలు పట్టించుకోరా.. కనీసం ఎలా ఉందో కూడా తెలుసుకోరా? స్పృహ తప్పి పడిపోయినప్పుడు మీ అమ్మ ఫోన్ చేసింది కదా. మీరు ఒక్కరు అయినా సరైన సమయానికి రెస్పాండ్ అయి ఉంటే ఇప్పడు మీ అమ్మకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మీ అమ్మకు ఇప్పుడు మీరు ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? పెరాలసిస్, కోమా' అంటాడు. దీంతో లాస్య 'తులసి మాజీ మొగుడు మౌనంగా ఉన్నాడు.

మధ్యలో ఈ కాకరొత్తుగాడు ఏంటి తెగ ఆవేశపడుతున్నాడు' అని మనసులో అనుకుంటుంది. అప్పుడు సరస్వతి వాళ్లను ఏమీ అనొద్దు అంటుంది. సామ్రాట్ కూడా 'దయచేసి ఎవ్వరినీ ఎవరూ నిందించుకోవద్దు. ముందు తులసి గారు ఈ గండం నుంచి బయట పడాలని ఆ దేవుడిని ప్రార్థించాలి' అంటాడు.

గుడ్ న్యూస్ చెప్పేసిన డాక్టర్

వాళ్లు మాట్లాడుతుండగానే డాక్టర్ వచ్చి ఇప్పుడే ఏమీ చెప్పలేం అంటుంది. దీంతో అందరూ వెళ్లి దేవుడిని ప్రార్ధిస్తారు. అప్పుడు సరస్వతి 'చేతులెత్తి నమస్కరిస్తారు. జీవితంలో దాని సంతోషాన్ని మొత్తం లాక్కున్నా మొండిగా అది బతుకుతోంది. వదిలేయొచ్చు కదా అయ్యా. దాని బతుకు దానిని బతకనీయొచ్చు కదా అయ్యా' అంటుంది. అప్పుడు ప్రేమ్ 'తప్పు మా వల్ల జరిగింది.

మమ్మల్ని శిక్షించు అమ్మను కాదు' అంటాడు. కాసేపటి తర్వాత డాక్టర్ వచ్చి అందరినీ చూసి 'అదేంటి పేషెంట్ ఎలా ఉందని ఎవ్వరూ అడగడం లేదేంటి' అంటుంది. అప్పుడు సామ్రాట్ 'మీరు ఏం చెప్తారో అని భయపడుతున్నాం' అంటాడు. దీనికామె నథింగ్ టు వర్రీ.. తను ఇప్పుడు బాగానే ఉంది అని చెబుతుంది.

దీపక్ కోపం... కొట్టిన నందూ

దీపక్ కోపం... కొట్టిన నందూ

ఇంతలో నర్సు అక్కడికి వచ్చి 'తులసి గారి భర్త మీరే కదా. డాక్టర్ గారు మీతో మాట్లాడాలి అట. మిమ్మల్ని రమ్మంటున్నారు' అని చెబుతుంది. దీంతో అక్కడి నుంచి సామ్రాట్ వెళ్తాడు. అప్పుడు లాస్య ఆ నర్సును పిలిచి ఏంటి అలా మాట్లాడుతున్నావు అంటే.. ఆయనే ఫామ్‌లో భర్త అని రాశారు అని అంటుంది.

దీంతో లాస్య 'ఇప్పుడు ఏమంటారు? దాని అర్థం ఏంటి.. ఏం చేస్తారో చేసుకోండి అంటూ బరి తెగించారా' అంటుంది. అలాగే, నందూ 'ఇలాంటి సమయంలో కూడా మీరు సామ్రాట్‌ను నిలదీయకపోవడం కరెక్ట్‌గా లేదు నాన్న' అంటాడు. అప్పుడు దీపక్ 'నా అక్క గురించే మాట్లాడుతావా? నా అక్క గురించి మాట్లాడే అర్హత లేదు నీకు. నువ్వు బజారు మనిషితో సమానం' అంటాడు. దీంతో నందూ అతడికి కొడతాడు. ఇలా ఎపిసోడ్ పూర్తైంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X