Intinti Gruhalakshmi: తులసి ఇంటికి విక్రమ్.. ఆ పని చేయడంతో షాక్.. దివ్యను రెచ్చగొట్టి మరీ!
తెలుగు బుల్లితెరపై ప్రసారం అవుతోన్న సీరియళ్లకు మాత్రం ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన దక్కుతోన్న విషయం తెలిసిందే. మన టెలివిజన్‌పై ఇప్పటికే ఎన్నో ధారావాహికలు విజయవంతంగా ప్రసారం అవుతూనే ఉన్నాయి. అలాంటి వాటిలో స్టార్ మాలో ప్రసారం అవుతోన్న 'ఇంటింటి గృహలక్ష్మి' గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దాదాపు రెండేళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ సీరియల్ రోజు రోజుకూ ఎంతో ఆసక్తికరంగా నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల నుంచి దీనికి ఆదరణ మరింతగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో 'ఇంటింటి గృహలక్ష్మి' సోమవారం ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో మీరే లుక్కేయండి మరి!
Photos Courtesy: Star మా and Disney+Hotstar
శనివారం ఎపిసోడ్‌లో జరిగింది ఇదే: శనివారం ప్రసారమైన ఎపిసోడ్‌లో.. కెఫే రీఓపెన్ చేసిన తల్లిదండ్రులను అర్జెంట్‌గా ఇంటికి రమ్మని దివ్య పిలుస్తుంది. వాళ్లు రాగానే సీక్రెట్‌గా తన గదిలోకి తీసుకు వెళ్లి డబ్బులు ఇస్తుంది. ఆ సమయంలోనే బసవయ్య.. విక్రమ్‌ను తీసుకు వచ్చి చూపిస్తాడు. కానీ, అతడు లైట్ తీసుకుంటాడు. ఇక దివ్య ఇచ్చిన డబ్బులను నందూ వాళ్లు తీసుకోరు. పైగా ఆమెకు కొన్ని సూచనలు చేస్తారు. తర్వాతి రోజు ఉదయాన్నే లాస్య ఇచ్చిన డబ్బులో కొంత కనిపించదు. వాటిని బసవయ్య కొట్టేసి ఆ నిందను దివ్యపై మోపుతాడు. దీంతో అందరి ముందు ఆమె దోషిలా నిలబడుతుంది.

తులసి అనొచ్చు.. నేను వద్దా?: తులసి ఇంటికి వచ్చిన లాస్య.. అనసూయను అత్తయ్య అని పిలుస్తుంది. దీనికామె అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. అంతేకాదు, 'ఛీ ఛీ.. నేను నీకు అత్తయ్యను ఏంటి' అంటుంది. దీంతో లాస్య 'మీ కొడుక్కి ఎప్పుడో విడాకులు ఇచ్చిన తులసి మిమ్మల్ని అత్తయ్యా అంటే ముద్దుగా ఉందా? నిన్నగాక మొన్న విడాకులు ఇచ్చిన నేను అత్తయ్యా అంటే చిరాకుగా ఉందా? ఇదెక్కడి న్యాయం' అని అంటుంది. దీనికామె 'నీకు తులసికి పోలిక ఏంటి? తను సంక్రాంతి ముగ్గు అయితే అందులో నువ్వు గొబ్బెమ్మవి. తులసి పౌర్ణమి.. నువ్వు అమావాస్య' అని తిడుతుంది.

అడుక్కోడానికి వచ్చావు కదా: తర్వాత అనసూయ 'తులసి మా ఒంటి మీద పుట్టు మచ్చ అయితే.. నువ్వు పెట్టుడు మచ్చ లాంటిదానివే. అందుకే చెరిపి అవతల పడేశాం' అంటుంది. దీంతో లాస్య 'మీరు చెరిపితే ఎంత చెరపకపోతే ఎంత? కోర్టు మా లింక్ ఇంకా తెంపలేదు కదా. మంగళసూత్రం అనే ఆభరణాన్ని దూరం చేసినా.. భరణం అనే ఆయుధాన్ని మిగిల్చింది కదా. ఇష్టమున్నా లేకున్నా మీ అబ్బాయి నేను ఒకర్నొకరు తలుచుకోకుండా ఉండలేం అత్తయ్యా' అంటుంది. దీనికామె 'అర్ధమైందిలే అడుక్కోవడానికి వచ్చావన్న మాట.. మా అబ్బాయి చేయి ఖాళీగా లేదు వెళ్లిరామ్మా' అంటుంది.

భరణం ఇచ్చేస్తే వెళ్లిపోతాగా: అనసూయ మాటలకు లాస్య 'చేయి ఖాళీగా ఉన్నప్పుడు.. మనసు ఖాళీగా ఉన్నప్పుడ.. దేవుడు కలలో కనిపించినప్పుడు భరణం ఇస్తానంటే చెల్లదు ముసలమ్మా' అనగా అత్తకు కోపం వచ్చి తిడుతుంది. దీంతో లాస్య 'అత్తయ్యా అని ముద్దుగా పిలిచినప్పుడు వద్దంటున్నారు కదా.. సర్లే నాకు రావాల్సిన భరణం నాకు ఇచ్చేస్తే వెళ్లిపోతాను.. ఏంటి మాస్టారూ.. భరణం ఎక్కడా? మీ అమ్మకు నన్ను చూస్తుంటే మంట పెరిగిపోతుంది.. త్వరగా ఇవ్వు' అని అంటుంది. దీంతో నందూ ఇప్పటికిప్పుడు ఇవ్వమంటే ఎక్కడ నుంచి వస్తాయి. ఇస్తానులే అంటాడు.

అయితే మళ్లీ పెళ్లి చేసుకో: నందూ మాటాలకు లాస్య 'ఏంటి మాజీ మొగుడా.. భరణం అడిగితే ఇప్పటికిప్పుడు కష్టం అంటున్నారు. మరి విడాకులు అప్పటికప్పుడు కావాలని అరిచి గోల చేసి ఎలా తీసుకున్నావు. అప్పుడేమైంది ఆ బుద్ది. భరణం ఇవ్వలేని వాడివి విడాకులు ఎందుకు తీసుకున్నావు? భరణం ఇవ్వలేకపోతున్నా లాస్యను మళ్లీ పెళ్లి చేసుకుంటా అని కోర్టులోనే చెబుదువుగాని పదా' అని నందూను లాక్కెళ్లబోతుంది. ఆ తర్వాత కాస్త డిస్కర్షన్ జరిగిన తర్వాత కెఫే కోసం ఉంచిన డబ్బులను లాస్యకు ఇచ్చేయమని తులసి చెబుతుంది. దీంతో నందూ వాటిని లాస్యకు ఇస్తాడు.
అందరూ కలిసి చెప్పాలి: విక్రమ్ ఎన్నో మాటలు అనడాన్ని ఊహించుకుని దివ్య బాధ పడుతూ ఉంటుంది. అంతలోనే అతడు అక్కడకు వస్తాడు. దీంతో దివ్య తన ఆవేదన మొత్తాన్ని బయటపెడుతుంది. అంతేకాదు, అసలు జరిగిన విషయాన్ని అతడికి చెప్తుంది. దీంతో విక్రమ్ సారీ అంటాడు. అప్పుడు దివ్య 'సారీ చెబితే అంతా అయిపోయినట్లేనా? రేపు నేను పని వాళ్ల ముందు తల ఎలా ఎత్తుకుని తిరగాలి? కాబట్టి నన్ను అవమానించిన ఈ ఇంట్లో వాళ్లు నాకు సారీ చెప్పాలి. అదే నీ స్థానంలో నేనుంటే మీ మామ చెంప పగలగొట్టేదాన్ని' అంటుంది. దీనికి విక్రమ్ ఏదో చెప్పబోగా దివ్య వినదు.
డబ్బు తీసుకొచ్చిన విక్రమ్: ఇంట్లో విక్రమ్ 'ఈ దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడో అర్థం కావడం లేదు. ఆ దేవుడు నాకు మళ్లీ కెఫే చేతికి వచ్చేలా చేశాడు. కానీ, దాన్ని మెయింటైన్ చేయడానికి డబ్బులు లేకుండా చేశాడు' అని అంటాడు. అంతలోనే విక్రమ్ అక్కడకు వస్తాడు. అతడిని అందరూ పలకరించిన తర్వాత డబ్బులు తీసి ఇస్తాడు. అప్పుడు 'నేను ఈ ఇంటికి అల్లుడినే కాదు.. కొడుకును కూడా. మీరు అవసరంలో ఉన్నప్పుడు సహాయం చేయడం నా బాధ్యత అందుకే ఇస్తున్నా' అంటాడు. దీనికి తులసి మేము డబ్బు అవసరంలో ఉన్నా అని ఎవరు చెప్పారు అనగా.. అల్లుడిని కాబట్టి నాకు ఈ విషయాలు ఎవరూ చెప్పరు. మీకు ఏ అవసరం వచ్చినా నన్ను మాత్రమే అడగండి దివ్యను కాదు. అది తప్పు కాదు కానీ, తనకు ఇలాంటివి ఎలా డీల్ చేయాలో తెలియదు' అంటాడు.
అత్త కోడలు మధ్య వార్: గదిలో ఒంటరిగా కూర్చున్న దివ్య దగ్గరకు రాజ్యలక్ష్మి వచ్చి 'ఏంటి కోడలా.. ఎలా ఉంది నా దెబ్బ' అంటుంది. దీనికి దివ్య కూడా 'నేను ఇలాంటి వాటికి భయపడే రకం కాదు. అయినా మీరు నాకు మంచే చేశారు' అంటుంది. దీనికామె 'నీ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా ఉంది. అటు వాడితో రాజీ పడలేవు. ఇటు కలిసి ఉండలేవు' అంటూ రెచ్చగొడుతుంది. దీంతో దివ్య 'నేను విక్రమ్‌తో రాజీ పడితే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నట్లే. అయినా మా మధ్య ప్రేమ అనే లైన్ ఉంది. అది ఉంటే ఎవరూ ఏమీ చేయలేదు' అంటుంది. ఇలా ఈరోజు ఎపిసోడ్ పూర్తైంది.


Click it and Unblock the Notifications











